ఈ పుస్తకాలు అందాయి

సాహితి వారి ప్రతిష్టాత్మక ప్రచురణలు టాల్‌ స్టాయ్‌ సాహిత్యం 1. యుద్ధము – శాంతి నవల : అనువాదం : రెంటాల గోపాలకృష్ణ, బెల్లంకొండ రామదాసు. 1/8 డెమ్మీలో 960 పుటలు. వెల : రు. 600/- ముద్రణ : సెప్టెంబరు 2019. 2. అన్నా కెరనీన నవల అనువాదం : ఆర్వియార్‌. 1/8 డెమ్మీలో 896 పుటలు. వెల : రు. 500/- ముద్రణ సెప్టెంబరు 2018. 3. నవజీవనం నవల అనువాదం : పురాణం
Complete Reading

అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం మార్చి 8 సందర్భంగా సభ           అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం మార్చి 8 సందర్భంగా ‘‘మహిళలపై అత్యాచారాలకు, హత్యలకు కారణమవుతున్న సామాజిక మూలాలను ప్రతిఘటిద్దాం’’ అని స్త్రీ విముక్తి సంఘటన ఇచ్చిన పిలుపు నందుకొని స్త్రీ విముక్తి సంఘటన, జనసాహితి సంస్థల ఆధ్వర్యంలో 8.3.2020న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం సెల్లార్‌ హాల్లో సభ జరిగింది. ఈ సభకు స్త్రీ విముక్తి సంఘటన జంటనగరాల శాఖ కన్వీనర్‌
Complete Reading

– డా॥ కొడవటిగంటి రోహిణీప్రసాద్‌           గతితార్కిక భౌతికవాద దృక్పథంతో కొడవటిగంటి రోహిణీప్రసాద్‌గారు ప్రజాసాహితి, తదితర పత్రికలలో అనేక సైన్సు వ్యాసాలు రాశారు. జీవశాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన వ్యాసాలను ఎన్నుకుని ‘జనసాహితి’ 53 వ్యాసాల ఈ సంకలనాన్ని ప్రచురించింది.           ‘అత్యాధునిక జీవనశైలినీ, తెచ్చిపెట్టుకున్న పాశ్చాత్య సంస్కృతినీ అవలంబించే ఈ తరం మానసికంగా ఆటవికదశలో ఉందనేది మనం గుర్తించాలి. సామాజిక రుగ్మతలన్నిటికీ కారణం వర్గసమాజపు దుష్టశక్తులు కాగా వాటికి తోడవుతున్నవి మోడర్న్‌ వేషంలో ఉన్న మూఢనమ్మకాలూ, అవగాహనా
Complete Reading

– ఏటూరి నాగేంద్రరావు           వీళ్ళందరూ           ఏ దేశపు నేరస్తులూ కారు..           ఓటు హక్కున్న నేల నుండి           విసిరేయబడి ఆకలిని నియంత్రించుకుంటూ           పేగులు కుట్టేసుకొని           యాడేడో తిరిగి తిరిగి           రంగు మారిన ముఖాలు.           ఈ మట్టిలో పుట్టి           ఈ మట్టినే తింటున్న           ప్రగతి కారులు.           ఆశల్ని తాకట్టు పెట్టుకుంటున్న           స్తబ్ధ ప్రపంచాలు.           చెలియలి కట్టను తెంపుకొని పరుగిడుతున్న           ఆవేదన
Complete Reading

– ఎస్. శంకరరావు           ఆదిపత్య దురహంకార           అక్రమ సంతానమా!           కాలం కనుసన్నలలో           వికసించిన యమపాశమా!           నగ్న శిధిలీకృత వ్యవస్థ           సృజించిన విష బీజమా!           ప్రకృతిని పట్టిపీడించే           హీన సంస్కృతి రాజసమా!           విషవాయు జ్వాలల           కాలుష్యమా! ఓ  కాలుష్యమా!           నీ దుర్నీతి ఫలితం           ప్రతి ఇంటా ప్రతి వాడా           క్షణం క్షణం మృత్యు భయం!           నాడు బోపాల్‌- నేడు
Complete Reading

– డా. జి.వి. కృష్ణయ్య           అమ్మో కరోన భూతం…. అది           కాటువేసిందంటె కాటికెపోతావు..                                            ॥ అమ్మో ॥           ఎటునుండి వస్తాదొ యాడపొంచున్నాదొ           ఎవడీకి తెలియాదు జాగ్రత్తగుండాలి           పక్కలొ బల్లెంల ప్రక్కనె వుంటాది           ఆదమరిచామంటె కాటేసిపోతాది….                                          ॥ అమ్మో ॥           చెప్పింది వినకుండ వీధుల్లోకొస్తావు           ప్రాణాలమీదికి తెచ్చుకుంటావేర           పోలీసు చెబుతుంటె పెడచెవిన పెడతావు           బుద్ధిలేదా నీకు మందబుద్ధీ వెదవ                                           ॥ అమ్మో ॥          
Complete Reading

– అశోక్ కుంబము (“మానవాళి శోభ కోసం మొత్తం దోపిడీ వ్యవస్థను కాల్చేయాల్సిందే!”)           నీ కడుపులో ఉన్న           తొమ్మిది నెలలేనమ్మా           జీవితంలో నేను పొందిన           స్వేచ్ఛా కాలం           ఏ క్షణాన           భూమి మీద పడ్డానో           నా నల్ల రంగే నాకు శాపమయ్యింది           ఊహించని మృత్యుకూపాన్ని           నా చుట్టూ తొవ్వింది           నేను ఎదురుపడితే           నాలో ఒక దొంగనో           మత్తు మందు బానిసనో
Complete Reading

– సూర్యప్రకాశ్           కంపుగొట్టే మురికి వాడల దారుల నుండి..           పెచ్చు లూడుతున్న ఫ్లై ఓవర్ల నీడల నుండి..           మొదలయ్యిందొక ప్రస్థానం.           బోర విరుచుకొని నిలుచున్న కార్పొరేటు కోటల శిఖరాల ముంగిట           శిరసు వంచి మోకరిల్లిన మహానగరాల మురికి వాడల నుండి..           డొక్కలు మాడి బక్క చిక్కిన బడుగుల పడకల ఫుట్పాతుల నుండి..           కాళ్ళీడ్చుకుంటూ మొదలయ్యింది           నేటి మహా ప్రస్థానం.           పాపాలను కడిగేసుకునే పుణ్య పురుషుల
Complete Reading

          అంతరాలులేని, అంధవిశ్వాసాలు లేని సమాజం కోసం కృషిచేసిన దొడ్డా హరిబాబు మాష్టారు తన 65వ ఏట 3 మే 2020న తెనాలిలో మరణించారు. ఆయన ప్రకాశంజిల్లా యద్ధనపూడి మండలం మున్నంగివారిపాలెంలో 1953లో జన్మించారు.           హరిబాబు మాష్టారు చిన్నప్పటి నుండి అభ్యుదయ భావాలతో వుండేవారు. ఊరిలో యువజన గ్రంథాలయాన్ని నిర్వహించేవారు. భాషాప్రవీణ చదవటం కోసం తాడికొండ సంస్కృత కళాశాలలో చేరటంతో చార్వాక రామకృష్ణగారి శిష్యుడయ్యారు. బాబాల, స్వాముల, అమ్మవార్ల బండారాలను బట్టబయలు చేస్తూ అనేక కార్యక్రమాలు
Complete Reading

          నాటక రచయిత, నటుడు, దర్శకుడు, నిర్మాత చింతపెంట సత్యనారాయణరావు 14 ఏప్రిల్‌ 2020న హైదరాబాదులో తన 86వ ఏట అనారోగ్యంతో మరణించారు. ఆయన 20 డిశెంబరు 1935న కడియం దగ్గర మాధవరాయుడుపాలెంలో జన్మించారు.           సి.ఎస్‌.రావు విద్యార్థి దశ నుండే బ్రహ్మసమాజము, ఆంధ్ర సారస్వత సభల ప్రభావంతో ఎదిగారు. రాజమండ్రిలో డిగ్రీ చదువుకునే రోజుల్లో స్టూడెంట్‌ ఫెడరేషన్‌లో పనిచేశారు. స్టూడెంట్‌ ఫెడరేషన్‌తో సంబంధాలు ఉండటంతో చాలాకాలం ఉద్యోగం రాలేదు. ఆ సమయంలో ఆయన వాళ్ళ వూరి
Complete Reading

Create Account



Log In Your Account