– బాలాజీ (కోల్ కతా) సుప్రసిద్ధ హంగేరియన్ దర్శకుడు ఈస్త్వాన్ జాబో 1981లో నిర్మించిన సినిమా ‘మెఫిస్టో’. జాబో పేరు చెప్పగానే గుర్తొచ్చే సినిమా ఇది. సినిమాకు మూలం జర్మన్ రచయిత క్లాస్ మాన్ ఇదే పేరుతో రాసిన నవల. ఈ నవలకు నాటక రూపాలు కూడా చాలా వచ్చాయి. ఫాసిస్టు జర్మనీలో హెండ్రిక్ హాఫ్గెన్ అనే రంగస్థల నటుడి అంచెలంచెల ఎదుగుదలను చెబుతుంది ఈ కథ. నిజజీవిత నటుడు గుస్తఫ్ గ్రుంజెన్స్ జీవితం ఆధారంగా
Complete Reading
దీనికి మొదటినుంచీ చివరివరకూ శ్రుతి పలికే తంబురా రచయిత నరేంద్ర డా. చంద్రారెడ్డి ‘‘నా జీవితంలో ఒక తీరని కోరికో లేక ఒక లోటో వున్నంత వరకూ నేను జీవించి ఉండటానికి ఒక కారణమంటూ ఉంటుంది. ఏ కోరికా లేక పూర్తిగా సంతృప్తి చెందటమంటె అది మరణంతో సమానం’’ అంటాడు బెర్నార్డ్ షా. జీవితంలో అతిప్రధానమైనది జీవితమే. అదే సరిపోతుందా అంటే సరిపోదంటుంది చిత్తూరు కుముదవల్లి నాగలక్ష్మి. ఆమెకు కావాల్సింది తను కోరుకున్న, తనుకావాలనుకున్న జీవితం.
Complete Reading
– శంకరం ‘‘మాది తెనాలే…. మీది తెనాలే…. అహ మాది తెనాలే….’’ ‘‘యేట్రా బామ్మర్దీ వడదెబ్బ తగిలిందేటి అలా ఊగిపోతన్నావ్?’’ ‘‘ఊగిపోడం కాదురా…. ఆనందం…. ఆవేశం…. ఉచ్చాహం….’’ ‘‘దేనికిరో అంతుత్సాహం!’’ ‘‘దేనికేట్రా పిచ్చిమొకమా? ఆంజినేయుడు తిరప్తిలోనే పుట్నాడట….. పై పెచ్చు మన్తెలుగోడట…. ఆనందంగాకింకేట్రా!’’ ‘‘వారినీ! దేవుళ్ళకి కూడా భాష, ప్రాంతం లాంటివన్నీ అంటగడతన్నార్రా…. ఇంతకీ ఆంజినేయుడు తెలుగు మాట్టాడినట్టు మనోల్లకెలా తెలిసిందో?’’ ‘‘వారి మాలోకం, తిరప్తిలో పుట్టినోడు
Complete Reading
– మనస్విని “ఉహువా…. ఉహువా నారాయణ! ఉహువాహువా…. నారాయణ! నారాయణ! ఏమిటబ్బా అన్ని ద్వారాలూ మూసి వున్నాయి? అరెరె వైకుంఠపుర ద్వారానికీ, బ్రహ్మలోక, కైలాసపురాల ద్వారాలకీ నో ఎంట్రీ బోర్డు లున్నాయేమిటి చెప్మా! నిత్యం విందు వినోదాలూ, అప్సరసల నృత్యాలూ, గంధర్వగానాలలో సందడిగా ఉండాల్సిన ఇంద్రసభ నిశ్శబ్దంగా తలుపులు మూసుకొని ఉందేమిటి? ఉహువా.. ఉహువా…. నారాయణ! నారాయణ! ఈ వెధవ దగ్గొకటి. భూలోకయాత్ర పుణ్యమాని పట్టుకొని వదలడంలేదు. తీరా ఇక్కడికొస్తినా….
Complete Reading
– ఓవీవీయస్ దేశ రాజధానిలో అది ఒక పూలతోట. మామూలు తోటకాదు. ఎంతో చక్కనైన తోట. సాక్షాత్తూ దేశాన్నేలే చప్పన్నాంగుళి స్వామివారు విహరించే…., ఇంకా చెప్పాలంటే సమావేశాలు వగైరాలు నిర్వహించే చోటది. ఎటుచూసినా పచ్చికబయళ్ళు. ఎన్నో విశాలమైన చెట్లు. ఎన్నెన్నో రంగురంగుల పూల మొక్కలు. పచ్చికే మెత్తనిదనుకుంటే…, అంతకన్న సుతిమెత్తనైన తివాచీలు యోగాసనాలు వేసేందుకు, అంతేనా…. ఎలా కావలిస్తే అలా వంగి మరీ ఆసనాలు వేసేందుకు మెత్తని పెద్ద బాహుబలి బంతులు. చప్పనాంగుళీ స్వామివారి కనుసైగకే
Complete Reading
– బాలాజీ (కోల్ కతా) ‘‘మీ ఫోన్లో మీకో ప్రచారం కన్పించినపుడు మీ ఫోను మిమ్మల్ని వింటోందని మీలో ఎంతమంది కనిపించింది?’’ – ప్రశ్నిస్తాడు డేవిడ్ కరోల్ తన క్లాసులోని విద్యార్థులతో. అమెరికాలోని పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైనింగ్‌లో డిజిటల్ మీడియా అడ్వర్టైజ్‌మెంట్ల గురించి బోధిస్తుంటాడాయన. డేవిడ్ వేసిన ప్రశ్నకు విద్యార్థులంతా గొల్లున నవ్వుతారు. ఆయన కూడా వారితో కలిసి నవ్వేసి, ‘మన ఫోను మనల్ని కనిపెడుతూ వుండడం ఏమంత నవ్వులాట విషయం కాదు’ అని
Complete Reading
– గౌరీశంకర్ ‘నారాయణా ఏవైందిరా అందరూ అలా గాభరా పడతన్రు?’ ఆదుర్దాగా అడిగాడు గోపాలం. మన కిష్ణగాడు పురుగుల మందు తాగీసేడ్రా! అమ్మమ్మ! అంత కస్టం ఏటొచ్చిందిరా ఆడికి! ‘‘నీకెప్పుడూ సెప్పనేదేటి? ఈడు గాజువాకలో ఒక ఆసామీ దగ్గిర సీటీ కట్టేవోడు. ఆడీ కరోనా అడావిడ్లో జెండా ఎత్తీసి, కరోనా కంటే పెద్ద జబ్బులొచ్చీలా సేసి ఎల్లిపోండట….’’ ‘అయితే…. సచ్చిపోడవేనేట్రా అన్నిటికీ మందు…..?’ ‘కూతురు పెల్లి సెయ్యనీకి అయిదు
Complete Reading
– శంకరం ‘ఇదేం బాగునేదురా సుబ్బారావ్!’ ‘ఏది, కరోనానా? ఎట్టా బాగుంటాదిరా?’ ‘మాట మార్సీకు…. జనాలంతా ఓనల్లేక గగ్గోలెడతావుంటే గెడ్డలోకి ఇంజనెట్టీసి నీ మళ్ళకి నీల్లు తోడీసుకుంతావా? మోతుబరివి కదా!’ ‘ఓరెల్లరా…. అక్కడికి నానొక్కన్నే ఇట్టా సేత్తున్నట్టు ఇడ్డూరంగా సెప్తావేందిరా? అయినా ఈ నీరంతా నానేటి సేసుకుంతాను? నా మళ్ళన్నీ తడిసినాక ఊరోల్లకి ఒగ్గీనా?’ ‘అబ్బా, యేం తెలివిరా నీది, నీ మళ్ళన్నీ తడిసినాక గెడ్డలో నీరు మిగులుద్దా అసలు?
Complete Reading
డా. జి.వి. కృష్ణయ్య ‘వలస భారతం’ దీర్ఘకవితపై సమీక్షాప్రసంగం – డా. ఎ.కె. ప్రభాకర్ డా॥ జి. వి. కృష్ణయ్య ‘వలస భారతం’ దీర్ఘ కవిత చదువుతుంటే నాకు పిల్లలు పాడుకునే రెండు పాటలు గుర్తొచ్చాయి. ఒకటి : ‘రింగా రింగా రోజస్ … … … వి ఆల్ ఫాల్ డౌన్’ రెండు : ‘ఎంతెంత దూరం … కోసెడు కోసెడు దూరం …’ ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ 19
Complete Reading
– కసిరెడ్డి గౌరీశంకర్ ‘‘ఓలమ్మో! ఓర్నాయనో! యెంత పన్జేసిందిరా మాయదారి గొడ్డూ! దీన్నోట్లో మన్ను వడ…. దీని కాళ్ళిరగ…. బంగారవంటి పంటని మింగేసిందిరా తల్లోయ్! ఇప్పుడు నానేంజెయ్యాల? ఎందల పడాల దేవుడోయ్….?’’ ‘‘యేంది రావులమ్మా…. యేందట్టా శోకాలెడతా వుండావ్ యామైందే?’’ ‘‘ఇంకేమవ్వాలి దేవుడోయ్…. యేపుగా ఎదిగొచ్చిన నా ఆవాలు పంటని గొడ్లు మేసీసినాయే తల్లా…. యెవురికి జెప్పుకనే తల్లా…?’’ ‘‘అన్నన్నా యెంత పన్జేసినాయమ్మా దిక్కుమాలిన గొడ్లు! నిన్నటికి నిన్న మంకు చిమ్మాచెలం,
Complete Reading