– డా. జి.వి. కృష్ణయ్య
అమ్మో కరోన భూతం…. అది
కాటువేసిందంటె కాటికెపోతావు.. ॥ అమ్మో ॥
ఎటునుండి వస్తాదొ యాడపొంచున్నాదొ
ఎవడీకి తెలియాదు జాగ్రత్తగుండాలి
పక్కలొ బల్లెంల ప్రక్కనె వుంటాది
ఆదమరిచామంటె కాటేసిపోతాది…. ॥ అమ్మో ॥
చెప్పింది వినకుండ వీధుల్లోకొస్తావు
ప్రాణాలమీదికి తెచ్చుకుంటావేర
పోలీసు చెబుతుంటె పెడచెవిన పెడతావు
బుద్ధిలేదా నీకు మందబుద్ధీ వెదవ ॥ అమ్మో ॥
భూలోకమందున్న ప్రాణదాతలు వాళ్ళు
ఆలుబిడ్డలనొదిలి సేవ సేస్తున్నారు
వైద్యులు చెప్పింది శ్రద్ధగ వినుకోర
చావుతొ నీకు చెలగాటమొద్దుర…. ॥ అమ్మో ॥
అంటురోగాలకు బంటుల్లా నిలబడి
సందుగొందులు తిరిగి చెత్తతీస్తున్నారు
పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు బిగపట్టి
కంటిరెప్పలై కాపాడుతున్నారు…. ॥ అమ్మో ॥
దేశదేశాలన్ని దిక్కుతోయక నేడు
బిక్కముఖంతో చుక్కలు చూస్తున్నాయి
ధనిక పేద తేడ వైరస్‌కుండదు
తేలిగ్గ చూశావ తాటతీసి పోద్ది ॥ అమ్మో ॥
అందుకే….
చేతుల్ని కడగండి మాస్కుల్ని పెట్టండి
శానిటైజర్‌తో శుభ్రంగ తుడవండి
భౌతిక దూరాన్ని పాటించితీరాలి
కరోన భూతాన్ని దూరంగ తరమాలి…. ॥ కరోన ॥ 2