Related Posts
– కొత్తపల్లి హరిబాబు
ఎగసే జ్వాల
దహనం చేసేదాకా ఆగదు
మండే గుండెలు
చెండాడుతాయి
రగిలే పోరు
తుది సమరందాకా నిద్రపోదు
నీలో నాలో మరిగే రక్తం
నీలో నాలో చెలరేగే కవితలకు మూలం
అది ప్రజాస్వామ్యాన్ని పునాదుల్తో పెకలిస్తుంది
విప్లవానికి బాటలు వేస్తుంది
సోషలిస్టు సమాజ నిర్మాణానికి దోహదం చేస్తుంది.