– వై. నేతాంజనేయ ప్రసాద్ పులిచంపిన లేడికి సానుభూతిగా సింహం అహింసావ్రతం చేస్తుంది అన్యాయం అంటూ ఆక్రోశిస్తుంది – నిన్నటిదాకా సింహం విదిల్చిన ఎంగిలి మాంసం పంచుకుతిన్న అవకాశవాద గుంటనక్కలనేకం వింత గొంతుకతో వంతపాడుతూ పస్తులుండలేక పాట్లుపడుతున్నాయి – దోచుకునే దొంగసొత్తు దక్కడంలేదని సమన్యాయం అంటూ ఘోషిస్తున్నాయి – నిన్నటిదాకా సింహం నీడన చేరి నిస్సిగ్గుగా నీరాజనాలందించిన వలస
Complete Reading
– పాలేరు తల్లీ కన్నీరు పెడుతుందో – కనిపించని కుట్రల భూ తల్లీ బావురుమన్నాదో – ఈ కరోన కాటుకు ॥ తల్లీ ॥ చైనాలోనా కరోన వచ్చెను ఊహానంతా ఉడికిపోయెను మనుషులందరూ పిట్టలులాగా ఊపిరి అందక కూలిపోయినరు కరోన ఎట్లా వచ్చిచేరినాదో – ఈ చైనాలోకి ప్రపంచికరణతో ఎల్లలు దాటిందో – ఆ కరోనభూతం ‘‘అయ్యో….. ఓ….. ఓ…… ఓ…..’’ ॥ తల్లీ
Complete Reading
– మనస్విని “ఉహువా…. ఉహువా నారాయణ! ఉహువాహువా…. నారాయణ! నారాయణ! ఏమిటబ్బా అన్ని ద్వారాలూ మూసి వున్నాయి? అరెరె వైకుంఠపుర ద్వారానికీ, బ్రహ్మలోక, కైలాసపురాల ద్వారాలకీ నో ఎంట్రీ బోర్డు లున్నాయేమిటి చెప్మా! నిత్యం విందు వినోదాలూ, అప్సరసల నృత్యాలూ, గంధర్వగానాలలో సందడిగా ఉండాల్సిన ఇంద్రసభ నిశ్శబ్దంగా తలుపులు మూసుకొని ఉందేమిటి? ఉహువా.. ఉహువా…. నారాయణ! నారాయణ! ఈ వెధవ దగ్గొకటి. భూలోకయాత్ర పుణ్యమాని పట్టుకొని వదలడంలేదు. తీరా ఇక్కడికొస్తినా….
Complete Reading
తన జీవితాంతం క్రూర పరిపాలకులకు, నియంతలకు వ్యతిరేకంగా ప్రతిఘటనా పోరాటాలలో క్రియాశీలంగా పాల్గొన్న, నికారుగ్వా దేశానికి చెందిన వామపక్ష కవి ఎర్నెస్టో కార్డినల్ 2020 మార్చి 1వ తేదీన తన 95వ ఏట మరణించారు. ఆయన 1925 జనవరి 20న ఒక ఉన్నత వర్గ కుటుంబంలో గ్రనడా పట్టణంలో పుట్టారు. నికారుగ్వా సాహిత్య, సాంస్కృతిక చరిత్రలో కార్డినల్ ఒక ప్రతిఘటనా వ్యక్తిగా కొనసాగారు. రాజకీయంగానూ, కవిత్వపరంగానూ నేటి లాటిన్ అమెరికాకు చెందిన ఒక అత్యంత
Complete Reading
అంటరానితనానికి వ్యతిరేకంగా, జోగిని – బసివిని దురాచారాలకు వ్యతిరేకంగా, కులాంతర వివాహాలను, నాస్తికత్వాన్ని ఒక ఉద్యమంగా కొనసాగించిన గోరాగారి కుమారుడు. డా॥ విజయం తన 84వ ఏట 22 మే 2020న అనారోగ్యంతో విజయవాడలో మరణించారు. ఆయన 1 డిశెంబరు 1936న జన్మించారు. నాస్తికత్వం అంటే ఒక జీవన విధానం అనీ, శాస్త్రీయ దృక్పథం అని నిరంతరం ప్రచారం చేసిన ఆయన ఇతర దేశాలలోని నాస్తిక సంఘాలతో నిత్య సంబంధాలు పెట్టుకొని, అక్కడి జర్నల్స్ కి
Complete Reading
– రవి నన్నపనేని కిరీట క్రిమి కంటే అత్యంత భయంకరమైంది యుద్ధ క్రిమి మనిషి లోపల విస్తరించే మహమ్మారో మనిషిని మానసికంగా శారీరకంగా హింసించే మరో అమానవుడో నేలమీద దుఃఖం లేని స్థలాన్ని చూడగలమా ? పీడితులూ పీడకులూ లేని కాలాన్ని ఊహించగలమా ? ఎల్లలు లేని ప్రపంచ పటం గీయగలమా? మనిషి పుట్టుక – జీవితం వేయి రేకుల
Complete Reading
‘చీకటి ఖండంపై మండే సూర్యుడు’ ముఖచిత్రంతో 1990 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మూడు నెలలు కలిపి ఒకే సంచికగా ప్రజాసాహితి వెలువడింది. “మా బాధలు మాకు నేర్పిన పోరాటం యిది” అనే శీర్షికతో వచ్చిన సంపాదకీయంలో దక్షిణాఫ్రికా నల్ల ప్రజల నేత నెల్సన్ మండేలాను 26 సం||ల తర్వాత విడుదల చేయటాన్ని పురస్కరించుకొని దక్షిణాఫ్రికాలో సాగుతున్న దోపిడీ విధానాలు, నల్లజాతి ప్రజల పోరాటాలను వివరించారు. మండేలాకు నిండు మనసుతో ప్రజాసాహితి స్వాగతం పలికింది. ‘అతని అసలు
Complete Reading
– మౌళి నడిచినడిచి బొబ్బలెక్కిన కాళ్ళతో.. ఏడ్చిఏడ్చికన్నీళ్లగాయపు కళ్ళతో.. చండ్ర చండ్రం ఎండదెబ్బల ఒళ్ళుతో.. తూలితూలి నెత్తురోడు పాదాలతో.. ‘‘ఆకలంతా నడుస్తుంది’’.. అవిసిఅవిసిన గుండెతో.. జారిపోయిన మనసుతో.. సడలిపోయిన ఆశతో.. అన్నమెండిన కడుపుతో.. నిద్రలేని రాత్రిసెగతో .. భద్రమెరుగని జాగరణతో.. ఊపిరాడని వయసుతో.. ‘‘ఆకలంతా నడుస్తుంది’’.. తల్లినేమో మోస్తులేక తల్లి బాధను చూడలేక తల్లి
Complete Reading
– సయ్యద్ రసూల్ మండే గుండెల అగ్ని కీలలు ఉవ్వెత్తున ఎలా ఎగిసిపడుతున్నాయో చూసావా ట్రంపూ ..!!? జనాగ్రహం జ్వాలా ముఖిలా విస్ఫోటనం చెందితే దిక్కులు ఎలా ఎరుపెక్కుతాయో గ్రహించావా ట్రంపూ ..!!? ఓరిమి నశించిన జనవాహిని ఉప్పెనలా చుట్టుముడితే ఊపిరి ఎలా ఆగిపోతుందో ఉహించావా ట్రంపూ …!!? కసితో బిగుసుకున్న పిడికిళ్లు అసహనంతో పైకి లేస్తే
Complete Reading
– శివాజీరావు ‘‘హు’’, అని నిట్టూర్చారు అలౌకికానందేంద్ర స్వాములవారు తన 60 ఏళ్ల ఆధ్యాత్మిక జ్ఞానం నింపుకున్న పొడుగాటి గడ్డాన్ని సవరించుకుంటూ. పరుపులకు, దిండ్లకు పట్టు గలేబాలు తొడుగుతున్న శిష్యులు ఆ నిట్టూర్పుకి క్షణం ఆగి గురువుగారి వైపు చూశారు. స్టేజి ఎదురుగా స్వామివారి జ్ఞాన బోధ విని తరిద్దామని వచ్చి షామియానాల కింద కూర్చున్న అశేష జన వాహినిలోని ముందు వరుసల జనాలు స్వామి వారి నిట్టూర్పు, వారి అనుంగు శిష్యుల తత్తరపాటు
Complete Reading