వేలాదిమంది విద్యార్థులకు తెలుగు భాష, సాహిత్యాలను శాస్త్రీయంగా బోధించిన, వందలాది పరిశోధకులకు మార్గదర్శకులుగా పనిచేసిన మార్క్సిస్టు సాహితీ విమర్శకులు ఆచార్య కోవెల్ కందాళై రంగనాథాచార్యులు (80) కోవిడ్‌తో 15-5-2021న హైదరాబాద్‌లోని తార్నాకలో మరణించారు. ఆయన 14-6-1941న తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జన్మించారు. ఆయన విశ్లేషణాత్మక రచనలు, గంభీరమైన ప్రసంగాలు, చతురోక్తులతో సాగించే సంభాషణ… ఏదైనా… ఆలోచింపచేసేవిగా, విజ్ఞానదాయకంగా, వివేచన కలిగించేవిగా ఉండేవి. విప్లవ రచయితల సంఘం, జనసాహితి వ్యవస్థాపకులలో ఒక ముఖ్యుడైన జ్వాలాముఖి, కె.కె.ఆర్
Complete Reading
‘చంద్ర’, ‘బాల’ పేర్లతో చిత్రకారునిగా, ఇల్లస్ట్రేటర్‌గా, కార్టూనిస్ట్ గా, డిజైనర్‌గా ప్రసిద్ధి చెందిన మైదం చంద్రశేఖర్ దీర్ఘ అనారోగ్యంతో 28-04-2021న హైదరాబాదులో తన 75వ యేట మరణించారు. ఆయన 28 ఆగస్టు 1946న వరంగల్ జిల్లా గన్నాసరి గ్రామంలో జన్మించారు. తన చిన్ననాటి నుంచే చిత్రాలు గీయటం ప్రారంభించిన చంద్ర, హైస్కూలు విద్యార్థిగా ఎం.ఎఫ్. హుస్సేన్, కొండపల్లి శేషగిరిరావుల చిత్రాల ప్రతికృతులను చిత్రించారు. బాపుకు ఏకలవ్య శిష్యునిగా చెప్పుకున్న చంద్ర త్వరలోనే తనదైన సొంత
Complete Reading
అంతరాలులేని, అంధవిశ్వాసాలు లేని సమాజం కోసం కృషిచేసిన దొడ్డా హరిబాబు మాష్టారు తన 65వ ఏట 3 మే 2020న తెనాలిలో మరణించారు. ఆయన ప్రకాశంజిల్లా యద్ధనపూడి మండలం మున్నంగివారిపాలెంలో 1953లో జన్మించారు. హరిబాబు మాష్టారు చిన్నప్పటి నుండి అభ్యుదయ భావాలతో వుండేవారు. ఊరిలో యువజన గ్రంథాలయాన్ని నిర్వహించేవారు. భాషాప్రవీణ చదవటం కోసం తాడికొండ సంస్కృత కళాశాలలో చేరటంతో చార్వాక రామకృష్ణగారి శిష్యుడయ్యారు. బాబాల, స్వాముల, అమ్మవార్ల బండారాలను బట్టబయలు చేస్తూ అనేక కార్యక్రమాలు
Complete Reading
నాటక రచయిత, నటుడు, దర్శకుడు, నిర్మాత చింతపెంట సత్యనారాయణరావు 14 ఏప్రిల్ 2020న హైదరాబాదులో తన 86వ ఏట అనారోగ్యంతో మరణించారు. ఆయన 20 డిశెంబరు 1935న కడియం దగ్గర మాధవరాయుడుపాలెంలో జన్మించారు. సి.ఎస్.రావు విద్యార్థి దశ నుండే బ్రహ్మసమాజము, ఆంధ్ర సారస్వత సభల ప్రభావంతో ఎదిగారు. రాజమండ్రిలో డిగ్రీ చదువుకునే రోజుల్లో స్టూడెంట్ ఫెడరేషన్‌లో పనిచేశారు. స్టూడెంట్ ఫెడరేషన్‌తో సంబంధాలు ఉండటంతో చాలాకాలం ఉద్యోగం రాలేదు. ఆ సమయంలో ఆయన వాళ్ళ వూరి
Complete Reading
అంటరానితనానికి వ్యతిరేకంగా, జోగిని – బసివిని దురాచారాలకు వ్యతిరేకంగా, కులాంతర వివాహాలను, నాస్తికత్వాన్ని ఒక ఉద్యమంగా కొనసాగించిన గోరాగారి కుమారుడు. డా॥ విజయం తన 84వ ఏట 22 మే 2020న అనారోగ్యంతో విజయవాడలో మరణించారు. ఆయన 1 డిశెంబరు 1936న జన్మించారు. నాస్తికత్వం అంటే ఒక జీవన విధానం అనీ, శాస్త్రీయ దృక్పథం అని నిరంతరం ప్రచారం చేసిన ఆయన ఇతర దేశాలలోని నాస్తిక సంఘాలతో నిత్య సంబంధాలు పెట్టుకొని, అక్కడి జర్నల్స్ కి
Complete Reading
గౌతం విద్యాసంస్థల అధినేత, విద్యావేత్త ఎన్. చౌదరిబాబు మూత్రపిండాల వ్యాధితో 5 ఆగస్టు 2020న విజయవాడలో మరణించారు. ఆయన గుంటూరుజిల్లా పాలపర్రులో 11 నవంబరు 1949న జన్మించారు. చౌదరిబాబు విద్యార్థి దశ నుండీ మార్క్సిజాన్ని నమ్మారు. అసమాన సమాజం పోయినపుడే విద్యావ్యవస్థలోనూ మార్పులు వస్తాయని నమ్ముతూనే ఈ కార్పొరేట్ పోటీ ప్రపంచంలో నిలబడి తనదైన రీతిలో నర్సరీ నుండి పి.జి. వరకూ విద్యాసంస్థలను నెలకొల్పి నిర్వహించారు. తన స్వగ్రామమైన పాలపర్రులో హైస్కూలును దత్తత తీసుకున్నారు.
Complete Reading
మానవ వికాస వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు, గాయకుడు నాస్తిక వెంకన్న 7-9-2020న హైదరాబాద్‌లో కరోనా వ్యాధితో మరణించారు. ఆయన కరీంనగర్ జిల్లా మంధని గ్రామంలో జన్మించారు. మహిమలు, మూఢనమ్మకాల బండారాన్ని బట్టబయలు చేసే ఇంద్రజాలికుడిగా, డప్పు వాయిస్తూ మూఢనమ్మకాలను పారద్రోలుతూ, మూఢత్వాన్ని ప్రశ్నిస్తూ పాటలు పాడే గాయకుడిగా రెండు తెలుగు రాష్ట్రాలలో కృషిచేశారు. వెంకన్న మరణానికి జనసాహితి సంతాపం ప్రకటిస్తూంది. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియచేస్తూంది.
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్రాధిపతిగా చేసిన ఆచార్య పి.సి. నరసింహారెడ్డి తన 77వ ఏట 19 అగస్టు 2020న హైదరాబాదులో మరణించారు. ఆయన గద్వాల సమీపంలోని గట్టు మండలంలోని పెంచుకలపాడులో 3 జులై 1943లో జన్మించారు. యువకునిగా వీరు ‘‘తిరగబడు’ కవుల్లో ఒకరిగా ఆ కవితా సంకలనంలో ‘ఐ’ అనే కలంపేరుతో ‘తిరగబడు’ అనే కవిత రాశారు. విరసం ఏర్పాటుతో సంబంధాలు వున్నా, సభ్యత్వం తీసుకోలేదు. ‘శుక్తి’ పేరుతో చిత్రకారునిగా చిత్రాలు గీశారు. ‘సృజన’
Complete Reading
బహుజన ఉద్యమకారుడిగా కృషిచేస్తూన్న ఉప్పుమావులూరి సాంబశివరావు 24 జూలై 2020న కరోనా వ్యాధితో హైదరాబాద్‌లో మరణించారు. ఆయన గుంటూరుజిల్లా బ్రాహ్మణ కోడూరులో జన్మించారు. ఉ.సా. తెనాలిలో డిగ్రీ చదివే రోజుల్లో (1973-74) ఏర్పడిన ‘అరుణోదయ సాంస్కృతిక సంస్థ’లో చేరి సామాజిక అంశాలపై కళారూపాలను నేర్చుకుంటూ, నేర్పుతూ – వివిధ సమస్యలపై పాటలు రాశారు. 1978లో జనసాహితి ఏర్పడినపుడు చురుకైన కార్యకర్తగా కృషిచేస్తూ పలు జనం పాటలు రాశారు. జనసాహితి సంస్థ గీతంగా పాడుకునే ‘‘మేం
Complete Reading
నవయుగ ఫిల్మ్స్ మేనేజర్‌గా పనిచేసి, చలనచిత్ర ప్రకటనలలో, ప్రచారంలో వినూత్నమైన విజయవంతమైన ప్రయోగాలు చేసిన అభ్యుదయవాది కాట్రగడ్డ నరసయ్య తన 96వ ఏట – 31 అగస్టు 2020న విజయవాడలో మరణించారు. విజయవాడలో ప్రముఖ కమ్యూనిస్టు కుటుంబమైన కాట్రగడ్డ కుటుంబసభ్యుడైన నరసయ్య బెనారస్ హిందూ యూనివర్శిటీలో విద్యార్థిగా వున్నపుడే – 1943లో తెనాలి సమీపాన పెదపూడి గ్రామంలో ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం నెల రోజులపాటు నిర్వహించిన సాహిత్య పాఠశాలకు హాజరయ్యారు. నవయుగలో పనిచేశారు.
Complete Reading