‘నాస్తిక కేంద్రం’ నాయకులు డా॥ విజయం మరణం

          అంటరానితనానికి వ్యతిరేకంగా, జోగిని – బసివిని దురాచారాలకు వ్యతిరేకంగా, కులాంతర వివాహాలను, నాస్తికత్వాన్ని ఒక ఉద్యమంగా కొనసాగించిన గోరాగారి కుమారుడు. డా॥ విజయం తన 84వ ఏట 22 మే 2020న అనారోగ్యంతో విజయవాడలో మరణించారు. ఆయన 1 డిశెంబరు 1936న జన్మించారు.          నాస్తికత్వం అంటే ఒక జీవన విధానం అనీ, శాస్త్రీయ దృక్పథం అని నిరంతరం ప్రచారం చేసిన ఆయన ఇతర దేశాలలోని నాస్తిక సంఘాలతో నిత్య సంబంధాలు పెట్టుకొని, అక్కడి జర్నల్స్ కి
Complete Reading

– రవి నన్నపనేని           కిరీట క్రిమి కంటే           అత్యంత భయంకరమైంది యుద్ధ క్రిమి           మనిషి లోపల విస్తరించే మహమ్మారో           మనిషిని మానసికంగా           శారీరకంగా హింసించే మరో అమానవుడో           నేలమీద           దుఃఖం లేని స్థలాన్ని చూడగలమా ?           పీడితులూ  పీడకులూ లేని కాలాన్ని           ఊహించగలమా ?           ఎల్లలు లేని ప్రపంచ పటం గీయగలమా?           మనిషి పుట్టుక – జీవితం           వేయి రేకుల
Complete Reading

          ‘చీకటి ఖండంపై మండే సూర్యుడు’ ముఖచిత్రంతో 1990 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మూడు నెలలు కలిపి ఒకే సంచికగా ప్రజాసాహితి వెలువడింది. “మా బాధలు మాకు నేర్పిన పోరాటం యిది” అనే శీర్షికతో వచ్చిన సంపాదకీయంలో దక్షిణాఫ్రికా నల్ల ప్రజల నేత నెల్సన్ మండేలాను 26 సం||ల తర్వాత విడుదల చేయటాన్ని పురస్కరించుకొని దక్షిణాఫ్రికాలో సాగుతున్న దోపిడీ విధానాలు, నల్లజాతి ప్రజల పోరాటాలను వివరించారు. మండేలాకు నిండు మనసుతో ప్రజాసాహితి స్వాగతం పలికింది. ‘అతని అసలు
Complete Reading

– మౌళి           నడిచినడిచి బొబ్బలెక్కిన కాళ్ళతో..           ఏడ్చిఏడ్చికన్నీళ్లగాయపు కళ్ళతో..           చండ్ర చండ్రం ఎండదెబ్బల ఒళ్ళుతో..           తూలితూలి నెత్తురోడు పాదాలతో..            ‘‘ఆకలంతా నడుస్తుంది’’..           అవిసిఅవిసిన గుండెతో..           జారిపోయిన మనసుతో..           సడలిపోయిన ఆశతో..           అన్నమెండిన కడుపుతో..           నిద్రలేని రాత్రిసెగతో ..           భద్రమెరుగని జాగరణతో..           ఊపిరాడని వయసుతో..           ‘‘ఆకలంతా నడుస్తుంది’’..           తల్లినేమో మోస్తులేక           తల్లి బాధను చూడలేక           తల్లి
Complete Reading

– సయ్యద్ రసూల్           మండే గుండెల అగ్ని కీలలు           ఉవ్వెత్తున           ఎలా ఎగిసిపడుతున్నాయో           చూసావా ట్రంపూ ..!!?           జనాగ్రహం           జ్వాలా ముఖిలా విస్ఫోటనం చెందితే           దిక్కులు ఎలా ఎరుపెక్కుతాయో           గ్రహించావా ట్రంపూ ..!!?           ఓరిమి నశించిన జనవాహిని           ఉప్పెనలా చుట్టుముడితే           ఊపిరి ఎలా ఆగిపోతుందో           ఉహించావా ట్రంపూ …!!?           కసితో బిగుసుకున్న పిడికిళ్లు           అసహనంతో పైకి లేస్తే
Complete Reading

– శివాజీరావు           ‘‘హు’’, అని నిట్టూర్చారు అలౌకికానందేంద్ర స్వాములవారు తన 60 ఏళ్ల ఆధ్యాత్మిక జ్ఞానం నింపుకున్న పొడుగాటి గడ్డాన్ని సవరించుకుంటూ.           పరుపులకు, దిండ్లకు పట్టు గలేబాలు తొడుగుతున్న శిష్యులు ఆ నిట్టూర్పుకి క్షణం ఆగి గురువుగారి వైపు చూశారు. స్టేజి ఎదురుగా స్వామివారి జ్ఞాన బోధ విని తరిద్దామని వచ్చి షామియానాల కింద కూర్చున్న అశేష జన వాహినిలోని ముందు వరుసల జనాలు స్వామి వారి నిట్టూర్పు, వారి అనుంగు శిష్యుల తత్తరపాటు
Complete Reading

– ఓవీవీయస్           దేశ రాజధానిలో అది ఒక పూలతోట. మామూలు తోటకాదు. ఎంతో చక్కనైన తోట. సాక్షాత్తూ దేశాన్నేలే చప్పన్నాంగుళి స్వామివారు విహరించే…., ఇంకా చెప్పాలంటే సమావేశాలు వగైరాలు నిర్వహించే చోటది. ఎటుచూసినా పచ్చికబయళ్ళు. ఎన్నో విశాలమైన చెట్లు. ఎన్నెన్నో రంగురంగుల పూల మొక్కలు. పచ్చికే మెత్తనిదనుకుంటే…, అంతకన్న సుతిమెత్తనైన తివాచీలు యోగాసనాలు వేసేందుకు, అంతేనా…. ఎలా కావలిస్తే అలా వంగి మరీ ఆసనాలు వేసేందుకు మెత్తని పెద్ద బాహుబలి బంతులు. చప్పనాంగుళీ స్వామివారి కనుసైగకే
Complete Reading

– బి. విజయభారతి (మహాభారతం – ఆదిపర్వం పరిశీలించి విజయభారతిగారు రాసిన ‘నరమేధాలూ – నియోగాలూ’ పుస్తకానికి ముందుమాట ఇది.      – సం॥)           ‘మహాభారతాన్ని’ భారతదేశ సంస్కృతికి ప్రతీకగా పరిగణిస్తుంటారు. ఇందులోని అంశాలు, ఒకప్పటి సామాజిక రాజకీయ సంఘటనల ఆధారంగా గ్రంథస్తమైన కథనాలే. అవి ఇప్పటికీ సమాజాన్ని శాసిస్తున్నాయి.           ‘మహాభారతం’ దాయాదుల పోరాటగాథగా కనిపిస్తున్నప్పటికీ ఇందులో రెండు వ్యవస్థలకు చెందిన హక్కుల పోరాటాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా కనిపించేది దుర్యోధనాదులకూ పాండు పుత్రులకూ మధ్య జరిగిన
Complete Reading

– బాలాజీ (కోల్ కతా)           ‘‘మీ ఫోన్లో మీకో ప్రచారం కన్పించినపుడు మీ ఫోను మిమ్మల్ని వింటోందని మీలో ఎంతమంది కనిపించింది?’’ – ప్రశ్నిస్తాడు డేవిడ్‌ కరోల్‌ తన క్లాసులోని విద్యార్థులతో. అమెరికాలోని పార్సన్స్‌ స్కూల్‌ ఆఫ్‌ డిజైనింగ్‌లో డిజిటల్‌ మీడియా అడ్వర్టైజ్‌మెంట్ల గురించి బోధిస్తుంటాడాయన. డేవిడ్‌ వేసిన ప్రశ్నకు విద్యార్థులంతా గొల్లున నవ్వుతారు. ఆయన కూడా వారితో కలిసి నవ్వేసి, ‘మన ఫోను మనల్ని కనిపెడుతూ వుండడం ఏమంత నవ్వులాట విషయం కాదు’ అని
Complete Reading

(స్వతంత్ర రచన 1947) – పి. లక్ష్మీకాంత మోహన్           పమిడిముక్కల లక్ష్మికాంత మోహన్‌ పాతతరం సాహితీ ప్రపంచానికి షేక్పియర్స్‌ మోహన్‌గా పరిచయం. 8వ తరగతి (థర్డ్‌ పారం) వరకే చదివి, ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీ సభ్యుడై, బుర్రకథ లాంటి ప్రజాకళారూపాలపై పట్టు సాధించి, ప్రజాకళాకారునిగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలో నిబద్ధ కార్యకర్తగా కృషిచేశాడు. తెలంగాణలో నిజాంకు, భూస్వాములకు వ్యతిరేకంగా ఆ కాలంలో జరిగిన పోరాటాన్ని పోరాటకాలంలోనే ‘సింహగర్జన’ అదే నవలను రచించాడు.
Complete Reading

Create Account



Log In Your Account