మాలకుంట

– సింధు           మండలంలో అదో పెద్ద గ్రామపంచాయతి. ఆరువేలకు పైగా జనాభా ఉంటుంది. అందుకే దాన్ని పేట అంటారు. ఊరుకు తూర్పున ఉత్తర దక్షిణంగా మాలవాడ, మాదిగ వాడలున్నాయి. ఈ వాడలు చెరో గ్రామ పంచాయితిలా వుంటాయి. రెండింటి మధ్యన లోతట్టు. మధ్యన కాపుల, తెనుగుల, రెడ్ల, గౌండ్ల వారి పొలాలకు, చేళ్ళకు దారుంది. దారికి ఇరువైపుల ఇరువాడలకు వెట్టిమడ్లు ఉన్నాయి. ఇవి వివిధ వృత్తులు చేసే మాల, మాదిగలకు ఇచ్చిన ఇనామ్‌1 భూములు. ఒక్కొక్క
Complete Reading

– డా. జి.వి. కృష్ణయ్య మనీషా… మన్నించమ్మా… నీ దేహం చితిపై కాలిపోతున్నా మా గుండెల్లో మంటలు చెలరేగుతున్నా తనివితీరా ఏడ్వలేని పిరికితనం కడసారి చూపులకీ నోచుకోలేని కడుబీద దళితబిడ్డా..నీకు కన్నీటి వీడ్కోలు! నీ మానప్రాణాలకు రక్షణలేదు కానీ… నీ చితిమంటలచుట్టూ లాఠీల పహారా రాజ్యంగీచిన లక్ష్మణరేఖకవతల భద్రతావలయంలో దిక్కుమాలిన దీనాలాపన! కామాంధుల కర్కశత్వానికీ ధనమధాందుల రాక్షసత్వానికీ చిత్తకార్తె కుక్కల పైశాచికత్వానికీ మూకుమ్మడి దాష్టీకానికి దేహం చిద్రమై హృదయం బద్దలై నాలుక తెగిన మాటలమౌనం వినిపించని శోకసంద్రమై
Complete Reading

          ‘‘ఆడదై పుట్టటం కంటే అడవిలో మానై పుట్టటం మేలు’’ అన్న సామెత మధ్య యుగాలనాటిది.           ‘‘గత కాలమే మేలు వచ్చు కాలము కంటెన్‌’’ అని నమ్మే భాజపా పాలకుల హయాంలో మహిళల బ్రతుకులు ఎలాంటి ఆటవికతకు బలవుతాయో, ఆగమాగమయి పోతాయో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పాలన మంచి ఉదాహరణ. ఆ రాష్ట్రం హాత్రాస్‌లో వాల్మీకి తెగకు చెందిన 19 ఏళ్ల దళిత యువతిపై అగ్రకులాల యువకులు నలుగురు అత్యాచారం చేయటమే కాక, తమ
Complete Reading

– రాహుల్           ఒకవైపు తీవ్ర ఆర్ధిక సంక్షోభం, మరోవైపు కరోనా కరాళనృత్యం మధ్య ఆగస్టు 5, 2020న అయోధ్యలో రాముడి గుడికి భూమిపూజ జరిగింది.           కాషాయరంగు కండువా, వెండి కిరీటం, పెరిగిన గడ్డంతో భారత ప్రధానమంత్రి ఓ రాజర్షిలా ఈ పవిత్ర మత కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 5 వందల ఏళ్లనాటి మసీదు స్థానంలో ఒక హిందూ దేవాలయానికి పునాది పడింది. అన్ని టి.వి.లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. పత్రికలు పతాక శీర్షికలు పెట్టాయి. 
Complete Reading

– కొత్తపల్లి హరిబాబు           ఎగసే జ్వాల           దహనం చేసేదాకా ఆగదు           మండే గుండెలు           చెండాడుతాయి           రగిలే పోరు           తుది సమరందాకా నిద్రపోదు           నీలో నాలో మరిగే రక్తం           నీలో నాలో చెలరేగే కవితలకు మూలం           అది ప్రజాస్వామ్యాన్ని పునాదుల్తో పెకలిస్తుంది           విప్లవానికి బాటలు వేస్తుంది           సోషలిస్టు సమాజ నిర్మాణానికి దోహదం చేస్తుంది.

         ‘‘భవిష్యత్‌ భారతదేశం తరగతి గదిలో నిర్మాణం అవుతుంది’’           ఈ వాక్యంతో కొఠారీ కమీషన్‌ నివేదిక మొదలవుతుంది.           తరగతి గది ఒక సాంస్కృతిక కేంద్రం           ఉపాధ్యాయుడు సాంస్కృతిక సైనికుడు.           విద్యాబలంతో ఏ లక్ష్యాలు సాధించాలో జాషువా చెబుతారు.           ప్రజల్ని పీల్చి పిప్పిచేసే దురాచారాల్ని విద్యాబలం అణచివేయాలనీ, విద్య మూఢత్వం అనే పులికి ఇంపైన భోజనం కాకూడదనీ మోసపూరిత కోతలకు రక్షాబంధం కాకూడదనీ, మనిషిని మనిషిగా నిలబెట్టలేని చదువులెందుకనీ నిరసించాడు కవి జాషువా.
Complete Reading

ప్రపంచాన్ని మార్చుతామంటున్న శ్లిష్టవర్గపు కపటత్వం ఆనంద్‌ గిరిధర్‌దాస్‌ ఆంగ్లంలో రాసిన ”Winners Take All” పుస్తక పరిచయం పరిచయకర్త : జి.వి. భద్రం                 ప్రపంచమంతటిలోనూ అత్యంత సంపన్నులుగా వున్న పిడికెడుమంది వ్యక్తులు తమ దాతృత్వం ద్వారా ప్రపంచాన్ని మార్చివేసే కృషిని కొనసాగిస్తున్నారు. వివిధ ఫౌండేషన్లను, ట్రస్టులను, ఆలోచనాపరుల – మేధావుల ఆలోచనా సమ్మేళనాలను, వేదికలను ఏర్పాటు చేసి వాటి ద్వారా తాము ప్రపంచాన్ని మార్చివేస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. తాము చేబడుతున్న కార్యకలాపాల ద్వారా ప్రపంచమంతటా మిలియన్ల
Complete Reading

– డాక్టర్‌ భూసురపల్లి వెంకటేశ్వర్లు           నాగరికత పేరుతో ప్రబలుతున్న పరాయీకరణకు దూరంగా కొండల్లో కోనల్లో బతకుతూ, స్వేచ్ఛా వాయువుల్లో పరిభ్రమిస్తూ, స్వచ్ఛ జీవన స్రవంతిలో ఊగితూగే ఆదివాసులు అరచినా, అరచేత్తో చరిచినా కృతకం కాని నాదం కొండలు దద్దరిల్లేలా ప్రతిధ్వనిస్తుంది. వారెన్నడూ లక్ష్య లక్షణాలు తెలిసి ఎలుగెత్తి పాడిన వారుకాదు. తాళ భరతం నేర్చుకొని లయలు మార్చి విన్యాసాలు పలికించడం తెలిసిన వారుకాదు. ఏ ఎండకా గొడుగు పట్టలేని స్వేచ్ఛా జీవులకు లాలనలూ, లావణ్యాలూ ఏం
Complete Reading

– పల్లిపట్టు ప్రదర్శించడం బాగానే వుంటాదిఅన్నీ అంగట్లో సరుకైన కాలంలోఅన్నిటికీ అమ్ముడుపోవడం అలవాటైన రోజుల్లోదేన్నైనా పేరుపెట్టిపిలిచిపెద్దపెద్ద మాటల్లో పొగిడి ప్రదర్శించడం గొప్పగానే వుంటాది రంగురంగుల బొమ్మలాటనోరకరకాలబురిడీల గారడీ మాటనోనలుగురు మెచ్చుకునేలానాలుగు రూకలు మూటకట్టుకునేలానాటకాన్ని ప్రదర్శించడం నాటకీయంగానే వుంటాది లోపాలు కనిపించకుండాదీపాల వెలుగులో నటించే ముఖాలమైనవ్వో ఏడుపో పులుముకునిదీపంచుట్టూ పేడబురగలా తిరిగే వీరభక్తినోఏ దేముడేమీ చేయలేని రోగభయాన్నోవొంటినిండా కప్పుకునిఇళ్లముందు ప్రదర్శించడం బలేగానే వుంటాది చూరుకిందోవసారాలోలోజిగేల్మంటూ కులికే వరండాలోనోఅద్దాలుపొదిగిన అంతస్తుల భవంతుల బాల్కనీల్లోనోఎదో ఒకటి ప్రదర్శించడం బ్రహ్మాండంగానే వుంటాది ఇల్లూ
Complete Reading

– నౌగాపు           అతను పరిగెడుతూ ఉన్నాడు….           ఊపిరి ఆడడం లేదు, శ్వాస అందడం లేదు, శరీరం సచ్చు బడింది, ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదు, ఎంతవరకు పరిగెట్టాలో తెలియటం లేదు….           గతంలో ఎంతగానో పరిగెట్టాడు. ఆ అనుభూతి వేరు.           చిన్నప్పుడు ఆటలాడుతూ పరిగెట్టాడు, సంతోషం పొందాడు. ఆ పరుగులో కాలు జారి పడ్డాక బోవురు మన్నాడు.           బస్సు అందుకోవటం కోసం పరిగెత్తాడు, అందుకున్నాక తృప్తి పొందాడు, అందనప్పుడు బాధపడ్డాడు.
Complete Reading

Create Account



Log In Your Account