ఆయుధం లేని

– రవి నన్నపనేని           కిరీట క్రిమి కంటే           అత్యంత భయంకరమైంది యుద్ధ క్రిమి           మనిషి లోపల విస్తరించే మహమ్మారో           మనిషిని మానసికంగా           శారీరకంగా హింసించే మరో అమానవుడో           నేలమీద           దుఃఖం లేని స్థలాన్ని చూడగలమా ?           పీడితులూ  పీడకులూ లేని కాలాన్ని           ఊహించగలమా ?           ఎల్లలు లేని ప్రపంచ పటం గీయగలమా?           మనిషి పుట్టుక – జీవితం           వేయి రేకుల
Complete Reading

– మౌళి           నడిచినడిచి బొబ్బలెక్కిన కాళ్ళతో..           ఏడ్చిఏడ్చికన్నీళ్లగాయపు కళ్ళతో..           చండ్ర చండ్రం ఎండదెబ్బల ఒళ్ళుతో..           తూలితూలి నెత్తురోడు పాదాలతో..            ‘‘ఆకలంతా నడుస్తుంది’’..           అవిసిఅవిసిన గుండెతో..           జారిపోయిన మనసుతో..           సడలిపోయిన ఆశతో..           అన్నమెండిన కడుపుతో..           నిద్రలేని రాత్రిసెగతో ..           భద్రమెరుగని జాగరణతో..           ఊపిరాడని వయసుతో..           ‘‘ఆకలంతా నడుస్తుంది’’..           తల్లినేమో మోస్తులేక           తల్లి బాధను చూడలేక           తల్లి
Complete Reading

– సయ్యద్ రసూల్           మండే గుండెల అగ్ని కీలలు           ఉవ్వెత్తున           ఎలా ఎగిసిపడుతున్నాయో           చూసావా ట్రంపూ ..!!?           జనాగ్రహం           జ్వాలా ముఖిలా విస్ఫోటనం చెందితే           దిక్కులు ఎలా ఎరుపెక్కుతాయో           గ్రహించావా ట్రంపూ ..!!?           ఓరిమి నశించిన జనవాహిని           ఉప్పెనలా చుట్టుముడితే           ఊపిరి ఎలా ఆగిపోతుందో           ఉహించావా ట్రంపూ …!!?           కసితో బిగుసుకున్న పిడికిళ్లు           అసహనంతో పైకి లేస్తే
Complete Reading

– శివాజీరావు           ‘‘హు’’, అని నిట్టూర్చారు అలౌకికానందేంద్ర స్వాములవారు తన 60 ఏళ్ల ఆధ్యాత్మిక జ్ఞానం నింపుకున్న పొడుగాటి గడ్డాన్ని సవరించుకుంటూ.           పరుపులకు, దిండ్లకు పట్టు గలేబాలు తొడుగుతున్న శిష్యులు ఆ నిట్టూర్పుకి క్షణం ఆగి గురువుగారి వైపు చూశారు. స్టేజి ఎదురుగా స్వామివారి జ్ఞాన బోధ విని తరిద్దామని వచ్చి షామియానాల కింద కూర్చున్న అశేష జన వాహినిలోని ముందు వరుసల జనాలు స్వామి వారి నిట్టూర్పు, వారి అనుంగు శిష్యుల తత్తరపాటు
Complete Reading

(స్వతంత్ర రచన 1947) – పి. లక్ష్మీకాంత మోహన్           పమిడిముక్కల లక్ష్మికాంత మోహన్‌ పాతతరం సాహితీ ప్రపంచానికి షేక్పియర్స్‌ మోహన్‌గా పరిచయం. 8వ తరగతి (థర్డ్‌ పారం) వరకే చదివి, ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీ సభ్యుడై, బుర్రకథ లాంటి ప్రజాకళారూపాలపై పట్టు సాధించి, ప్రజాకళాకారునిగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలో నిబద్ధ కార్యకర్తగా కృషిచేశాడు. తెలంగాణలో నిజాంకు, భూస్వాములకు వ్యతిరేకంగా ఆ కాలంలో జరిగిన పోరాటాన్ని పోరాటకాలంలోనే ‘సింహగర్జన’ అదే నవలను రచించాడు.
Complete Reading

– సంఘమిత్ర, బాలసంఘ సభ్యులు పిల్లలూ పాలపిట్టలు పిల్లలూ తాటిముంజలు పిల్లలూ చింపిరి గుడ్డలు పిల్లలూ ఆణిముత్యాలు పిల్లలూ వెన్నముద్దలు పిల్లలూ పంచదార చిలుకలు పిల్లలూ శిల్పి చెక్కిన బొమ్మలు పిల్లలూ మీరు పిడుగులు పిల్లలూ వాన చినుకులు పిల్లలూ శ్రమజీవుల చెమట చుక్కలు పిల్లలూ సముద్రపు ఆలుచిప్పలు పిల్లలూ మట్టిలోని మాణిక్యాలు పిల్లలూ చీపురుకట్ట పుల్లలు పిల్లలూ టపాకాయలు పిల్లలూ సంఘమిత్ర మొగ్గలు

– సంఘమిత్ర, బాలసంఘ సభ్యులు కరోనా వచ్చింది ముక్కుకు మాస్క్‌ వేసింది మనుషులను దూరం పెట్టింది షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకోవద్దంది దండాలు పెట్టుకోమనింది లాక్‌డౌన్‌ పెట్టారు ఇంట్లో ఉండమన్నారు బయటికి రావద్దన్నారు వలస కూలీలకు కష్టాలు లాభదారులకు నష్టాలు మంచి తిండి తినమన్నారు తిండి దొరకక చస్తున్నారు

–  ఎస్. అశ్వని ఆడది అమ్మ వంటిది. కాని ఇప్పుడు ఆమె మీద ఎన్నో అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి. ఎలా అంటే పూర్వం రామాయణంలో రాముడు సీతమ్మను అడవులపాలు చేశాడు కదండి. రామాయణంలో రాముడు దేవునిగా పేరు పొందినా కాని సీతమ్మను మాత్రం అగ్నిప్రవేశం చేయించాడు. అయినా చెప్పుడు మాటలు విని రాముడు అలా చేశాడు. కానీ మన తాత, నాయనమ్మలు మాత్రం అతన్ని ఇప్పటికీ దేవునిగానే కొలుస్తున్నారు. ఇది నిజమేనంటారా? రాముడు నిజంగా దేవుడా? అసలు
Complete Reading

–  అక్షర, ౩వ తరగతి అది నల్లమల అడవి. అక్కడ జంతువులు ఎప్పుడు సంతోషంగా ఉండేవి. అన్ని జంతువులతో పోలిస్తే కుందేలు అందరికన్నా తెలివిగా, ఉపాయంగా ఉండేది. అంతేకాదు భాషలు తెలిసినది. అంటే మనుషుల భాష ఇంకా 24 భాషలు కూడా వచ్చు. ఒకరోజు అది తిరుగుతూ ఉంటే అది కొంతమంది మనుషులు మాట్లాడుతుండగా వినసాగింది.  ఒక మనిషి ఏమని చెప్పాడంటే, ఇక్కడ యురేనియం బాగా ఎక్కువగా ఉంది, ఇక్కడ మనం తవ్వడం మొదలుపెడదాం అని. సరేనని
Complete Reading

– ‘బాలబంధు’ అలపర్తి వెంకట సుబ్బారావు ప్రకృతే చెబుతోంది పాఠాలు మనకు ! సారాంశమును తెలిసి సాగించు బ్రతుకు ॥ సూర్యుడే శ్రమశక్తి సూచించు మనకు ! చంద్రుడే సౌమ్యతకు కేంద్రమ్ము మనకు ॥ సముద్రం ధైర్యాన్ని సమకూర్చు మనకు ! చేరు పై స్థాయికని చెప్పేను నింగి ॥ ఓర్పుగా ఉండమని నేర్వేను నేల ! పరులకై తను తానె బలియగును అగ్ని ॥ పరుల మేలునుకోరి కురిసేను వాన ! విశ్వహిత మాశించి వీచేను
Complete Reading

Create AccountLog In Your Account