— డా. వెల్డండి శ్రీధర్ —
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా దేశాు, సోవియట్ యూనియన్, అమెరికాలాంటి దేశాు బాసాహిత్యాన్ని ప్రోత్సహించడానికి ప్రత్యేక శ్రద్ధ కనబరిచాయి. అత్యంత అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని బాసాహిత్యాభివృద్ధికి చాలా సమర్ధవంతంగా ఉపయోగించడం మనం చూస్తూనే ఉన్నాం. మనదేశంలో మాత్రం దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపడం పెద్దగా కనిపించదు. ఒకింత మక్కువ పెంచుకొని, కాస్త అధ్యయనం చేస్తే పెద్ద కథు, సీరియస్ కథు రాయవచ్చేమో కాని ప్లి కథు రాయడం మాత్రం చాలా కష్టం. అందుకే పెద్ద సాహిత్యంతో పోల్చినపుడు బాసాహిత్యం రాశిలో చాలా తక్కువగా మెవడుతుంది. ప్లి కథు రాయడమంటే ‘చందమామ’ను నేమీదికి దించడం. మనల్ని పగడపు దీవు వెంట తిప్పుకురావడం. నిజానికి పసి హృదయాను చేరుకోవాంటే బాకథా సాహిత్యం ద్వారానే సాధ్యమవుతుందనేది అనుభవం మీద తేలిన విషయం. ప్లి కథల్ని నీతి ప్రధానంగా, అద్భుతరసాన్ని మేళవించి కాఠిన్యత లేకుండా సరళంగా రాయాలి. ఆంకారికు పేర్కొన్న నవరసాల్లో కేవం అద్భుత, వీర, హాస్య, శాంత, కరుణ రసాను మాత్రమే బాకథా సాహిత్యానికి వాడగం. మిగిలిన రసాు బాల కథను చెప్పడానికి అంతగా నప్పే రసాు కావు. కథావస్తువేదైనా కాసింత నీతి ఉండాలి. కథ చదివిన ప్లి మనస్సులో ఏదో రసాయనిక మార్పు స్పష్టంగా కనబడకపోతే ఆ కథ కేవం కాక్షేపపు కథగానే మిగిలిపోతుంది. పంచతంత్రం కథు, బేతాళ కథలోని నిర్మాణ శాస్త్రీయతను గమనిస్తే శతాబ్దా క్రితమే బాకథా సాహిత్యం ఎదిగిన ఎత్తుకు అబ్బురపడతాం. ఈ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని స్వాతంత్య్రానంతర కాంలో నాగిరెడ్డి, చక్రపాణి, కొడవటిగంటి కుటుంబరావు తదితయి ఎంతో ప్రామాణికతతో చందమామ కథను మెవరించారు. అయితే అనంతర కాంలో ‘చందమామ’, ‘బొమ్మర్లిు’ లాంటి పత్రికు అదృశ్యం కావడంతో తొంభై తరువాతి తరాు ఈ బాల కథు చదవకుండానే పెరిగి పెద్దైపోయారు. ఈ కథ స్థానే స్పైడర్‌మ్యాన్, బ్యాట్‌మ్యాన్, ఎక్స్‌మ్యాన్, ఛోటా భీం, హనుమాన్, హ్యారి పోర్టర్ లాంటివి ప్లి ఆదరణను పొందడం గమనార్హం. ఇదిలా ఉండగా ఇటీవ వాసా నర్సయ్య, దాసరి వెంకటరమణ, పైడిమర్రి, రెడ్డి రాఘవయ్య, కీ.శే. పెండెం జగదీశ్వర్, డా॥ ఎం. హరికిషన్, డా॥ పత్తిపాక మోహన్‌లాంటివారు విరివిగా బాసాహిత్యాన్ని సృజిస్తున్నారు. వీరితోపాటు రెండు తొగు రాష్ట్రాలోని ఆయా పాఠశాల నుంచి కూడా బాసాహిత్య సంపుటాు అనేకం రావడం ముదావహం.
‘చందమామ’ పత్రిక క్షీణదశకు చేరిన కాంలో దాసరి సుబ్రహ్మణ్యం, గంగిశెట్టి శివకుమార్‌తోపాటు అద్భుతమైన రచనానైపుణ్యంతో సుమారు ఐదు వంద బాల కథు రాసి ప్లి మనసులో తనదైన ముద్రవేసిన విశిష్ట బాసాహితీవేత్త డా॥ టి.జి.ఆర్. ప్రసాద్. కేంద్ర సాహిత్య అకాడమీ లాంటి సాహిత్య సంస్థు బాసాహిత్యానికి గత కొంతకాంగా ప్రత్యేకంగా అవార్డును ఇస్తున్నాయి. కాని అంతకు ముందు బాల సాహిత్యాన్ని సృజించేవారికి సాహిత్య ప్రపంచంలో పెద్దగా గుర్తింపు ఉండేది కాదు. విమర్శకు కూడా బాసాహిత్యాన్ని అంతగా పట్టించుకోలేదు. వాస్తవంగా సమాజాభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడేది ప్లి సాహిత్యమే. సమాజం ఎంతగా కుళ్ళిపోయిందో పోస్ట్‌మార్టం చేసి చూపించేది పెద్ద సాహిత్యమైతే, మెరుగైన సమాజాన్ని తయారుచేయడానికి రేపటి పౌరును తీర్చిదిద్దేది బాసాహిత్యం. డా॥ టి.జి.ఆర్. ప్రసాద్ రాసిన ఈ అయిదు వంద కథు చదివితే ఆయనకు గ తొగు, ఆంగ్ల, సంస్కృత సాహిత్యంతో ఉన్న పరిచయం, జిజ్ఞాస, పరిశీనాశక్తి, కథకు అనువైన విషయం స్ఫురించిన చోట దాన్ని కథగా మలిచే కళా నైపుణ్యం, సమాజాభివృద్ధిపట్ల గ తపన బోధపడతాయి. ఇంతటి ప్రతిభా, వ్యుత్పత్తు కలిగిన రచయిత పెద్ద కథు / సీరియస్ కథు ఎందుకు రాయలేదని ఆశ్చర్యం కుగుతుంది. వృక్షాను వంచే కంటే మొక్కను వంచడమే తేలికనుకున్నారేమో. బాల కథా ప్రక్రియను ఎన్నుకొని మైురాళ్ళలాంటి కథల్ని రాసి మెరుగైన సమాజాన్ని కగన్నారనిపిస్తుంది. వాస్తవానికి ఐదువంద బాల కథు రాయడం మాట అటుంచి వాటికి పేర్లు పెట్టడమే పెద్ద సవాు. ఎందుకంటే మొదట పాఠకుడిని కథలోకి ఆహ్వానించే / ఆకర్షించే వాటిలో పేరే ప్రధానమైనది. కొన్నిసార్లు కథకు తగ్గ పేరు తట్టదు. మరికొన్నిసార్లు పేరుకు తగ్గ కథ రాయలేం. అలాంటిది ఇన్ని కథల్లో వస్తు వైవిధ్యం, శ్పి వైవిధ్యం, పాత్ర చిత్రణ, సన్నివేశ క్పన, సంఘర్షణ, ఏ కథకి ఆ కథను కొత్తదనంతో రాయడం ఇంకా ఎంతో కష్టమైన పని. అంతేగాక పెద్ద కథల్లా ఏవో కొన్ని సమస్యల్ని ఏకరువు పెట్టి వదిలేస్తే సరిపోదు. ప్రతి కథ మార్గదర్శకంగా ఉండాలి. ఆ కథ చదివిన తరువాత ప్లిు అందులో నుండి ఏదో కొంత నీతిని గ్రహించాలి. వీటితోపాటు సరళమైన భాషను వాడాలి. ఇన్ని పరిమితుకు లోబడి శ్పిం చెడకుండా, కథ నీతిని డామినేట్ చేయకుండా, నీతి, కథను డామినేట్ చేయకుండా బాలెన్స్‌గా చెప్పాలి. ఇంత నిబద్ధతతో, అత్యంత శ్రమకోర్చి వంద కథు రాసిన డా॥ టి.జి.ఆర్. ప్రసాద్‌కు రావాల్సినంత గుర్తింపు రాలేదననేది వాస్తవం.
డా॥ టి.జి.ఆర్. ప్రసాద్ కథపై ఇప్పటికే చాలా విమర్శ గ్రంథాు వచ్చాయి. క్రిష్టిపాటి బాసుబ్రహ్మణ్యం టి.జి.ఆర్. ప్రసాద్ కథల్లోని 50 ఎంపిక చేసిన కథను తీసుకొని ‘గోరంతదీపం’ అనే ఒక పరామర్శ గ్రంథం రాశారు. వీరే తర్వాత మరో వంద కథల్ని తీసుకొని ‘జష్ట్రఱషసవఅ ూశీబజూ టశీతీ ్‌ష్ట్రవ ూశీబశ్రీ’ పేర ఒక సమీక్షా గ్రంథాన్ని మెవరించారు. అంతేగాక తిరుపతి, అనంతపురం, కడప, ఆకాశవాణి కేంద్రాల్లో కూడా వీరి కథపై అనేకు ప్రసంగాు చేశారు. డా॥ చిట్రాజు గోవిందరాజు టి.జి.ఆర్. ప్రసాద్ రాసిన 350 బా కథకు తయారుచేసిన వర్ణనాత్మక జాబితాకు మివైన ముందుమాట రాశారు. బొందపాటి సత్యనారాయణ ‘డా॥ టి.జి.ఆర్. ప్రసాద్ బాల కథు ఒక సమాలోచన’ అనే గ్రంథాన్ని మెవరించారు. డా॥ తొండాటి బాసుబ్రమణ్యం ‘డా॥ టి.జి.ఆర్. ప్రసాద్ బాల కథు
ఒక పరిశీన’ అనే అంశంపై శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాయంలో పిహెచ్.డి. చేశారు.
‘చందమామ’ నిజంగా ప్లి పుస్తకమా? అని కొడవటిగంటి కుటుంబరావు ఒకసారి ప్రశ్నించారు. నిజానికి ప్లి కథు కేవం ప్లికే కాదు అవి పెద్దకు కూడా అని వాటిని చదివి జీర్ణం చేసుకున్నవారికి ఇట్టే బోధపడుతుంది. టి.జి.ఆర్. ప్రసాద్ కూడా ‘‘ప్రధానంగా నా దృష్టి ప్లికు కథ చెప్పడం మీదే ఉంటుంది. సహృదయు వారి సంస్కారాన్ని బట్టి వ్యాఖ్యానిస్తుంటారు’’ అంటారు. ఈయన రాసిన ఒక్కో కథ నిజంగానే ఒక్కో ఆణిముత్యం. సగం పేజి లేదా ఫుల్ పేజీ కథలోనే కథకుడు అద్భుతం సృష్టిస్తాడు. కొన్ని కథు చదివితే ప్లి నెపంతో ఈ కథల్ని పెద్దకే చెప్పారేమో అనే సందేహం కూడా రాకమానదు. దీనికి ఆయన రాసిన ఎన్నో కథల్ని ఉదహరించవచ్చు. ముఖ్యంగా ‘మూడు దిశు’, ‘పానలో తేడాు’, ‘నేరంశిక్ష’, ‘మహిమగ ప్లినగ్రోవి’, ‘వృద్ధాప్యం’, ‘అన్నదానం’, ‘కార్యదక్షత’, ‘ఉత్తమ అధ్యాపకుడు’, ‘ఉత్తము మహిమ’, ‘నేనంటే నేను’, ‘పొట్టితోక’, ‘కళ
వ్యాపారం’ తదితర కథు దీపావళి చిచ్చుబుడ్లలా ఒక మెగు వెలిగి ఆ మెగును మన మదిలో సజీవంగా నింపే కథు.
ప్లి మానసిక ఆరోగ్యానికి తీసుకోవసినంత జాగ్రత్త తీసుకోలేక పోతున్నాం మనం. దీనికి భారీ మ్యూమే చెల్లిస్తున్నాం కూడా. ఈ విషయం స్పష్టం కావడానికి ఏదో ఒక రోజు దినపత్రికను తిరగేస్తే సమాజంలో క్రైం రేట్ ఏ రేంజిలో ఉందో తెలిసిపోతుంది.
బాల కథు ప్రజెంట్ చేయాంటే అందమైన రంగు బొమ్మతో పాటు మంచి శ్పింతో కూడిన కథు రాయాలి / చెప్పాలి. ఎత్తుగడ, కొనసాగింపు, ముగింపు అద్భుతంగా ఉండాలి. లేదంటే మొదటికే మోసం వచ్చి ప్లిు అసు కథకే దూరం అయ్యే ప్రమాదం లేకపోలేదు. ఒకసారి అబ్రహాం లింకన్‌ను ఒక ఆకతాయి ‘‘కాళ్లు ఎంత పొడవు ఉండాలి?’’ అని ఓ కొంటె ప్రశ్న అడిగాడట. దానికి ఆయన ‘‘భూమిని తాకేటంత ఉంటే చాు’’ అని చమత్కరించాడట. అట్లా కథ ఎంత పొడవు చెప్పావని కాదు. ప్లి మనసుకు తాకిందా లేదా? అనేదే ప్రమాణం. వాళ్ల హృదయాల్లో నాుగు కాలాపాటు నిలిచిందా లేదా? అనేదే ముఖ్యం. అందుకే బాల కథు రాసేవారు చాలా జాగ్రత్తగా ఆచితూచి రాస్తారు. ఈ క్షణాన్ని అక్షరాలా పాటించే బాకథా రచయిత డా॥ టి.జి.ఆర్. ప్రసాద్. ఒకచోట రచయితే ‘‘నా కథు చదివినపుడు జీవితంలోని వైవిధ్యాు, వైరుధ్యాు పాఠకునికి సరిగా బోధపడకపోతే నా వస్తువు అసమర్థం అనుకోవాలి. అలాగే నా కథు చదువుతున్నప్పుడు పాఠకుని దృష్టి నేను చెప్పదచుకున్న విషయం మీదికి మళ్ళకపోతే నా శ్పిం అసమగ్రమని భావించాలి’’ అంటారు. దీన్ని బట్టి టి.జి.ఆర్. ప్రసాద్ ఎంత నిబద్ధత, బాధ్యత గ రచయితో అర్థం చేసుకోవచ్చు.
బాల కథు రాయడమే కాదు డా॥ టి.జి.ఆర్. ప్రసాద్ మంచి విమర్శకు కూడా. 1979లో కొడవటిగంటి కుటుంబరావు ‘చదువు ఒక పరామర్శ’పై ఎంఫిల్ చేస్తున్నప్పుడే ‘ఆధునిక సాహిత్య పరిశోధన
విద్యార్థు సమస్యు’ అనే వివాదాస్పదమైన వ్యాసం రాశారు. ఇది ఆ రోజుల్లో పెద్ద సంచనం కలిగించింది. పర్యవేక్షకునికి, పరిశోధకునికి మధ్య ఉన్న అంతరం, భావావేశాు, ఇష్టాయిష్టాు పరిగణనలోకి తీసుకోకుండానే ఏదో ఒక పరిశోధనాంశాన్ని పరిశోధకునికి అంటగట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పైగా పరిశోధకుడు ప్రాచీన సాహిత్యం చదువుకున్నవారు అయి, పరిశోధకుడు ఆధునిక సాహిత్యం పైన రీసెర్చ్ చేస్తుంటే ఇద్దరికీ సయోధ్య ఎలా కుదురుతుందని చర్చ చేశారు. తరువాత ‘కర్నూు జిల్లా జానపద గేయగాథు’పై పిహెచ్.డి. చేశారు. ‘ఆధునిక కవిత్వంలో స్త్రీ’, ‘బాకథా శ్పిం’, ‘పవఎaఅaఃం ఙఱవషం శీఅ ఔశీఎవఅ’, ‘తొలి తొగునాటి కథ కవితాత్మకథ’, ‘కె.వి.ఆర్. కథా స్రవంతి
సాహిత్యపు వాసంతి’, ‘దాక్షిణాత్య భాషల్లో మహాభారతం’, ‘రాసాని కథు శ్పి ప్రశంస’, ‘ముస్లిం అస్తిత్వ కథ కొన్ని భావను’, ‘తొగు కథాసాహిత్య ఆకాశంలో పాణి ఎగరేసిన గాలిపటం ‘ఇన్‌మోషన్’, ‘పసిప్లి’ కథలో తుమ్మేటి రఘోత్తమరెడ్డి ‘పనితనం’, ‘మారుతున్న మానవ సంబంధా ప్రతిరూపాు
బి.ఎస్.రాము కథు’, ‘పదహారణా తొగు కథకుడు కరుణకుమార’ లాంటి అనేక మివైన సాహిత్య విమర్శా వ్యాసాు రాశారు. ఆయన రాసిన కొన్ని సాహిత్యవిమర్శ వ్యాసాను చేర్చి ‘చేతన’ అనే పుస్తకాన్ని మెవరించారు. అలాగే ‘డా॥ కె.వి. రమణరావు కథు శ్పి పరిశీన’ పేర ఒక విమర్శ గ్రంథాన్ని మెవరించారు. భీమరాజు వెంకరమణ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సలీం రాసిన కథల్లోంచి తొమ్మిది కథల్ని ఎంచుకుని వాటికి సీక్వెల్ కథు రాసి ‘కథకు కథ’ అనే కథాసంపుటిని ప్రచురించారు. ఇది తొగు సాహిత్యంలోనే తొలి సీక్వెల్ కథ సంకనంగా గుర్తింపు పొందింది. దీనిపై డా॥ టి.జి.ఆర్. ప్రసాద్ ‘సీక్వెల్ కథు
కథకు కథ పరామర్శ’ పేర ఒక విమర్శనా గ్రంథాన్ని ప్రచురించారు. ఇంకా ఆంగ్లంలో పురాణ భాస్కర డా॥ కంబాూరు వెంకటేశ ఆచార్య రాసిన ‘వ్యాస భారతం ` ఒక పరిశీన’ గ్రంథాన్ని తొగులోకి అనువదించారు. వీటన్నింటినీ మించి ‘ఆగష్టు వ్’ పేర మనసును కదిలించే గొప్ప పరిమళభరితమైన కవిత్వం రాశారు.
నిత్యం సాహిత్యాన్నే శ్వాసిస్తూ సాహిత్యంలోనే జీవించే డా॥ టి.జి.ఆర్. ప్రసాద్ 1980లో కొడవటిగంటి కుటుంబరావును చివరి ఇంటర్వ్యూ చేసి ఆయన ద్వారా అనేక మివైన సాహిత్యాంశాల్ని సాహిత్య ప్రపంచానికి అందించారు. 7.3.1980న ‘చందమామ’ కార్యాయంలో చేసిన ఇంటర్వ్యూని ‘ప్రజాసాహితి’ 1980 అక్టోబరులో (కొ.కు. ప్రత్యేకసంచిక) ప్రచురించింది. అదే సంచికలో టి.జి.ఆర్. ప్రసాద్ ‘చదువు’ నవపై వ్యాసాన్ని కూడా ప్రచురించింది. బాకథా సాహిత్యంలో ఒక మెగు వెలిగి, సాహిత్య విమర్శలో లోతును ముట్టిన టి.జి.ఆర్. ప్రసాద్ సీరియస్ / పెద్ద కథ వైపు వస్తే ఖచ్చితంగా ఎన్నో గొప్ప కథల్ని రాసేవారు. కనీసం సాహిత్య విమర్శలో అలాగే కొనసాగినా సాహిత్యానికి ఎంతో మేు జరిగేది.