ఆకలి

– రావిశాస్త్రి          అన్నారావుని శనిలా వెంటాడుతున్నాడు ముష్టివాడు.          ఆకల్లో అందం కనిపించదు. ఆకల్తో ఉన్నవాళ్లు బొత్తిగా బావుండరు చూడ్డానికి. వాళ్ళనసలు చూడరు చాలామంది. ఇక్కడ ‘‘ఆకలి’’ అంటే ఆకలేకాని మరొకటి కాదు. పుస్తకాలంటే ఆకలి, పరస్త్రీ అంటే ఆకలి, పరాయి సొమ్మంటే ఆకలి, ఆ తరహాది కాదు. ఆకలంటే అసలైన ఆకలి. అంటే ఏమిటో చాలామందికి తెలిసుండాలి.          అతనసలు ఆదినుంచీ ఆకల్తో ఉన్నవాళ్ళా ఉన్నాడు. అంతకాలం అలా ఉంటే మనిషి రూపు మారిపోతుంది. అతను, చెదపుట్టలోంచి తీసిన
Complete Reading

– డా. కే.వి. రమణరావు           కారును సైడురోడ్లోకి తిప్పి పార్కింగ్‌ కోసం వెతుకుతున్నాడు జైరాజ్‌. జేబులో ఫోను రెండుసార్లు మోగి ఆగిపోయింది. ఇళ్ల యజమానులు వీధినే పార్కింగ్‌ లాట్‌గా మార్చుకొని రోడ్డుకు రెండువైపులా వాళ్ల కార్లు పెట్టుకున్నారు. చివరకు ఒక ఇంటిముందు గేటుకడ్డంరాని ఖాళీ కనపడింది. ‘ఇంటివోనరు చూసాడంటే తిట్లు తప్పవు, డ్రైవర్లంటే అందరికీ అలుసే. మాలాంటివాళ్లను గౌరవంగాజూసే రోజెప్పుడన్నా వస్తుందా’ అనుకుంటూ అక్కడ కారుపెట్టి గబగబా నడిచి అతని ఇల్లున్న సన్నటి సందులోకి తిరిగాడు.
Complete Reading

– బొలుసాని జయప్రభ                 ‘‘ఆనంద బాబు! నీదేకులం అని ఎన్నిమార్లు అడిగినా ఎప్పుడూ సమాధానం చెప్పరు ఎందుకు బాబూ?’’ అని అడిగాడు రంగయ్య.           ‘‘చెప్పాను కదా రంగయ్యా ! నీ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు’’ సమాధానంగా ఆనంద బాబు.           ‘‘అదేం సమాధానం బాబూ? మనిషి భూమి మీద పడ్డాక ఏదో కులానికి చెందకుండా ఎలా ఉంటాడు? పోనీ పేరును బట్టి పోల్చుకుందామా అంటే అదీ వీలు కాకుండా ఉంది. రెడ్డి,
Complete Reading

– శివాజీరావు           ‘‘హు’’, అని నిట్టూర్చారు అలౌకికానందేంద్ర స్వాములవారు తన 60 ఏళ్ల ఆధ్యాత్మిక జ్ఞానం నింపుకున్న పొడుగాటి గడ్డాన్ని సవరించుకుంటూ.           పరుపులకు, దిండ్లకు పట్టు గలేబాలు తొడుగుతున్న శిష్యులు ఆ నిట్టూర్పుకి క్షణం ఆగి గురువుగారి వైపు చూశారు. స్టేజి ఎదురుగా స్వామివారి జ్ఞాన బోధ విని తరిద్దామని వచ్చి షామియానాల కింద కూర్చున్న అశేష జన వాహినిలోని ముందు వరుసల జనాలు స్వామి వారి నిట్టూర్పు, వారి అనుంగు శిష్యుల తత్తరపాటు
Complete Reading

(స్వతంత్ర రచన 1947) – పి. లక్ష్మీకాంత మోహన్           పమిడిముక్కల లక్ష్మికాంత మోహన్‌ పాతతరం సాహితీ ప్రపంచానికి షేక్పియర్స్‌ మోహన్‌గా పరిచయం. 8వ తరగతి (థర్డ్‌ పారం) వరకే చదివి, ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీ సభ్యుడై, బుర్రకథ లాంటి ప్రజాకళారూపాలపై పట్టు సాధించి, ప్రజాకళాకారునిగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలో నిబద్ధ కార్యకర్తగా కృషిచేశాడు. తెలంగాణలో నిజాంకు, భూస్వాములకు వ్యతిరేకంగా ఆ కాలంలో జరిగిన పోరాటాన్ని పోరాటకాలంలోనే ‘సింహగర్జన’ అదే నవలను రచించాడు.
Complete Reading

హిందీమూలం : ప్రేమ్ చంద్ (1925)         తెలుగు స్వేచ్ఛానువాదం : బాలాజీ(కోల్ కతా)           చౌదరీ ఇత్రత్‌ అలీ ‘కడే’ ప్రాంతానికి పెద్ద జాగీర్దారు. అతని పూర్వీకులు రాచరిక యుగంలో బ్రిటిష్‌ ప్రభుత్వానికి గొప్పగొప్ప సేవలందించారు. దాని ఫలితంగా వారికీ జాగీరు దొరికింది. అతడు తన నిర్వహణా దక్షతతో, తన యాజమాన్యాన్ని మరింత పెంచుకున్నాడు. ఇప్పుడా ప్రాంతంలో అతడ్ని మించిన పేరైన ధనవంతుడు లేడు. బ్రిటిష్‌ అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించేటప్పుడు, ఖచ్చితంగా చౌదరీ సాహెబ్‌
Complete Reading

– సింధు           మండలంలో అదో పెద్ద గ్రామపంచాయతి. ఆరువేలకు పైగా జనాభా ఉంటుంది. అందుకే దాన్ని పేట అంటారు. ఊరుకు తూర్పున ఉత్తర దక్షిణంగా మాలవాడ, మాదిగ వాడలున్నాయి. ఈ వాడలు చెరో గ్రామ పంచాయితిలా వుంటాయి. రెండింటి మధ్యన లోతట్టు. మధ్యన కాపుల, తెనుగుల, రెడ్ల, గౌండ్ల వారి పొలాలకు, చేళ్ళకు దారుంది. దారికి ఇరువైపుల ఇరువాడలకు వెట్టిమడ్లు ఉన్నాయి. ఇవి వివిధ వృత్తులు చేసే మాల, మాదిగలకు ఇచ్చిన ఇనామ్‌1 భూములు. ఒక్కొక్క
Complete Reading

– నౌగాపు           అతను పరిగెడుతూ ఉన్నాడు….           ఊపిరి ఆడడం లేదు, శ్వాస అందడం లేదు, శరీరం సచ్చు బడింది, ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదు, ఎంతవరకు పరిగెట్టాలో తెలియటం లేదు….           గతంలో ఎంతగానో పరిగెట్టాడు. ఆ అనుభూతి వేరు.           చిన్నప్పుడు ఆటలాడుతూ పరిగెట్టాడు, సంతోషం పొందాడు. ఆ పరుగులో కాలు జారి పడ్డాక బోవురు మన్నాడు.           బస్సు అందుకోవటం కోసం పరిగెత్తాడు, అందుకున్నాక తృప్తి పొందాడు, అందనప్పుడు బాధపడ్డాడు.
Complete Reading

— అరుణ — ‘అమ్మా!’ అంటూ ఆనందంతో కేకు వేస్తూ ఇంట్లోకి దూసుకొచ్చాడు రవి. ఆ వయసు అంతే, 16 ఏళ్ళ ప్రాయం. తూనీగలా దొరక్కుండా ఎగురుతుంటారు. దారం కడదామని ప్రయత్నిస్తామా, చిక్కినట్లే చిక్కి దారంతో సహా ఎగిరిపోతారు. వాళ్ళకి వాళ్ళే గొప్ప. ప్రపంచాన్ని వాళ్ళ కళ్ళతో చూడమంటారు. ఏదో అద్భుత ప్రపంచంలో తేలియాడుతూ, పెద్దవాళ్ళని ధిక్కరిస్తూ, ప్రతిదీ ఛాలెంజింగ్‌ స్వీకరిస్తూ…. స్వేచ్ఛాలోకంలో విహరిస్తుంటారు. ‘‘అమ్మా, రేపు మర హ్యాపీసండే తొసా. నేను బాగా డాన్సు చేస్తున్నానని
Complete Reading

జార్జీ ఫుకుంబే అనే ఒక సైనికుడికి జోయర్‌ యుద్ధంలో కాలికి తుపాకీ గుండు తగిలింది. దాంతో కేప్‌టౌన్‌లో వున్న ఒక ఆస్పత్రిలో అతడి మోకాును తొగించారు. అతడు ండన్‌కు తిరిగివచ్చిన తర్వాత ప్రభుత్వం నుండి డెబ్బయి ఐదు పౌండ్లు అందుకున్నాడు. ఇక మీదట ప్రభుత్వం నుండి తనకు రావసిన బకాయిలేమీ లేవని చ్లొచీటీ రాసిచ్చాడు. తాను అందుకున్న మొత్తాన్ని న్యూగేట్‌ టౌన్‌లోని ఒక బీరుషాపులో పెట్టుబడి పెట్టాడు. అందుకు కారణం ఆ షాపులో బీరు మరకు పడ్డ
Complete Reading

Create Account



Log In Your Account