ప్రాణవాయువు

ప్రాణవాయువు

— సన్నపు రెడ్డి వెంకట రామి రెడ్డి —

బడికి ప్రయాణమై వెళుతూ
సెవు రోజనే విషయం గుర్తుకొచ్చి
వెనక్కి తిరిగొచ్చిన అనుభవం నీకు లేదా?
పిరియడ్‌ గంట మోగిన తర్వాత కూడా
గది బైట ఉపాధ్యాయుడు నిరీక్షించటం గమనించకుండా
బోధనలోంచి బైటకు రాలేని పరిస్థితి ఎప్పుడూ ఎదురవలేదా?
చిరుకోపంతో నువ్వు చేయెత్తితే
నీకన్నా ముందే నిన్ను కొట్టి పారిపోయే ప్లిల్ని చూసి
మనసారా నవ్వుకొన్న స్మృతి ఒక్కటైనా లేదా?
నిన్నా మొన్నా బడికెందుకు రాలేదనో
గంటకొట్టినా తరగతికి ఆస్యమెందుకయిందనో
అమాయికంగా ప్లిు నిన్ను నిదీసిన రోజులేదా?
నిన్నటి బట్టలే యీరోజు వేసికొచ్చావనో
కళ్ళద్దాు మరిచావనో గుర్తుజేసినపుడు
నీపట్ల వాళ్ల పరిశీనకు ఆశ్చర్యపడిన క్షణాు లేవా?
ప్లిు విసరిన ప్రశ్నకు జవాబు
రేపు చెబుతానంటూ ఎప్పుడూ వాయిదా వేయలేదా?
ఉదయం అన్నం తిని రాలేదనీ, ఆకలేస్తోందనీ
ఏ బిడ్డా నీవద్దకొచ్చి కన్నీళ్ళు పెట్టుకోలేదా?
నీ క్యారియర్‌ అన్నం నిస్సంకోచంగా తినలేదా?
ఈ ప్రశ్నకు సమాధానాు వెదకి చూసుకో
ఉపాధ్యాయునిగా బతికున్నావో లేదో నీకే తొస్తుంది.
కనీసం ఒక్కరోజన్నా నీ త్లెని బట్టనిండా
ప్లి చేతివేళ్ల మట్టి మరకల్తో బైటకొచ్చావా
నీకింకా బడి ప్రాణవాయువు రాసివున్నట్టే

admin

leave a comment

Create AccountLog In Your Account