ఆంగ్లమూలం : పంకజ్ ప్రసూన్ తెలుగు : కొత్తపల్లి రవిబాబు (స్వేచ్ఛ, సమానత్వం, దోపిడీరహిత ప్రపంచం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులందరికీ మన విప్లవ అరుణారుణ వందనాలు) నిరంకుశులకు, సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా కవిత్వం ఒక ఆయుధంగా వుంటుంది. టునీసియాలో, ఈజిప్టులో, సిరియాలో యెమెన్‌లో, బహ్త్రైన్‌లో, మలేసియాలో స్వాతంత్య్ర పతాకాన్ని ఎత్తిపట్టిన వారికి, అన్యాయానికీ, దోపిడీకి వ్యతిరేకంగా
Complete Reading
– సిహెచ్. మధు జీవన చరమాంకం ప్రారంభమయ్యింది సూర్యుడు పశ్చిమాన పరుగును అరచేతితో ఆపేసాను ఆపన్నుల హస్తం, అభిమాన సూర్యుల వెలుగు నాకు అమృతం పోస్తున్నాయి అస్తమయం సహజాతి సహజం కానీ తాత్కాలికంగా ఓడిపోతుంది పర్వతాల అడ్డు తొలగిపోతుంది డెబ్బది సంవత్సరాల చెట్టు శిశిరంలోకి ప్రవేశించింది ఆకులు రాలిపోతున్నాయి కొమ్మలు బలంగానే వున్నాయి మళ్లీ ఆకులు చిగురిస్తాయి గాలి, నీరు నేనేగా నేల బలం నాలో నిక్షిప్తమయివుంది నా మనసులో ముళ్లు – రాళ్లు వున్నాయి నా
Complete Reading
– ఏటూరి నాగేంద్రరావు వీళ్ళందరూ ఏ దేశపు నేరస్తులూ కారు.. ఓటు హక్కున్న నేల నుండి విసిరేయబడి ఆకలిని నియంత్రించుకుంటూ పేగులు కుట్టేసుకొని యాడేడో తిరిగి తిరిగి రంగు మారిన ముఖాలు. ఈ మట్టిలో పుట్టి ఈ మట్టినే తింటున్న ప్రగతి కారులు. ఆశల్ని తాకట్టు పెట్టుకుంటున్న స్తబ్ధ ప్రపంచాలు. చెలియలి కట్టను తెంపుకొని పరుగిడుతున్న ఆవేదన
Complete Reading
– ఎస్. శంకరరావు ఆదిపత్య దురహంకార అక్రమ సంతానమా! కాలం కనుసన్నలలో వికసించిన యమపాశమా! నగ్న శిధిలీకృత వ్యవస్థ సృజించిన విష బీజమా! ప్రకృతిని పట్టిపీడించే హీన సంస్కృతి రాజసమా! విషవాయు జ్వాలల కాలుష్యమా! ఓ కాలుష్యమా! నీ దుర్నీతి ఫలితం ప్రతి ఇంటా ప్రతి వాడా క్షణం క్షణం మృత్యు భయం! నాడు బోపాల్- నేడు
Complete Reading
– అశోక్ కుంబము (“మానవాళి శోభ కోసం మొత్తం దోపిడీ వ్యవస్థను కాల్చేయాల్సిందే!”) నీ కడుపులో ఉన్న తొమ్మిది నెలలేనమ్మా జీవితంలో నేను పొందిన స్వేచ్ఛా కాలం ఏ క్షణాన భూమి మీద పడ్డానో నా నల్ల రంగే నాకు శాపమయ్యింది ఊహించని మృత్యుకూపాన్ని నా చుట్టూ తొవ్వింది నేను ఎదురుపడితే నాలో ఒక దొంగనో మత్తు మందు బానిసనో
Complete Reading
– సూర్యప్రకాశ్ కంపుగొట్టే మురికి వాడల దారుల నుండి.. పెచ్చు లూడుతున్న ఫ్లై ఓవర్ల నీడల నుండి.. మొదలయ్యిందొక ప్రస్థానం. బోర విరుచుకొని నిలుచున్న కార్పొరేటు కోటల శిఖరాల ముంగిట శిరసు వంచి మోకరిల్లిన మహానగరాల మురికి వాడల నుండి.. డొక్కలు మాడి బక్క చిక్కిన బడుగుల పడకల ఫుట్పాతుల నుండి.. కాళ్ళీడ్చుకుంటూ మొదలయ్యింది నేటి మహా ప్రస్థానం. పాపాలను కడిగేసుకునే పుణ్య పురుషుల
Complete Reading
– వై. నేతాంజనేయ ప్రసాద్ పులిచంపిన లేడికి సానుభూతిగా సింహం అహింసావ్రతం చేస్తుంది అన్యాయం అంటూ ఆక్రోశిస్తుంది – నిన్నటిదాకా సింహం విదిల్చిన ఎంగిలి మాంసం పంచుకుతిన్న అవకాశవాద గుంటనక్కలనేకం వింత గొంతుకతో వంతపాడుతూ పస్తులుండలేక పాట్లుపడుతున్నాయి – దోచుకునే దొంగసొత్తు దక్కడంలేదని సమన్యాయం అంటూ ఘోషిస్తున్నాయి – నిన్నటిదాకా సింహం నీడన చేరి నిస్సిగ్గుగా నీరాజనాలందించిన వలస
Complete Reading
– రవి నన్నపనేని కిరీట క్రిమి కంటే అత్యంత భయంకరమైంది యుద్ధ క్రిమి మనిషి లోపల విస్తరించే మహమ్మారో మనిషిని మానసికంగా శారీరకంగా హింసించే మరో అమానవుడో నేలమీద దుఃఖం లేని స్థలాన్ని చూడగలమా ? పీడితులూ పీడకులూ లేని కాలాన్ని ఊహించగలమా ? ఎల్లలు లేని ప్రపంచ పటం గీయగలమా? మనిషి పుట్టుక – జీవితం వేయి రేకుల
Complete Reading
– మౌళి నడిచినడిచి బొబ్బలెక్కిన కాళ్ళతో.. ఏడ్చిఏడ్చికన్నీళ్లగాయపు కళ్ళతో.. చండ్ర చండ్రం ఎండదెబ్బల ఒళ్ళుతో.. తూలితూలి నెత్తురోడు పాదాలతో.. ‘‘ఆకలంతా నడుస్తుంది’’.. అవిసిఅవిసిన గుండెతో.. జారిపోయిన మనసుతో.. సడలిపోయిన ఆశతో.. అన్నమెండిన కడుపుతో.. నిద్రలేని రాత్రిసెగతో .. భద్రమెరుగని జాగరణతో.. ఊపిరాడని వయసుతో.. ‘‘ఆకలంతా నడుస్తుంది’’.. తల్లినేమో మోస్తులేక తల్లి బాధను చూడలేక తల్లి
Complete Reading
– సయ్యద్ రసూల్ మండే గుండెల అగ్ని కీలలు ఉవ్వెత్తున ఎలా ఎగిసిపడుతున్నాయో చూసావా ట్రంపూ ..!!? జనాగ్రహం జ్వాలా ముఖిలా విస్ఫోటనం చెందితే దిక్కులు ఎలా ఎరుపెక్కుతాయో గ్రహించావా ట్రంపూ ..!!? ఓరిమి నశించిన జనవాహిని ఉప్పెనలా చుట్టుముడితే ఊపిరి ఎలా ఆగిపోతుందో ఉహించావా ట్రంపూ …!!? కసితో బిగుసుకున్న పిడికిళ్లు అసహనంతో పైకి లేస్తే
Complete Reading