మనిషీ ` మార్జాలo

మనిషీ ` మార్జాలo

పరిచయం
ఈ కథ టి. విజయేంద్ర 2016లో ప్రచురించిన తన ఆత్మకథ(?) వెరైటీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో చదివాను. అందులో ఆయన ‘సాంగత్య’ అనబడే తన ఫామ్‌లో ఉన్న మిష్కా అనబడే పిల్లి గురించి రాస్తూ కానార్డ్‌ లోర్నెన్జ్‌ అనే ప్రఖ్యాత ఆస్ట్రియన్‌ జంతుపరిణామ శాస్త్రవేత్త గూర్చి ప్రస్తావిస్తారు. జంతువు పరిణామక్రమాన్ని గురించి లోర్నెన్జ్‌ ‘కింగ్‌ స్మాన్‌ రింగ్‌’ , ‘మాన్‌ మీట్స్‌ ది డాగ్‌’, ‘టెన్‌ హౌస్‌హోల్డ్‌ పెట్స్‌’ మొదయిన ఆసక్తికర రచను చేసారని, ఫిజియాజీలో నోబుల్‌ కూడా పొందిన ఈయన తర్వాత కాంలో నాజీతో సంబంధాు కారణంగా ఇంగ్లీషు వాళ్ళకి దూరం కాబడి అపకీర్తి మూటకట్టుకున్నారని రాసారు. అంతేకాక కుక్క పరిణామానికి సంబంధించిన లోర్నెన్జ్‌ సిద్ధాంతం నక్కÄ తోడొ సంకర ఫలితమే శునకమనే విషయం తదనంతరం జరిగిన జన్యు పరిశోధనల్లో తప్పని రుజువు కాబడి, కుక్క జాతంతా బూడిదరంగు తోడేు నుండి వచ్చిందేనని తేలిందంటారు విజయేంద్ర. అంతమాత్రాన లోర్నెన్జ్‌ గొప్పతనం తగ్గదని, ఆయన గొప్ప జంతుపరిణామ శాస్త్ర అధ్యయనపరుడని మరోసారి చెప్తూ పిల్లి పరిణామం, ప్రవర్తనకి సంబంధించిన వివరా కోసం ఆస్ట్రియా దేశంలోని కానార్డ్‌ లోర్నెన్జ్‌ మ్యూజియానికి లేఖరాస్తూ తన రచన పుస్తకం ఒకదాన్ని జతచేసి పంపారు.
కొద్దిరోజు తర్వాత ఆస్ట్రియా నుండి జవాబొచ్చింది. లోర్నెన్జ్‌ మనవడు, విజేయంద్రగారికి లేఖరాస్తూ మ్యూజియం తమ కుటుంబ ఆధ్వర్యంలో నిర్వహించబడుతోందనీ, తన తాతగారి కృషిని గురించిన వివరాకీ, అభిప్రాయకీ ధన్యవాదాు చెప్తూ ఆసక్తికరమైన విషయాన్నొకదాన్ని రాసాడు. అందరికీ శాస్త్రవేత్తగా, శోధకుడిగా మాత్రమే తెలిసిన కానార్డ్‌ లోర్నెన్జ్‌ కొన్ని కథు కూడా రాసారనీ, అయితే అవి ఎక్కడా ప్రచురించబడలేదని చెబుతూ వాటిలో పిల్లికోసం రాసిన కథను మీ కోసం జర్మన్‌ నుండి ఆంగ్లంలోకి అనువాదం చేసి పంపుతున్నాననీ, అందుకే సమాధానం ఇవ్వటానికి రెండు వారాు పట్టిందని లేఖరాస్తూ, ఆ చిన్ని కథను జతచేసాడు. పిల్లి ఎప్పటికీ మచ్చిక కాదనే టేగ్‌తో ‘‘కాట్‌ కమ్స్‌ టు మాన్‌’’ అనే ఆ కథని తొగులో ఇలా ప్రచురిస్తున్నాం. మన సాహిత్యంలో సైతం పిల్లికి ఉన్న స్థానం చిన్నదేం కాదు. శ్రీంకకి చెందిన ప్రముఖ నవలాకారుడు మైకెల్‌ వోన్డట్జీ ‘ది కేట్స్‌ టేబిల్‌’ పేరుతో రచన చేసారు. రాజారావు ‘ది కేట్‌ అండ్‌ షేక్‌స్పియర్‌’ అనే పుస్తకం రాసారు. యం.యన్‌.రాయ్‌, ‘పిల్లి ఆత్మకథ’ పేరుతో గ్రంథం రచించారు. వ్యక్తిగతంగా పెంపుడు జంతువుపై నాకుండే ఆసక్తి కూడా ఆ యత్నాకో కారణమనుకుంటాను. మా అత్త (భాగ్యక్ష్మి కందాళై) బ్రతికున్న రోజుల్లో వాళ్ళింట్లో చిన్నపిల్లాడిగా పదు సంఖ్యలో ప్లిుతో గడిపిన దినాలెందుకో జ్ఞాపకమొస్తున్నాయ్‌. ఏదేమయినా మానవళితో మార్జాం సంబంధానికి వే యేండ్ల చరిత్రుంది. ఈజిప్ట్‌లో పిల్లిని అతీతశక్తున్న దానిగా ఆరాధిస్తే, ఇంగ్లాండ్‌లో మంత్రశక్తున్నాయని కొట్టి మంటల్లో వేసి చంపేవారని ఎక్కడో చదివాను. తొగు సాహిత్యంలో సైతం అనేక కవితు, రచనూ ఉన్నాయి. గోడమీద పిల్లి, కాుకాలిన / తోకకాలిన పిల్లి, పిల్లి కళ్ళు, చీకట్లో పిల్లిలాగా… వంటి ఎన్నో నానుడున్నాయి. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎందుకనో ఈచిన్నకథను అనువదించానిపించింది. ప్రధానంగా ప్లి కోసమన్నట్లుండే ఈ కథ పెద్దకి ఆసక్తికరంగా ఉంటుంది.

అడవిలో జంతువు సర్వసభ్య సమావేశం ఆర్భాటంగా  జరుగుతోంది.  దిక్కున్నీ జంతువు అరుపుతో దద్దర్లిుతున్నాయి. ఎప్పటిలాగే గుడ్లగూబ ఆ సభకి అధ్యక్షత వహించింది. కాకి చిట్టాపద్దు వివరాు చూస్తోంది. చివరికి మనిషి గురించిన చర్చ వచ్చింది. ప్రతీ సంవత్సరం లాగానే ఎవరో మానవాళిపై సమరం ప్రకటించానే సహా ఇచ్చారు. మరొకరైతే, ఆ మధ్యవొచ్చిన ‘అవతార్‌’ అనే సినిమాను ప్రస్తావిస్తూ వేరే గ్రహంలోని వారిపై ఆయుధాపై అధికారాన్ని ఒదుకొని చేసిన పోరాటాన్ని ఉదహరించారు.
ఏదేమయిన  ప్రతీసారి  లాగానే  ఆ సంవత్సరం  కూడా  జంతురాజ్యంలో అమలౌతోన్న  అద్భుతమయిన  నిబంధన కారణంగా యుద్ధమనే భావం తోసిపుచ్చబడిరది. ‘ఆకలితో ఉన్నప్పుడు తప్ప ఎవర్నీ చంపకు’’ అనేదే ఆ నియమం. అదీకాక అసు మనిషిని ఎవరు తినానుకుంటారు? చివరికి కళేబరాల్ని ఇష్టంగా తినే రాబందు కూడా, మనిషి పశువుపై వాడిన ‘డిక్లోఫేన్‌’ అనే రసాయనం వ్ల దాదాపు నాశనమైపోయి అంతరించిపోయే దశకు  వచ్చి  మనుషుల్ని  చంపడానికి నిరాకరించాయి. పెద్ద మొత్తంలో ఆహారాన్ని తరలించగ ఎర్రటి వానపాము సైతం ఒకే రకమయిన ఆహారం అంత పరిమాణంలో తినమని తెగేసి చెప్పాయి. విభిన్న రుచుని ఇష్టపడతామని ప్రకటించాయి. 
ఆ  సమయంలో  తోడేు  నిబడి మాట్లాడుతూ మనిషి కారణంగా జీవజంతు జాలానికీ, భూమికీ, మానవాళికి జరుగుతున్న నష్టాన్ని వీయినంత మేరకు కుదించేలా ఏదైనా చేసి తీరాని పట్టుబట్టింది.
అతడి కార్యక్రమాు విధివిధానా పట్ల ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాను కొన్నాయి. గుడ్లగూబ కొద్దిగా ముందుకు వొంగి ఈ అంశంపై చర్చించి నిర్ణయాు తీసుకోడానికి ఒక ఉపకమిటీ ఏర్పాటు చేసుకోవడం మంచిదనీ, భద్రతకి సంబంధించిన ఇలాంటి నిర్ణయాు బహిరంగసభలో తీసుకోలేమంది.
మర్నాడు గుడ్లగూబ, కాకి, తోడేు గ ఉపకమిటీ సమావేశమైంది. ప్రస్తావించింది నువ్వే కనుక, ` మీరే చర్చను ప్రారంభించండి అని తోడేుతో గుడ్లగూబ అంది.
మనుషు పద్దతుల్ని, ప్రణాళికల్ని ఆలోచనా రీతుల్నీ ఎప్పటికప్పుడు మనకి తెలియజేసే ఒక గూఢచారి అవసరమని నేను భావిస్తున్నాను. అంటూ తోడేు తర్వాత సంభాషణని ఇలా కొనసాగించింది. 
గూడ్లగూబ : అందుకోసం మనం కాకిని ఎన్నుకోవచ్చు. మనందరిలోకి కాకి బుద్దిజీవి. మనుషు వద్దకు తేలికగా చేరగలిగేది. ఎవరూ అనుమానించనిదీను.
కాకి : వద్దు ఇలా చెప్పేందుకు అనేక కారణాున్నాయి. నేనెంత తెలివిగదాన్నో మనుషుకీ త్సొ. ‘‘మనిషికి రెక్కలొచ్చి ఎగరడం నేర్చుకున్నంతలో తెలివయిన కాకి కాలే’’డనే సామెత అందుకే వచ్చింది. రెండోది, నేను నిత్యం వాళ్ళను గమనిస్తూనే ఉంటానన్న విషయం వాళ్ళకి త్సొ. నేను బ్కానీలో కూర్చొనుండగా కాకు గుంపొకటి కర్కశంగా కావు. కావు మనడం మొదలెట్టాయి. వాటిని తరిమానో లేదో కొంతదూరం ఎగిరి మళ్ళీ మరింత కఠోరస్వరాతో చర్చల్లో మునిగి పోయాయి, అంటూ మార్క్‌ట్వైన్‌ అనే రచయిత రాసాడుకూడా. ఇండియాలో అయితే కొంతమంది నన్ను చూడటం మంచి శకునమనుకుంటారు కానీ ఇళ్ళలోకి మాత్రం రానివ్వరు. కానీ చనిపోయిన ఆత్ము మాలో ప్రవేశిస్తాయని నమ్ముతూ, వారు పెట్టే పిండాను తింటే సంతోషిస్తుంటారు.
తోడేెు : ఎందుకనంటే అవకాశం కోసం ఎదురుచూసి మేసే నువ్వు మురికిగా ఉంటావని వాళ్ళనుకుంటారు కాబట్టి, నువ్వు ప్రతీదీ తింటావు కాబట్టి.
గుడ్లగూబ : సరే, కాకి కాదంది. ఉడతయితే ఎలా ఉంటుంది? అది మనుషు ఇళ్ళలోకి కూడా వెళ్ళిపోగదు.
కాకి : కానీ సూర్యస్తమయానికి దానికి నిద్రొస్తుంది. అదీకాక, గత కొన్ని దశాబ్దాుగా పట్టణాల్లో వాటి సంఖ్య తగ్గుతోంది. మానవ నివాసాల్లోకి వాట్ని రానివ్వడం లేదు. 
గుడ్లగూబ : తోడేూ... మీ చుట్టం కుక్క సంగతేమిటి?
తోడేు : (తిరస్కారంతో) అది నా బంధువని చెప్పుకోడానికే నేను సిగ్గుపడుతున్నాను. అది పూర్తిగా మనిషి చేతిలోపడి చెడిపోయింది. ఈ మధ్యకాంలో అది తోడేళ్ళతో బాటుగా ఉండే ఎన్నో నైపుణ్యాల్ని కోల్పోయింది. దాంతో చివరికది ఎప్పుడూ తిండికోసం ఎదురుచూపే మిగిలిపోయింది. కొన్ని శునకాలైతే ఏకంగా శాకాహాయిగా మారిపోయాయి. అవి మంచి తల్లితండ్రు కాలేవు. ఎందుకనంటే అవి వాటి ప్లికి మా ప్లిల్లా వేట నైపుణ్యాన్ని నేర్పలేవు. కారణం అవే వేటాడ్డం మర్చిపోయాయి కనుక. అవి  కేవం  మానవాళి  స్నేహితుగా, సన్నిహితుగా  మిగిలిపోయాయి.  అవి బుద్ధిలేనివి.
గుడ్లగూబ : కాకీ నువ్వేమైనా సహా ఇవ్వగవా?
కాకి : పిల్లిని మన గూఢచారిగా పంపాని నా అభిప్రాయం. అదెక్కడికైనా వెళ్ళగదు. రాత్రుళ్ళు మేల్కోవడమే కాదు, బాగా చూడగదు కూడా. అదీకాక తెలివైంది. మనం కొన్ని ముఖ్యమయిన సూచనలిస్తామనుకోండి.
గుడ్లగూబ : ఏం సూచనవి?
కాకి : కుక్కలా ఆహారం కోసం పూర్తిగా మనిషిపైనే ఆధారపడరాదు. వేటని కొనసాగించాలి. బ్లునీ, ఎకనీ వేటాడాలి. అప్పుడే మనిషి దాన్నొక సొత్తులా చూస్తాడు. మరోవైపు మనిషిపై సమయానుకూంగా ఆపేక్షని చూపుతూ అతని కాళ్ళను రుద్దుతుండాలి. కానీ కుక్కలా ఎలా ఆడిస్తే అలా ఆడరాదు. అతడి ఆలోచనకి అందరాదు. అప్పుడప్పుడూ కనబడకుండా మాయమవుతుంటే మనిషి అది మామూలేనని అవాటుపడతాడు. అలాంటి రాత్రి సమయాల్లో గుడ్లగూబకి  సేకరించిన  సమాచారం అందించొచ్చు. చివరికి, ఏడాదికో ఎప్పటికో వెంబడిరచకుండా దాన్ని పూర్తిగా వదవచ్చు.
గుడ్లగూబ :  బాగుంది.  ఎవరికైనా, సహాు, సందేహాు ఉన్నాయా?
తోడేు : కొంత భంగపాటు కావచ్చు. కొన్ని ప్లిుు కుక్కల్లాగానే చెడిపోవచ్చు. ముఖ్యంగా ఎక్కువకాంపాటు ఒకే మనిషితో సావాసం చేసేవి. కానీ, మొత్తానికీ, ఆలోచనయితే అద్భుతంగా ఉంది. ఒక్కటి మటుకు నిజం. పిల్లి ఎప్పటికీ సంపూర్ణ శాఖాహారిగా మారదు. స్వాభావికమయిన దాని మాంసాహార అవాట్లు మారవు. మనిషి దానిని ప్రేమిస్తాడు. 

admin

leave a comment

Create AccountLog In Your Account