పికెటింగ్‌

పికెటింగ్‌

— విజయ్ —

‘‘అవతార్‌ కార్మికు సంఘం వర్థిల్లాలి’’
‘అవతార్‌ కార్మికును పనిలోకి తీసుకోవాలి’
‘ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి’
నినాదాతో అనంతపురం టవర్‌క్లాక్‌ దద్దర్లిుతోంది. దాదాపు వందమంది కార్మికు మానవహారం ప్రదర్శిస్తున్నారు. అరగంటయ్యే సరికి వారికి మద్దతుగా వివిధసంఘాు, వాళ్ళ నాయకు వచ్చి చేరినారు.
అక్కడినించి కార్మికు ప్రదర్శన ప్రారంభమైంది. కలెక్టరు ఆఫీసు ముట్టడికి బయుదేరినారు. ‘కార్మికు ఐక్యత వర్థిల్లాలి’ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాు నశించాలి’ ఇలాంటి నినాదా జోరు పెరిగిపోతోంది. విలేకయి, వివిధ ఛానల్స్‌వారు ప్రదర్శనను వీడియో తీస్తున్నారు. కొంతమంది ఫోటోు తీసుకుంటున్నారు.
ప్రదర్శన మ్లెగా కలెక్టరు ఆఫీసు చేరుకుంటోంది. జిల్లాలోని అన్ని ప్రాంతా నుంచి అవతార్‌ కార్మికుకు మద్దతుగా లారీల్లో వచ్చి దిగుతున్నారు.
అనంతపురం కలెక్టరు ఆఫీసు గేట్లన్నీ మూసి ఉన్నాయి. పోలీసు ప్రహారా మొదవుతోంది. పోలీసు జీపు కుయ్‌కుయ్‌ శబ్దం అక్కడ రణధ్వనిని తపిస్తోంది.
ఆరోజు సోమవారం కావడంవ్ల ప్రజు కలెక్టరుకు వినతిపత్రం ఇవ్వడానికి వస్తున్నారు. సోమవారం ప్రజాసమస్య పరిష్కార దినమైనందున చాలామంది ప్రజు వాళ్ళ సమస్యను విన్నవించుకోవడానికి కలెక్టరు ఆఫీసుకు తొమ్మిదింటికే చేరుకుంటున్నారు.
ప్రదర్శన అగ్రభాగాన ప్రధాన కార్మిక సంఘా నాయకు రామ్మోహన్‌, ఓబులేసు మొదలైనవారంతా నడుస్తున్నారు. వారి ముఖాల్లో గాంభీర్యం వ్యక్తమవుతోంది. కలెక్టరేటు దగ్గరవుతున్న కొద్ది నినాదా హోరు పెరిగిపోతోంది.
లేపాక్షిలో ఉండే అవతార్‌ ఫ్యాక్టరీ ఊరగాయు తయారుచేస్తూ ఉంటుంది. గత పదేళ్ళ నుంచి పనిచేస్తున్న కార్మికును సంఘం పెట్టుకున్నారన్న నెపంతో యాజమాన్యం ఉన్న పళంగా వారిని తొగించింది. బీహారు నుంచి కార్మికును తెచ్చి పను చేయించు కుంటోంది. తమను పనుల్లోకి తీసుకోవాని కోరుతూ కలెక్టరుకు విన్నవించుకోవడానికి కార్మికు అన్నిసంఘా మద్దతుతో వస్తున్నారు.
అక్కడేదో రణరంగం జరగబోతోందన్న సంకేతంగా పోలీసు బగాు పెరిగిపోతున్నాయి. పది పోలీసు వ్యాను వచ్చి ఆగాయి. కార్మికు కలెక్టరాఫీసులోకి పోకుండా ప్రధాన ద్వారాన్ని మూసేసినారు.
కలెక్టరాఫీసు ప్రధాన ద్వారం దగ్గర కార్మికనేతు బైఠాయించారు. వారిచుట్టూ వయంగా కార్మికు కూర్చున్నారు. ప్రధాన కార్మిక సంఘాను ఒకతాటిపైకి తీసుకు రావడానికి కృషిచేసిన రామ్మోహన్‌ లేచినిబడి ప్రసంగించడం మొదుపెట్టాడు.
‘కామ్రేడ్‌! అవతార్‌ కార్మికు గత పదేళ్ళుగా అవతార్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ కంపెనీ 50 కోట్లతో ప్రారంభమై అంచెంచొగా ఎదిగి విదేశాకు ఎగుమతి చేసే స్థాయికి చేరింది. ఈ కంపెనీ టర్నోవర్‌ ఇప్పుడు 500 కోట్లకు చేరుకుంది. ఈ కార్మికు శ్రమ ఫలితంగానే ఇది సాధ్యమయింది. కంపెనీలో పనిచేసే కార్మికు జీతాు పెంచమని అడగలేదు. కేవం సంఘం పెట్టుకున్నారు. సంఘం పెట్టుకోవడం నేరమా! సంఘం పెట్టుకున్నారని 200 మంది కార్మికును ఉన్నపళంగా తొగించారు. ఈ కార్మికు ఫ్యాక్టరీ ఏర్పడకముందు వ్యవసాయ కూలీుగా ఉండేవారు. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ కోసం తమ శ్రమను ధారపోస్తున్నారు. వీరందరిని తీసేసి బీహార్‌, రాజస్థాన్‌ నుంచి కార్మికును తెచ్చుకుని ఫ్యాక్టరీని నడిపిస్తున్నారు. ఇదేం న్యాయమని అడిగితే సమాధానం లేదు. యం.ఎల్‌.ఏ.,లేబర్‌ అధికాయి యజమానితో కుమ్మక్కయ్యారు. యజమాని విసిరేసిన డబ్బుకు లొంగిపోయి కార్మికు పొట్టు గొడుతున్నారు. ఈ సమస్యను ప్రభుత్వమే పరిష్కరించాలి. కార్మికు సంక్షేమం కోసం ఏమేమో చేస్తున్నామని చెపుతున్న ఈ ప్రభుత్వం కరువు బారిన పడిన ఈ జిల్లాలో కార్మికు బాధు వినిపించడంలేదా? అని నేను అడుగుతున్నాను.’’ అంటూ ఉపన్యసించాడు.
మరో కార్మిక నాయకుడు లేచి ‘‘జిల్లాలో కరువు పరిస్థితు నెకొని ఉన్నా, ధరు పెరిగిపోతున్నా, యజమాను కార్మికు పొట్టు గొడుతున్నా పాకు నిమ్మకు నీరెత్తినట్లున్నారన్నారు. అనేక కంపెనీకు శంకుస్థాపను చేస్తున్నారు. కానీ ఒక్కటి కూడా ప్రారంభం కాలేదు. వ్యవసాయానికి హంద్రీనీవా ద్వారా సాగునీరు ఇస్తామన్నారు దానిని ఇంకా పూర్తిచేయలేదు’’. ఇలా ఎన్నో సమస్యను కార్మికు ముందు చెపుతూ కార్మికుకు న్యాయం చేయాన్నాడు ఇలా ఒక్కోనేత మాట్లాడుతూ ఉన్నారు. గంట గడిచే సరికి కార్మికుల్లో ఆవేశం పెరిగిపోతోంది.
‘కలెక్టరు రావాలి, కలెక్టరు రావాలి’ అంటూ నినాదాు ఇచ్చారెవరో.
డి.ఎస్‌.పి.మైకులో అనౌన్స్‌మెంట్‌ ఇచ్చాడు. ‘‘ఇక్కడున్న కార్మికుంతా గేటు దగ్గరనుంచి దూరంగా వెళ్ళిపోవాలి. లీడర్లు మాత్రం కలెక్టరుకు వినతిపత్రం ఇవ్వండి. పదినిమిషాల్లో ఈ స్థలాన్ని ఖాళీచేయాలి. లేకపోతే అరెస్టు, లాఠీచార్జీు తప్పవు. ఇది ఎస్‌.పి.గారి అదేశం’’.
అనౌన్స్‌మెంట్‌ వినగానే కార్మికు బిగ్గరగా నినాదాు ఇవ్వటం మొదుపెట్టారు. ‘‘పోలీసు జుం నశించాలి. కార్మికును పనిలోకి తీసుకోవాలి. కలెక్టరు రావాలి. కలెక్టరు ప్రకటించాలి. మేం లేవం! మేం లేవం’’ నినాదాు మిన్నంటాయి.
పోలీసు తమ లాఠీకు పనిచెప్పడం మొదుపెట్టారు. విపరీతంగా కార్మికును కాళ్ళపైన, చేతుపైన, వీపుపైన కొడుతున్నారు. ఆ దెబ్బకు తట్టుకోలేక కార్మికు చెల్లాచెదరవుతున్నారు. అయినా చాలామంది కార్మికు కదడంలేదు. బంగా లాగేస్తున్నారు.
పోలీసుతో కార్మికు పెనుగులాట మొదలైంది. అక్కడి దృశ్యం బీభత్సంగా ఉంది. విలేకర్లు ఫోటోు తీస్తున్నారు. ఛానల్స్‌ లైవ్‌లో చూపిస్తున్నారు.
రామ్మోహన్‌, అవతార్‌ కార్మికసంఘం నాయకుడు ఓబులేసు చుట్టూ కార్మికుంతా వయంగా ఏర్పడి దెబ్బు తగకుండా చూస్తున్నారు. వాళ్ళలో రామాంజినమ్మ, కమమ్ము కూడా ఉన్నారు. చాలామంది కార్మికనేతను చరచరా లాక్కుపోయి వ్యానుల్లో కుక్కుతున్నారు. చివరగా రామ్మోహన్‌ను, ఓబులేసును లాక్కుని వెళ్ళేందుకు దృఢంగా బంగా తర్ఫీదు పొందిన పోలీసు రంగంలోకి దిగినారు. లాఠీతో కార్మికును చితకబాదినారు. ఒక వయం చెదిరిపోయింది. రెండో వయంలో రామాంజినమ్మ, కమమ్మ మొదలైన మహిళు ఉన్నారు. వాళ్ళను లేడీ పోలీసు బవంతంగా లాగుతున్నారు. ఇంతలో రామ్మోహన్‌, ఓబులేసుపై లాఠీు నృత్యం చేసినాయి. రామ్మోహన్‌కు తగకుండా కమమ్మ లాఠీకు చేయి అడ్డం పెట్టింది. ఆమె చిటికెనమే విరిగిపోయింది. ఓబులేసు వీపుబద్దలై చొక్కా చినిగిపోయింది. వీపంతా ఎర్రగా కమిలిపోయింది. అన్నీ కముకు దెబ్బు. లాఠీు అదోరకం ప్లాస్టిక్‌ కర్రు. వాటిల్తో కొడితే అవి విరగవు. దెబ్బతిన్నవాడి కండరాు కమిలిపోతాయి. నెరోజుయినా నొప్పితగ్గదు. ఇదంతా జరిగే లోప మరికొంతమంది లేడీ పోలీసు వచ్చి మహిళందర్ని పక్కకు లాగేసినారు.
పోలీసు నుగురు కలిసి రామ్మోహన్‌ను గట్టిగా పట్టుకున్నారు. చేతును జబ్బ దగ్గర బంగా పట్టుకొని ఎవరికీ కనిపించకుండా నొక్కుతున్నారు. విపరీతమైన బాధతో వివి లాడుతున్నాడు. ఇద్దరు పోలీసు పట్టుకున్నారు. కాలిమడమ దగ్గర ఎవరికీ అర్థం కాని రీతిలో వడతిప్పినారు. ఆ గుంపులో తోపులాటలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావటంలేదు. రామ్మోహన్‌ను బవంతంగా ఓ నుగురు పోలీసు లాక్కుపోయి పోలీసు జీపులోకి తోసేసినారు. పోలీసు ఆ కార్మికును మనుషుగా చూడటంలేదు. పదైదు నిమిషాల్లో కార్మికును చెదరగొట్టారు. వినతిపత్రాు చెల్లాచెదరుగా పడిపోయాయి. కలెక్టరాఫీసు గేట్లు తెరిచారు. జీపుల్లో, వ్యానుల్లోకి ఎక్కించిన కార్మికును పోలీస్‌స్టేషనుకు తీసుకెళ్ళిపోయినారు. స్వంత పూచీకత్తు మీద సాయంత్రం వదుతామని అంతవరకు ఇక్కడే ఉండాని చెప్పినారు పోలీసు.
కార్మికనేతంతా ఒక బెంచిపై కూర్చున్నారు. గాయాలైన ఓబులేసును, మే విరిగిన కమమ్మను, కముకు దెబ్బు తిన్న రామ్మోహన్‌ను ఆసుపత్రిలో చేర్పించారు తక్కిన కార్మికు. పోలీసు అభ్యంతరం చెప్పలేదు.
నొప్పితగ్గేందుకు, సెప్టిక్‌ కాకుండా టి.టి. ఇంజెక్షన్‌ ఇచ్చాడు డాక్టరు ఇద్దరికి. కమమ్మ మేకు కట్టుకట్టారు. మగతగా ఒత్తిగిలి పడుకున్నాడు ఓబులేసు. ఒక్కసారిగా గతం సినిమారీులా కదిలింది మదిలో.
‘గేటు తెరవండి! గేటు తెరవండి’ అంటూ అవతార్‌ ఫ్యాక్టరీ బయట అరుస్తున్నారు కార్మికు. వాచ్‌మెన్‌ ‘లేదు, మిమ్మల్ని ఈరోజు నుంచి వద్దన్నారు సారు’ అని చెపుతున్నాడు.
‘‘ఏం, ఎందుకు వద్దన్నారు?’’ అడిగింది రామాంజినమ్మ
‘నాకు తెలీదుపోమ్మా!’ కసురుకుంటున్నాడు వాచ్‌మేన్‌.
ఇంతలో ఓబులేసు వచ్చాడు. ‘గేటు తెరవయ్యా! సార్‌తో మాట్లాడి వస్తాను’ అనడిగాడు వాచ్‌మెన్‌కు.
‘సరే! నువ్వొక్కడివే పో! అడిగిరా పో’ గేటు తెరిచాడు. ఓబులేసు ఫ్యాక్టరీ లోపలికి వెళ్లాడు. మేనేజరు దగ్గరకు వెళ్ళి ‘‘సార్‌! వర్కర్స్‌ అందరూ వచ్చినాము. గేట్లు మూసినారు. ఇదేందిసార్‌! ఎక్కడాలేంది!’ అడిగాడు ఓబులేసు.
‘ఓబులేసూ! ఏంతెలీనట్లు మాట్లాడకు. నువ్వు యూనియన్‌ ఏర్పాటు చేసినావు. అందరినీ రెచ్చగొడుతున్నావని మాకు రిపోర్టు వచ్చింది! అందుకే ఎవరినీ రావద్దని చెప్పాము. మీకు యూనియన్‌ కావాలా? ఫ్యాక్టరీలో పనికావాలా? త్చేుకొనిరండి! ఓనరు ఇదే చెప్పమన్నాడు’’ అన్నాడు మేనేజరు శివరామ్‌.
మేం యూనియన్‌ పెట్టింది ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీ కోసం సార్‌. ఫ్యాక్టరీలో లాభాు అడగడానికి కాదు సార్‌! అయినా మేం యూనియన్‌ పెట్టుకుంటే మీకేం నష్టం సార్‌’’.
‘అవన్నీ నాకు తెలీదు. బాస్‌ ఆర్డర్‌ అంతే! బీహార్‌, రాజస్థాన్‌ నుంచి కొత్త వర్కర్లు రేపు వస్తున్నారు. మీరు ఇక నుంచి రానక్కర్లేదు.
‘‘ఇక్కడివాళ్లను కాదని ఎక్కడ్నించో తీసుకువస్తారా? ఇది అన్యాయం. మీ ఫ్యాక్టరీని నమ్ముకుని ఇన్నేళ్ళ నుంచి పనిచేస్తున్నాం. మా పొట్టల్ని కొడతారా! మేం ఒప్పకోం!’
‘‘నువ్వేంది ఒప్పుకునేది. మా ఫ్యాక్టరీ మాయిష్టం, ఇక్కడ్నించి వెళ్ళవయ్యా’’.
చేసేదేమీ లేక వెనక్కు వచ్చాడు.
గంభీరంగా కార్మికుతో చెపుతున్నాడు. అప్పుడే ఎవరోవచ్చి ‘ఇక్కడ ఓబులేసు ఎవరూ’ అని అడిగాడు. ‘నేనే’ అన్నాడు ఓబులేసు.
‘‘నాపేరు రామ్మోహన్‌, నేను కార్మికు సంఘా జిల్లా నాయకుణ్ని. పేపర్లో మీ ఫ్యాక్టరీలో మిమ్మల్ని తొగించారని తెలిసి వచ్చాను’’. తనను పరిచయం చేసుకుంటూ వచ్చిన వ్యక్తి అన్నాడు.
ఆశ్చర్యంగా చూశాడు ఓబులేసు. తమ కోసం ఒక వ్యక్తి రావడం ఎంతో విస్మయ పరిచింది ఓబులేసుకు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుల్ని ఎలా తొగించింది, ఎందుకు తొగించింది అంతా వివరంగా చెప్పినాడు ఓబులేసు. ఓపిగ్గా విన్నాడు రామ్మోహన్‌. తనకేం సంబంధంలేని ఒక కార్మిక నాయకుడు వచ్చి తమ సమస్యు వింటుంటే వారందరికీ ఆశ్చర్యంగా ఉంది.
‘సరే! ఏం చేద్దామనుకుంటున్నారూ’ అడిగాడు రామ్మోహన్‌.
‘ఏం చేయాలో మాకర్థం కాలే సారూ’ అన్నాడు ఓబులేసు
‘అందర్ని ఒకచోట కూర్చోబెట్టి మాట్లాడుదాం! వాళ్ళేమి చెపితే అది చేద్దాం’ అన్నాడు రామ్మోహన్‌.
‘సరే’ అన్నాడు ఓబులేసు.
సాయంకాలానికి అందరూ వచ్చారు. అందులో ఈశ్వరయ్య చురుకైనవాడు. ‘‘ఒకసారి మన ఎం.ఎల్‌.ఏ నరేంద్రన్నకు చెప్పిచూద్దాం. ఆయనచెప్తే వాళ్ళు వింటారు’’ అన్నాడు. అక్కడ కూర్చుని వింటున్న కమమ్మ, రామాంజినమ్మ, ఈశ్వరయ్య చెప్పింది సరైనదన్నారు. మిగతా వాళ్ళంతా ‘‘దేవునికైనా దెబ్బే గురువు ఆయన చెప్తే పనైపోతుంది’’ అన్నారు.
‘‘ఎప్పుడుపోదాం’’ అడిగాడు రామ్మోహన్‌.
‘‘రేపే’’ అన్నాడు ఈశ్వరయ్య.
ఒక వినతిపత్రం తయారుచేశాడు రామ్మోహన్‌. మరుసటిరోజు అందరూ హిందూపురం బయుదేరారు. ఎం.ఎల్‌.ఏ నరేంద్ర ఇంటి దగ్గరకు అంతా చేరుకున్నారు.
ఉదయమే కాబట్టి అప్పుడప్పుడే ఆయన్ను కలిసేందుకు జనాు వస్తున్నారు. గుంపుగా వచ్చిన వాళ్ళలో ఈశ్వరయ్యను చూస్తునే ఎం.ఎల్‌.ఏ. పి.ఎ. ప్రతాప్‌ ‘‘ఏం ఈశ్వరయ్యా! అందరూ కట్టకట్టుకొని వచ్చినారు?’’ అడిగాడు. ఈశ్వరయ్యకు ప్రతాప్‌ దగ్గర బంధువు.
‘‘అందరూ కాకుండా నుగురు లోపలికి రండి’’ మాట్లాడిస్తా.
ఎవరెవరు పోవాలా అని తటాపటా యిస్తున్నాడు ఓబులేసు. రామ్మోహన్‌ ‘ఓబులేసూ, నువ్వు, ఈశ్వరయ్య ఇంకా ఇద్దరు మహిళా కార్మికు లోపలికి పోయి మాట్లాడండి’ అన్నాడు.
‘అదేంటి సార్‌! నువ్వుకూడా రావా’ ఈశ్వరయ్య గట్టిగా అన్నాడు. ‘సరే పద!’ అంటూ లోపలికి అడుగుపెట్టారు ఐదు మంది. రామ్మోహన్‌తో పాటు కమమ్మ. రామాంజిమ్మ కూడా లోపలికి పోయినారు.
అప్పటికే ఫ్యాక్టరీ యజమాని నరేంద్రన్నతో కలిసి మాట్లాడినారు. ‘‘సార్‌! ఫ్యాక్టరీలో మన వూరి వాళ్ళే గదాని పనిలో పెట్టుకున్నా. ఇన్నేండ్లు బాగానే వున్నారు. ఈ మధ్యలో ఒకడు యూనియన్‌ పెట్తాండాడని తెలిసింది. యూనియన్‌ పెట్టి వూరకనే ఉండరు. సమ్మెంటారు. జీతాు పెంచాంటారు. యూనియన్‌ పేరు చెప్పి నాయకు పనిచేయరు. లేనిపోని రగడు. అందుకే అందరినీ తీసేసి బీహారు నుంచి వచ్చినవాళ్ళను పెట్టుకున్నాం. వాళ్ళైతే బుద్దిగా పనిచేస్తా వుంటారు. జీతాు పెంచాని డిమాండ్లు ఏమీ ఉండవు. మీరు మాకు కొంచెం సాయం చేయాలి. మీరడిగిన పార్టీఫండు రెండు కోట్లు ఈరోజే పంపిస్తా.’’ చెప్పినాడు. వీళ్ళను చూడగానే ఆయన ‘‘వీళ్ళేసార్‌’ అని మ్లెగా చెబుతున్నాడు.
అక్కడి దృశ్యాన్ని చూడగానే వాళ్ళకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.
‘సరే మీరు వెళ్ళండి. నేను మాట్లాడుతాను’ అని చెప్తూ వీళ్ళవైపు తిరిగి రండి, ‘కూర్చోండి! ఏం పని మీద వచ్చారు?’ అడిగాడు ఎం.ఎల్‌.ఏ. సాదరంగా.
‘‘మేము అవతార్‌ ఫ్యాక్టరీలో కార్మికుం సార్‌! మీకు మా సమస్యు చెప్పుకొనడానికి వచ్చినాం సార్‌’’ అన్నాడు ఓబులేసు వినయంగా.
‘‘మీరా! రోజూ పేపర్లో చూస్తున్నా! పనిచేసుకోకుండా ఏందయ్యా సమ్మొ, ధర్నాు. ఇంకేం పనిలేదా? వాళ్ళు కోట్లు పెట్టి ఫ్యాక్టరీు పెట్టేది ఇందుకా? మీరు పనిచేయకుండా ఇట్లా రోజూ ధర్నాు సమ్మొ చేస్తే ఫ్యాక్టరీు ఎలానడుస్తాయి. సంఘాంటా, ఆ కోర్కెంటూ, ఈ కోర్కెంటూ మిమ్మల్ని ఆ ఎర్రజెండా వాళ్ళు రెచ్చగొట్తాంటారు. మీరు అమాయకంగా వాళ్ళ వలో పడిపోవద్దు’’ అన్నాడు ఎం.ఎల్‌.ఏ నరేంద్ర.
‘‘అదికాదు సార్‌! మమ్మల్ని పనిలోంచి తీసేసినారు సార్‌!’’ అన్నాడు ఓబులేసు.
‘‘తీసేయక మీలాంటి వాళ్ళను పనిలో పెట్టుకుంటారా వాళ్ళు! మీకేం పెళ్లాంబిడ్డు లేరా? బుద్ధిగా పనిచేసుకోపోండి’’
‘‘అదేసార్‌! మేం అడుగుతాండేది మమ్మల్ని పనిలోకి తీసుకొమ్మని మీరు చెపుతారని వచ్చాం సార్‌!’’
‘‘ఇప్పుడు బీహారోళ్లను పనిలోకి పెట్టుకున్నారట. మీరు చేసే అరాచకాను చెప్పిపోయినారు. మీరు ధర్నాు మానేయండి. నేను చెపుతాలే, మీరు పోండి’’ అంటూ లోపలికి వెళ్ళిపోయాడు ఎం.ఎల్‌.ఏ.
నిరాశతో వెనుదిరిగినారు కార్మిక నాయకు. ‘‘ఎం.ఎల్‌.ఏ ఓనరు మాయ మాటు నమ్మినట్టుండాడురా’’ అన్నాడు ఈశ్వరయ్య. ‘ఏమో! ఓనరు ఎంత ముట్టచెప్పినాడో’, అన్నాడు మరో కార్మికుడు. అందరు మౌనంగా ఉండిపోయినారు.
మళ్ళీ సమావేశమయినారు సాయంత్రం. ఏం చేద్దామన్నాడు రామ్మోహన్‌.
‘‘లేబర్‌ ఆఫీసరుకు మన డిమాండ్లు చెపుదాం. వినకుంటే ధర్నాకు కూర్చుందాం’’ అన్నాడు ఈశ్వరయ్య.
‘‘సరే ఇదీ చూద్దాం’’ అన్నాడు రామ్మోహన్‌.
ధర్నా జిల్లా లేబరు ఆఫీసరు కార్యాయంకు మారింది.
యాభై మంది కార్మికు లేపాక్షి నుంచి వచ్చినారు. మిగతా సంఘాు వచ్చి సంఫీుభావం తెలిపాయి.
ఒకనె గడిచింది. ఇరవైమంది మాత్రమే మిగిలారు. జరుగుబాటులేని కార్మికు వేరే పనుల్లోకి వెళ్ళిపోయినారు. కొత్త ఆఫీసరు వచ్చినాడు. చాలా స్ట్రిక్టంట. ఆయన ఫ్యాక్టరీ రికార్డు తనికీ చేస్తాడంట. ఆఫీసు క్లర్కు వచ్చి చెప్పిన సమాచారమది. సాయంత్రానికల్లా తెలిసిందేమంటే ఆయన తనిఖీ చేస్తే అందులో కార్మికులే లేరంట. ఫ్యాక్టరీ రిజిష్టరులో పదిమంది కార్మికులే ఉన్నారంట. వాళ్ళు ఇప్పుడు అక్కడ పని చేస్తున్నారంట. రికార్డున్ని కరెక్టుగా ఉన్నాయంట. ఊరగాయు బయట ఎక్కడో ఏజెన్సీ ద్వారా చేయిస్తున్నారంట. ఆ యజమానిని ఏమి చేయలేరంటా. ఇదీ వార్త.
పూర్తిగా నిరాశా, నిస్పృహు అుము కున్నాయి కార్మికుల్లో. రెండొందమంది కార్మికుల్లో చాలా మంది అప్పుడే వేరే పనుల్లోకి చేరిపోయారు. కొంతమంది బెంగళూరుకు వసవెళ్ళిపోయారు. యాభైమంది మాత్రమే మిగిలిపోయారు. ఆ యాభైమంది మమ్మల్ని మళ్ళీతీసుకోకపోతారా అన్నమొండి ధైర్యంతో అప్పుచేసి ధర్నాలో పాల్గొంటున్నారు.
ఓబులేసు పట్టుదగా ఉన్నాడు, ఎలాగైనా ఫ్యాక్టరీలోకి అందరినీ తీసుకునేటట్లు చేయాని. ‘‘కాదు ఓబులేసు, కందకు లేని దురద కత్తిపీటకెందుకు చెప్పు. మనవాళ్ళు ఐక్యంగా లేరు. ఇప్పటికే అందరూ జారుకుంటున్నారు. నువ్వేమో పోరాడదామంటున్నావ్‌. మనం కూడా వేరో ఏదో ఒకటి చేసుకుంటేపోలా’’ అన్నాడు ఈశ్వరయ్య.
‘‘మనం హక్కుకోసం పోరాడతాండం, సంఘం పెట్టుకునే హక్కుకోసమే కదా! జీతాు పెంచమన్నామా? ఉన్నవాళ్ళనైనా పనిలోకి తీసుకోవానే గదా. అంతకంటే మనమేం అడుగుతాండాం?’’ అన్నాడు ఓబులేసు.
‘‘సరే అట్లయితే రామ్మోహన్‌ సార్‌ను అడిగిచూడు. ఏమి చేద్దామంటాడో’’.
రామ్మోహన్‌ సహామేరకు కలెక్టరు ఆఫీసు దగ్గర ధర్నాకు పిుపునిచ్చినారు.

admin

leave a comment

Create Account



Log In Your Account