Related Posts
– ‘బాలబంధు’ అలపర్తి వెంకట సుబ్బారావు
చిట్టి చిట్టి పాపలార
చెప్పండీ నేనెవరిని? ॥
మురికి అయితె తెల్లగాను
మురికి పోతె నల్లగాను
రూపు దాల్చుచుండు నేను
చూపరులకు చోద్యముగను ॥
మూడు అక్షరాలు వున్న
ముచ్చటైన మాట నేను!
తిప్పి చదువ, ఇల్లు గట్ట
ఒప్పిదమగు కొయ్యనగుదు ॥
ఆ కాలంలో దిద్దిరి
అక్షరాలు ఇసుకలోన!
అక్షరాలు దిద్ద నేడు
అవసరమయ్యాను నేను ॥
‘మాట్లాడను’ అనే మాట
మరోలాగ అని చూడుడు!
నే నెవరినొ వివరంగా
నేనె చెప్పినట్లుండును ॥
తెలియలేద ఇప్పటికీ?
తెలిపెద నేనే ‘పలకను’ ॥