బహుభాషావేత్త నోము సత్యనారాయణ మృతికి సంతాపం

బహుభాషావేత్త నోము సత్యనారాయణ మృతికి సంతాపం

నోము సార్‌గా విద్యార్థుకు, సాహితీవేత్తకు పరిచయమైన నోము సత్యనారాయణ తన 80వ ఏట న్లగొండలో 26 డిసెంబరు 2018న మరణించారు.
నోము ఉపాధ్యాయునిగా పనిచేస్తూ, ఎం.ఏ (ఇంగ్లీషు) చదివి, కళాశాలో ఆంగ్లోపన్యాసకునిగా న్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలో పనిచేశారు. 1962 నుండి ప్రారంభమైన ఆయన సాహిత్య వ్యాసంగం చివరివరకు సాగింది. 1951లోనే స్వయంగా ఉర్దూ నేర్చుకొని ఉర్దూ అభ్యుదయ సాహిత్యాన్ని తొగువారికి అనువదించి ఇచ్చారు. వ్యాసాు రాశారు. రుబాయిను, మహమ్మద్‌ ఇక్బాల్‌ను తొగువారికి పరిచయం చేశారు.
ఎందరో రచయిత గ్రంథాకు ముందుమాటు రాశారు. ఆయన తొగు, ఇంగ్లీషు, ఉర్దూ, హిందీ భాషా సాహిత్యా గురించి యువరచయితకు తెలియచేసేవారు. బహిరంగసభల్లో ఎక్కువగా పాల్గోవడం నచ్చని నోము కృషి గురించి ఇతర ప్రాంతా వారికి తెలియలేదు. తొగు కవితను ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లోకి, హిందీ, ఇంగ్లీషు ఉర్దూ కవితను తొగులోకి అనువదించారు. ‘నోముసార్‌ ` ఏన్‌ అనటోల్డ్‌ లెసన్‌’ అనే పేర ఆయన గురించి ఒక ప్రత్యేక సంచిక ప్రచురింపబడిరది.
నోము ఇతరును పకరించడానికి ‘హలో’ అనే పదానికి బదు ‘జయహో’ అనే పదాన్ని వాడుకలో పెట్టారు. నోము సాహితీ సమితి అనే సంస్థను ఏర్పరచి నోము పురస్కార కథ పోటీ ద్వారా కథకుకు ప్రతిఏడూ బహుమతు అందించారు.
ఆయన ‘ప్రజాసాహితి’ పత్రికకు ప్రారంభంనుండీ ఆప్తుడు. న్లగొండలో జనసాహితి ఏర్పరచిన సాహిత్య సభకు ఎంతో సహకరించేవారు.
నోము మరణానికి ‘ప్రజాసాహితి’ సంతాపాన్ని ప్రకటిస్తోంది. వారి కుటుంబ సభ్యుకు సానుభూతిని తెలియచేస్తోంది.

admin

leave a comment

Create Account



Log In Your Account