– ‘బాలబంధు’ అలపర్తి వెంకట సుబ్బారావు చిట్టి చిట్టి పాపలార చెప్పండీ నేనెవరిని? ॥ మురికి అయితె తెల్లగాను మురికి పోతె నల్లగాను రూపు దాల్చుచుండు నేను చూపరులకు చోద్యముగను ॥ మూడు అక్షరాలు వున్న ముచ్చటైన మాట నేను! తిప్పి చదువ, ఇల్లు గట్ట ఒప్పిదమగు కొయ్యనగుదు ॥ ఆ కాలంలో దిద్దిరి అక్షరాలు ఇసుకలోన! అక్షరాలు
Complete Reading
– ఓ.హెచ్. మిత్ర, 8వ తరగతి బయట ఎండ మండిపోతుంటే ఇంట్లోకి వచ్చాను. నా 15 ఏళ్ల కూతురు మంచినీళ్ళు ఇస్తూ ‘‘నాన్నా దొరికాయా?’’ అని అడిగింది. ‘‘లేదమ్మా 7 షాపులు వెతికాను. ఎక్కడా లేవు కాని మాస్కులు మాత్రం దొరికాయి.’’ అంటూ నా కూతురికి మాస్కులు ఇచ్చి కుర్చీలో కూలబడ్డాను. కొంతసేపటికి మా ఆవిడ వచ్చి ‘‘హేండ్‌వాష్లు దొరకలేదా?…. మాస్కులింకో నాలుగైదు తేలేకపోయారా?. అయినా ఇంతసేపేంటి?’’ జవాబు ఇవ్వటానికి గ్యాపు లేకుండా ప్రశ్నలడిగేస్తూంది.
Complete Reading
ఇలీనాసేన్, చత్తీస్‌ఘడ్‌లో కార్మిక ఉద్యమాలలోను, ఆదివాసీల సమస్యలపైనా తన భర్త డా॥ వినాయక్‌సేన్‌తో పాటు పనిచేసిన సంఘసేవిక. తన 69వ ఏట 2020 ఆగస్టు 9న మరణించారు. పిల్లల వైద్యుడు, మానవహక్కుల కార్యకర్త ఐన డా॥ వినాయక్‌సేన్‌పై రాజ్యం మావోయిస్టులకు సహకరిస్తున్నాడన్న ఆరోపణపై అరెస్టు చేసిన సందర్భంగా, ఇలీనాసేన్ రాజ్యం చేసే అకృత్యాలను ఖండిస్తూ ఉద్యమం నడిపారు. ట్రయల్ కోర్టు వినాయక్‌సేన్‌కు 2010లో జీవిత ఖైదు విధించగా, 2011లో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
Complete Reading
డా. జశ్వంతరావు పెట్టుబడిదారీవిధానం, సామ్రాజ్యవాదం కరోనా వంటి అంటువ్యాధులు పుట్టడానికీ, విస్తరించడానికీ మూలకారణం. లాభాపేక్షే ఏకైక లక్ష్యంగా అది సాగిస్తున్న విధ్వంసం – జల, వాయు కాలుష్యం, ప్రకృతిలోని సమతుల్యతను దెబ్బతీయటం, జీవజాలం నశించిపోవటం, కొన్ని విపత్కర పరిస్థితుల్లో జీవం రూపాంతం చెందటం – ఈ ప్రక్రియలో భాగమే కరోనా వైరస్ పుట్టుక. కరోనా వంటి అంటువ్యాధులు ప్రబలకుండా నిరోధించడానికి కూడా పెట్టుబడిదారీ వ్యవస్థ ఆటంకంగా వుంది. కరోనా వైరస్‌ను చైనా వైరస్‌గా పేర్కొంటూ
Complete Reading
– దివికుమార్ షహీద్ భగత్‌సింగ్‌కు మేమే వారసులమంటూ భారతదేశంలో ఉన్న అన్ని విద్యార్థిసంఘాలు ప్రకటించుకుంటాయి. గడిచిన 84 సంవత్సరాల నుండీ విద్యార్ధి, యువజనుల హృదయాలలో గొప్ప దేశభక్తి పరునిగా, అసమాన త్యాగ ధనునిగా తిరుగులేని విప్లవ ప్రతీకగా నిలిచి, ఉపఖండపు ఉమ్మడి విప్లవ వీరునిగా చెరగని ముద్ర వేసుకొన్నందువల్ల భగత్‌సింగ్ మనకు ఆత్మీయుడయ్యాడు. ఆదర్శనీయుడయ్యాడు, విప్లవ దీక్షకు స్ఫూర్తిగా మన మనస్సులలో శాశ్వత స్థానాన్ని పొందాడు. పదుల సంఖ్యలో ఉన్న విద్యార్ధి సంఘాలందరికీ ఒకే
Complete Reading
– శంకరం ‘ఇదేం బాగునేదురా సుబ్బారావ్!’ ‘ఏది, కరోనానా? ఎట్టా బాగుంటాదిరా?’ ‘మాట మార్సీకు…. జనాలంతా ఓనల్లేక గగ్గోలెడతావుంటే గెడ్డలోకి ఇంజనెట్టీసి నీ మళ్ళకి నీల్లు తోడీసుకుంతావా? మోతుబరివి కదా!’ ‘ఓరెల్లరా…. అక్కడికి నానొక్కన్నే ఇట్టా సేత్తున్నట్టు ఇడ్డూరంగా సెప్తావేందిరా? అయినా ఈ నీరంతా నానేటి సేసుకుంతాను? నా మళ్ళన్నీ తడిసినాక ఊరోల్లకి ఒగ్గీనా?’ ‘అబ్బా, యేం తెలివిరా నీది, నీ మళ్ళన్నీ తడిసినాక గెడ్డలో నీరు మిగులుద్దా అసలు?
Complete Reading
హిందీమూలం : ప్రేమ్ చంద్ (1925) తెలుగు స్వేచ్ఛానువాదం : బాలాజీ(కోల్ కతా) చౌదరీ ఇత్రత్ అలీ ‘కడే’ ప్రాంతానికి పెద్ద జాగీర్దారు. అతని పూర్వీకులు రాచరిక యుగంలో బ్రిటిష్ ప్రభుత్వానికి గొప్పగొప్ప సేవలందించారు. దాని ఫలితంగా వారికీ జాగీరు దొరికింది. అతడు తన నిర్వహణా దక్షతతో, తన యాజమాన్యాన్ని మరింత పెంచుకున్నాడు. ఇప్పుడా ప్రాంతంలో అతడ్ని మించిన పేరైన ధనవంతుడు లేడు. బ్రిటిష్ అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించేటప్పుడు, ఖచ్చితంగా చౌదరీ సాహెబ్
Complete Reading
డా. జి.వి. కృష్ణయ్య ‘వలస భారతం’ దీర్ఘకవితపై సమీక్షాప్రసంగం – డా. ఎ.కె. ప్రభాకర్ డా॥ జి. వి. కృష్ణయ్య ‘వలస భారతం’ దీర్ఘ కవిత చదువుతుంటే నాకు పిల్లలు పాడుకునే రెండు పాటలు గుర్తొచ్చాయి. ఒకటి : ‘రింగా రింగా రోజస్ … … … వి ఆల్ ఫాల్ డౌన్’ రెండు : ‘ఎంతెంత దూరం … కోసెడు కోసెడు దూరం …’ ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ 19
Complete Reading
– జ్యోత్స్న రైతు దేశానికి వెన్నుముక కాని ఇప్పుడు కర్రెముక అలాంటి వెన్నుముకను కర్రెముక చేస్తున్నారు కర్రెముకలను తొక్కి, నలిపేసి, పిండి, పక్కకు పడేస్తున్నారు రైతు ఎవరికోసం కష్టపడుచున్నాడు మనకోసం, దేశంకోసం, ప్రపంచం కోసం ఎండనక, వాననక కష్టపడి నానా తిప్పలు పడేవాడు రైతు పంట చేతికి వస్తే ఆనందం లేక అది అమ్ముడౌతుందో లేదో అనే భయంతో పంట
Complete Reading
– కె. భానుమూర్తి తూరుపు తెల వారక ముందే సూర్యుడు పొద్దు పొడవక ముందే ముఖానికి ఇంత పసుపు పులుముకొని నుదుటన ఇంత సింధూరం అద్దుకొని రంగురంగుల సీతాకోకచిలుకల కోసం తనని తాను సింగారించుకుని సిద్ధ పరుచుకుంటుంది మా ఊరి బడితల్లి గుంపులు గుంపులుగా వచ్చే నును వెచ్చని కిరణాల కోసం భుజాలకతుక్కొని జట్లు జట్లుగా వచ్చే పూల గుత్తుల గుబాళింపుల కోసం ఎదురుచూస్తోంది మా ఊరి చదువులమ్మ ఏ శిశిరం కాటేసిందొ ఏ వేరు పురుగు
Complete Reading