తమిళంలో మొదటి ఆధునిక నాటకం ద్వారా ప్రత్యామ్నాయ నాటకరంగాన్ని సృష్టించిన ఎన్‌.ముత్తుస్వామి (నా.ము.) మరణం

తమిళంలో మొదటి ఆధునిక నాటకం ద్వారా ప్రత్యామ్నాయ నాటకరంగాన్ని సృష్టించిన ఎన్‌.ముత్తుస్వామి (నా.ము.) మరణం

ఎన్‌. ముత్తుస్వామి 1936లో తంజావూరు జిల్లా పూంజల్‌ గ్రామంలో జన్మించారు. తన 82వ ఏట 24102018 ఉదయం 11:30కు చెన్నైలోని చిన్మయనగర్‌లో తన సొంత ఇంటిలో మరణించారు.
ఆయన 1950లో మద్రాసుకు వచ్చారు. ఆయన 1968లో రాసి ప్రదర్శించిన ‘కాం కామాగ’ (సమయం వెంట సమయం) తమిళ నాటకరంగంలో మొదటి ఆధునిక నాటకంగా విమర్శకు పరిగణిస్తున్నారు. ఈ నాటకంలో వస్తు వ్యామోహ సంస్కృతి ఏవిధంగా వ్యక్తిత్వాను హరించివేస్తోందో చిత్రీకరించారు. సంప్రదాయ నాటకరంగానికి ప్రత్యామ్నాయంగా రూపొందిన ఈ ఆధునిక నాటకంలో తమిళ జానపద కళారూపం ‘తేరుకూత్తు’లోని అంశాను ఆయన ప్రవేశ పెట్టారు. ఈ జానపద కళారూపం లోతుపాతును ఆయన ఎనిమిదేళ్ళపాటు అధ్యయనంచేసి, దానిలోని పాటు, నృత్యాు మొదలైన అంశాను ఆధునికం చేశారు. నిజానికి ఈ ‘తేరుకూత్తు’ అత్యంత ప్రాచీనమైనది. ఎంతో ముడి రూపంలో వుండే ఈ కళారూపం 8 గంటపాటు సాగుతుంది. పాత్ర మధ్య సంభాషణుండవు. కేవం పాటు, నృత్యాతో నిండి వుంటుంది. కథావస్తువు రామాయణం, మహాభారతం మహాకావ్యాకు సంబంధించి వుంటుండేది. కొన్ని పాత్రు ముఖాకు అట్టబొమ్ము (మాస్క్‌) ధరిస్తాయి. క్రీ.పూ. 300 క్రీ.శ. 300 మధ్యకాపు నాటి సంగం సాహిత్యంలోని ఐదు తమిళ ప్రాచీన మహాకావ్యాలైన ‘శిప్పదికారం’లో ఈ కళారూప ప్రస్తావన వుంది.
దీనిని ముత్తుస్వామి ఆధునికం చేశారు. తమిళ నాటకాలో అప్పటివరకు వున్న సుదీర్ఘ సంభాషణ స్థానంలో క్లుప్త సంభాషణను ప్రవేశబెట్టారు. కథావస్తువుగా సమకాలీన సమాజాన్ని పట్టిపీడిస్తున్న రుగ్మతను తీసుకున్నారు. వ్యంగ్యం ప్రధానంగా ఆ రుగ్మతను తన నాటకాలో చీల్చి చెండాడారు. తన నాటకంలో పాటను, జానపద నృత్యాను చేర్చారు. ముడిసరుకుగా వున్న ‘తేరుకూత్తు’ ముత్తుస్వామి చేతిలో ఆధునిక నాటకంగా రూపుదిద్దుకొంది.
ముత్తుస్వామి 1977లో చెన్నైలో కూత్తుపిపట్టరాయ్‌ (సమగ్ర రంగస్థం) అనే నట శిక్షణాసంస్థను ప్రారంభించి 40 ఏళ్ళపాటు నడిపారు. 1987 నుంచి ఈ నాటక సంస్థ సంచార నాటక బృందంగా అనేక ఆధునిక నాటకాను ప్రదర్శించింది. ఒక ఏడాదైతే ఏకబిగిని 65 రోజు పర్యటనలో బొంబాయి, కకత్తా, ఢల్లీి, ముస్సోరి తదితర ప్రదేశాలో 20 ప్రదర్శనలిచ్చారు. ఆయన తన నాటకాకు ఎప్పుడూ టిక్కెట్లు పెట్టలేదు. అన్నీ ఉచిత ప్రదర్శనలే.
నాటకరంగం సమకాలీన సమాజపు సమస్యను ప్రతిబింబించానీ, అవి మానవత్వాన్నీ, వినయాన్నీ నేర్పానీ ఆశించిన ముత్తుస్వామి నడిపిన నాటక శిక్షణాసంస్థను యునెస్కో 2000`2007 మధ్యకాంలో ప్రపంచంలో వున్న మొదటి ఐదు నట శిక్షణా సంస్థలో ఒకటిగా గుర్తించింది. ఈ శిక్షణా సంస్థలో ప్రతి విడతకూ 25 మందిని మాత్రమే చేర్చుకునేవారు. వారందరూ కలిసి ఆ ప్రాంగణంలోనే ఒక కుటుంబంగా నివసించేవారు. వారందరూ గతంలో ఎటువంటి నటనానుభవం లేనివారు. పైపెచ్చు గ్రామీణ ప్రాంతా నుండి అభినయంపట్ల ఆసక్తితో వచ్చినవారు. ఆ ముడిసరుకును ఈ శిక్షణాసంస్థ సానబట్టి, నటుగా తీర్చిదిద్దింది. ఈనాడు తమిళ సినిమారంగంలోని కలైరాణి, పశుపతి, విజయ్‌ సేతుపతి, విక్రమ్‌ వేధా, వినోదిని, విమల్‌, గురుసోమసుందర్‌ మొదగు వారందరూ ఈ శిక్షణాసంస్థలో శిక్షణ పొందినవారే.
సాధారణంగా నాటకాలో పాత్రు కుడివైపునుండో, ఎడమవైపు నుండో, ప్రేక్షకులో నుండో ప్రవేశిస్తాయి. అయితే ముత్తుస్వామి చేసిన మరో ప్రయోగం ఏమిటంటే కొన్ని పాత్రను రంగస్థపు పైకప్పు నుండి (తీశీశీట) మోకు ద్వారా ప్రవేశబెట్టడం.
ఒక కుగ్రామం నుంచి వచ్చిన ముత్తుస్వామి, తన సాహిత్య జీవితపు తొలిసంవత్సరాలో, గ్రామాు పట్టణీకరణ చెందటంతో వచ్చిన మార్పును శక్తిమంతమైన కథుగా రచించారు. ఆయన కథను ‘నీర్మాయ్‌’ అనే సంపుటిగా 1960లో ప్రచురించారు. వీటిలో కొన్ని కథను ప్రసిద్థ అనువాదకురాు క్ష్మీ హోమ్‌స్ట్రామ్‌ ఇంగ్లీషులోకి అనువదించారు.
1999లో ఆయన సంగీత నాటక అకాడమీ అవార్డును పొందారు. 2012లో భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది.

admin

Related Posts

leave a comment

Create AccountLog In Your Account