కుటుంబం, సొంత ఆస్తి, రాజ్యాంగ యంత్రాల పుట్టుక

ఎంగెల్స్ 2వ శతజయంతి సందర్భంగా – డా. ఆర్కే 1884లో ఫ్రెడరిక్‌ ఎంగెల్స్‌ రాసిన ఈ మహత్తర గ్రంథం అనేకసార్లు ప్రచురించబడి, అత్యంత ప్రజాదరణ పొందింది. పలు భాషలలోకి అనువదింపబడింది. స్త్రీ, పురుష సంబంధాలు, కుటుంబం పుట్టుక, పరిణామం గురించి ఈ పుస్తకం చెబుతుంది. నేను, నాది అంటే ఏమిటో ఎరుగని మానవ సమాజంలోకి సొంత ఆస్తి ఎలా ప్రవేశించిందో తెలియజేస్తుంది. పాలకులు, పాలితులు లేని సమాజం స్థానే శ్రమదోపిడి, వర్గసమాజం ఎలా వచ్చాయో, వాటి రక్షణ
Complete Reading

– ఓ వీ వీ ఎస్ దేశం మడిలో తుపాకీ విత్తులు నాటి, స్వేచ్ఛా పరిమళాల పూదోటలు వేద్దామనుకున్నావు కానీ…, అన్యాయాల కలుపు మొక్కలు చూడెలా కమ్మేస్తున్నాయో…. జనాన్ని కలిపి ‘ఉంచని’ తనాన్ని ఈసడిస్తూ…. మతాతీతంగా నువ్వెదిగిపోయావు…. కానీ, దురంతాల వామనపాదాల వికటాట్టహాసాలు బోన్సాయ్‌ వృక్షాల అరణ్యాలై ఎలా విస్తరిస్తున్నాయో చూడు. అస్వతంత్ర భారతంలో మృత్యువే నీ వధువన్నావు…. గాంధారి పుత్రుల కీచక పర్వాల పుటలమై మేమెలా రాలిపడుతున్నామో చూడు. హోరెత్తిన యవ్వనాగ్ని కేతనమై నువు నిలిస్తే….
Complete Reading

– ఉప్పెన కరోనా కాటుకు రాలుతున్న కంఠాలు ఎన్నో కరోనా వేటుకు తెగి పడుతున్న తనువులెన్నో ఒక్కరా ఇద్దరా ఎందరాని చెప్పుదూ వందలాది జనము మందలోలే కూలుతుంటే                 ॥ కరోనా ॥ ఎంత కష్టం వచ్చెనో ఎన్ని బాదలు తెచ్చెనో ఇంత కష్ట కాలమూ చూడలేదు ఎన్నడూ కన్నీళ్ళు తాగుకుంటు కాలమెల్ల దీసుకుంటు కాలి నడకన వేల మైళ్ళు నడిచి వలస కూలి కూలే          ॥ కరోనా ॥ వలస వెల్లిన కొడుకు తిరిగి మల్ల
Complete Reading

– డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్ ఈనాడు మనిషి ఎటువంటి క్రూర జంతువునైనా ఒక తుపాకీ గుండుతో లొంగదీసుకోగలడు. కానీ కంటికి కనబడని రకరకాల క్రిములు ఎప్పుడైనా, ఎక్కడైనా మన ప్రాణాలు తీయగలవు. ఎన్ని రకాల కొత్త మందులు కనిపెట్టినా అవి తమ స్వభావాలని మార్చేసుకుని మనమీద దొంగదెబ్బ తీస్తూనే ఉంటాయి. సైంటిస్టులు ఈ ఎడతెగని పోరాటంలో అహోరాత్రాలు శ్రమిస్తూ ఉంటారు. అందుకే కష్టాల్లో ఉన్నవాళ్ళు దేవుణ్ణి తులుచుకున్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా అంటురోగాలు (లేదా, వాటి గురించిన భయం) ప్రబలినప్పుడల్లా
Complete Reading

మే నెల 7వ తేదీ తెల్లవారుఝామున విశాఖపట్టణంలో ఎల్‌.జి. పాలిమర్స్ లో జరిగిన స్టైరిన్‌ గ్యాస్‌ లీకేజి సంఘటన ఒక్క విశాఖ జిల్లావాసులనేగాక, యావత్‌ దేశ ప్రజానీకాన్నీ తీవ్రమైన కలవరపాటుకు గురిచేసింది. సంఘటన జరిగిన రోజునే 11 మంది చనిపోగా, తదుపరి (జూన్‌ 4 నాటికి) మరో ముగ్గురు మరణించారు. మొత్తం 14 మంది మృత్యువాత పడ్డారు. సంఘటన జరిగిన ప్రాంతానికి చెందిన యిద్దరు గర్భవతులకు అబార్షన్స్‌ జరిగాయి. విశాఖజిల్లా జనసాహితి మరియు ఓపిడిఆర్‌ సభ్యులు కలిసి,
Complete Reading

– జి.వి. భద్రం           మే 25న సిగరెట్లు కొనటానికి 20 డాలర్ల నకిలీ కరెన్సీ నోటు ఇచ్చాడనే ఆరోపణతో అమెరికాలోని మినియాపోలీస్‌లో సౌవిక్‌ అనే తెల్లజాతి పోలీసు అధికారి జార్జి ఫ్లాయిడ్‌ అనే నల్లజాతి ఆఫ్రో – అమెరికన్‌ను కారులో నుంచి బయటకు లాగి, సంకెళ్ళు వేసి రోడ్డుపై బోర్లా పడుకోబెట్టి, తొమ్మిది నిముషాలపాటు మెడపై మోకాలితో త్రొక్కిపట్టి, అతడికి ఊపిరాడకుండా చేసి చంపివేశాడు. తాను ఊపిరి పీల్చుకోలేకపోతున్నానని అతడు పదే, పదే ప్రాధేయపడినా కనికరం
Complete Reading

Create AccountLog In Your Account