ప్రజా సైన్స్ ఉద్యమంలో అవిశ్రాంతంగా కృషిచేసిన అమిత్‌సేన్ గుప్తా తన 60వ ఏట గోవా బీచ్‌లో ప్రమాదవశాత్తూ 28 నవంబరు 2018న మరణించారు.
ఆయన ఢల్లీిలోని మౌలానా అజాద్ వైద్య కళాశాలో ఎం.బి., బి.ఎస్ పూర్తిచేశారు. కాని వైద్య వృత్తి చేపట్టకుండా ప్రజా ఆరోగ్య వ్యవస్థపై కేంద్రీకరించి వివిధ ప్రజారోగ్య సంస్థలో క్రియాశీకంగా పనిచేశారు. ఢల్లీి సైన్స్ ఫోరం స్థాపకుల్లో ఆయనొకరు. ఈ సంస్థలో పూర్తికాం కార్యకర్తగా పనిచేశారు. దాని సోదర సంస్థగా, పేద గ్రామీణ ప్రజానీకానికి పనికివచ్చే సాధనాను రూపొందించే సెంటర్ ఫర్ టెక్నాజీ అండ్ డెవప్‌మెంట్ సంస్థకు అంకితమయ్యారు.
198384లో జరిగిన భోపాల్ గ్యాసు సంఘటన అక్కడి ప్రజ ఆరోగ్యంపై సుదీర్ఘకాం వేసే ప్రభావంపై అధ్యయనం చేసి వాటిని వివరించారు. ప్రాణాల్ని రక్షించే కీకమైన మందు ధరు తగ్గించేవిధంగా 1911 నాటి పేటెంట్ చట్టాన్ని 1970లో మార్చడానికి ఆయన చేసిన కృషి ఎంతో గొప్పది. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసి ప్రజ ఆరోగ్యానికి హానికరమైన మందును నిషేధించేవిధంగా పోరాడారు. అఖి భారత పీపుల్స్ సైన్స్ నెట్‌వర్క్ సంస్థకు 2008
2010 సంవత్సరాలో ప్రధానకార్యదర్శిగా వున్నారు. జనస్వాస్థ్య అభియాన్‌కు కన్వీనర్‌గా తన సేవందించారు. బంగ్లాదేశ్‌లోని సవర్‌లో 2000లో ప్రారంభింపబడిన ప్రజారోగ్య ఉద్యమానికి ఆయన సంస్థాపక సభ్యుడు. ప్రజలో శాస్త్ర విజ్ఞాన ప్రచారం విరివిగా జరగకపోవడం వ్ల ప్రజాతంత్ర ఉద్యమం చా నష్టపోయిందని చెప్పేవారు.
ఇటీవ నవంబరు 16`19 తేదీలో ఢాకాలో జరిగిన న్గావ అంతర్జాతీయ ప్రజారోగ్య అసెంబ్లీ (ూవశీజూశ్రీవఃం నవaశ్ర్‌ీష్ట్ర Aంంవఎపశ్రీవ) నిర్వహణలో కీకమైన పాత్ర వహించారు. దీనికి 73 దేశా నుండి 1400 మంది ప్రతినిధు హాజరయ్యారు. ఈ ఏడాది సెప్టెంబరులో రాయ్‌పూర్ (ఛత్తీస్‌ఘడ్)లో ఆయన నిర్వహించిన జాతీయ హెల్త్ అసెంబ్లీకి 22 రాష్ట్రా నుండి 1300 ప్రతినిధు హాజరయ్యారు.
ప్రజ ఆరోగ్యమూ, ఆరోగ్య రక్షణకు సంబంధించి ఎటువంటి ఆరోగ్య విధానం (నవaశ్ర్‌ీష్ట్ర ూశీశ్రీఱషవ) అవసరమో ఆయన ప్రచురించిన గ్లోబల్ హెల్త్‌వాచ్ గ్రంథం ఐదు సంపుటాలో వివరించారు. ‘వరల్డ్ హెల్త్ రిపోర్టు’కు ప్రత్యామ్నాయంగా ఆయన ఈ ఐదు సంపుటాు ప్రచురించారు.
ఢల్లీి నగరంలో సంపూర్ణ అక్షరాస్యతా ఉద్యమం ఢల్లీి సాక్షరతా సమితి ద్వారా చేబట్టారు. 1987లో, 1990లో భారత జనవిజ్ఞాన జాతాకు తమ సహకారాన్నందించారు. వరల్డ్ సోషల్ ఫోరమ్, ఆసియా సోషల్ ఫోరమ్ సమావేశాల్లో క్రియాశీంగా పాల్గొన్నారు.
కార్పొరేట్ హాస్పిటళ్ళు వీరవిహారం చేస్తున్న ఈనాడు సాధారణ పేద ప్రజ ఆరోగ్య రక్షణ పట్ల ప్రభుత్వా బాధ్యతను గుర్తింపచేస్తూ, పోరాడుతూ విద్య, వైద్యం ఉచితంగా ప్రజకందాని కృషిచేసే సంస్థ ఉద్యమా అవసరాన్ని గుర్తుచేసుకుందాం.