సోషలిస్టు సమాజాన్ని స్థాపించగ కదులుదాం

– రౌతు వాసుదేవరావు నేల నీరు గాలి వెలుగు ఆకాశలన్నిటిని మలినం చేసిన పాపం చుట్టుకొనగ మనిషినీ కరోనా వైరస్సై కమ్ముకొనెను నేడురా మృత్యుఘోష పెడుతున్నది మానవాళి చూడరా               ॥ నేల ॥ గ్రామ స్వరాజ్యం వదిలి నగరీకరణం చేసిరి రసాయనాలెదజల్లి విషం కుమ్మరించిరి కాలుష్యపు కోరల్లో వనరులన్ని విలపించగ వింత వింత రోగాలతో లోకాన్నె ముంచిరి                          ॥ నేల ॥ ప్రపంచమె కుగ్రామం అనే కుటిల బాటలో బహుళజాతి కంపెనీల లాభాల వేటలో ప్రజల నోట
Complete Reading

‘‘తాడిచెట్టు ఎందుకు ఎక్కావు అంటే, దూడ మేత కోసం’’ అని వెనుకటికొకరు జవాబు చెప్పారట! తెలుగు మాధ్యమం రద్దు దేనికి అంటే ‘‘ప్రభుత్వ బడులలో చదివే బడుగుందర్నీ డాక్టర్లుగా, ఐ.ఎ.ఎస్‌. అధికార్లుగా చేయటానికి’’ – ఇదీ జగన్మోహనరెడ్డి ప్రభుత్వ జవాబు. ఈ సందర్భంలోని ఒక మోసపూరిత మెలిక ఏమిటంటే, తెలుగు మాధ్యమం రద్దు అనేది వినపడనీయకుండా చదువులన్నీ ఆంగ్ల మాధ్యమంలోనే అనటం! నిజానికి యిప్పటికే ప్రభుత్వ బడులన్నీ ఆంగ్లం – తెలుగు రెండు మాధ్యమాలలో సాగుతున్నాయి. ఇక
Complete Reading

– దివికుమార్‌ పల్లెలలో బతకలేక వలసపోయిన పాదాలు నగరాల్లో చావలేక తల్లి ఒడికై తపించి యింటి బాట పట్టిన పాదాలు చావుని ధిక్కరిస్తున్న పాదాలు ఆధునిక మహాయాత్రకు చరిత్ర నిర్మాతలైన పాదాలు దండి యాత్రలను ఆయోథ్య జాతరలను తెర వెనుకకు నెడుతున్న పాదాలు ఏ శక్తి పిడికిలైతే దోపిడీశక్తులు గజగజలాడతాయో ఏ నెత్తుటి చారికలు మరో చరిత్రకు దారి చూపుతాయో వేటి సంకల్ప బలానికి ప్రపంచం తల దించుకుంటోందో ఆ శ్రమజీవన పాదాలకు మనసా వాచా కర్మేణా
Complete Reading

మూడు నెలలుగా కరోనా మహమ్మారి మానవ ప్రపంచాన్ని గిజగిజలాడిస్తోంది. మానవ సమాజంలో వర్గ వైరుధ్యాలు తలెత్తిన నాటి నుండీ సామాజిక వైరుధ్యాలే ప్రధానంగా సాగుతూండిన చరిత్ర ఆకస్మికంగా మానవ సమాజమంతా ప్రకృతి విలయమైన కరోనాపైకి ఎక్కుపెట్టాల్సిన స్థితి ఏర్పడిందా అన్నట్లు పరిస్థితులు కదలాడసాగాయి. అయితే ప్రపంచాధిపత్యశక్తులు ఈ పాప పంకిలాన్ని ఏ దేశం నెత్తిన రుద్దాలా అనే పోటీలో వున్నాయి. ప్రకృతి విధ్వంసమూ, పర్యావరణ సమస్యలు కలగలిసి ఈ మహావిపత్తుకి కారణమయినట్లు ఒక సాధారణ భావన వ్యక్తమయింది.
Complete Reading

            ఉదయం చూస్తే మంచు! మధ్యాహ్నం వరకు వడగాడ్పులు! అంతలోనే సాయంత్రం దట్టంగా కమ్ముకున్న మబ్బులు – ఉరుములు – మెరుపులు – బోరున వర్షం!! రాత్రి గడగడలాడించే చలి!!!             ఒక ఏడాది కాలంలో రావాల్సిన మూడు కాలాలూ ఒక్క రోజులోనే – కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే! రుతువుల్ని ధ్వంసం చేస్తుంది ఎవరు? ప్రకృతి నియమాలను చిందరవందర చేసిందెవరు? ఎక్కడెక్కడో వైరస్‌లను తట్టి లేపుతుంది ఎవరు? పర్యావరణ విధ్వంసం ఎవరి ఖాతాలో జమ చేయాలి?
Complete Reading

          గౌతం విద్యాసంస్థల అధినేత, విద్యావేత్త ఎన్‌. చౌదరిబాబు మూత్రపిండాల వ్యాధితో 5 ఆగస్టు 2020న విజయవాడలో మరణించారు. ఆయన గుంటూరుజిల్లా పాలపర్రులో 11 నవంబరు 1949న జన్మించారు.           చౌదరిబాబు విద్యార్థి దశ నుండీ మార్క్సిజాన్ని నమ్మారు. అసమాన సమాజం పోయినపుడే విద్యావ్యవస్థలోనూ మార్పులు వస్తాయని నమ్ముతూనే ఈ కార్పొరేట్‌ పోటీ ప్రపంచంలో నిలబడి తనదైన రీతిలో నర్సరీ నుండి పి.జి. వరకూ విద్యాసంస్థలను నెలకొల్పి నిర్వహించారు. తన స్వగ్రామమైన పాలపర్రులో హైస్కూలును దత్తత తీసుకున్నారు.
Complete Reading

          మానవ వికాస వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు, గాయకుడు నాస్తిక వెంకన్న 7-9-2020న హైదరాబాద్‌లో కరోనా వ్యాధితో మరణించారు. ఆయన కరీంనగర్‌ జిల్లా మంధని గ్రామంలో జన్మించారు.           మహిమలు, మూఢనమ్మకాల బండారాన్ని బట్టబయలు చేసే ఇంద్రజాలికుడిగా, డప్పు వాయిస్తూ మూఢనమ్మకాలను పారద్రోలుతూ, మూఢత్వాన్ని ప్రశ్నిస్తూ పాటలు పాడే గాయకుడిగా రెండు తెలుగు రాష్ట్రాలలో కృషిచేశారు. వెంకన్న మరణానికి జనసాహితి సంతాపం ప్రకటిస్తూంది. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియచేస్తూంది.

          శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్రాధిపతిగా చేసిన ఆచార్య పి.సి. నరసింహారెడ్డి తన 77వ ఏట 19 అగస్టు 2020న హైదరాబాదులో మరణించారు. ఆయన గద్వాల సమీపంలోని గట్టు మండలంలోని పెంచుకలపాడులో 3 జులై 1943లో జన్మించారు.           యువకునిగా వీరు ‘‘తిరగబడు’ కవుల్లో ఒకరిగా ఆ కవితా సంకలనంలో ‘ఐ’ అనే కలంపేరుతో ‘తిరగబడు’ అనే కవిత రాశారు. విరసం ఏర్పాటుతో సంబంధాలు వున్నా, సభ్యత్వం తీసుకోలేదు. ‘శుక్తి’ పేరుతో చిత్రకారునిగా చిత్రాలు గీశారు. ‘సృజన’
Complete Reading

          బహుజన ఉద్యమకారుడిగా కృషిచేస్తూన్న ఉప్పుమావులూరి సాంబశివరావు 24 జూలై 2020న కరోనా వ్యాధితో హైదరాబాద్‌లో మరణించారు. ఆయన గుంటూరుజిల్లా బ్రాహ్మణ కోడూరులో జన్మించారు.           ఉ.సా. తెనాలిలో డిగ్రీ చదివే రోజుల్లో (1973-74) ఏర్పడిన ‘అరుణోదయ సాంస్కృతిక సంస్థ’లో చేరి సామాజిక అంశాలపై కళారూపాలను నేర్చుకుంటూ, నేర్పుతూ – వివిధ సమస్యలపై పాటలు రాశారు. 1978లో జనసాహితి ఏర్పడినపుడు చురుకైన కార్యకర్తగా కృషిచేస్తూ పలు జనం పాటలు రాశారు. జనసాహితి సంస్థ గీతంగా పాడుకునే ‘‘మేం
Complete Reading

          నవయుగ ఫిల్మ్స్‌ మేనేజర్‌గా పనిచేసి, చలనచిత్ర ప్రకటనలలో, ప్రచారంలో వినూత్నమైన విజయవంతమైన ప్రయోగాలు చేసిన అభ్యుదయవాది కాట్రగడ్డ నరసయ్య తన 96వ ఏట – 31 అగస్టు 2020న విజయవాడలో మరణించారు.           విజయవాడలో ప్రముఖ కమ్యూనిస్టు కుటుంబమైన కాట్రగడ్డ కుటుంబసభ్యుడైన నరసయ్య బెనారస్‌ హిందూ యూనివర్శిటీలో విద్యార్థిగా వున్నపుడే – 1943లో తెనాలి సమీపాన పెదపూడి గ్రామంలో ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం నెల రోజులపాటు నిర్వహించిన సాహిత్య పాఠశాలకు హాజరయ్యారు. నవయుగలో పనిచేశారు.
Complete Reading

Create Account



Log In Your Account