నాస్తికవాది దొడ్డా హరిబాబు మరణం

          అంతరాలులేని, అంధవిశ్వాసాలు లేని సమాజం కోసం కృషిచేసిన దొడ్డా హరిబాబు మాష్టారు తన 65వ ఏట 3 మే 2020న తెనాలిలో మరణించారు. ఆయన ప్రకాశంజిల్లా యద్ధనపూడి మండలం మున్నంగివారిపాలెంలో 1953లో జన్మించారు.           హరిబాబు మాష్టారు చిన్నప్పటి నుండి అభ్యుదయ భావాలతో వుండేవారు. ఊరిలో యువజన గ్రంథాలయాన్ని నిర్వహించేవారు. భాషాప్రవీణ చదవటం కోసం తాడికొండ సంస్కృత కళాశాలలో చేరటంతో చార్వాక రామకృష్ణగారి శిష్యుడయ్యారు. బాబాల, స్వాముల, అమ్మవార్ల బండారాలను బట్టబయలు చేస్తూ అనేక కార్యక్రమాలు
Complete Reading

          నాటక రచయిత, నటుడు, దర్శకుడు, నిర్మాత చింతపెంట సత్యనారాయణరావు 14 ఏప్రిల్‌ 2020న హైదరాబాదులో తన 86వ ఏట అనారోగ్యంతో మరణించారు. ఆయన 20 డిశెంబరు 1935న కడియం దగ్గర మాధవరాయుడుపాలెంలో జన్మించారు.           సి.ఎస్‌.రావు విద్యార్థి దశ నుండే బ్రహ్మసమాజము, ఆంధ్ర సారస్వత సభల ప్రభావంతో ఎదిగారు. రాజమండ్రిలో డిగ్రీ చదువుకునే రోజుల్లో స్టూడెంట్‌ ఫెడరేషన్‌లో పనిచేశారు. స్టూడెంట్‌ ఫెడరేషన్‌తో సంబంధాలు ఉండటంతో చాలాకాలం ఉద్యోగం రాలేదు. ఆ సమయంలో ఆయన వాళ్ళ వూరి
Complete Reading

          తన జీవితాంతం క్రూర పరిపాలకులకు, నియంతలకు వ్యతిరేకంగా ప్రతిఘటనా పోరాటాలలో క్రియాశీలంగా పాల్గొన్న, నికారుగ్వా దేశానికి చెందిన వామపక్ష కవి ఎర్నెస్టో కార్డినల్‌ 2020 మార్చి 1వ తేదీన తన 95వ ఏట మరణించారు. ఆయన 1925 జనవరి 20న ఒక ఉన్నత వర్గ కుటుంబంలో గ్రనడా పట్టణంలో పుట్టారు.           నికారుగ్వా సాహిత్య, సాంస్కృతిక చరిత్రలో కార్డినల్‌ ఒక ప్రతిఘటనా వ్యక్తిగా కొనసాగారు. రాజకీయంగానూ, కవిత్వపరంగానూ నేటి లాటిన్‌ అమెరికాకు చెందిన ఒక అత్యంత
Complete Reading

          అంటరానితనానికి వ్యతిరేకంగా, జోగిని – బసివిని దురాచారాలకు వ్యతిరేకంగా, కులాంతర వివాహాలను, నాస్తికత్వాన్ని ఒక ఉద్యమంగా కొనసాగించిన గోరాగారి కుమారుడు. డా॥ విజయం తన 84వ ఏట 22 మే 2020న అనారోగ్యంతో విజయవాడలో మరణించారు. ఆయన 1 డిశెంబరు 1936న జన్మించారు.          నాస్తికత్వం అంటే ఒక జీవన విధానం అనీ, శాస్త్రీయ దృక్పథం అని నిరంతరం ప్రచారం చేసిన ఆయన ఇతర దేశాలలోని నాస్తిక సంఘాలతో నిత్య సంబంధాలు పెట్టుకొని, అక్కడి జర్నల్స్ కి
Complete Reading

          ‘చీకటి ఖండంపై మండే సూర్యుడు’ ముఖచిత్రంతో 1990 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మూడు నెలలు కలిపి ఒకే సంచికగా ప్రజాసాహితి వెలువడింది. “మా బాధలు మాకు నేర్పిన పోరాటం యిది” అనే శీర్షికతో వచ్చిన సంపాదకీయంలో దక్షిణాఫ్రికా నల్ల ప్రజల నేత నెల్సన్ మండేలాను 26 సం||ల తర్వాత విడుదల చేయటాన్ని పురస్కరించుకొని దక్షిణాఫ్రికాలో సాగుతున్న దోపిడీ విధానాలు, నల్లజాతి ప్రజల పోరాటాలను వివరించారు. మండేలాకు నిండు మనసుతో ప్రజాసాహితి స్వాగతం పలికింది. ‘అతని అసలు
Complete Reading

మే నెల 7వ తేదీ తెల్లవారుఝామున విశాఖపట్టణంలో ఎల్‌.జి. పాలిమర్స్ లో జరిగిన స్టైరిన్‌ గ్యాస్‌ లీకేజి సంఘటన ఒక్క విశాఖ జిల్లావాసులనేగాక, యావత్‌ దేశ ప్రజానీకాన్నీ తీవ్రమైన కలవరపాటుకు గురిచేసింది. సంఘటన జరిగిన రోజునే 11 మంది చనిపోగా, తదుపరి (జూన్‌ 4 నాటికి) మరో ముగ్గురు మరణించారు. మొత్తం 14 మంది మృత్యువాత పడ్డారు. సంఘటన జరిగిన ప్రాంతానికి చెందిన యిద్దరు గర్భవతులకు అబార్షన్స్‌ జరిగాయి. విశాఖజిల్లా జనసాహితి మరియు ఓపిడిఆర్‌ సభ్యులు కలిసి,
Complete Reading

          గౌతం విద్యాసంస్థల అధినేత, విద్యావేత్త ఎన్‌. చౌదరిబాబు మూత్రపిండాల వ్యాధితో 5 ఆగస్టు 2020న విజయవాడలో మరణించారు. ఆయన గుంటూరుజిల్లా పాలపర్రులో 11 నవంబరు 1949న జన్మించారు.           చౌదరిబాబు విద్యార్థి దశ నుండీ మార్క్సిజాన్ని నమ్మారు. అసమాన సమాజం పోయినపుడే విద్యావ్యవస్థలోనూ మార్పులు వస్తాయని నమ్ముతూనే ఈ కార్పొరేట్‌ పోటీ ప్రపంచంలో నిలబడి తనదైన రీతిలో నర్సరీ నుండి పి.జి. వరకూ విద్యాసంస్థలను నెలకొల్పి నిర్వహించారు. తన స్వగ్రామమైన పాలపర్రులో హైస్కూలును దత్తత తీసుకున్నారు.
Complete Reading

          మానవ వికాస వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు, గాయకుడు నాస్తిక వెంకన్న 7-9-2020న హైదరాబాద్‌లో కరోనా వ్యాధితో మరణించారు. ఆయన కరీంనగర్‌ జిల్లా మంధని గ్రామంలో జన్మించారు.           మహిమలు, మూఢనమ్మకాల బండారాన్ని బట్టబయలు చేసే ఇంద్రజాలికుడిగా, డప్పు వాయిస్తూ మూఢనమ్మకాలను పారద్రోలుతూ, మూఢత్వాన్ని ప్రశ్నిస్తూ పాటలు పాడే గాయకుడిగా రెండు తెలుగు రాష్ట్రాలలో కృషిచేశారు. వెంకన్న మరణానికి జనసాహితి సంతాపం ప్రకటిస్తూంది. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియచేస్తూంది.

          శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్రాధిపతిగా చేసిన ఆచార్య పి.సి. నరసింహారెడ్డి తన 77వ ఏట 19 అగస్టు 2020న హైదరాబాదులో మరణించారు. ఆయన గద్వాల సమీపంలోని గట్టు మండలంలోని పెంచుకలపాడులో 3 జులై 1943లో జన్మించారు.           యువకునిగా వీరు ‘‘తిరగబడు’ కవుల్లో ఒకరిగా ఆ కవితా సంకలనంలో ‘ఐ’ అనే కలంపేరుతో ‘తిరగబడు’ అనే కవిత రాశారు. విరసం ఏర్పాటుతో సంబంధాలు వున్నా, సభ్యత్వం తీసుకోలేదు. ‘శుక్తి’ పేరుతో చిత్రకారునిగా చిత్రాలు గీశారు. ‘సృజన’
Complete Reading

          బహుజన ఉద్యమకారుడిగా కృషిచేస్తూన్న ఉప్పుమావులూరి సాంబశివరావు 24 జూలై 2020న కరోనా వ్యాధితో హైదరాబాద్‌లో మరణించారు. ఆయన గుంటూరుజిల్లా బ్రాహ్మణ కోడూరులో జన్మించారు.           ఉ.సా. తెనాలిలో డిగ్రీ చదివే రోజుల్లో (1973-74) ఏర్పడిన ‘అరుణోదయ సాంస్కృతిక సంస్థ’లో చేరి సామాజిక అంశాలపై కళారూపాలను నేర్చుకుంటూ, నేర్పుతూ – వివిధ సమస్యలపై పాటలు రాశారు. 1978లో జనసాహితి ఏర్పడినపుడు చురుకైన కార్యకర్తగా కృషిచేస్తూ పలు జనం పాటలు రాశారు. జనసాహితి సంస్థ గీతంగా పాడుకునే ‘‘మేం
Complete Reading

Create Account



Log In Your Account