చైతన్యవాహిని

            29-03-2021న తెనాలిలో జి. మోహనరావు (స్పార్టకస్‌) సంతాపసభలో ‘ప్రజాసాహితి’ ప్రధాన సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు మాట్లాడుతూ మోహనరావు పోలీసు శాఖలో పనిచేస్తూ సాహిత్య ప్రపంచంలోకి ప్రవేశించడం, ఆయనపై రంగనాయకమ్మ రచనల ప్రభావం, ‘ఖాకీ బతుకులు’ నవల రాసిన తర్వాత పోలీసు శాఖ ఆయనపై చేబట్టిన వేధింపు చర్యలు మొదలైనవి వివరించారు. చెరబండరాజు రాసిన ‘పోలీసు పాట’ ద్వారా పోలీసులూ ప్రజల్లో భాగమని చెప్పారన్నారు. మోహనరావు మిత్రులు అడ్వకేట్‌ జి.యస్‌. నాగేశ్వరరావు, జనసాహితి సభ్యుడు రచయిత చందు
Complete Reading

            ‘చంద్ర’, ‘బాల’ పేర్లతో చిత్రకారునిగా, ఇల్లస్ట్రేటర్‌గా, కార్టూనిస్ట్ గా, డిజైనర్‌గా ప్రసిద్ధి చెందిన మైదం చంద్రశేఖర్‌ దీర్ఘ అనారోగ్యంతో 28-04-2021న హైదరాబాదులో తన 75వ యేట మరణించారు. ఆయన 28 ఆగస్టు 1946న వరంగల్‌ జిల్లా గన్నాసరి గ్రామంలో జన్మించారు.           తన చిన్ననాటి నుంచే చిత్రాలు గీయటం ప్రారంభించిన చంద్ర, హైస్కూలు విద్యార్థిగా ఎం.ఎఫ్‌. హుస్సేన్‌, కొండపల్లి శేషగిరిరావుల చిత్రాల ప్రతికృతులను చిత్రించారు. బాపుకు ఏకలవ్య శిష్యునిగా చెప్పుకున్న చంద్ర త్వరలోనే తనదైన సొంత
Complete Reading

ఆంగ్లమూలం : పంకజ్ ప్రసూన్                      తెలుగు : కొత్తపల్లి రవిబాబు (స్వేచ్ఛ, సమానత్వం, దోపిడీరహిత ప్రపంచం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులందరికీ మన విప్లవ అరుణారుణ వందనాలు)                     నిరంకుశులకు, సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా                     కవిత్వం ఒక ఆయుధంగా వుంటుంది.                     టునీసియాలో, ఈజిప్టులో, సిరియాలో                     యెమెన్‌లో, బహ్త్రైన్‌లో, మలేసియాలో                     స్వాతంత్య్ర పతాకాన్ని ఎత్తిపట్టిన వారికి,                     అన్యాయానికీ, దోపిడీకి వ్యతిరేకంగా                    
Complete Reading

– సిహెచ్. మధు జీవన చరమాంకం ప్రారంభమయ్యింది సూర్యుడు పశ్చిమాన పరుగును అరచేతితో ఆపేసాను ఆపన్నుల హస్తం, అభిమాన సూర్యుల వెలుగు నాకు అమృతం పోస్తున్నాయి అస్తమయం సహజాతి సహజం కానీ తాత్కాలికంగా ఓడిపోతుంది పర్వతాల అడ్డు తొలగిపోతుంది డెబ్బది సంవత్సరాల చెట్టు శిశిరంలోకి ప్రవేశించింది ఆకులు రాలిపోతున్నాయి కొమ్మలు బలంగానే వున్నాయి మళ్లీ ఆకులు చిగురిస్తాయి గాలి, నీరు నేనేగా నేల బలం నాలో నిక్షిప్తమయివుంది నా మనసులో ముళ్లు – రాళ్లు వున్నాయి నా
Complete Reading

– శంకరం           ‘‘మాది తెనాలే…. మీది తెనాలే…. అహ మాది తెనాలే….’’           ‘‘యేట్రా బామ్మర్దీ వడదెబ్బ తగిలిందేటి అలా ఊగిపోతన్నావ్‌?’’           ‘‘ఊగిపోడం కాదురా…. ఆనందం…. ఆవేశం…. ఉచ్చాహం….’’           ‘‘దేనికిరో అంతుత్సాహం!’’           ‘‘దేనికేట్రా పిచ్చిమొకమా? ఆంజినేయుడు తిరప్తిలోనే పుట్నాడట….. పై పెచ్చు మన్తెలుగోడట…. ఆనందంగాకింకేట్రా!’’           ‘‘వారినీ! దేవుళ్ళకి కూడా భాష, ప్రాంతం లాంటివన్నీ అంటగడతన్నార్రా…. ఇంతకీ ఆంజినేయుడు తెలుగు మాట్టాడినట్టు మనోల్లకెలా తెలిసిందో?’’           ‘‘వారి మాలోకం, తిరప్తిలో పుట్టినోడు
Complete Reading

– బొలుసాని జయప్రభ                 ‘‘ఆనంద బాబు! నీదేకులం అని ఎన్నిమార్లు అడిగినా ఎప్పుడూ సమాధానం చెప్పరు ఎందుకు బాబూ?’’ అని అడిగాడు రంగయ్య.           ‘‘చెప్పాను కదా రంగయ్యా ! నీ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు’’ సమాధానంగా ఆనంద బాబు.           ‘‘అదేం సమాధానం బాబూ? మనిషి భూమి మీద పడ్డాక ఏదో కులానికి చెందకుండా ఎలా ఉంటాడు? పోనీ పేరును బట్టి పోల్చుకుందామా అంటే అదీ వీలు కాకుండా ఉంది. రెడ్డి,
Complete Reading

          వ్యక్తిగత ఆస్తులు పుట్టిన కాలం నుండీ ఈనాటివరకు మానవులు నడిచివచ్చిన కాలాన్ని వర్గపోరాటాల చరిత్రగా కమ్యూనిస్టు ప్రణాళికలో మార్క్స్‌ – ఏంగెల్స్‌ పేర్కొన్నందువల్ల సమాజంలో వర్గ సంఘర్షణ జరగటంలేదు. వర్గపోరాటం వ్యక్తుల యిష్టాయిష్టాలతో నిమిత్తం లేని వర్గ సమాజపు సత్యం. అది సామాజిక చలనానికి చోదకశక్తి.           సమాజాన్ని వాస్తవికంగా శాస్త్రీయంగా అర్ధం చేసుకున్నందువల్ల వర్గసంఘర్షణ – సామాజిక పరిణామాలు – విప్లవాలు – మానవ చైతన్య రూపాలయిన సాహిత్యం – కళలు సామాజిక విప్లవంలో
Complete Reading

                ఊపిరి అందని నిస్సహాయ పరిస్థితుల్లో భారత ప్రజానీకం మరణం అంచున వేలాడుతోంది. ప్రజల చితిమంటల కాగడాని ఎత్తిపట్టి దానినే అభివృద్ధి వెలుగుగా భారత పాలకవర్గం చాటుకుంటోంది. దయనీయ కరమైన పరిస్థితులను, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడే దుస్థితిని ప్రజలకి కల్పించిన నేరం మాత్రం పాలకులదే. గత సంవత్సర కాలంగా కరోనా వల్ల జరిగిన కల్లోలం తర్వాత సెకెండ్‌ వేవ్‌ వల్ల కలిగే విలయం గురించి శాస్త్రవేత్తల, డాక్టర్ల, ప్రజాతంత్రవాదుల హెచ్చరికలను పట్టించు కోకుండా పాలకులు పెట్టుబడిదారీ
Complete Reading

Here I Stand పాల్‌ రోబ్సన్‌ స్వీయకథ.    అనువాదం : కొత్తపల్లి రవిబాబు             పాల్‌ రోబ్సన్‌ అద్భుతమైన అమెరికన్‌ సంగీతకారుడు, గాయకుడు, గొప్ప ఫుట్‌బాల్‌, బేస్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌ క్రీడాకారుడు. తన నల్లజాతివారి హక్కులకోసం జీవితాంతం కృషిచేసిన పోరాట యోధుడు. వివక్షకు గురి అవుతున్న జాతులవారు వివిధ దేశాలలో పోరాటాలు చేస్తూ వున్నారు. సామ్రాజ్యవాద దురాక్రమణల ఆధిపత్యశక్తులు వర్ణవివక్షల అసమాన ఆర్థిక, సాంఘిక వ్యవస్థలను పెంచి పోషిస్తున్నాయన్న దృక్పథంతో పాల్‌ రోబ్సన్‌ జీవితకాలం సామ్రాజ్యవాదాన్ని ధిక్కరిస్తూ సాగారు.
Complete Reading

Create Account



Log In Your Account