బాటసారులు

మూలం : అరవింద సిన్హా                                      అనువాదం : వి. రాధిక           బీదా బిక్కీ           సాదాసీదా జనం మేం.           ఈ దేశంలో!           బహుదూరపు బాటసారులమై           కాలినడకన బేగు సరాయ్‌ చేరగలిగినప్పుడు           కాలే కడుపులతో బెనారస్‌ చేరగలిగినప్పుడు           నడిచి నడిచి మేం బిడ్డా పాపలతో           మాన్సర్‌, రాంచీ, బస్తర్‌…. దేశంలో ఏ           మూలకైనా           దూరదూర తీరాలకు మేం చేరగలిగినప్పుడు           గుర్తుంచుకోండి మీరంతా!           మా
Complete Reading

– వంగర లక్ష్మీకాంత్ తెల్ల తుమ్మ తంగేడు కరక్కాయ ఊటలో ఊరివచ్చిన తోలు చెప్పులా వైరస్సు ధూళి మహా సముద్రంలో మునిగి – నాని – ఈదివచ్చిన వాడా వీరుడా – శూరుడా – మానవుడా! కాష్టంబూడిద వళ్ళంతా పులుముకున్న శివుడిలా సూక్ష్మక్రిమి సున్నం లోపలా – బయటా తాపడం వేసుకుని ఊరేగుతున్న నవ్య రుద్రుడివిరా నువ్వు వీరుడా – శూరుడా – మానవుడా! ‘కరోనా’ ఓ చిన్న దుమ్ము కణం దాన్ని చూసి కటకట –
Complete Reading

– సహచరి             వాళ్ళు విమానాల్లో విహరించే వాళ్లకు             రన్‌వేలు నిర్మించే వలస జీవులు….             వాళ్ళు రైలు బోగీలకు పట్టాలేసి             రహదారుల్ని నిర్మించిన బడుగుజీవులు             వాళ్ళు కాళ్ళు తడవకుండా బడాబాబుల్ని             సముద్రాలు దాటించగల శ్రమజీవులు….             ఫ్యాక్టరీల పొగగొట్టాలే ఊపిరితిత్తుల్లా             ఉఛ్వాస నిశ్వాసాల్లో విషవల(స)యంలో రాలిపోయి..             తెగిపడిన విగత జీవులు వాళ్ళు             కళ్ళు తడుపుకుంటూ కడుపు కాల్చుకుంటూ             సకల సంపదల సృష్టికర్తలు వాళ్ళు..            
Complete Reading

– ఓ వీ వీ ఎస్ దేశం మడిలో తుపాకీ విత్తులు నాటి, స్వేచ్ఛా పరిమళాల పూదోటలు వేద్దామనుకున్నావు కానీ…, అన్యాయాల కలుపు మొక్కలు చూడెలా కమ్మేస్తున్నాయో…. జనాన్ని కలిపి ‘ఉంచని’ తనాన్ని ఈసడిస్తూ…. మతాతీతంగా నువ్వెదిగిపోయావు…. కానీ, దురంతాల వామనపాదాల వికటాట్టహాసాలు బోన్సాయ్‌ వృక్షాల అరణ్యాలై ఎలా విస్తరిస్తున్నాయో చూడు. అస్వతంత్ర భారతంలో మృత్యువే నీ వధువన్నావు…. గాంధారి పుత్రుల కీచక పర్వాల పుటలమై మేమెలా రాలిపడుతున్నామో చూడు. హోరెత్తిన యవ్వనాగ్ని కేతనమై నువు నిలిస్తే….
Complete Reading

– దివికుమార్‌ పల్లెలలో బతకలేక వలసపోయిన పాదాలు నగరాల్లో చావలేక తల్లి ఒడికై తపించి యింటి బాట పట్టిన పాదాలు చావుని ధిక్కరిస్తున్న పాదాలు ఆధునిక మహాయాత్రకు చరిత్ర నిర్మాతలైన పాదాలు దండి యాత్రలను ఆయోథ్య జాతరలను తెర వెనుకకు నెడుతున్న పాదాలు ఏ శక్తి పిడికిలైతే దోపిడీశక్తులు గజగజలాడతాయో ఏ నెత్తుటి చారికలు మరో చరిత్రకు దారి చూపుతాయో వేటి సంకల్ప బలానికి ప్రపంచం తల దించుకుంటోందో ఆ శ్రమజీవన పాదాలకు మనసా వాచా కర్మేణా
Complete Reading

– కె. భానుమూర్తి తూరుపు తెల వారక ముందే సూర్యుడు పొద్దు పొడవక ముందే ముఖానికి ఇంత పసుపు పులుముకొని నుదుటన ఇంత సింధూరం అద్దుకొని రంగురంగుల సీతాకోకచిలుకల కోసం తనని తాను సింగారించుకుని సిద్ధ పరుచుకుంటుంది మా ఊరి బడితల్లి గుంపులు గుంపులుగా వచ్చే నును వెచ్చని కిరణాల కోసం భుజాలకతుక్కొని జట్లు జట్లుగా వచ్చే పూల గుత్తుల గుబాళింపుల కోసం ఎదురుచూస్తోంది మా ఊరి చదువులమ్మ ఏ శిశిరం కాటేసిందొ ఏ వేరు పురుగు
Complete Reading

– డా. జి.వి. కృష్ణయ్య మనీషా… మన్నించమ్మా… నీ దేహం చితిపై కాలిపోతున్నా మా గుండెల్లో మంటలు చెలరేగుతున్నా తనివితీరా ఏడ్వలేని పిరికితనం కడసారి చూపులకీ నోచుకోలేని కడుబీద దళితబిడ్డా..నీకు కన్నీటి వీడ్కోలు! నీ మానప్రాణాలకు రక్షణలేదు కానీ… నీ చితిమంటలచుట్టూ లాఠీల పహారా రాజ్యంగీచిన లక్ష్మణరేఖకవతల భద్రతావలయంలో దిక్కుమాలిన దీనాలాపన! కామాంధుల కర్కశత్వానికీ ధనమధాందుల రాక్షసత్వానికీ చిత్తకార్తె కుక్కల పైశాచికత్వానికీ మూకుమ్మడి దాష్టీకానికి దేహం చిద్రమై హృదయం బద్దలై నాలుక తెగిన మాటలమౌనం వినిపించని శోకసంద్రమై
Complete Reading

– కొత్తపల్లి హరిబాబు           ఎగసే జ్వాల           దహనం చేసేదాకా ఆగదు           మండే గుండెలు           చెండాడుతాయి           రగిలే పోరు           తుది సమరందాకా నిద్రపోదు           నీలో నాలో మరిగే రక్తం           నీలో నాలో చెలరేగే కవితలకు మూలం           అది ప్రజాస్వామ్యాన్ని పునాదుల్తో పెకలిస్తుంది           విప్లవానికి బాటలు వేస్తుంది           సోషలిస్టు సమాజ నిర్మాణానికి దోహదం చేస్తుంది.

– పల్లిపట్టు ప్రదర్శించడం బాగానే వుంటాదిఅన్నీ అంగట్లో సరుకైన కాలంలోఅన్నిటికీ అమ్ముడుపోవడం అలవాటైన రోజుల్లోదేన్నైనా పేరుపెట్టిపిలిచిపెద్దపెద్ద మాటల్లో పొగిడి ప్రదర్శించడం గొప్పగానే వుంటాది రంగురంగుల బొమ్మలాటనోరకరకాలబురిడీల గారడీ మాటనోనలుగురు మెచ్చుకునేలానాలుగు రూకలు మూటకట్టుకునేలానాటకాన్ని ప్రదర్శించడం నాటకీయంగానే వుంటాది లోపాలు కనిపించకుండాదీపాల వెలుగులో నటించే ముఖాలమైనవ్వో ఏడుపో పులుముకునిదీపంచుట్టూ పేడబురగలా తిరిగే వీరభక్తినోఏ దేముడేమీ చేయలేని రోగభయాన్నోవొంటినిండా కప్పుకునిఇళ్లముందు ప్రదర్శించడం బలేగానే వుంటాది చూరుకిందోవసారాలోలోజిగేల్మంటూ కులికే వరండాలోనోఅద్దాలుపొదిగిన అంతస్తుల భవంతుల బాల్కనీల్లోనోఎదో ఒకటి ప్రదర్శించడం బ్రహ్మాండంగానే వుంటాది ఇల్లూ
Complete Reading

– డా॥ పి.వి. సుబ్బారావు బతుకంతా బొట్లు బొట్లుగా కాలపు వేళ్ళ సందుల్లోంచి మెలమెల్లగా జారిపోతుంటే కళ్ళల్లో నింపుకున్న నిరాశా శకలాల తడిపొరల్లోంచి అప్పుడప్పుడూ తొంగి చూచే గతం ఊబిలోంచి బయటపడ్డానికి నిస్సహాయంగా ఆక్రందించే జీరబోయిన చీకటి గొంతు కేక! ఆత్మీయంగా వినడానికీ అభయ హస్తమందించి బయటకు లాగడానికి ఎవరూ లేరని తెలిసినా లోపొరల్లో ఎక్కడో పరుచుకొన్న ధైర్యపు తెర వెలుగును సంగ్రహించుకొంటూ ఆశాశ్వాసల రంగుల్ని ముద్దలు ముద్దలుగా పులుముకొంటూనే వుంటుంది ఒక సర్రియలిస్టు చిత్రంలా గడచిన
Complete Reading

Create Account



Log In Your Account