రాజకీయ స్నేహం

రాజకీయ స్నేహం

— డా॥ వూస ఎజ్రాశాస్త్రి —


పార్టీ టికెట్‌ కోసం స్నేహం పార్టీ సభ్యత్వం కోసం స్నేహం పార్టీ మద్దతుకోసం స్నేహం పార్టీ పొత్తుకోసం స్నేహం
తిట్టుకున్న తిట్లన్ని ప్రక్కన బెట్టి
కొట్లాటన్నింటికి చెక్కుబెట్టి
ఎక్షనయ్యేంత వరకు ఎంచక్కా జట్టుకట్టాలి
అధిష్టానం ఆజ్ఞ అముకు
దున్నపోతును మేకపోతును జతకలిపినా
గున్నఏనుగును చిన్నకుందేును జతకలిపినా
ఏకంగా పులిని మేకను పిల్లిని ఎుకను జతకలిపినా ఎంతో అన్యోన్యంగా సాగిపోవాలి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజల్ని పంచుకుతినాన్నా
నాయకు మధ్య గొడవల్లేకుండా నంజుకుతినాన్నా
ఆమాత్రం కలిసికట్టుగా వుండి అడ్డగోు స్నేహం చేయాల్సిందే రాజకీయ స్నేహమంటేనే అది ఆపద్ధర్మ స్నేహం అవకాశవాద స్నేహం
రాజకీయంలో శాశ్వత శత్రువు
శాశ్వత మిత్రుంటారా?
సత్తావున్న స్వానుభవం వున్నా
పొత్తుల్లేందే విపత్తు దాటలేని
పొలిటికల్‌ ట్రెండ్‌ మనది
ఈ అర్థాంతర స్నేహానికి అర్థాలే వేరు
పార్టీ సిద్ధాంతాల్ని కొంతకాం ప్రక్కనబెట్టి
‘‘ఖబడ్దార్‌’’ అన్న నోటితోనే ‘‘కామ్రేడ్‌’’ అనాలి
భూస్వాము బూర్జువా కొమ్ముకాయాలి చేదు గుళికలే మ్రింగినా తీపి కబుర్లే చెప్పుకోవాలి
స్నేహం ముదిరి పాకాన పడితే
సొంతపార్టీకంటే పొత్తుపార్టీనే గట్టిగా
వాటేసుకుని హత్తుకుపోనూ వచ్చు
ఎన్ని సంవత్సరా నుండి పార్టీలో వున్నా
కన్నతల్లి నా పార్టీ అని చెప్పుకున్న
అప్పటి పరిస్థితుల్ని బట్టి ` అప్పటికప్పుడు
అదును చూసుకొని అవత పార్టీలోకి
అమాంతంగా దూకేయనూ వచ్చు
ఇదే రాజకీయ స్నేహం
అదే అందులోనున్న రహస్యం

admin

leave a comment

Create AccountLog In Your Account