నలుపు తెలుపుల దృశ్య కావ్యం

నలుపు తెలుపుల దృశ్య కావ్యం

— బాలాజీ— కోల్ కతా

దర్శకుడు అల్ఫాన్సో కువారన్‌ పేరు వినగానే గుర్తొచ్చే సినిమా ‘గ్రావిటీ’ (2013). అంతరిక్షజీవితం గురించి తీసిన ఆ సినిమా ఆస్కారు సాధించింది కనుక ఆ సినిమాతో అతడి పేరు ముడిపడిపోయింది. కానీ చార్లెస్‌ డికెన్స్‌ కథతో ‘గ్రేట్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌’ (1998), ఇద్దరు టీనేజి యువకు రోడ్‌ మువీ ‘వై టు మామా తాంబియేన్‌’ (2001), భూమ్మీద ఇరవై యేళ్ల నిస్సంతానం తర్వాత ఎర్పడే క్పానిక పరిస్థితిని విశ్లేషించిన థ్ల్రిర్‌ ‘చిల్డ్రెన్‌ ఆఫ్‌ మెన్‌’ (2006) వంటి ప్రశంసు పొందిన సినిమాు కూడా అతడి సినిమా జాబితాలో వున్నాయి. ‘గ్రావిటీ’ తర్వాత ఐదేళ్ళకి వచ్చిన తదుపరి చిత్రం ‘రోమా’. చన చిత్రోత్సవాల్లో బహుప్రశంశు పొంది, ప్రస్తుతం ‘నెట్‌ఫ్లిక్స్‌’ ద్వారా బుల్లితెరపై అందుబాటులో వుంది.

లిబోకి ప్రేమతో …
మెక్సికో నగరంలోని కొలొనియా రోమా అనే కానీ పేరు మీదుగా ఈ సినిమాకు పేరు పెట్టాడు దర్శకుడు. ఆ కానీలోనే అతడి బ్యా జీవనం గడిచింది. దేశంలో అ్లర్లలానే అతడి బ్యాజీవితం కూడా ఒడిదుడుకుతో సాగింది. తల్లిదండ్ర వైవాహిక జీవిత వైఫ్యం, తల్లి డిప్రెషన్‌లో వున్నప్పుడు ఆ ప్లిల్ని అక్కున చేర్చుకుని ప్రేమతో లాలించిన తమ యింటి ఆదివాసీ పనిమనిషి లిబోరియో రోడ్రిగెజ్‌ లేక లిబోకి కృతజ్ఞతా పూర్వకంగా అంకితమిస్తూ ఆమె కథగా తీసిన సినిమా ‘రోమా’. ‘‘నా జ్ఞాపకా పొర చిక్కుదారుల్లోంచి ప్రయాణిస్తూ, ఆ సమయాన్ని నాతోపాటు జీవించిన వారి కథనాు విని రాసుకున్న కథ ఇది. నన్ను నన్నుగా మలిచిన ఆ సమయమే ఈ దేశాన్నీ మలిచింది. మెక్సికో దేశ సుదీర్ఘ పరివర్తనకు సంధికామది’’ అని దర్శకుడు ఒక ఇంటర్వూలో చెప్పాడు. ఆరంభమే ఒక అద్భుతం ఈ కథను చెప్పుకోవడం కంటే చూసి అనుభవించడం అవసరం. సగటు తొగు ప్రేక్షకుడికి స్లోగా సాగేలా వున్నా, ఆ సుకుమార ప్రయాణమే ఈ సినిమాకు సొగసును అద్దిందని చివరికంటా చూసిన సీరియస్‌ వీక్షకుడు వొప్పుకుంటాడు. ‘మార్నింగ్‌ షోస్‌ ద డే’ అన్నట్టు ఓపెనింగ్‌ సన్నివేశమే చూడబోయే సినిమా అందాన్ని వర్ణించినట్టు వుంటుంది. టైటిల్స్‌ వేస్తున్నప్పుడు ఇంటి కారిడార్‌ టాప్‌ షాట్‌. ఎన్నో బకెట్ల నీళ్లతో ఎవరో పొడవాటి కారిడార్‌ గచ్చు కడుగుతున్న దృశ్యం. న్వినీటి ప్రకాశవంతమైన భాగంలో ఆకాశంలో ఎగురుతున్న విమానం ప్రతిబింబం. సాధారణంగా ఎస్టాబ్లిష్‌మెంట్‌ షాట్లో పరిసరాను లేక ఇంటి వాతావరణాన్ని పరిచయం చేస్తుంటారు. ఇక్కడ ఇంటిపై పనిమనిషికి గ శ్రద్ధను పరిచయం చేయడం జరిగింది. ఆ పనిమనిషే కథానాయకి. ఆ పనిమనిషి పేరు క్లియో (యాలిత్జా అపరాసియో). వంట పనిచూసే మరో పనిమనిషి అడెలా (నాన్సీ గార్సియా). ‘రోమా’ కానీలోని ఆ ఎగువ మధ్యతరగతి కుటుంబం అంటోనియో (ఫెర్నాండో గ్రేడియాగా) అనే డాక్టరు గారిది. ఆ డాక్టరు సినిమాలో రెండు మూడు దృశ్యాల్లో తప్ప కన్పించడు. డాక్టరు గారి భార్య సోఫియా (మారినా డీ తావిరా). వారికి నుగురు ప్లిు పెపె (మార్కో గ్రాఫ్‌), సోఫీ (డేనియెలా డిమెసా), టోనో (డీగో కోర్టినో ఆట్రే), పేకో (కార్లోస్‌ పెరాల్టా). సోఫియా తల్లి తెరేసా (వెరోనికా గార్షియా). ఇంటి కారిడార్‌ కంగాళీ చేసే బోరోస్‌ అనే కుక్క. అంటోనియో, సోఫియా వివాహ బంధం తెగిపోయేలా సందిగ్ధావస్థలో వుంది. అందుకని కాన్ఫరెన్సు పేరుమీద తిరుగుతూ, ఇంటిపట్టున వుండడు ఆ డాక్టరు. కేవం ఒక్కరోజు కోసం ఇంటికి వచ్చి, కెనడా క్యూబెక్‌లో కాన్ఫరెన్సు అంటూ మళ్లీ చెక్కేస్తాడు. ‘నాన్నా, త్వరగా వచ్చేయ్‌’ అంటూ ప్లి చేత ఉత్తరాు రాయిస్తూ వారిని మభ్యపెడుతుంది తల్లి.
నీదీ నాదీ ఒకే కథ!
క్లియో, అడెలా తమ బాయ్‌ ఫ్రెండ్స్‌తో డేటింగుకు బయల్దేరుతారు. అడెలా రామోన్‌తో సినిమాకు వెళితే, క్లియో ప్రేమికుడు ఫెర్మిన్‌ (జార్స్‌ అంటోనియో గ్వెరెరో) మాత్రం ఆమెను హోటల్‌ రూమ్‌కి తీసుకు వెళ్తాడు. శారీరకంగా దగ్గరయే ముందు ఆమెకు తన యుద్ధవిద్య పాటవం చూపిస్తాడు. మరో డేటింగులో వారు సినిమాకి వెళ్లినపుడు తను నె తప్పినట్టు అనుమానంగా వుందని చెబుతుంది. అంతే, ఏదో సాకుతో హాు నుండి, ఆమె నుండి పరార్‌. క్లియో భయపడుతూ తన గర్భÛం సంగతి సోఫియాకు చెబుతుంది. ‘తనని ఉద్యోగంలోంచి తీసెయ్యరు కదా?’ అని ప్రాధేయపడుతుంది. అభయమిస్తూ సోఫియా ఆమెను గర్భనిర్ధారణ టెస్టు కోసం ఆసుపత్రికి తీసుకెళ్త్తుంది. కాన్ఫరెన్సు అని చెప్పి వెళ్లిన అంటోనియో ఆ వూర్లోనే వుంటూ మరో యువతితో కంటపడతాడు సినిమా హాు దగ్గర. ఆ దృశ్యం పెద్దబ్బాయి కంట పడిరదని తొస్తుంది సోఫియాకు. తమ్ముళ్ళకూ, చెల్లాయికీ చెప్పొద్దని బ్రతిమాుతుంది. రామోన్‌ సహాయంతో ఫెర్మిన్‌ను అతడి మార్షల్‌ ఆర్ట్స్‌ క్లాస్‌ దగ్గర కుస్తుంది క్లియో. కానీ, అతడు తన పూచీ లేదంటూ పారిపోతాడు. క్లియో, సోఫియో కథ ఒకటేలా వుందనిపిస్తుంది. సినిమాలో మరో చోట తాగొచ్చిన సోఫియా క్లియోతో ‘‘మనం ఒంటరి వాళ్ళం. ఎవరేమన్నా ఆడవాళ్ళమెప్పటికీ ఒంటరి వాళ్ళమే’’ అంటుంది. కార్పస్‌ క్రిస్టీ హత్యాకాండ : ప్రసవకాం దగ్గర కొస్తున్నందున పుట్టబోయో బిడ్డ కోసం ‘క్రిబ్‌’ కొందామని క్లియోను షాపింగుకి తీసుకెళ్తుంది తెరేసా. వీధిలో బ్యానర్లు, ప్లకార్డుతో సమాయత్తమౌతున్న విద్యార్థును చూస్తుంది క్లియో. విద్యార్థు తిరుగుబాటు రక్తసిక్తం కాబోతోందని తెలీదామెకు. ఇన్స్‌టిట్యూషనల్‌ రిమ్యాషనరీ పార్టీ (పేరును బట్టి ప్రగతిశీ పార్టీ అనుకోవద్దు) ూయిస్‌ ఇచెవారియా ఆ్వరేజ్‌ అధ్యక్షుడిగా వున్న రోజువి. రైతు భూము ఆక్రమిస్తూ, విద్యారంగానికి కేటాయింపు తగ్గిస్తూ సంస్కరణు సాగుతున్న కామది. రైతుూ, విద్యార్థుూ వుద్యమిస్తున్నారు. మిటరీ, పోలీసు ద్వారానే కాక, రాజ్యాంగేతర శక్తు ద్వారా వీటిని అణిచే ప్రయత్నాు చేస్తోంది ఆ సర్కారు. అటువంటి ఒకానొక మితవాద మిలీషియా పేరు ‘లాస్‌ హల్కొనేస్‌’. ‘డేగు’గా ప్రసిద్ధి చెందిన ఈ దళానికి అమెరికా గూఢచర్య సంస్థ సి.ఐ.ఏ. శిక్షణనిస్తోంది. పోలీసు అండతో ఈ డేగు ఉద్యమకారుపై విరుచుకుపడతారు. లాఠీతో చెదరగొట్టడానికి ప్రయత్నిస్తారు. తర్వాత క్పాుు జరుపుతారు. పారిపోతున్న వారిని వెంబడిరచి మరీ చంపడం వీరికవాటు. ఫర్నిచర్‌ షాపు పైవాటాలో షాపింగు చేసున్న క్లియోకు గన్‌ షాట్స్‌ వినిపిస్తాయి. దిగువ రోడ్డు మీద విద్యార్థుపై క్పాుు జరుగుతున్నట్టు తొస్తుంది. ఈలోగా కొంతమంది విద్యార్థు ప్రాణభయంతో దుకాణంలోకి వస్తారు. వెంబడిరచిన ‘డేగు’ కొన్ని దుకాణంలోకి వస్తాయి. ఒక ‘డేగ’ దాక్కోబోతున్న విద్యార్థిని కాల్చి చంపేస్తుంది. మరో డేగ క్లియోవైపు పిస్లోు గురిపెట్టి ఒక్క క్షణం నిశ్చేష్టమైపోతుంది. తర్వాత మిగతా డేగతో కలిసి పారిపోతుంది. సుమారు 120 మంది విద్యార్థుల్ని పొట్టన పెట్టుకున్న ఈ సంఘటన ‘కార్పస్‌ క్రిష్టీ హత్యాకాండ’గా మెక్సికో చరిత్రలో నమోదైంది. ఈ సంఘటన 1971 జూన్‌ 10న జరిగింది. దీనికి ముందు 1968లో ‘లాటేలోల్కో’ విద్యార్థు హత్యాకాండ జరిగింది. అందుకనే ‘ఈ ప్లిను చంపేయరు కదా?’ అని ముసలావిడ కార్లో వెళ్తున్నప్పుడు ఆందోళన వ్యక్తపరుస్తుంది అంతకు మునుపటి దృశ్యంలో. అతి కీక సన్నివేశం: తనవైపు పిస్తోు గురిపెట్టింది తను ప్రేమించిన, తన గర్భానికి కారణమైన ఫెర్మిన్‌ అని తెలిసివచ్చిన క్లియో భయంతో కూడిన షాక్‌కి గురౌతుంది. దాంతో ఆమె గర్భం నుంచి ఉమ్మనీరు స్రవించడం మొదలౌతుంది. వెనువెంటనే ఆసుపత్రికి తరలించాని ప్రయత్నిస్తారు. కానీ వారి కారు వూరిలో సాగుతున్న అ్లర్లలో చిక్కుకుని ఇంకాస్తా ఆస్యమౌతుంది. ఆమె పరిస్థితి మరింత విషమిస్తుంది. ఆసుపత్రి దగ్గర తన ఇంటి యజమాని డాక్టర్‌ అంటోనియో కుస్తాడు. సహకరించ బోతున్నట్టే నటించి, మళ్ళీ పనుందని తప్పుకుంటాడు. గర్భంలోని శిశువు గుండె దడ విన్పించడం లేదని గాబరా పడతారు డాక్టర్లు. కష్టం మీద ఆపరేషన్‌ థియేటర్లో మృత పాపాయికి జన్మనిస్తుంది క్లియో. ఇటు ప్రసవవేదన భరిస్తూనే మరోవైపు తన పాపను బ్రతికించడానికి ప్రయత్నిస్తున్న డాక్టర్లను చూస్తూ ఆమె పడిన వేదన ఎంతటి వారికైనా కళ్ళనీళ్లు పెట్టిస్తుంది. ఇంత అద్భుతంగా నటించినామె నూతన నటి అంటే నమ్మబుద్ధి కాదు. ఈ దృశ్యంలో కెమెరా క్లియో ఆపరేషన్‌ టేబుల్‌ వైపు ఆమె మొహం ప్రక్కనే క్లోజప్‌లో తిష్టవేస్తుంది. ఈ సినిమాలో దర్శకుడే కెమేరామేన్‌ కాబట్టి తన ప్రియతమ ఆయా కష్టాల్లో వున్నప్పుడు చేదోడుగా ఆమె చెంతనే వుంటానన్నట్టు ఆ సన్నివేశాన్ని ఆ కోణంలోనే చిత్రీకరించాడు. త్యాగమయ మాతృమూర్తి క్లియో: ఈ విషాదంతో మూగజీవిలా మారిపోతుంది క్లియో. పార్కింగ్‌ సమస్య వ్ల చిన్నకారు కొనుక్కొస్తుంది సోఫియా. కానీ పెద్దకారు అమ్మేసే ముందు సీ బీచికి ఒక ట్రిప్పు ప్లాను వేస్తుంది. తమ ప్లికి ఒక ముఖ్యమైన విషయం చెప్పొచ్చనీ, క్లియోకి కూడా కొంత వుపశమనంగా వుంటుందనీ భావిస్తుంది. ‘మీనాన్న మనల్ని వదిలేస్తున్నాడు, మనింటి నుండి తన సామాను తీసకుపోతాడు. అందుకనే, మనమిక్కడికి వచ్చాం’ అంటూ ప్లికు చెబుతుంది. అంతా ఇంతకు ముందునుంచే కనిపెడుతున్న పెద్దాడు వెక్కి వెక్కి ఏడుస్తాడు. చిన్నప్లిు సముద్ర స్నానానికి వెళ్తారు. అందరిలోకీ చిన్నవాళ్ళు ప్రమాదంలో పడతారు. క్లియోకి ఈతరాదు. అయినా తన ప్రాణాు లెక్కచేయకుండా వారిని కాపాడుతుంది. నుగురు ప్లిూ క్లియోను తమ సొంత తల్లిలా కావలించుకుని భోరున విపిస్తారు. తన ప్రాణాు పణంగా పెట్టి ప్లిల్ని కాపాడినందుకు కృతజ్ఞత తెలియజేస్తారు. ‘నా సొంత బిడ్డ బ్రతకాని మాత్రం నేను కోరుకోలేదు’ అంటూ అపరాధ భావనతో విపిస్తుంది క్లియో. కారు వెనక సీట్లో ప్లిల్ని అక్కున చేర్చుకున్న ఆమె ప్రశాంత వదనం మాతృత్వపు అనుభూతిని నిజంగా అనుభవిస్తున్నట్టు వుంటుంది.
ప్రేమతో శ్రద్ధగా నిర్మించిన సినిమా:
ఉదయం లేచి ఇళ్ళంతా శుభ్రం చేసి, ప్లికి ప్రేమతో నిద్రలేపి, వారికి తిండి పెట్టి, స్కూుకి పంపి, స్కూు నుండి తెచ్చి, వారికి కథు చెప్పి నిద్రపుచ్చి, ఇంట్లోని లైట్లన్నీ ఆర్పి, కొవ్వొత్తి మెతురులో ఇనుప నిచ్చెన మెట్లెక్కి డాబా మీది తన గదికి చేరే వరకూ ఆ ఇంటికీ, ప్లికీ చేసిన సేవకు ఏమిచ్చి రుణం తీర్చుకోగం అని దిగుపడుతూ దర్శకుడు చాలా ప్రేమతో తీసిన సినిమా ఇది. కెమేరా పనితనం దృశ్యాను చిత్రీకరిస్తున్నట్టనిపించదు, పాత్రను పరికిస్తున్నట్టుంటుంది. తమ పెద్దాళ్లు అంత మంచావిడతో కొన్ని సార్లు అన్యాయంగా ప్రవర్తించారన్నట్టు చూపే ఒకటి రెండు దృశ్యాున్నాయి. తల్లి, తండ్రితో కలిసి ప్లింతా టీవీ షో చూస్తుంటారు. అక్కడికి వచ్చిన క్లియో పను చేస్తూ, తను కూడా ఆ షో ఓరకంట చూస్తూ చివరికి వారి ప్రక్కన చతికి పడుతుంది. ఇంతలోనే ‘డాక్టరు గారి కోసం టీ పట్రా’ అంటూ ఆమెను అక్కడ్నించి వెళ్లగొట్టేస్తుంది సోఫియా. మరోచోట తన భర్తతో ఫోన్లో మాట్లాడి మనసు పాడుచేసుకున్న సోఫియా తన పనిమనిషితో దురుసుగా ప్రవర్తిస్తుంది. కానీ, సినిమా ఆఖర్లో క్లియో త్యాగమయ సేవను గుర్తించిన ఆమె మరోసారి విహారయాత్రకు వెళితే ‘డిస్నీల్యాండ్‌’ కాకుండా క్లియో స్వగ్రామం ఓగ్జాకా వెళదామంటుంది ప్లితో.
దృశ్యకావ్యం ఈ సినిమా :
కళాత్మకమైన రాజు కాపు కట్టడా సరసనే, షాపింగ్‌ కాంప్లెక్స్‌తో నవీకరణ చెందుతున్న మెక్సికో నగరాన్ని బ్లాక్‌ అండ్‌ వైట్‌లో చాలా అందంగా ఆవిష్కరించాడు దర్శకుడు. వీధిలో వెళ్తున్న బ్యాండ్‌, సైకిు మీది ఫ్లూటు వాద్యకారుడు, సినిమా హాు బయటి వెండర్లూ, ప్లిు వడగళ్ళను ఏరుకోవడాు, తీగపై వుతికి ఆరేసిన బట్టల్లో కేవం సాక్స్‌ నుండి మాత్రమే నీటి చుక్కు కారడం, సినిమా ద్వారా ప్లిల్లోకి చేరుతున్న గన్‌ క్చర్‌, అపుడే ముగిసిన ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌ పోస్టర్లు, మెక్సికోలో వచ్చే భూకంప ప్రకంపనూ ` ఇలా ఎన్నో చిన్న, పెద్ద అంశాు సినిమాకు సహజత్వాన్ని అందించాయి. కారు పార్కింగు చేసే విధానంలోనే పాత్ర మనస్తత్వాన్ని విశ్లేషిస్తాడు దర్శకుడు. సినిమా ఫొటోను చూసినా ఒక్కో ఫ్రేము ఒక్కో దృశ్యకావ్యంలా వుంటుంది. ఉదాహరణకి కార్లో టూర్‌కి బయల్దేరుతున్న భర్తను తన భయం కొద్దీ వెనకనుండి వాటేసుకుని, ముద్దుపెట్టుకుంటే, పిల్లాడిని సముదాయిస్తున్న క్లియో దృశ్యం చూడొచ్చు. ప్రొఫెసర్‌ జోవెక్‌ (లాటిన్‌ వర్‌) అనే చిన్న పాత్ర ఈ సినిమాలో వస్తుంది. తన పళ్ళతో కారును లాగుతున్న ఫీటు చేస్తూ మొదట ఒకచోట టీవీలో కన్పిస్తాడు ఈ పాత్రదారి. మరోచోట ఫెర్మిన్‌ తదితరుకు ఔట్‌డోర్‌లో కర్రసాము నేర్పుతూ కన్పిస్తాడు. చూస్తున్న వాళ్ళంతా ఇదేదో మమూు శరీరవ్యాయామ విద్య అనుకుంటారు. కానీ, ప్రైవేటు మిలీషియా ట్రైనింగని మనకు తర్వాత అర్థమౌతుంది. క్బుర్గీ, గౌరీంకేష్‌ను చంపిన వాళ్లు కూడా ఇటువంటి శిక్షణ పొందిన ఖాకీ నిక్కరుగాళ్ళే. సినిమా ఆఖరు దృశ్యంలో, డాబా మీదికి వెళ్తున్న క్లియోను మనకందనంత ఎత్తుకు ఎదిగిన వ్యక్తిగా లో ఏంగిల్‌ షాట్‌ తీస్తూ, టైటిల్స్‌లో ప్రతిబింబంలో చూపిన విమానాన్ని ఒరిజినల్‌గా ఆకాశంలో చూపుతాడు దర్శకుడు.
ఈ సినిమా 75వ వెనిస్‌ అంతర్జాతీయ చిత్రోత్సవంలో గోల్డెన్‌ యన్‌ గ్చొకుంది. ఆస్కార్‌ అవార్డు కోసం విదేశీ సినిమా విభాగంలో మెక్సికో దేశపు ఎంట్రీగా ఎంపికైంది. ‘టైం’, ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ పత్రికు ఈ సినిమాను 2018 సంవత్సరంలో తయారైన ఉత్తమ సినిమా అని ప్రశంసించాయి.

admin

leave a comment

Create Account



Log In Your Account