వేలాదిమంది విద్యార్థులకు తెలుగు భాష, సాహిత్యాలను శాస్త్రీయంగా బోధించిన, వందలాది పరిశోధకులకు మార్గదర్శకులుగా పనిచేసిన మార్క్సిస్టు సాహితీ విమర్శకులు ఆచార్య కోవెల్ కందాళై రంగనాథాచార్యులు (80) కోవిడ్‌తో 15-5-2021న హైదరాబాద్‌లోని తార్నాకలో మరణించారు. ఆయన 14-6-1941న తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జన్మించారు. ఆయన విశ్లేషణాత్మక రచనలు, గంభీరమైన ప్రసంగాలు, చతురోక్తులతో సాగించే సంభాషణ… ఏదైనా… ఆలోచింపచేసేవిగా, విజ్ఞానదాయకంగా, వివేచన కలిగించేవిగా ఉండేవి. విప్లవ రచయితల సంఘం, జనసాహితి వ్యవస్థాపకులలో ఒక ముఖ్యుడైన జ్వాలాముఖి, కె.కె.ఆర్
Complete Reading
కష్టాల కొలిమి – త్యాగాల శిఖరం సర్వదేవభట్ల రామనాథం జీవితం : పరిశోధకుడు : ఆర్. శివలింగం, రచన : డా॥ కె. ముత్యం. 1/8 డెమ్మీలో 312 పుటలు. వెల : రూ.200/- ప్రథమ ముద్రణ : 9-3-2021. ప్రచురణ : రాయల సుభాష్‌చంద్రబోస్ మెమోరియల్ ట్రస్ట్. ప్రతులకు : గుర్రం అచ్చయ్య, ట్రస్ట్ చైర్మన్ ఆర్.ఎం.టి. భవన్, ఎం.వి.పాలెం (పోస్టు, గ్రామం) ఖమ్మం రూరల్ (మండలం), ఖమ్మం జిల్లా మరియు నవోదయ
Complete Reading
స్వాతంత్య్ర సమరయోధులు, ప్రముఖ గాంధేయ హేతువాది, యలమంచిలి వెంకటప్పయ్య కృష్ణాజిల్లా కనుమూరులో జన్మించారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని రాజమండ్రి జైలులో (1920) బాబా పృధ్వీసింగ్ వద్ద హిందీ నేర్చుకున్నారు. ఆ తర్వాత నెల్లూరు, కాశీ, అలహాబాద్, బీహార్‌లో జాతీయోద్యమంలో భాగంగా హిందీ అధ్యయనం చేశారు. 1920, 1930, 1932, 1942లలో జైలు శిక్షలనుభవించారు. హిందీ బోధన ఒక కార్యక్రమంగా తీసుకొని కృష్ణాజిల్లా పెనుమచ్చ, చినకళ్ళేపల్లి, గుంటూరుజిల్లా మైనేనివారిపాలెం, తూర్పుపాలెం, బెల్లంవారి పాలెం మొదలగు గ్రామాలలో హిందీ నేర్పారు.
Complete Reading
117వ సంచిక, మే 1991 మేడే పై మోహన్ వేసిన చిత్రం ముఖచిత్రంగా వెలువడిన ఈ సంచికలో మేడేపై రాసిన సంపాదకీయాన్ని ‘‘ప్రజారచయితలూ, కళాకారులూ కష్టజీవులకు అండదండలుగా నిలబడి వారి లక్ష్య సాధనకు ఆలంబనగా రూపొందాలి. మరొకసారి మేడే నిర్దేశిస్తున్న కర్తవ్యం ఇదే!’’ అంటూ ముగించారు. దాదా హయత్ రాసిన ‘మసీదు పావురం’ కథ; రామతీర్థ వ్యంగ్య రచన, ‘బ్యాలటోపాఖ్యానం’; జాన్ వెస్లీ రచన ‘సామ్రాజ్యవాదం – ప్రసార సాధనాలు’; ‘మతతత్త్వం – మహిళల జీవితం’పై
Complete Reading
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కళాశాలలు మన దేశంలో ఉన్న ప్రసిద్ధ విద్యాసంస్థలు. అటువంటి విద్యాసంస్థలలోనే కులవివక్ష బహిరంగంగా, నిర్భీతితో ప్రదర్శించబడిందంటే – సమాజంలోనూ, సామాన్య విద్యాలయాలలో ఈ వివక్ష ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఖరగ్‌పూర్ ఐఐటి సంఘటన తెలియచేస్తూంది. అసోసియేట్ ప్రొఫెసర్ సీమాసింగ్ ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థుల బ్రిడ్జి కోర్సులో భాగంగా ఆన్లైన్లో పాఠం చెప్పటం పూర్తయిన తర్వాత విద్యార్థులు జనగణమణ పాటపాడి, భారత్ మాతాకీ జై! అంటూ ముగించారు. ఆ
Complete Reading
‘చంద్ర’, ‘బాల’ పేర్లతో చిత్రకారునిగా, ఇల్లస్ట్రేటర్‌గా, కార్టూనిస్ట్ గా, డిజైనర్‌గా ప్రసిద్ధి చెందిన మైదం చంద్రశేఖర్ దీర్ఘ అనారోగ్యంతో 28-04-2021న హైదరాబాదులో తన 75వ యేట మరణించారు. ఆయన 28 ఆగస్టు 1946న వరంగల్ జిల్లా గన్నాసరి గ్రామంలో జన్మించారు. తన చిన్ననాటి నుంచే చిత్రాలు గీయటం ప్రారంభించిన చంద్ర, హైస్కూలు విద్యార్థిగా ఎం.ఎఫ్. హుస్సేన్, కొండపల్లి శేషగిరిరావుల చిత్రాల ప్రతికృతులను చిత్రించారు. బాపుకు ఏకలవ్య శిష్యునిగా చెప్పుకున్న చంద్ర త్వరలోనే తనదైన సొంత
Complete Reading
వ్యక్తిగత ఆస్తులు పుట్టిన కాలం నుండీ ఈనాటివరకు మానవులు నడిచివచ్చిన కాలాన్ని వర్గపోరాటాల చరిత్రగా కమ్యూనిస్టు ప్రణాళికలో మార్క్స్ – ఏంగెల్స్ పేర్కొన్నందువల్ల సమాజంలో వర్గ సంఘర్షణ జరగటంలేదు. వర్గపోరాటం వ్యక్తుల యిష్టాయిష్టాలతో నిమిత్తం లేని వర్గ సమాజపు సత్యం. అది సామాజిక చలనానికి చోదకశక్తి. సమాజాన్ని వాస్తవికంగా శాస్త్రీయంగా అర్ధం చేసుకున్నందువల్ల వర్గసంఘర్షణ – సామాజిక పరిణామాలు – విప్లవాలు – మానవ చైతన్య రూపాలయిన సాహిత్యం – కళలు సామాజిక విప్లవంలో
Complete Reading
Here I Stand పాల్ రోబ్సన్ స్వీయకథ. అనువాదం : కొత్తపల్లి రవిబాబు పాల్ రోబ్సన్ అద్భుతమైన అమెరికన్ సంగీతకారుడు, గాయకుడు, గొప్ప ఫుట్‌బాల్, బేస్‌బాల్, బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు. తన నల్లజాతివారి హక్కులకోసం జీవితాంతం కృషిచేసిన పోరాట యోధుడు. వివక్షకు గురి అవుతున్న జాతులవారు వివిధ దేశాలలో పోరాటాలు చేస్తూ వున్నారు. సామ్రాజ్యవాద దురాక్రమణల ఆధిపత్యశక్తులు వర్ణవివక్షల అసమాన ఆర్థిక, సాంఘిక వ్యవస్థలను పెంచి పోషిస్తున్నాయన్న దృక్పథంతో పాల్ రోబ్సన్ జీవితకాలం సామ్రాజ్యవాదాన్ని ధిక్కరిస్తూ సాగారు.
Complete Reading
సాహితి వారి ప్రతిష్టాత్మక ప్రచురణలు టాల్ స్టాయ్ సాహిత్యం 1. యుద్ధము – శాంతి నవల : అనువాదం : రెంటాల గోపాలకృష్ణ, బెల్లంకొండ రామదాసు. 1/8 డెమ్మీలో 960 పుటలు. వెల : రు. 600/- ముద్రణ : సెప్టెంబరు 2019. 2. అన్నా కెరనీన నవల అనువాదం : ఆర్వియార్. 1/8 డెమ్మీలో 896 పుటలు. వెల : రు. 500/- ముద్రణ సెప్టెంబరు 2018. 3. నవజీవనం నవల అనువాదం : పురాణం
Complete Reading
– డా॥ కొడవటిగంటి రోహిణీప్రసాద్ గతితార్కిక భౌతికవాద దృక్పథంతో కొడవటిగంటి రోహిణీప్రసాద్‌గారు ప్రజాసాహితి, తదితర పత్రికలలో అనేక సైన్సు వ్యాసాలు రాశారు. జీవశాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన వ్యాసాలను ఎన్నుకుని ‘జనసాహితి’ 53 వ్యాసాల ఈ సంకలనాన్ని ప్రచురించింది. ‘అత్యాధునిక జీవనశైలినీ, తెచ్చిపెట్టుకున్న పాశ్చాత్య సంస్కృతినీ అవలంబించే ఈ తరం మానసికంగా ఆటవికదశలో ఉందనేది మనం గుర్తించాలి. సామాజిక రుగ్మతలన్నిటికీ కారణం వర్గసమాజపు దుష్టశక్తులు కాగా వాటికి తోడవుతున్నవి మోడర్న్ వేషంలో ఉన్న మూఢనమ్మకాలూ, అవగాహనా
Complete Reading