కలువకొలను సదానంద

          ప్రముఖ రచయిత, చిత్రకారుడు కలువకొలను సదానంద తన 81వ ఏట 25 ఆగస్టు 2020 ఉదయం పాకాలలో మరణించారు. ఆయన 22 ఫిబ్రవరి 1939లో పాకాలలో జన్మించారు.           సదానంద కథ, నవల, గేయాలు మొదలగు ప్రక్రియలలో బాలసాహిత్యాన్ని ప్రధానంగా రచించారు. చిత్రకారునిగా, కార్టూనిస్టుగా కూడా పాఠకులకు వీరు పరిచయం. ‘రక్తయజ్ఞం’, ‘పైరుగాలి’, ‘మాయకంబళి’, ‘నవ్వే పెదవులు, ఏడ్చే కళ్ళు’ వీరి కథాసంపుటాలు. ‘గాడిద బ్రతుకులు’, ‘గందరగోళం’ వీరి నవలలు. ఆయన రచించిన ‘అడవి తల్లి’
Complete Reading

          భారత నాస్తిక సమాజ వ్యవస్థాపక సభ్యురాలు, జయగోపాల్‌ భార్య శారదమ్మ 29 ఆగస్టు 2020న విశాఖలో చనిపోయారు.           గత 50 ఏళ్ళకుపైగా జయగోపాల్‌తో పాటు నాస్తికోద్యమపు ఎగుడుదిగుడు ప్రయాణం చేసిన శారదమ్మ మరణానికి ‘ప్రజాసాహితి’ సంతాపం తెలియచేస్తూంది. వారి కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటిస్తున్నాం.

          ఏ.పి.టి.ఎఫ్‌.లోను, జనసాహితిలోనూ, రాయలసీమ ఉద్యమంలోనూ క్రియాశీలకంగా పనిచేసిన ఉపాధ్యాయుడు, రచయిత, ఉద్యమ కార్యకర్త బి. పాండురంగారెడ్డి తన 74వ ఏట ఆగస్టు 3, 2020న కరోనా వ్యాధితో మరణించారు. ఆయన నంద్యాల సమీపంలోని గోవిందపల్లెలో 1946లో జన్మించారు.           పాండురంగారెడ్డి తిరుపతిలో విద్వాన్‌ చదివి 1968లో మొలగపల్లి గ్రామంలో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు. అప్పటి నుండి ఎ.పి.టి.ఎఫ్‌లో చురుకైన పాత్ర పోషించారు. ఏపిటిఎఫ్‌ బాధ్యతలతో పాటుగా 1992-2006 నడుమ ఉపాధ్యాయ పత్రిక సంపాదకవర్గ బాధ్యతలు నిర్వహించారు.
Complete Reading

          ప్రజాకళాకారుడు వంగపండు ప్రసాద్‌ గుండెనొప్పితో విజయనగరం జిల్లా పార్వతీపురం వై.కే.ఎం. నగర్‌లో 4-8-2020న మరణించారు. ఆయన విజయనగరంజిల్లా పార్వతీపురం మండలంలోని బొండపల్లి గ్రామంలో జన్మించారు.           వంగపండు ఆదివాసీలు, ఇతర పీడిత ప్రజల సమస్యలు, బాధలు కన్నీళ్ళతోపాటు పోరాటాలను కూడా గానం చేస్తూ అనేక పాటలు రాశారు. ఆయన రచించిన ‘సుత్తీ కొడవలి ఎత్తిన జెండా’ పాటను 1977లో ప్రజాసాహితి ప్రచురించింది. ఎమర్జన్సీ కాలంలో ఆయన రచించిన ‘భూమి భాగోతం’ కళారూపాన్ని అనేక బృందాలు, ప్రదర్శించాయి.
Complete Reading

          స్వామి అగ్నివేశ్‌ ఆర్యసమాజం ఆశయాలను కొనసాగిస్తూ ‘ఆర్యసభ’ అనే రాజకీయ పార్టీని ఏర్పాటుచేశారు. హర్యానా రాష్ట్రం నుండి కాబినెట్‌ మినిష్టర్‌గా ఎన్నికయ్యారు. విద్యాశాఖమంత్రిగా పనిచేశారు. ప్రజల ప్రజాస్వామిక హక్కుల కోసం కృషిచేసిన ఆయన 11-9-2020న ఢిల్లీలో కాలేయ వ్యాధితో మరణించారు. అగ్నివేశ్‌ 21-9-1939న శ్రీకాకుళంలో జన్మించారు.           హిందూమతంలోని దురాచారాలను వ్యతిరేకిస్తూ ఆర్యసమాజంలో చేరారు. ప్రజాస్వామిక హక్కుల కోసం ఉద్యమిస్తున్న అగ్నివేశ్‌ను 2008లో ఆర్యసమాజం బహిష్కరించింది. ఢిల్లీ పరిసర ప్రాంతాలలోని గనుల్లో సాగుతున్న వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా
Complete Reading

          ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాకాటి శిరీష్ కుమార్ నున్నలో వారి స్వగృహము నందు 9-8-2020న మరణించారు. ఆయన కృష్ణాజిల్లా నున్నలో జన్మించారు.          ‘సంస్కృతీ సమాఖ్య’ అనే పేరుతో సాహిత్య సాంస్కృతిక సంఘాన్ని నిర్వహించిన శిరీష్ కుమార్ నాలుగు దశాబ్దాలకు పైగా యువ రచయితలను, కవులను ప్రోత్సహించారు. ‘ప్రజాసాహితి’కి మిత్రులు. శిరీష్ కుమార్ మృతికి ‘ప్రజాసాహితి’ సంతాపం ప్రకటిస్తోంది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తుంది.

          అభ్యుదయ, నాస్తికోద్యమ భావవ్యాప్తిలో ఇంద్రజాల కళను జోడించి మూఢవిశ్వాసాలను పారద్రోలుతూ ప్రజల్ని చైతన్యపర్చటంలో అలుపెరుగని కృషిచేసిన ప్రొ॥ ఎన్‌. విక్రం కోవిడ్‌-19 వ్యాధితో హైదరాబాదులో 4-7-2020న మరణించారు. ఆయన 3-9-1947న రంగూన్‌లో జన్మించారు.           హిప్నాటిజం, ఇంద్రజాల కళలపట్ల అత్యంత ఉత్సాహం వున్న విక్రంకు భారత నాస్తిక సమాజంతో అనుబంధం ఏర్పడింది. ఆయన వృత్తి రీత్యా టెక్నికల్‌ ఉద్యోగి అయినా, సమాజాన్ని పట్టి పీడిస్తున్న మూఢనమ్మకాలు మానసికజాడ్యంగా రూపొందుతున్న విధానాలపైన నిరంతరం పోరాడారు. బాణామతి వంటి
Complete Reading

          జనసాహితి తూర్పుగోదావరి జిల్లా శాఖ కన్వీనర్‌ సయ్యద్‌ అహ్మద్‌ కరీం (65 సంవత్సరాలు) ఒక సంవత్సర కాలంగా క్యాన్సర్‌ వ్యాధితో పోరాడుతూ 11 జూలై 2020న కాకినాడలో మరణించారు.           కాకినాడలో పుట్టి పెరిగిన ఆయనపై అప్పటికే ఆ పరిసర ప్రాంతాలలో ప్రసరించివున్న ఇస్లాంలోని సూఫీ అభ్యుదయ ప్రభావం వుండేది. విద్యార్థి దశ నుండే 1974-75 మధ్యకాలంలో డాక్టర్‌ పి.జస్వంత్‌రావు, కోమలి సూర్యారావు, డాక్టర్‌ పట్టాభిరామయ్య, వై.ఎన్‌.వి.వి. సత్యనారాయణ (కొండ), కుదరవల్లి రఘురామయ్య తదితరులతో కలసి
Complete Reading

          ‘అంబాలిస్‌’, ‘నిర్నిమిత్తం’, ‘రెల్లు’, ‘డియర్‌’ కథాసంపుటాల రచయిత బి.పి. కరుణాకర్‌ (76) గుండెనొప్పితో 20-7-2020న హైదరాబాద్‌లో మరణించారు. ఆయన 22 ఏప్రియల్‌ 1944న గుంటూరులో జన్మించారు.      కరుణాకర్‌ బిహెచ్‌ఇఎల్‌లో వున్నతోద్యోగం చేశారు. సాహిత్య పిపాసి. చిన్న కథలు రాయటంలో నేర్పరి. ఆయన కథలు ఇంగ్లీషు, కన్నడ భాషలలోకి అనువాదమయ్యాయి. కరుణాకర్‌ మరణానికి ‘ప్రజాసాహితి’ సంతాపం ప్రకటిస్తోంది. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటిస్తుంది.

          ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, అరసం బాధ్యులు అయిన నిసార్‌ కోవిడ్‌-19 వ్యాధితో హైదరాబాద్‌లో 10 జూలై 2020న మరణించారు. ఆయన నల్లగొండ జిల్లా సుద్దాల గ్రామంలో జన్మించారు.      తెలంగాణ సాయుధ పోరాటం ప్రభావంతో పెరిగిన నిసార్‌ చిన్నప్పటి నుండి జానపదాలను ప్రజాగేయాలుగా మలచి పాడటంలో నేర్పరి. సుద్దాల హన్మంతు స్ఫూర్తితో ఉద్యమాలలోకి వచ్చిన ఆయన ప్రతి ప్రజా సమస్యను ప్రజలకర్ధమయ్యే జానపదాలతో పాటలుగా మలిచేవారు. ‘పల్లె సుద్దులు’ కళారూపంలో ఒదిగిపోయి నటించేవారు.
Complete Reading

Create AccountLog In Your Account