అశాస్త్రీయ భావాకు టెక్నాలజీ ముసుగు రోబో 2.O!

అశాస్త్రీయ భావాకు టెక్నాలజీ ముసుగు రోబో 2.O!

— మనస్విని —

సెల్‌ఫోన్‌ నేడు అత్యవసర వస్తువు. ప్రొద్దున్న లేచిన దగ్గరి నుండీ రాత్రి నిద్రపోయేవరకూ సెల్‌ఫోన్‌ లేకుంటే రోజు గడవని పరిస్థితి. రోజుకో సెల్ఫీ అయినా సోషల్‌మీడియాలో అప్‌లోడ్‌ చేయని యువత, క్రికెట్‌ మ్యాచ్‌నూ, టీ.వీ. సీరియళ్ళనూ మిస్సవకుండా ‘‘హాట్‌ స్టార్‌’’ లాంటి యాప్‌లో చూసే ఉద్యోగుూ, హోంవర్కును సైతం ఇంటర్నెట్‌లోనే అవ్వగొట్టేసే విద్యార్థుూ ఈ రోజు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. న్యూస్‌పేపరు నుండీ ఆఫీసు వర్కు వరకూ అన్నిటినీ స్మార్ట్‌ఫోన్‌లోనే చేసుకోవడం టెక్నాజీ అభివృద్ధి చేసిన అద్భుతమే. అయితే సెల్‌ఫోన్‌ లేకుంటే జీవితమే లేదు అనేంత తీవ్రమయిన పరిస్థితును కొన్ని సంఘటను తెలియజేస్తున్నాయి. ఉదాహరణకు డిగ్రీ చదువుతున్న యువతి తన ఫోన్‌ పోయిందని ఆత్మహత్య చేసుకున్న సంఘటన, ఫోన్‌ కొనియ్యలేదని ఆత్మహత్య చేసుకున్న బాుడి సంఘటన, సెల్‌ఫోన్‌ కోసం దెబ్బలాడుకుని ఉరి వేసుకున్న అక్కచెల్లెళ్ళు వంటి ఘటను ఈ సెల్‌ఫోన్‌ సంస్కృతి వికృత రూపాన్ని తెలియజేస్తూనే వున్నాయి. అయినప్పటికీ సెల్‌ఫోన్‌ మనిషికి బహిర్గత అవయవంగా తయారౌతూనే ఉంది. మానవ సంబంధానూ, వ్యక్తు కనీస నైతిక మివల్ని మర్చిపోయేలా చేస్తూ, ‘‘ఎవరికి వారే యమునా తీరే’’ అన్న చందాన సంఘజీవి అయిన మనిషిని ఒక్కొక్కరిగా ఒంటరిగా విడగొట్టేస్తున్న ఈ సెల్‌ఫోన్‌ వాడకంతో ఎన్ని వుపయోగాున్నా అంతకు మించిన స్థాయిలో ప్రమాదాు కూడా ఉన్నాయని అందరికీ అర్థం అవుతూనే ఉన్నప్పటికీ అవసరాు మనల్ని సెల్‌ఫోన్‌ వైపుకు నెడుతున్నాయి. అయితే మన సెల్‌ఫోన్‌ వినియోగం వన మనకు మాత్రమే కాదు మన చుట్టూ వున్న జీవజాలానికీ కూడా హాని జరుగుతుందన్న విషయాన్ని గురించి చర్చిస్తూ ఇటీవ రోబో ‘‘2.ఓ’’ విడుదలైంది. గతంలో వచ్చిన ‘‘రోబో’’ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమా హాలీవుడ్‌ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో ముస్తాబయ్యి మనకేం చెప్పదచుకున్నదో ఒకసారి పరిశీలిద్దాం….
సినిమాలో మొదట ఒక వ్యక్తి సెల్‌టవర్‌కు ఉరివేసుకుని చనిపోవడాన్ని చూపిస్తారు. తర్వాత డా॥ వశీకర్‌ (రజనీకాంత్‌) తన 2వ ఆండ్రో హ్యూమనాయిడ్‌ రోబో వెన్నె (అమీజాక్సన్‌)ను పరిచయం చేయడంతో సినిమా ప్రారంభం అవుతుంది. చెన్నై నగరంలోని ఫోన్లన్నీ హఠాత్తుగా పిచ్చుకల్లా ఎగిరిపోతుంటాయి. ఇది తీవ్రవాదు పనా? విదేశీయు పనా? ఏలియన్ల పనా? అని ఆలోచించేలోపే ఎగిరిపోయిన ఫోన్లన్నీ కలిసి ప్రముఖ సెల్‌ఫోన్‌ షోరూమ్‌ ఓనర్‌ని హత్య చేస్తాయి. దాంతో డా॥ వశీకర్‌ రంగంలోకి దిగి ఇదేదో మానవాతీత శక్తి అని గుర్తించేలోపే ఫోన్లన్నీ పక్షిగా మారి నగరంలోని సెల్‌టవర్లని నాశనం చేస్తుంటాయి. మిటరీని తీసుకుని వచ్చినా ఫలితం ఉండదు. అదే ఊపులో నెట్‌వర్క్‌ కంపెనీ యజమానినీ, టెలికాం మినిష్టరునూ కూడా హత్య చేస్తాయి. తప్పనిసరి పరిస్థితుల్లో అంతకు ముందు సినిమాలోనే డిస్మాటిల్‌ చేసిన రోబో చిట్టిని తిరిగి రప్పిస్తారు. చిట్టి సహాయంతో సెల్‌ఫోన్లన్నిటి చేతా ఈ పను చేయిస్తున్నదీ, సెల్‌ఫోన్లు ఎగిరిపోవడానికి కారణమూ, చనిపోయిన పక్షిరాజా (అక్షయ్‌కుమార్‌) మరియు సెల్‌టవర్‌ రేడియేషన్‌ వన చనిపోయిన పక్షున్నిటి ‘‘ఆరా’’(తేజస్సు)గా గుర్తిస్తారు. ఈ ఆరా నెగెటివ్‌ మైక్రో ఫోటాన్లను విడుద చేస్తుందని సినిమాలో తెలియ జేయడం జరిగింది. కాబట్టి ఈ నెగెటివ్‌ శక్తిని న్యూట్రలైజ్‌ (అంటే పాజిటివ్‌ మైక్రోఫోటాన్లను విడుద చేయడం ద్వారా సమత్యుం చేయడం) చేస్తారు. అయితే చిట్టి తిరిగి రావడం ఇష్టంలేని ఫో॥ బోరా (ముందు సినిమాలో విన్‌) కొడుకు సమత్యుం చేసి భద్రపరిచిన ఆ శక్తిని తిరిగి విడుద చేస్తాడు. ఈసారి ఆ శక్తి డా॥ వశీకర్‌ శరీరంలో దూరి విజృంభిస్తుంది. దాన్ని అంతం చేయడానికి చిట్టి 2.0గా అప్‌గ్రేడ్‌ అయ్యి వెన్నె సహాయంతో దాన్ని అంతం చేస్తాడు. స్థూంగా ఇదీ సినిమా కథ.
ఇంతకీ ఈ సినిమా చెప్పదచుకున్నదేమిటి? అని ఆలోచిస్తే బోలెడు ప్రశ్ను తలెత్తుతున్నాయి. ఈ సినిమాలో విన్‌ అయిన పక్షిరాజు మనుషు సెల్‌ఫోన్‌ని వాడడం వన, నెట్‌వర్క్‌ ఫ్రీక్వెన్స్‌కి తమ లాభా కోసం ఇష్టానుసారంగా పెంచేయడం వన, ఆ రేడియేషన్‌కు గురయ్యి పక్షున్నీ చనిపోతున్నాయంటారు. సెల్‌ఫోన్‌ వాడడం అనేది టెక్నాజీ అభివృద్ధికి చిహ్నం అయితే కావొచ్చు. ఆ టెక్నాజీని మనం ఎందుకు ఉపయోగిస్తున్నాం? సగటు మానవు అభివృద్ధి కోసమా? లేక బడా ఎంఎన్‌సిు తమ జేఋ నింపుకోవడానికా? మనకన్నా పెద్ద దేశం అయిన చైనాలో కేవం 3, 4 నెట్‌వర్క్‌లేనంటాడు పక్షిరాజు. మరి మనకో? పదు సంఖ్యలో నెట్‌వర్క్‌ు! మన భూమినీ, మన గాలినీ వేరెవరి సూట్‌కేసులో నింపడం కోసం నాశనం చేయడం నిజం! ఆ నిజాన్ని ప్రశ్నించే పక్షిరాజు లాంటివారిని ఏమీ చేయలేని నిస్సహాయుగా ఈ సినిమాలో చూపారు. అదే పక్షిరాజు చనిపోయి ‘‘ఆరా’’గా మారిపోయాక చాలా శక్తివంతునిగా చూపారు. ఇది దేనికి సంకేతం? మనపై జరుగుతున్న దోపిడీకి మనుషుగా ఉంటూ ఏం చేయలేం అనా? లేక దుష్టశక్తుద్వారానో, కంటికి కన్ను, పంటికి పన్ను వంటి సిద్ధాంతా ద్వారానో మాత్రమే పరిష్కారం సాధ్యం అవుతుందనా? ఇది ప్రజల్లో తప్పుడు మార్గాు తొక్కడానికీ, నైరాశ్యతకూ దారితీయదా?
అలాగే సినిమా చివర్లో డా॥ వశీకర్‌ ‘‘టెక్నాజీ మనల్ని కాపాడిరది కానీ మనం దాన్ని దుర్వినియోగం చేస్తున్నాం’’ అంటారు. మనమంటే ఎవరు? తమ స్వార్ధం కోసం ప్రకృతి ఇచ్చినదాన్ని, అందరికీ చెందాల్సినదాన్ని అనుభవిస్తున్న కొందరు, ఈ ప్రభావానికి గురవుతూ, తమను తామే నష్టపోతున్నవారు ఎందరోగా ఈ ప్రపంచం విభజించబడి ఉంది. ఇందులో ఎవరు టెక్నాజీని దుర్వినియోగం చేస్తున్నారు? భూమిపై కాుష్యం పెరిగిపోవడానికైనా, జీవరాశు అంతరించి పోవడానికైనా, సహజవనయి తరిగిపోవడానికైనా, ‘‘మనదీ ఒక బ్రతుకేనా? కుక్క వలె, నక్క వలె సందులో పందువలె’’ అని శ్రీశ్రీ అన్నట్టు కనీస అవసరాు కూడా తీరని దయనీయ పరిస్థితుల్లో మనుషు బ్రతకడానికైనా కారణం కొందరే. ఆ కొందరూ ఎవరన్నది మనం సరిగ్గా అర్ధం చేసుకోవాలి. కానీ ఈ విషయాన్ని పక్కదారి పట్టిస్తూ పక్షి ఆవేశాన్ని అమాయక ప్రజపైకి మళ్ళించారు.
ఇక సినిమాలో ‘‘ఆరా’’ విషయాన్ని పరిశీలిస్తే…. బ్రతికున్న జీవు పాజిటివ్‌ మైక్రోఫొటాన్స్‌కి విడుద చేస్తే చనిపోయిన జీవు కళేబరా నుండి నెగెటివ్‌ మైక్రో ఫొటాన్స్‌ని విడుద చేస్తాయట. ఈ విషయాన్ని భౌతికవాద దేశం అయిన రష్యా శాస్త్రవేత్త ధృవీకరించారట. (దీన్ని అదేదో ప్రత్యేక కెమెరాతో ఫోటో కూడా తీయచ్చట) ఇది మానవు చుట్టూ వారివారి వ్యక్తిత్వాను బట్టీ ఆవరించి ఉంటుందట. (స్వామీజీలైతే మీటర్లు మామూు మానవులైతే సెంటీమీటర్లు) ఇక ఈ ‘‘ఆరా’’ను పాత విఠలాచార్య సినిమాల్లో మాదిరి మాంత్రికుడు దయ్యాన్ని గాజు సీసాలో బంధించినట్లు బ్యాటరీలో బంధించడం జరిగింది. అంటే దయ్యాన్నే సైంటిఫిక్‌గా ‘‘ఆరా’’ అని నిరూపించే ప్రయత్నం చేశారా?!…. సైన్సుకి పరాకాష్ఠ అయినటువంటి ఆండ్రో హ్యూమనాయిడ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ గ రోబో చేత ‘‘దేవుడు ` దయ్యం’’ అనే మాటు మాట్లాడిస్తున్నారు. నిరూపణకు నిబడేది సైన్సు. కానీ ఏ నిరూపణకూ నిబడని పైగా ప్రశ్నిస్తే కళ్ళుపోతాయని బెదిరించే దేవుళ్ళనీ, దయ్యానీ సెంటిమెంట్‌ రోబో చేత సైంటిఫిక్‌గా నిరూపించే ప్రయత్నం చేస్తున్నారా? ఈ అన్‌సైంటిఫిక్‌ శాస్త్రవేత్తంతా?!.. ప్రతి రాకెట్‌ ప్రయోగం ముందూ కొబ్బరికాయు కొట్టి దేవునిపై భారం పడేసే ఇటువంటి శాస్త్రవేత్తున్నంతకాం కాదు…. కాదు….. అటువంటి శాస్త్రవేత్తల్ని తయారుచేస్తున్న అశాస్త్రీయ విద్యావిధానం ఉన్నంతకాం హైటెక్‌ మాంత్రికులే శాస్త్రవేత్తుగా చెలామణీ అయ్యే పరిస్థితి ఉంటుంది. దయ్యాల్నీ భూతాన్నీ సైంటిఫిక్‌గా నిరూపించే ప్రయత్నం చేసే ఈ దర్శకుూ, నటుూ, మనకు విమానాు వద్దు పుష్పక విమానం చాు, ప్లాస్టిక్‌ సర్జరీు అక్కర్లేదు ఏనుగుతనే అతికించగం అని ఉపన్యాసాు దంచే పాకుూ నిజంగానే ఈ దయ్యాల్నీ భూతాల్నీ ఇపుడు కొత్తగా వచ్చిన ‘‘ఆరా’’ల్నీ నమ్మితే మరి భూమిని నమ్ముకుని బ్రతికే బ్రతుకుదెరువు లేక క్షలాదిగా ఆత్మహత్యు చేసుకొని చనిపోయారే? వారి ‘‘ఆరా’’న్నీ ఒక్కటయ్యి తమనేం చేస్తాయో అని భయపడరేం? అశాస్త్రీయతను ప్రతి పేజీలోనూ రంగరించి భట్టీయం గొట్టించే చదువు ఒత్తిడి తట్టుకోలేక వేలాదిమంది విద్యార్థు చనిపోయారే? మరి వారి ‘‘ఆరా’’న్నీ ఏకమయ్యి తమనేం చేస్తాయో అని భయపడరేం? ప్రతీ 20 నిమిషాకొక ఆడప్లి అత్యాచారాకూ, హత్యకూ గురవుతోంది! రక్షించాల్సినవారే అన్యాయానికొడిగడుతుంటే ఆత్మహత్యే శరణ్యం అని బలైపోతున్న ఆడప్లి ‘‘ఆరా’’న్నీ ఒక్కటయ్యి ఏం చేస్తాయో అని ఒక్కడూ భయపడరేం? ఏదో ఒక అన్యాయానికీ, దోపిడీకి గురయి చనిపోయినవారందరి ఆరా గురించి ఎందుకని భయపడడం లేదు? ఈ ప్రశ్నకేమిటి సమాధానం?….
మొత్తానికి ఇది ‘‘సూపర్‌మ్యాన్‌’’, ‘‘అవెంజర్స్‌’’ లాంటి చిన్నప్లి సినిమానా? సైన్స్‌ఫిక్షన్‌ సినిమానా? చిన్నప్లి సినిమా అయితే ఆరాను బ్యాటరీలో బంధించడంతోనే ముగిసిపోవాలి. సైన్స్‌ ఫిక్షన్‌ అయ్యింటే…. అసు ఆరా అన్న విషయాన్నే సైన్సు ఒప్పుకోదు. ఇంక దాన్ని సైన్స్‌ఫిక్షన్‌ అని ఎలా అంటాం? అయినప్పటికీ సినిమాను మరింతగా సాగదీసి ఏం చెప్పానుకున్నారు? ‘‘మనుషుకంటె పక్షు ఎక్కువగా ఉంటాయి. పక్షుకంటె పురుగు ఎక్కువగా ఉంటాయి. పక్షు పురుగుల్ని తినాలి. తద్వారా పంటల్ని పురుగులే తినేయకుండా మనుషు తినగుగుతారు. కాబట్టి మనుషు బ్రతకాంటే పురుగు కూడా బ్రతకాలి’’ అంటాడు పక్షిరాజా! ఇదంతా ప్రకృతిలో సహజంగా ఉన్న జీవావరణ వ్యవస్థ. మరి ఇష్టానుసారంగా ఫ్రీక్వెన్సీని పెంచుతూ పక్షుకు తద్వారా మనుషుకు హాని తపెట్టడం అనేది అన్యాయమే కదా?!…. ప్రకృతిసహజమైనదాన్ని ధ్వంసం చేయడం అన్యాయమే కదా? అటువంటి విధానాల్ని వ్యతిరేకిస్తున్న ‘‘పక్షిరాజు’’ లాంటివారిని దుష్టశక్తిగా చూపడమేంటి. అంటే ఇది ఖచ్చితంగా సూడోసైన్సును వెదజ్లుతూ ప్రజల్ని పక్కదారి పట్టించే పక్కా కమర్షియల్‌ సినిమా తప్ప మరేమీ కాదు. అని అర్ధం అవుతుంది.
ఇటువంటి తకిందు మివల్ని ప్రతిపాదించే సినిమాల్నీ, సమస్య మూలాల్ని ఏమాత్రం పట్టించుకోకుండా పైపూత పరిష్కారాన్నిచ్చే ఇటువంటి సినిమాల్ని, వందకోట్ల రూపాయను ఖర్చుచేసి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అంతటినీ ప్రతీ ఫ్రేములోనూ గుప్పించి, గుప్పించి ఎందుకు తీస్తున్నారు? ఈ సినిమా నిర్మాణ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్‌ గతంలో వచ్చిన ‘‘స్పైడర్‌’’, తమిళ ‘‘కత్తి’’ దాని రీమేక్‌ అయిన తొగు ‘‘ఖైదీ నెంబర్‌ 150’’కు డిస్టిబ్యూటర్‌గా వ్యవహరించింది. అంటే పనిగట్టుకునే ఇటువంటి అశాస్త్రీయ భావాల్నీ, తప్పుడు పరిష్కారాల్నీ ప్రతిపాదించే సినిమాల్ని ఒక ‘‘మాల్‌వేర్‌’’లాగానో, లేదంటే ఒక ‘‘వైరస్‌’’లాగానో ప్రజ మెదళ్ళలోకి తెలియకుండానే ఇన్‌స్టాల్‌ చేస్తున్నారు. మన మెదడు సిస్టమ్‌ని హ్యాక్‌ చేస్తున్నారు.
కాబట్టి ఈ విషయాని అర్ధం చేసుకుంటూ శీర్షాసనమేసి ప్రపంచాన్ని తకిందుగా చూపే అశాస్త్రీయ సినిమాు కాకుండా, వాస్తవాల్ని ప్రజకు అర్ధం చేయించే సినిమాు రావాని కోరుకుందాం.

admin

leave a comment

Create AccountLog In Your Account