సాహిత్య పత్రికలు ప్రారంభ సంపాదకీయాలు

సాహిత్య పత్రికలు ప్రారంభ సంపాదకీయాలు

ఉదయం
(197577) ఇది అత్యవసర పరిస్థితి కాంలో జైులో వున్న రచయితు కె.వి.ఆర్‌. సంపాదకత్వాన రూపొందించిన లిఖిత పత్రిక. దీనిని వి.ర.సం. జనవరి 2003లో 1/8 డెమ్మీలో 28 పుట పుస్తకంగా ప్రచురించింది. ఈ లిఖిత పత్రికలో సంపాదకీయాన్ని ‘ఉదయాన్ని ఆహ్వానిద్దాం’ అనే శీర్షికతో చెరబండరాజు రాశారు. కె.వి.ఆర్‌. ‘ప్రాణాగ్ని’ అనే కవితను ‘రమ’ పేరుతో రాశారు. జజ రాసిన కవిత ‘ఒక తారక రాలినంతలో....’ (మావో మరణంపై), రాహీ రాసిన ‘విప్లవ వారసు’ కవిత, ‘ఒక పువ్వుకోసం’ కవిత, కన్న రాసిన ‘ఓరయో! నారయో’ పాట, శోభనాద్రి రాసిన ‘రేపటిని గురించి అందరికీ చెప్పాలి’ కవితతో పాటు శ్యామకృష్ణ రాసిన ‘వీడని బాట’ కథ, క.వి (కె.వి.ఆర్‌) రాసిన వ్యాసం ‘వైశ్వనాథ సాత్యననారాయణీయం’ వున్నాయి. ఉదయాన్ని ఆహ్వానిద్దాం అన్ని రంగాల్లో వలెనే సాహిత్య సాంస్కృతికరంగాల్లో కూడా పిరికితనం, కపటం, ముఖప్రీతి రాజ్యమేుతున్నాయి. నిప్పుకు జాజ్వ్యంగా వెలిగేదశ, బూడిదలో దాగి వుండే దశ ఉండొచ్చుకాని, కాలేనైజంలో మాత్రం మార్పు ఉండదు. రవిచూడని సత్యాు చూస్తాడనుకునే కవి, చూసినవి చెప్పలేని నిర్బంధ పరిస్థితిలో ఉన్నపుడు, లోలోప దహించుకుపోవడం అర్థం చేసుకోగం, గాని ‘‘ఇరవై పువ్వు అరవై కాయు’’ అవుతాయనే అశాస్త్రీయమైన ఇచ్చకాకి దిగడాన్ని అసహ్యించుకోక తప్పదు. అవసరమైనప్పుడు తప్ప అన్ని వేళలా ప్రజపక్షం వహించిన ఆంద్రేమాల్రోను ఆకాశానికెత్తే కంపనికి తాకట్టుపడ్డాం మనం! బాబాను విమర్శించడానికి, వివేకానందుణ్ని, గాంధీని, చివరకు జగద్గురువు శంకరాచార్యును ఆశ్రయించే ‘ఆధ్యాత్మిక హేతువాదానికి ఎదిగాం మనం! చనిపోయినవాడి వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూనే ‘అభివృద్ధి నిరోధక’ భావాను ఖండిస్తూ, ప్రాచీన సాహిత్యాన్ని కంఠస్థం చేయమని పాఠకు నోటికి మరోచేత అందిస్తున్న సాహిత్య ద్వంద్వనీతికి అవాటుపడ్డాం మనం! వ్యాపారమూ, సాహిత్య వ్యాపారమూ రెంటికీ నీతి లేకుండా నిండా మునిగాం మనం! ఇవ్వాళకాదు మన ఈ నీతి మన సంప్రదాయంలో, మన ప్రాచీన సాహిత్యంలో భద్రపరచి ఈనాటికందిస్తున్నారు. అందుకే వేదాు, ఉపనిషత్తు, పురాణాు మొదుకొని ఆర్యభట్ట ప్రయోగందాకా ‘సైంటిఫిక్‌ టెంపర్‌’ అనుశ్రుతంగా వస్తున్నదని అశాస్త్రీయ సత్యాన్ని పబ్లిగ్గా చెప్పగుగుతున్నది ఇందిరాగాంధి.
మనకు మాటకు తడువులాట లేదు. దాసోహాకు నీళ్ళు నముడు లేదు. సెక్యురిజం శిలాక్షరాల్లో చెక్కుతూనే విశ్వవిద్యాయాల్లో విశ్వనాథకు పీఠాు స్థాపించగం. సామ్యవాదం ప్రచారం చేయడానికి బిర్లాను అనధికార సౌహార్ధ్ర ప్రతినిధిగా పంపించగం. హరిజన సభు ఆస్థానకవి స్థానాు వీటిలో వైరుధ్యం ఏమిటో మనకు కనిపించదు. సోషల్‌ సామ్రాజ్యవాదుకు, రివిజనిస్టుకు రామాయణ, శాకుంతలాల్లో భారత ‘‘ప్రజ’’ జీవితమూ, సంస్కృతీ కనిపించినపుడు, ‘రామాయణ క్పవృక్షాన్ని’ తప్పు పట్టడం అరసానికి అవకాశవాదమే అవుతోంది. సాఫిస్టికేటెడ్‌ ఆధ్యాత్మికవాదం, జాతీయభావం పేరుతో జాతీయ అహంకారం, హేతువాద, నాస్తికవాదా పేరుతో విప్లవ వ్యతిరేకత, అభ్యుదయం పేరుతో సోషల్‌ సామ్రాజ్యవాద దాసం అన్నీ కలిసి అద్భుతంగా సహజీవనం చేస్తున్న ఆత్యయిక పరిస్థితిలో ఉన్నాం ‘మనం’.
మనలోని ఈ ‘మనం’ ఇవ్వాళ మౌనంగా ఉన్నాం. చేదు అనుభవాను మననం చేసుకుంటున్నాం. గాయాను కన్నీటితో కడుగుతూ, కన్నీళ్ళలో ప్రతిఫలిస్తున్న రేపటి సూర్యకిరణాను ఆహ్వానిస్తున్నాం. ఉదయం ఇవ్వాళ హృదయంలో ఉంది. ప్రజ ఆకాంక్షల్లో ఉంది. పోరాటాల్లో ఉంది. ఇవ్వాళ ప్రతి గుడిసె గుండెల్లో అుముకున్న అయోమయ అంధకారంలో రేపటి ఉదయం తొంగి చూస్తున్నది. పుడమితల్లి పురిటినొప్పు చప్పుడు ఇవ్వాళ భయంకరంగానూ, బాధాకరంగానూ వినవస్తున్నది. ఇది సమీప ప్రసవానికి సంకేతం. బాధతో మెలికు తిరిగిపోతున్న తల్లిని ఆపరేషన్‌ చేయడానికి అదును ఇది.
అతి జాగ్రత్తగా, సాహసంగా, ఆ ఉదయాన్ని ఆహ్వానిద్దాం.

admin

Related Posts

leave a comment

Create AccountLog In Your Account