– రావిశాస్త్రి అన్నారావుని శనిలా వెంటాడుతున్నాడు ముష్టివాడు. ఆకల్లో అందం కనిపించదు. ఆకల్తో ఉన్నవాళ్లు బొత్తిగా బావుండరు చూడ్డానికి. వాళ్ళనసలు చూడరు చాలామంది. ఇక్కడ ‘‘ఆకలి’’ అంటే ఆకలేకాని మరొకటి కాదు. పుస్తకాలంటే ఆకలి, పరస్త్రీ అంటే ఆకలి, పరాయి సొమ్మంటే ఆకలి, ఆ తరహాది కాదు. ఆకలంటే అసలైన ఆకలి. అంటే ఏమిటో చాలామందికి తెలిసుండాలి. అతనసలు ఆదినుంచీ ఆకల్తో ఉన్నవాళ్ళా ఉన్నాడు. అంతకాలం అలా ఉంటే మనిషి రూపు మారిపోతుంది. అతను, చెదపుట్టలోంచి తీసిన
Complete Reading
– డా. కే.వి. రమణరావు కారును సైడురోడ్లోకి తిప్పి పార్కింగ్ కోసం వెతుకుతున్నాడు జైరాజ్. జేబులో ఫోను రెండుసార్లు మోగి ఆగిపోయింది. ఇళ్ల యజమానులు వీధినే పార్కింగ్ లాట్‌గా మార్చుకొని రోడ్డుకు రెండువైపులా వాళ్ల కార్లు పెట్టుకున్నారు. చివరకు ఒక ఇంటిముందు గేటుకడ్డంరాని ఖాళీ కనపడింది. ‘ఇంటివోనరు చూసాడంటే తిట్లు తప్పవు, డ్రైవర్లంటే అందరికీ అలుసే. మాలాంటివాళ్లను గౌరవంగాజూసే రోజెప్పుడన్నా వస్తుందా’ అనుకుంటూ అక్కడ కారుపెట్టి గబగబా నడిచి అతని ఇల్లున్న సన్నటి సందులోకి తిరిగాడు.
Complete Reading
ఆంగ్లమూలం : పంకజ్ ప్రసూన్ తెలుగు : కొత్తపల్లి రవిబాబు (స్వేచ్ఛ, సమానత్వం, దోపిడీరహిత ప్రపంచం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులందరికీ మన విప్లవ అరుణారుణ వందనాలు) నిరంకుశులకు, సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా కవిత్వం ఒక ఆయుధంగా వుంటుంది. టునీసియాలో, ఈజిప్టులో, సిరియాలో యెమెన్‌లో, బహ్త్రైన్‌లో, మలేసియాలో స్వాతంత్య్ర పతాకాన్ని ఎత్తిపట్టిన వారికి, అన్యాయానికీ, దోపిడీకి వ్యతిరేకంగా
Complete Reading
– సిహెచ్. మధు జీవన చరమాంకం ప్రారంభమయ్యింది సూర్యుడు పశ్చిమాన పరుగును అరచేతితో ఆపేసాను ఆపన్నుల హస్తం, అభిమాన సూర్యుల వెలుగు నాకు అమృతం పోస్తున్నాయి అస్తమయం సహజాతి సహజం కానీ తాత్కాలికంగా ఓడిపోతుంది పర్వతాల అడ్డు తొలగిపోతుంది డెబ్బది సంవత్సరాల చెట్టు శిశిరంలోకి ప్రవేశించింది ఆకులు రాలిపోతున్నాయి కొమ్మలు బలంగానే వున్నాయి మళ్లీ ఆకులు చిగురిస్తాయి గాలి, నీరు నేనేగా నేల బలం నాలో నిక్షిప్తమయివుంది నా మనసులో ముళ్లు – రాళ్లు వున్నాయి నా
Complete Reading
– బొలుసాని జయప్రభ ‘‘ఆనంద బాబు! నీదేకులం అని ఎన్నిమార్లు అడిగినా ఎప్పుడూ సమాధానం చెప్పరు ఎందుకు బాబూ?’’ అని అడిగాడు రంగయ్య. ‘‘చెప్పాను కదా రంగయ్యా ! నీ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు’’ సమాధానంగా ఆనంద బాబు. ‘‘అదేం సమాధానం బాబూ? మనిషి భూమి మీద పడ్డాక ఏదో కులానికి చెందకుండా ఎలా ఉంటాడు? పోనీ పేరును బట్టి పోల్చుకుందామా అంటే అదీ వీలు కాకుండా ఉంది. రెడ్డి,
Complete Reading
– ఏటూరి నాగేంద్రరావు వీళ్ళందరూ ఏ దేశపు నేరస్తులూ కారు.. ఓటు హక్కున్న నేల నుండి విసిరేయబడి ఆకలిని నియంత్రించుకుంటూ పేగులు కుట్టేసుకొని యాడేడో తిరిగి తిరిగి రంగు మారిన ముఖాలు. ఈ మట్టిలో పుట్టి ఈ మట్టినే తింటున్న ప్రగతి కారులు. ఆశల్ని తాకట్టు పెట్టుకుంటున్న స్తబ్ధ ప్రపంచాలు. చెలియలి కట్టను తెంపుకొని పరుగిడుతున్న ఆవేదన
Complete Reading
– ఎస్. శంకరరావు ఆదిపత్య దురహంకార అక్రమ సంతానమా! కాలం కనుసన్నలలో వికసించిన యమపాశమా! నగ్న శిధిలీకృత వ్యవస్థ సృజించిన విష బీజమా! ప్రకృతిని పట్టిపీడించే హీన సంస్కృతి రాజసమా! విషవాయు జ్వాలల కాలుష్యమా! ఓ కాలుష్యమా! నీ దుర్నీతి ఫలితం ప్రతి ఇంటా ప్రతి వాడా క్షణం క్షణం మృత్యు భయం! నాడు బోపాల్- నేడు
Complete Reading
– అశోక్ కుంబము (“మానవాళి శోభ కోసం మొత్తం దోపిడీ వ్యవస్థను కాల్చేయాల్సిందే!”) నీ కడుపులో ఉన్న తొమ్మిది నెలలేనమ్మా జీవితంలో నేను పొందిన స్వేచ్ఛా కాలం ఏ క్షణాన భూమి మీద పడ్డానో నా నల్ల రంగే నాకు శాపమయ్యింది ఊహించని మృత్యుకూపాన్ని నా చుట్టూ తొవ్వింది నేను ఎదురుపడితే నాలో ఒక దొంగనో మత్తు మందు బానిసనో
Complete Reading
– సూర్యప్రకాశ్ కంపుగొట్టే మురికి వాడల దారుల నుండి.. పెచ్చు లూడుతున్న ఫ్లై ఓవర్ల నీడల నుండి.. మొదలయ్యిందొక ప్రస్థానం. బోర విరుచుకొని నిలుచున్న కార్పొరేటు కోటల శిఖరాల ముంగిట శిరసు వంచి మోకరిల్లిన మహానగరాల మురికి వాడల నుండి.. డొక్కలు మాడి బక్క చిక్కిన బడుగుల పడకల ఫుట్పాతుల నుండి.. కాళ్ళీడ్చుకుంటూ మొదలయ్యింది నేటి మహా ప్రస్థానం. పాపాలను కడిగేసుకునే పుణ్య పురుషుల
Complete Reading
– వై. నేతాంజనేయ ప్రసాద్ పులిచంపిన లేడికి సానుభూతిగా సింహం అహింసావ్రతం చేస్తుంది అన్యాయం అంటూ ఆక్రోశిస్తుంది – నిన్నటిదాకా సింహం విదిల్చిన ఎంగిలి మాంసం పంచుకుతిన్న అవకాశవాద గుంటనక్కలనేకం వింత గొంతుకతో వంతపాడుతూ పస్తులుండలేక పాట్లుపడుతున్నాయి – దోచుకునే దొంగసొత్తు దక్కడంలేదని సమన్యాయం అంటూ ఘోషిస్తున్నాయి – నిన్నటిదాకా సింహం నీడన చేరి నిస్సిగ్గుగా నీరాజనాలందించిన వలస
Complete Reading