– డా. కే.వి. రమణరావు కారును సైడురోడ్లోకి తిప్పి పార్కింగ్ కోసం వెతుకుతున్నాడు జైరాజ్. జేబులో ఫోను రెండుసార్లు మోగి ఆగిపోయింది. ఇళ్ల యజమానులు వీధినే పార్కింగ్ లాట్‌గా మార్చుకొని రోడ్డుకు రెండువైపులా వాళ్ల కార్లు పెట్టుకున్నారు. చివరకు ఒక ఇంటిముందు గేటుకడ్డంరాని ఖాళీ కనపడింది. ‘ఇంటివోనరు చూసాడంటే తిట్లు తప్పవు, డ్రైవర్లంటే అందరికీ అలుసే. మాలాంటివాళ్లను గౌరవంగాజూసే రోజెప్పుడన్నా వస్తుందా’ అనుకుంటూ అక్కడ కారుపెట్టి గబగబా నడిచి అతని ఇల్లున్న సన్నటి సందులోకి తిరిగాడు.
Complete Reading
వేలాదిమంది విద్యార్థులకు తెలుగు భాష, సాహిత్యాలను శాస్త్రీయంగా బోధించిన, వందలాది పరిశోధకులకు మార్గదర్శకులుగా పనిచేసిన మార్క్సిస్టు సాహితీ విమర్శకులు ఆచార్య కోవెల్ కందాళై రంగనాథాచార్యులు (80) కోవిడ్‌తో 15-5-2021న హైదరాబాద్‌లోని తార్నాకలో మరణించారు. ఆయన 14-6-1941న తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జన్మించారు. ఆయన విశ్లేషణాత్మక రచనలు, గంభీరమైన ప్రసంగాలు, చతురోక్తులతో సాగించే సంభాషణ… ఏదైనా… ఆలోచింపచేసేవిగా, విజ్ఞానదాయకంగా, వివేచన కలిగించేవిగా ఉండేవి. విప్లవ రచయితల సంఘం, జనసాహితి వ్యవస్థాపకులలో ఒక ముఖ్యుడైన జ్వాలాముఖి, కె.కె.ఆర్
Complete Reading
ఇంతవరకు బతకడాన్ని నేరం చేసిన మూడు పాతికల స్వాహాతంత్య్రంలో మోడీ పాలనకొచ్చేసరికి ఊపిరిపీల్చడమూ, నోరువిప్పి మాట్లాడడమూ కూడా ‘రాజ ద్రోహం’ అయిపోయింది. ‘చావడాన్ని’ కారు చవక చేశారు. మరణాన్ని నిత్యకృత్యం చేస్తున్నారు. దీంతో నానాటికీ దేశ పాలక విధానాలు తీసికట్టై జన జీవనం అల్లకల్లోలమైపోతున్న సంక్షోభం దాపురించింది. సెక్షన్ 124ఎ నిబంధనలకు సంబంధించి చాలా సందర్భాల్లో కోర్టులు ఎన్నిసార్లు అభిశంసించినా ముఖ్యంగా మోడీ ప్రభుత్వం మంకుపట్టుతో ‘రాజద్రోహం’ పేరుతో భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తోంది. ఈ నేపథ్యంలో దేశకాలమాన
Complete Reading
కష్టాల కొలిమి – త్యాగాల శిఖరం సర్వదేవభట్ల రామనాథం జీవితం : పరిశోధకుడు : ఆర్. శివలింగం, రచన : డా॥ కె. ముత్యం. 1/8 డెమ్మీలో 312 పుటలు. వెల : రూ.200/- ప్రథమ ముద్రణ : 9-3-2021. ప్రచురణ : రాయల సుభాష్‌చంద్రబోస్ మెమోరియల్ ట్రస్ట్. ప్రతులకు : గుర్రం అచ్చయ్య, ట్రస్ట్ చైర్మన్ ఆర్.ఎం.టి. భవన్, ఎం.వి.పాలెం (పోస్టు, గ్రామం) ఖమ్మం రూరల్ (మండలం), ఖమ్మం జిల్లా మరియు నవోదయ
Complete Reading
స్వాతంత్య్ర సమరయోధులు, ప్రముఖ గాంధేయ హేతువాది, యలమంచిలి వెంకటప్పయ్య కృష్ణాజిల్లా కనుమూరులో జన్మించారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని రాజమండ్రి జైలులో (1920) బాబా పృధ్వీసింగ్ వద్ద హిందీ నేర్చుకున్నారు. ఆ తర్వాత నెల్లూరు, కాశీ, అలహాబాద్, బీహార్‌లో జాతీయోద్యమంలో భాగంగా హిందీ అధ్యయనం చేశారు. 1920, 1930, 1932, 1942లలో జైలు శిక్షలనుభవించారు. హిందీ బోధన ఒక కార్యక్రమంగా తీసుకొని కృష్ణాజిల్లా పెనుమచ్చ, చినకళ్ళేపల్లి, గుంటూరుజిల్లా మైనేనివారిపాలెం, తూర్పుపాలెం, బెల్లంవారి పాలెం మొదలగు గ్రామాలలో హిందీ నేర్పారు.
Complete Reading
117వ సంచిక, మే 1991 మేడే పై మోహన్ వేసిన చిత్రం ముఖచిత్రంగా వెలువడిన ఈ సంచికలో మేడేపై రాసిన సంపాదకీయాన్ని ‘‘ప్రజారచయితలూ, కళాకారులూ కష్టజీవులకు అండదండలుగా నిలబడి వారి లక్ష్య సాధనకు ఆలంబనగా రూపొందాలి. మరొకసారి మేడే నిర్దేశిస్తున్న కర్తవ్యం ఇదే!’’ అంటూ ముగించారు. దాదా హయత్ రాసిన ‘మసీదు పావురం’ కథ; రామతీర్థ వ్యంగ్య రచన, ‘బ్యాలటోపాఖ్యానం’; జాన్ వెస్లీ రచన ‘సామ్రాజ్యవాదం – ప్రసార సాధనాలు’; ‘మతతత్త్వం – మహిళల జీవితం’పై
Complete Reading
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కళాశాలలు మన దేశంలో ఉన్న ప్రసిద్ధ విద్యాసంస్థలు. అటువంటి విద్యాసంస్థలలోనే కులవివక్ష బహిరంగంగా, నిర్భీతితో ప్రదర్శించబడిందంటే – సమాజంలోనూ, సామాన్య విద్యాలయాలలో ఈ వివక్ష ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఖరగ్‌పూర్ ఐఐటి సంఘటన తెలియచేస్తూంది. అసోసియేట్ ప్రొఫెసర్ సీమాసింగ్ ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థుల బ్రిడ్జి కోర్సులో భాగంగా ఆన్‌లైన్‌లో పాఠం చెప్పటం పూర్తయిన తర్వాత విద్యార్థులు జనగణమణ పాటపాడి, భారత్ మాతాకీ జై! అంటూ ముగించారు. ఆ
Complete Reading
– బాలాజీ (కోల్ కతా) సుప్రసిద్ధ హంగేరియన్ దర్శకుడు ఈస్త్వాన్ జాబో 1981లో నిర్మించిన సినిమా ‘మెఫిస్టో’. జాబో పేరు చెప్పగానే గుర్తొచ్చే సినిమా ఇది. సినిమాకు మూలం జర్మన్ రచయిత క్లాస్ మాన్ ఇదే పేరుతో రాసిన నవల. ఈ నవలకు నాటక రూపాలు కూడా చాలా వచ్చాయి. ఫాసిస్టు జర్మనీలో హెండ్రిక్ హాఫ్గెన్ అనే రంగస్థల నటుడి అంచెలంచెల ఎదుగుదలను చెబుతుంది ఈ కథ. నిజజీవిత నటుడు గుస్తఫ్ గ్రుంజెన్స్ జీవితం ఆధారంగా
Complete Reading
దీనికి మొదటినుంచీ చివరివరకూ శ్రుతి పలికే తంబురా రచయిత నరేంద్ర డా. చంద్రారెడ్డి ‘‘నా జీవితంలో ఒక తీరని కోరికో లేక ఒక లోటో వున్నంత వరకూ నేను జీవించి ఉండటానికి ఒక కారణమంటూ ఉంటుంది. ఏ కోరికా లేక పూర్తిగా సంతృప్తి చెందటమంటె అది మరణంతో సమానం’’ అంటాడు బెర్నార్డ్ షా. జీవితంలో అతిప్రధానమైనది జీవితమే. అదే సరిపోతుందా అంటే సరిపోదంటుంది చిత్తూరు కుముదవల్లి నాగలక్ష్మి. ఆమెకు కావాల్సింది తను కోరుకున్న, తనుకావాలనుకున్న జీవితం.
Complete Reading