చివరికి మిగిలినవాడు

చివరికి మిగిలినవాడు

జార్జీ ఫుకుంబే అనే ఒక సైనికుడికి జోయర్‌ యుద్ధంలో కాలికి తుపాకీ గుండు తగిలింది. దాంతో కేప్‌టౌన్‌లో వున్న ఒక ఆస్పత్రిలో అతడి మోకాును తొగించారు. అతడు ండన్‌కు తిరిగివచ్చిన తర్వాత ప్రభుత్వం నుండి డెబ్బయి ఐదు పౌండ్లు అందుకున్నాడు. ఇక మీదట ప్రభుత్వం నుండి తనకు రావసిన బకాయిలేమీ లేవని చ్లొచీటీ రాసిచ్చాడు. తాను అందుకున్న మొత్తాన్ని న్యూగేట్‌ టౌన్‌లోని ఒక బీరుషాపులో పెట్టుబడి పెట్టాడు. అందుకు కారణం ఆ షాపులో బీరు మరకు పడ్డ ఒక పద్దు పుస్తకం అతనికి దొరకింది, అందులో ఆ షాపుమీద వారానికి రెండుపౌండ్లు లాభం వస్తున్నట్టుగా వుంది.
ఆ షాపుకు వెనుకవైపున్న ఒక చిన్న గదిలో తన మకాం ఏర్పాటు చేసుకుని, ఒక వృద్ధ మహిళ సాయంతో బీరు అమ్మకాు మొదుపెట్టాడు. అయితే తొందరగానే వారానికి కనీసం రెండు పౌండ్ల లాభం కూడా రావడం లేదన్న సంగతి తెలిసి వచ్చింది. దాంతో యుద్ధంలో కాు పొగొట్టుకొని తానేమీ ప్రయోజనం పొందలేకపోయానని గ్రహించాడు. అప్పటికీ షాపుకు వచ్చే కస్టమర్లందరితోనూ చాలా గౌరవంగానే మసు కుంటున్నాడు. తాను ఆ షాపు కొనకముందు వరకూ ఆ ప్రాంతంలో కొన్ని నార్మాణపు పను జరిగాయి. అక్కడి పనివారు, యజమాను ఆ బీరుషాపుకు మంచి కస్టమర్లుగా వుండేవారు. ఆ నిర్మాణం పూర్తికావడంతో కస్టమర్లు తగ్గిపోయారు. పద్దు పుస్తకం చూసినపుడు అతడికి మరొక విషయం తెలిసింది. సెవు రోజుల్లో కంటే పనిదినాల్లోనే అమ్మకాు బాగుంటాయని అదే విషయం అందరూ చెప్పారు. నిజానికి అనుభవమున్న మద్యం వ్యాపారుకు ఎవరికీ ఇది అనుభవంలోకి రాని విషయం. అయితే ఇప్పటి వరకూ ఫుకుంబే కస్టమరుగానే తప్ప యజమానిగా లేడు కదా! అలా పడుతూ లేస్తూ నాుగునెలపాటు మాత్రమే షాపుని నడపగలిగాడు. పాత యజమాని ఎప్పుడు వస్తాడా, షాపు ఎంతో కొంతకు అతనికే ఇచ్చి పోదామా అని ఎదురుచూసాడు. చివరికి చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా రోడ్డున పడ్డాడు. ఒక సైనికుని భార్య వాళ్ళ ఇంట్లో ఫుకుంబేకు ఆశ్రయమిచ్చింది. ఆమె తనకున్న చిన్న షాపు నడుపుకుంటుండగా ఆమె ప్లికు మనవాడు యువకథు చెపుతుండేవాడు. ఒకరోజు ఆమెకు సైన్యంలోనున్న తన భర్త సెవుపై ఇంటికి వస్తున్నట్లుగా ఉత్తరం రాసాడు. అప్పటివరకూ ఆమె ఆ సైనికుడితో నిద్రిస్తోంది. అటువంటి చిన్న ఇళ్ళలో అది సాధారణమైన విషయం. అయితే ఉత్తరం రాగానే వీలైనంత తర్వగా ఇు్ల వదలి వెళ్ళిపోవసిందిగా ఫుకుంబేకు చెప్పింది. కొద్దిరోజుపాటు అక్కడే ఉండిపోయిన్పటికీ అతడికి ఇు్ల వదిలిపెట్టక తప్పలేదు. ఆమె భర్త వచ్చిన తరువాత కూడా ఒకటి రెండుసార్లు ఆమెను కలిసాడు. తినడానికి ఏదో ఒకటి పెట్టేది, తరువాత అదీ మానేసాడు. కానీ అతని పరిస్థితి మరింత దిగజారిపోయింది. చివరికి ప్రపంచానికే మకుటాయమానమైన ఆ మహానగరంలో ఆకలికి మమలాడే అసంఖ్యాకమైన అన్నార్తు జాబితాలో తానూ చేరిపోయాడు.
ఒకరోజు థేమ్స్‌నదిపై నున్న ఒక వంతెనపై నిబడి వున్నాడు. రెండు రోజునుండీ తినడానికి ఏమీ దొరకనందున నిబడడానికి శరీరం సహకరించడం లేదు. మద్యంషాపుల్లోని కస్టమర్ల వద్దకు తన సైనిక యూనిఫాంలో వెళ్తే తాగడానికి మాత్రం కొంత పోయించారు గానీ తినడానికేమీ ఈయలేదు. ఒంటిపై యూనిఫాం లేకపోతే మందు కూడా దక్కేదికాదు.
ప్రస్తుతం సాదాసీదా దుస్తు మాత్రమే ధరించివున్నాడు. ఒక పక్క తనస్థితికి సిగ్గుపడుతూనే బిచ్చమెత్తుకోడానికి సిద్ధమయ్యాడు. అవిటివానిగా ఉన్నందుకూ సిగ్గుపడలేదు, లాభాు తెచ్చిపెట్టని మద్యం షాపు కొన్నందుకూ సిగ్గుపడలేదు… కానీ ముక్కూమోహం తెలియని వారి ముందు చెయ్యిచాపడానికి విపరీతంగా అవమానపడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళెవరూ అతనికి రుణపడినవారు కాదు.
అడుక్కోవడం కూడా అనుకున్నంత సుభమైన పనికాదని అర్థమైంది మనవాడికి…. నిజానికి యాచన చేయడానికి నేర్చుకో వసిందంటూ ఏమీ వుండదు. ఇప్పుడు చూస్తే కొంత నేర్చుకోనవసింది వుందనిపిస్తోంది. కనిపించని ప్రతి ఒక్కరినీ యాచించాడు. ఎవరిదారికీ అడ్డంగా నిబడకుండా, ముఖంలో కొంత ధైర్యం పుముకొనీ యాచించాడు. చిన్నచిన్న పదానుపయోగించి యాచించడం రాలేదు. అందువన ఇతగాడి మాటు పూర్తిగాకముందే దాతు వెళ్ళిపోతుండేవారు. పైపెచ్చు ఎవరి ముందూ చేయిసాచేవాడు కాదు. అలా నాుగైదు సార్లు విఫమైన తర్వాతే అతడికి అర్ధమైంది తననెవరూ యాచకుడిగా (అర్థం చేసుకోలేదని) గుర్తించలేదని, కానీ ఎవరో ఇతడిని గమనిస్తూనే వున్నారు. ఎందుకంటే వెనుకనుండి బొంగురు గొంతుతో ‘‘పో! ఇక్కడనుండి’’ అని అకస్మాత్తుగా వినబడిరది. కనీసం వెనుదిరిగి చూడేలేనంతగా సిగ్గుపడ్డాడు. డీలా పడిపోయి నెమ్మదిగా అక్కడనుండి తప్పుకున్నాడు. ఓ వంద గజా దూరం ముందుకు వెళ్ళి వెనుదిరిగి చూసాడు. దుమ్మకొట్టుకుపోయి, పేలికలైన దుస్తుల్లోనున్న ఇద్దరు ముష్టివాళ్ళు అతని వంక చూస్తున్నారు. అతడు నెమ్మదిగా నడిచి వెళ్తుంటే అతని వెనుకనే రాసాగారు. అలా చాలా వీధు దాటిన తర్వాత వాళ్ళు తనను అనుసరించడంలేదని తొసుకున్నాడు.
మరునాడు చేసేపనేమీ లేక రేవు చుట్టపక్క తచ్చాడుతున్నాడు. అప్పుడప్పుడు ఆ దారివెంట పోయే కూలీతో మాట్లాడడానికి ప్రయత్నించాడు. ఇంతలో వెనుకనుండి ఎవరో గుచ్చినట్లనిపించి వెనక్కి తిరిగి చూసాడు. ఎవరూ లేరు. కానీ ఎవరో అతని జేబులో ఏదో పెట్టారు. బయటకు తీసి చూస్తే అది బాగా నలిగిపోయి, మాసిపోయి ఉన్న ఒక కార్డు. ఏదో ఒక సంస్థ చిరునామా దానిపై ముద్రించబడి వుంది. ‘‘జె.జె.పీచమ్‌, 7 ` పాతోక్‌వీధి’’.దానికిందన ‘‘నీ ఎముకు సున్నం కాకుండా వుండాంటే పై చిరునామాకు రావాలి’’ అని పెన్సిల్‌తో అస్పష్టంగా రాసివుంది. కొట్టొచ్చినట్టు దాని కింద రెండు గీతు కూడా గీయబడ్డాయి.
తనపై జరుగుతున్న దాడు తన యాచనతో ముడిపడ్డవే అని నెమ్మదిగా అర్థమైంది ఫుకుంబేకు అలా అని పాత ఓక్‌వీధికి వెళ్ళాని కూడా అనిపించలేదు. ఆ మధ్యాహ్నం ఒక మద్యం షాపుముందు నిబడివుండగా ముందురోజు తన వెంట పడ్డ ముష్టివాళ్ళలో ఒకడు కనిపించాడు. అతడు యువకుడే, చూడ్డానికి పర్వాలేదనిపించేలా వున్నాడు. ఫుకుంబే చొక్కాపట్టుకొని ఒక పక్కకు లాక్కుపోయాడు.

‘‘ఒరే పందీ, నీ నెంబరు చూపించు’’ అని స్నేహంగానే అడిగాడు.
‘‘నంబరేంటి’’ అడిగాడు సైనికుడు (ఫుకుంబే)
సైనికుడిపై వాలిపోతూ, తన మొరటుభాషలో అనునయంగా చెప్పాడు యువకుడు. ‘‘అన్ని ఇతర వృత్తు మాదిరిగానే ఈ యాచకవృత్తి కూడా జరుగుతోంది. నిజానికి వాటన్నిటికంటే కాస్తో కూస్తో ఇదే నయం. అయితే మనం వున్నది అడివిలో కాదు… ఏ మారుమూలో కాదు, ఒక మహానగరంలో. ఇక్కడ ఏవృత్తి చేయదచుకున్నా, ముఖ్యంగా యాచించడం. దానికో నంబరు తీసుకోవాలి. పాత ఓక్‌వీధిలో దీనికి సంబంధించిన యూనియన్‌ హెడ్డాఫీస్‌ వుంది. అక్కడ కొంత డబ్బు చెల్లిస్తే నీకొక నెంబరు ఇస్తారు. అది ఒక రకమైన లైసెన్సులాంటిది. అప్పుడు మాత్రమే నువ్వు మా అందరిలా స్వేచ్ఛగా అడుక్కోగవు. అర్ధమైందా?
ఒక్క ప్రశ్న కూడా వేయకుండా ఆ యువకుడు చెప్పిందంతా ప్రశాంతంగా విన్నాడు ఫుకుంబే. భవన నిర్మాణ కార్మికుకూ, క్షురకుకూ, ఇతర వృత్తు వారికీ వున్నట్టే యాచకుకు కూడా యూనియన్‌ వుండడం తనకు చాలా సంతోషాన్ని కల్గించిందన్నాడు. గతంలో తాను వివిధ హోదాతో పనిచేసి వున్నానని, దానికి తన కొయ్యకాలే సాక్ష్యమని అన్నాడు. అందువన తన వరకు తనకు నచ్చినట్టే ఏ పనైనా చేస్తానని కూడా అన్నాడు.
ఇలా చెప్పి ఆ యువకునితో కరచానం చేద్దామని చేయి చేసాడు. ఒక అద్భుతమైన ప్రసంగాన్ని ఎంతో ఆసక్తితో వింటూనే దానితో ఏకభవించలేనట్టుగా ఆ యువకుని ముఖం వుంది. చప్పట్లు కొడుతూ స్నేహపూర్వకంగా సైనికుని భుజం తట్టి ఆ యువకుడు వెళ్ళిపోయాడు. ఎందుకో ఆ కుర్రాడి నవ్వు నచ్చలేదు ఫుకుంబేకు.
తర్వాత మరికొన్ని గడ్డు దినాు ఎదరయ్యాయి. క్రమం తప్పకుండా ముష్టి పడాంంటే ఏదో ఒక చోట కుదురుగా కూర్చోని అడుక్కోవడం మంచిదనిపించింది. కానీ అలా చేయలేకపోయాడు. ఎక్కడ కూర్చుందామని ప్రయత్నించినా అప్పటికే అక్కుడున్న ముష్టివాళ్ళు ఇతడిని తరమేసేవారు. మిగిలిన వాళ్ళంతా ఎలా ఆ పని చేసుకోగగు తున్నారో మనవాడికి అర్థమయ్యేదికాదు. అయితే వాళ్ళంతా తనకంటే దీనస్థితిలో వున్నట్టు కనబడుతున్నారు. వాళ్ళ దుస్తున్నీ చిరిగిపోయి లోపలి ఎముకల్ని చూపిస్తున్నాయి. ఎముక గూళ్ళలా వున్నవాళ్ళ శరీరాు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్ని జ్ఞాపకం చేస్తున్నాయి. వాళ్ళలో చాలామంది క్రింద ఏమీ పరుచుకోకుండానే చ్లటి పేవ్‌మెంట్లపై కూర్చున్నారు. ఆ దారంట పోయేవాళ్ళు వీళ్ళని చూస్తే ఖచ్చితంగా వీళ్ళు జబ్బు పాయ్యారు అనుకుంటారు. అయినప్పటికీ అనుమతిస్తే ఫుకుంబే కూడా చాలా సంతోషంగా అక్కడ కూర్చునేవాడు. కానీ తనకీ అవకాశం ఇవ్వరు. పోలీసుూ ముష్టివాళ్ళూ అతడిని తరుముతూనే వున్నారు.
అట్లా దుమ్మూ, ధూళిలో ఆవారాగా తిరిగినందువన ఛాతీలో కఫం పేరుకుపోయి జుబుచేసింది. మనవాడికి వొళ్ళంతా నొప్పు, జర్వంతో బాధపడుతూనే ముష్టికోసం తీరగాల్సివచ్చింది.
ఒక సాయంత్రం యువకుడైన బిచ్చగాడిని మరలా కుసుకున్నాడు ఫుకుంబే. ఇతడిని చూచిన వెంటనే అనుసరించడం మొదుపెట్టాడు. ఆ యువకుడు రెండు వీధు దాటేసరికి రెండవ బిచ్చగాడు కూడా వచ్చాడక్కడికి అది చూచి ఫుకుంబే పరుగెత్తడం మొదుపెట్టాడు. వాళ్ళు ఇతడిని తరమసాగారు.
వాళ్ళ నుండి తప్పించుకొనడానికి ఒక చిన్న సందులో దూరాడు. హమ్మయ్య! వాళ్ళ బారి నుండి తప్పించుకున్నాను అని అనుకున్నాడో లేదో ఆ వీధి చివర ఇద్దరూ హఠాత్తుగా ప్రత్యక్షమయ్యారు. వెనక్కి తిరుగుదామనుకుంటుండగా వాళ్ళ చేతుల్లోనున్న కర్రతో సైనికుడిని కొట్టారు. ఒకడైతే అతడ్ని పేవ్‌మెంటు మీదకు తోసేసి, కొయ్యకాును పట్టుకులాగేసాడు. దాంతో సైనికుడు వెల్లికిలా పడిపోయాడు. పోలీసు అటువైపుగా రావడం చూసి అతడ్ని అలాగే వదిలేసి ఇద్దరు బిచ్చగాళ్ళూ పారిపోయారు.
పోలీసు తననుపైకి లేపుతాడని ఫుకుంబే ఆశించాడు. ఇంతలో దారిపక్కనున్న ఇళ్ళ మధ్య నుండి తోపుడు బండిపై మరొక బిచ్చగాడు అక్కడికి వచ్చాడు. మొదటి ఇద్దరు బిచ్చగాళ్ళూ పారిపోయిన వైపు పోలీసుకు చూపిస్తూ బొంగురు గొంతుతో ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు. పోలీసు ఇచ్చిన చేయి ఆసరాతో ఫుకుంబే పైకి లేచి నెమ్మదిగా నడవసాగాడు. తన బండిని తోసుకుంటూ మూడవ బిచ్చగాడు కూడా ఫుకుంబేతో పాటు నెమ్మదిగా సాగుతున్నాడు. అతడూ కుంటివాడిలా వున్నాడు. పోలీసు తనదారిన వెళ్ళిపోయాడు.
పక్క సందులోకి వెళ్ళగానే ఆ కుంటివాడు ఫుకుంబే పంట్లాం పట్టుకుని గుంజాడు. వాళ్ళిప్పుడు ఆవాడలో అతి మురికిగానున్న చోట వున్నారు. ఇరుకుగానున్న ఒక చీకటి యింటి పెరడు వైపు చూపిస్తూ ‘‘లోపలికినడు’’ అంటూ కుంటివాడు గట్టిగా అరిచాడు. అలా అంటూ తన తోపడు బండితో ఫుకుంబే మోకాలి ఎముకపై వెనక్కి నెట్టాడు. అసలే తిండిలేక నీరసంగా ఉన్నాడేమో, అలా తోసేసరికి మూడు గజా స్థం కూడా లేని ఆ ఇరుకు పెరట్లో పడ్డాడు. ఆశ్చర్యపోతూ ఏం జరిగిందో తొసుకొనేలోగానే కుంటివాడు తన తోపుడుబండి నుండి ఆకస్మాత్తుగా మొలిచిన రెండు కాళ్ళతో ఫుకుంబే పైకి ఎగిరిదుమికాడు.

admin

leave a comment

Create Account



Log In Your Account