విష..వలస విలయం

admin

Author Posts

– సహచరి             వాళ్ళు విమానాల్లో విహరించే వాళ్లకు             రన్‌వేలు నిర్మించే వలస జీవులు….             వాళ్ళు రైలు బోగీలకు పట్టాలేసి             రహదారుల్ని నిర్మించిన బడుగుజీవులు             వాళ్ళు కాళ్ళు తడవకుండా బడాబాబుల్ని             సముద్రాలు దాటించగల శ్రమజీవులు….             ఫ్యాక్టరీల పొగగొట్టాలే ఊపిరితిత్తుల్లా             ఉఛ్వాస నిశ్వాసాల్లో విషవల(స)యంలో రాలిపోయి..             తెగిపడిన విగత జీవులు వాళ్ళు             కళ్ళు తడుపుకుంటూ కడుపు కాల్చుకుంటూ             సకల సంపదల సృష్టికర్తలు వాళ్ళు..            
Complete Reading

ఎంగెల్స్ 2వ శతజయంతి సందర్భంగా – డా. ఆర్కే 1884లో ఫ్రెడరిక్‌ ఎంగెల్స్‌ రాసిన ఈ మహత్తర గ్రంథం అనేకసార్లు ప్రచురించబడి, అత్యంత ప్రజాదరణ పొందింది. పలు భాషలలోకి అనువదింపబడింది. స్త్రీ, పురుష సంబంధాలు, కుటుంబం పుట్టుక, పరిణామం గురించి ఈ పుస్తకం చెబుతుంది. నేను, నాది అంటే ఏమిటో ఎరుగని మానవ సమాజంలోకి సొంత ఆస్తి ఎలా ప్రవేశించిందో తెలియజేస్తుంది. పాలకులు, పాలితులు లేని సమాజం స్థానే శ్రమదోపిడి, వర్గసమాజం ఎలా వచ్చాయో, వాటి రక్షణ
Complete Reading

– ఓ వీ వీ ఎస్ దేశం మడిలో తుపాకీ విత్తులు నాటి, స్వేచ్ఛా పరిమళాల పూదోటలు వేద్దామనుకున్నావు కానీ…, అన్యాయాల కలుపు మొక్కలు చూడెలా కమ్మేస్తున్నాయో…. జనాన్ని కలిపి ‘ఉంచని’ తనాన్ని ఈసడిస్తూ…. మతాతీతంగా నువ్వెదిగిపోయావు…. కానీ, దురంతాల వామనపాదాల వికటాట్టహాసాలు బోన్సాయ్‌ వృక్షాల అరణ్యాలై ఎలా విస్తరిస్తున్నాయో చూడు. అస్వతంత్ర భారతంలో మృత్యువే నీ వధువన్నావు…. గాంధారి పుత్రుల కీచక పర్వాల పుటలమై మేమెలా రాలిపడుతున్నామో చూడు. హోరెత్తిన యవ్వనాగ్ని కేతనమై నువు నిలిస్తే….
Complete Reading

– ఉప్పెన కరోనా కాటుకు రాలుతున్న కంఠాలు ఎన్నో కరోనా వేటుకు తెగి పడుతున్న తనువులెన్నో ఒక్కరా ఇద్దరా ఎందరాని చెప్పుదూ వందలాది జనము మందలోలే కూలుతుంటే                 ॥ కరోనా ॥ ఎంత కష్టం వచ్చెనో ఎన్ని బాదలు తెచ్చెనో ఇంత కష్ట కాలమూ చూడలేదు ఎన్నడూ కన్నీళ్ళు తాగుకుంటు కాలమెల్ల దీసుకుంటు కాలి నడకన వేల మైళ్ళు నడిచి వలస కూలి కూలే          ॥ కరోనా ॥ వలస వెల్లిన కొడుకు తిరిగి మల్ల
Complete Reading

– డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్ ఈనాడు మనిషి ఎటువంటి క్రూర జంతువునైనా ఒక తుపాకీ గుండుతో లొంగదీసుకోగలడు. కానీ కంటికి కనబడని రకరకాల క్రిములు ఎప్పుడైనా, ఎక్కడైనా మన ప్రాణాలు తీయగలవు. ఎన్ని రకాల కొత్త మందులు కనిపెట్టినా అవి తమ స్వభావాలని మార్చేసుకుని మనమీద దొంగదెబ్బ తీస్తూనే ఉంటాయి. సైంటిస్టులు ఈ ఎడతెగని పోరాటంలో అహోరాత్రాలు శ్రమిస్తూ ఉంటారు. అందుకే కష్టాల్లో ఉన్నవాళ్ళు దేవుణ్ణి తులుచుకున్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా అంటురోగాలు (లేదా, వాటి గురించిన భయం) ప్రబలినప్పుడల్లా
Complete Reading

మే నెల 7వ తేదీ తెల్లవారుఝామున విశాఖపట్టణంలో ఎల్‌.జి. పాలిమర్స్ లో జరిగిన స్టైరిన్‌ గ్యాస్‌ లీకేజి సంఘటన ఒక్క విశాఖ జిల్లావాసులనేగాక, యావత్‌ దేశ ప్రజానీకాన్నీ తీవ్రమైన కలవరపాటుకు గురిచేసింది. సంఘటన జరిగిన రోజునే 11 మంది చనిపోగా, తదుపరి (జూన్‌ 4 నాటికి) మరో ముగ్గురు మరణించారు. మొత్తం 14 మంది మృత్యువాత పడ్డారు. సంఘటన జరిగిన ప్రాంతానికి చెందిన యిద్దరు గర్భవతులకు అబార్షన్స్‌ జరిగాయి. విశాఖజిల్లా జనసాహితి మరియు ఓపిడిఆర్‌ సభ్యులు కలిసి,
Complete Reading

– జి.వి. భద్రం           మే 25న సిగరెట్లు కొనటానికి 20 డాలర్ల నకిలీ కరెన్సీ నోటు ఇచ్చాడనే ఆరోపణతో అమెరికాలోని మినియాపోలీస్‌లో సౌవిక్‌ అనే తెల్లజాతి పోలీసు అధికారి జార్జి ఫ్లాయిడ్‌ అనే నల్లజాతి ఆఫ్రో – అమెరికన్‌ను కారులో నుంచి బయటకు లాగి, సంకెళ్ళు వేసి రోడ్డుపై బోర్లా పడుకోబెట్టి, తొమ్మిది నిముషాలపాటు మెడపై మోకాలితో త్రొక్కిపట్టి, అతడికి ఊపిరాడకుండా చేసి చంపివేశాడు. తాను ఊపిరి పీల్చుకోలేకపోతున్నానని అతడు పదే, పదే ప్రాధేయపడినా కనికరం
Complete Reading

– రౌతు వాసుదేవరావు నేల నీరు గాలి వెలుగు ఆకాశలన్నిటిని మలినం చేసిన పాపం చుట్టుకొనగ మనిషినీ కరోనా వైరస్సై కమ్ముకొనెను నేడురా మృత్యుఘోష పెడుతున్నది మానవాళి చూడరా               ॥ నేల ॥ గ్రామ స్వరాజ్యం వదిలి నగరీకరణం చేసిరి రసాయనాలెదజల్లి విషం కుమ్మరించిరి కాలుష్యపు కోరల్లో వనరులన్ని విలపించగ వింత వింత రోగాలతో లోకాన్నె ముంచిరి                          ॥ నేల ॥ ప్రపంచమె కుగ్రామం అనే కుటిల బాటలో బహుళజాతి కంపెనీల లాభాల వేటలో ప్రజల నోట
Complete Reading

‘‘తాడిచెట్టు ఎందుకు ఎక్కావు అంటే, దూడ మేత కోసం’’ అని వెనుకటికొకరు జవాబు చెప్పారట! తెలుగు మాధ్యమం రద్దు దేనికి అంటే ‘‘ప్రభుత్వ బడులలో చదివే బడుగుందర్నీ డాక్టర్లుగా, ఐ.ఎ.ఎస్‌. అధికార్లుగా చేయటానికి’’ – ఇదీ జగన్మోహనరెడ్డి ప్రభుత్వ జవాబు. ఈ సందర్భంలోని ఒక మోసపూరిత మెలిక ఏమిటంటే, తెలుగు మాధ్యమం రద్దు అనేది వినపడనీయకుండా చదువులన్నీ ఆంగ్ల మాధ్యమంలోనే అనటం! నిజానికి యిప్పటికే ప్రభుత్వ బడులన్నీ ఆంగ్లం – తెలుగు రెండు మాధ్యమాలలో సాగుతున్నాయి. ఇక
Complete Reading

– దివికుమార్‌ పల్లెలలో బతకలేక వలసపోయిన పాదాలు నగరాల్లో చావలేక తల్లి ఒడికై తపించి యింటి బాట పట్టిన పాదాలు చావుని ధిక్కరిస్తున్న పాదాలు ఆధునిక మహాయాత్రకు చరిత్ర నిర్మాతలైన పాదాలు దండి యాత్రలను ఆయోథ్య జాతరలను తెర వెనుకకు నెడుతున్న పాదాలు ఏ శక్తి పిడికిలైతే దోపిడీశక్తులు గజగజలాడతాయో ఏ నెత్తుటి చారికలు మరో చరిత్రకు దారి చూపుతాయో వేటి సంకల్ప బలానికి ప్రపంచం తల దించుకుంటోందో ఆ శ్రమజీవన పాదాలకు మనసా వాచా కర్మేణా
Complete Reading

Create Account



Log In Your Account