అలల నిలయం

అలల నిలయం

— రవి సన్నపనేని —

సముద్రం ఒడ్డుచే చుట్టబడిన
భూమ్మీద నేను
నీరే నా తొలి ఊయ
నీరే నా తొలిపాఠశా
నీరే నా ప్రాణదాత
ఇక్కడే తొుచూరి నేను
జచరమై ఈదులాడిరది
తీరం తవాకిట్లోకిపాకి
ఉభయచరమై
ఇక్కడే ఈ ఇసుకలోనే గుడ్లుపెట్టింది
కాపురుషుని శస్త్ర చికిత్సలో
నా పురాతనరూపం మారి
దట్టమైన చెట్ల మేడల్లోకీ
మెట్టినింటి మైదానాల్లోకీ
నరవానరమై నడిచింది ఇక్కడి నుంచే
శ్రమ క్రమంలో
నియాండర్తల్‌ సంచారమయ్యింది
ఈ అనంత పారావార అగాధంలోంచే..
రెండు చేతు ప్రాణినై
అనేక జీవజాతుల్ని జయించిన నేను
జీవన యానంలో మైత్రీభావం, మానవత్వం కోల్పోయిన
ఒక పరాజితుణ్ణి
దేహ దాహం తీరని దుఃఖితుణ్ణి
అహంకారలోకంలో ఆత్మ గుడ్డిదైనప్పుడు
ఈ అనంత శక్తిస్వరూపిణి నియంలోనే
ఇక్కడే ఈ ప్రసిద్ధ జముకురంలోనే
నా ఎత్తూ నా వెడ్పూ దృశ్యమానమయ్యేది
ఇవాళ ఓ రెండు గంటు
ఉప్పులోఉప్పయ్యేను
మళ్ళీ అమీబా కణమయ్యేను
అలతో ముద్దాడబడ్డ అనాది బిడ్డనయ్యేను
సముద్రం నా పుట్ట్లిు
సముద్రం నా మాతృగర్భ స్థానం

admin

leave a comment

Create Account



Log In Your Account