ఓ! కాలుష్యమా!

– ఎస్. శంకరరావు           ఆదిపత్య దురహంకార           అక్రమ సంతానమా!           కాలం కనుసన్నలలో           వికసించిన యమపాశమా!           నగ్న శిధిలీకృత వ్యవస్థ           సృజించిన విష బీజమా!           ప్రకృతిని పట్టిపీడించే           హీన సంస్కృతి రాజసమా!           విషవాయు జ్వాలల           కాలుష్యమా! ఓ  కాలుష్యమా!           నీ దుర్నీతి ఫలితం           ప్రతి ఇంటా ప్రతి వాడా           క్షణం క్షణం మృత్యు భయం!           నాడు బోపాల్‌- నేడు
Complete Reading

– డా. జి.వి. కృష్ణయ్య           అమ్మో కరోన భూతం…. అది           కాటువేసిందంటె కాటికెపోతావు..                                            ॥ అమ్మో ॥           ఎటునుండి వస్తాదొ యాడపొంచున్నాదొ           ఎవడీకి తెలియాదు జాగ్రత్తగుండాలి           పక్కలొ బల్లెంల ప్రక్కనె వుంటాది           ఆదమరిచామంటె కాటేసిపోతాది….                                          ॥ అమ్మో ॥           చెప్పింది వినకుండ వీధుల్లోకొస్తావు           ప్రాణాలమీదికి తెచ్చుకుంటావేర           పోలీసు చెబుతుంటె పెడచెవిన పెడతావు           బుద్ధిలేదా నీకు మందబుద్ధీ వెదవ                                           ॥ అమ్మో ॥          
Complete Reading

– అశోక్ కుంబము (“మానవాళి శోభ కోసం మొత్తం దోపిడీ వ్యవస్థను కాల్చేయాల్సిందే!”)           నీ కడుపులో ఉన్న           తొమ్మిది నెలలేనమ్మా           జీవితంలో నేను పొందిన           స్వేచ్ఛా కాలం           ఏ క్షణాన           భూమి మీద పడ్డానో           నా నల్ల రంగే నాకు శాపమయ్యింది           ఊహించని మృత్యుకూపాన్ని           నా చుట్టూ తొవ్వింది           నేను ఎదురుపడితే           నాలో ఒక దొంగనో           మత్తు మందు బానిసనో
Complete Reading

– సూర్యప్రకాశ్           కంపుగొట్టే మురికి వాడల దారుల నుండి..           పెచ్చు లూడుతున్న ఫ్లై ఓవర్ల నీడల నుండి..           మొదలయ్యిందొక ప్రస్థానం.           బోర విరుచుకొని నిలుచున్న కార్పొరేటు కోటల శిఖరాల ముంగిట           శిరసు వంచి మోకరిల్లిన మహానగరాల మురికి వాడల నుండి..           డొక్కలు మాడి బక్క చిక్కిన బడుగుల పడకల ఫుట్పాతుల నుండి..           కాళ్ళీడ్చుకుంటూ మొదలయ్యింది           నేటి మహా ప్రస్థానం.           పాపాలను కడిగేసుకునే పుణ్య పురుషుల
Complete Reading

          అంతరాలులేని, అంధవిశ్వాసాలు లేని సమాజం కోసం కృషిచేసిన దొడ్డా హరిబాబు మాష్టారు తన 65వ ఏట 3 మే 2020న తెనాలిలో మరణించారు. ఆయన ప్రకాశంజిల్లా యద్ధనపూడి మండలం మున్నంగివారిపాలెంలో 1953లో జన్మించారు.           హరిబాబు మాష్టారు చిన్నప్పటి నుండి అభ్యుదయ భావాలతో వుండేవారు. ఊరిలో యువజన గ్రంథాలయాన్ని నిర్వహించేవారు. భాషాప్రవీణ చదవటం కోసం తాడికొండ సంస్కృత కళాశాలలో చేరటంతో చార్వాక రామకృష్ణగారి శిష్యుడయ్యారు. బాబాల, స్వాముల, అమ్మవార్ల బండారాలను బట్టబయలు చేస్తూ అనేక కార్యక్రమాలు
Complete Reading

          నాటక రచయిత, నటుడు, దర్శకుడు, నిర్మాత చింతపెంట సత్యనారాయణరావు 14 ఏప్రిల్‌ 2020న హైదరాబాదులో తన 86వ ఏట అనారోగ్యంతో మరణించారు. ఆయన 20 డిశెంబరు 1935న కడియం దగ్గర మాధవరాయుడుపాలెంలో జన్మించారు.           సి.ఎస్‌.రావు విద్యార్థి దశ నుండే బ్రహ్మసమాజము, ఆంధ్ర సారస్వత సభల ప్రభావంతో ఎదిగారు. రాజమండ్రిలో డిగ్రీ చదువుకునే రోజుల్లో స్టూడెంట్‌ ఫెడరేషన్‌లో పనిచేశారు. స్టూడెంట్‌ ఫెడరేషన్‌తో సంబంధాలు ఉండటంతో చాలాకాలం ఉద్యోగం రాలేదు. ఆ సమయంలో ఆయన వాళ్ళ వూరి
Complete Reading

– వై. నేతాంజనేయ ప్రసాద్           పులిచంపిన లేడికి సానుభూతిగా           సింహం అహింసావ్రతం చేస్తుంది           అన్యాయం అంటూ ఆక్రోశిస్తుంది –           నిన్నటిదాకా సింహం విదిల్చిన           ఎంగిలి మాంసం పంచుకుతిన్న           అవకాశవాద గుంటనక్కలనేకం           వింత గొంతుకతో వంతపాడుతూ           పస్తులుండలేక పాట్లుపడుతున్నాయి –           దోచుకునే దొంగసొత్తు దక్కడంలేదని           సమన్యాయం అంటూ ఘోషిస్తున్నాయి –           నిన్నటిదాకా సింహం నీడన చేరి           నిస్సిగ్గుగా నీరాజనాలందించిన           వలస
Complete Reading

– పాలేరు           తల్లీ కన్నీరు పెడుతుందో – కనిపించని కుట్రల           భూ తల్లీ బావురుమన్నాదో – ఈ కరోన కాటుకు                           ॥ తల్లీ ॥           చైనాలోనా కరోన వచ్చెను           ఊహానంతా ఉడికిపోయెను           మనుషులందరూ పిట్టలులాగా           ఊపిరి అందక కూలిపోయినరు           కరోన ఎట్లా వచ్చిచేరినాదో – ఈ చైనాలోకి           ప్రపంచికరణతో ఎల్లలు దాటిందో – ఆ కరోనభూతం           ‘‘అయ్యో….. ఓ….. ఓ…… ఓ…..’’                                             ॥ తల్లీ
Complete Reading

– మనస్విని           “ఉహువా…. ఉహువా నారాయణ!           ఉహువాహువా…. నారాయణ! నారాయణ!           ఏమిటబ్బా అన్ని ద్వారాలూ మూసి వున్నాయి? అరెరె వైకుంఠపుర ద్వారానికీ, బ్రహ్మలోక, కైలాసపురాల ద్వారాలకీ నో ఎంట్రీ బోర్డు లున్నాయేమిటి చెప్మా! నిత్యం విందు వినోదాలూ, అప్సరసల నృత్యాలూ, గంధర్వగానాలలో సందడిగా ఉండాల్సిన ఇంద్రసభ నిశ్శబ్దంగా తలుపులు మూసుకొని ఉందేమిటి?           ఉహువా.. ఉహువా…. నారాయణ! నారాయణ!           ఈ వెధవ దగ్గొకటి. భూలోకయాత్ర పుణ్యమాని పట్టుకొని వదలడంలేదు. తీరా ఇక్కడికొస్తినా….
Complete Reading

          తన జీవితాంతం క్రూర పరిపాలకులకు, నియంతలకు వ్యతిరేకంగా ప్రతిఘటనా పోరాటాలలో క్రియాశీలంగా పాల్గొన్న, నికారుగ్వా దేశానికి చెందిన వామపక్ష కవి ఎర్నెస్టో కార్డినల్‌ 2020 మార్చి 1వ తేదీన తన 95వ ఏట మరణించారు. ఆయన 1925 జనవరి 20న ఒక ఉన్నత వర్గ కుటుంబంలో గ్రనడా పట్టణంలో పుట్టారు.           నికారుగ్వా సాహిత్య, సాంస్కృతిక చరిత్రలో కార్డినల్‌ ఒక ప్రతిఘటనా వ్యక్తిగా కొనసాగారు. రాజకీయంగానూ, కవిత్వపరంగానూ నేటి లాటిన్‌ అమెరికాకు చెందిన ఒక అత్యంత
Complete Reading

Create Account



Log In Your Account