వైదిక వారసత్వ వెబ్‌సైట్‌!

వైదిక వారసత్వ వెబ్‌సైట్‌!


‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయష!’ అన్న నానుడిని నిజం చేస్తూ మన కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ వివిధ విద్యాసంస్థకు 2018 నవంబరు 12న పంపిన లేఖలో, ‘‘వేదాలోని శాస్త్రీయ జ్ఞానానికి సంబంధించిన ‘వేదిక్‌ వారసత్వ పోర్టల్‌ను ప్రారంభించబోతోందని పేర్కొంది.
ఈ వైదిక వారసత్వ వేదిక తరఫున ప్రాచీన హిందూ గ్రంథాలోని శాస్త్రీయ విజ్ఞానాన్ని సేకరించి, అవసరమైనవారికి దానిని అందిస్తుందని సాంస్కృతికశాఖ కార్యదర్శి అరుణ్‌గోయల్‌ చెప్పారు. అన్ని విద్యాసంస్థతోపాటు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాజీ వారికి కూడా ఈ లేఖ అందింది. ఈ పోర్టల్‌లో ‘‘స్వచ్ఛమైన శాస్త్రీయ సమాచారం’’తోపాటు మౌఖిక సాహిత్యాన్ని దృశ్య, శ్రవణ యంత్రా ద్వారా పొందుపరుస్తారని, వ్రాత ప్రతును, ప్రచురణను, యజ్ఞయాగాు చేయడానికి ఉపయోగించే వస్తువును, సాధనాను సేకరిస్తామ’’ని ఆయన చెప్పారు!
ఈ పోర్టల్‌ను ఇందిరాగాంధీ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ది ఆర్ట్స్‌ (ఇందిరా గాంధి లితకళ జాతీయ కేంద్రం) ద్వారా పనిచేస్తుంది. ఈ వెబ్‌సైట్‌ను మార్చి 2019 నాటికి ప్రారంభించవచ్చని ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ సుధీర్‌లాల్‌ చెప్పారు.
సైన్స్‌, గణితం, ఖగోళశాస్త్రం, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం, న్యాయశాస్త్రం మొదలైనవాటిలో నిష్ణాతులైనవారూ, వైదిక పండితు కలిసి ‘‘భారత సంప్రదాయ జ్ఞాన విధానాను చర్చించి, ఒక నూతన అధ్యయనం చేపట్టేట్లు కార్యక్రమాన్ని ఈ శాఖ రూపొందించింది. ఇప్పటికే ఈ కార్యక్రమంలో కొందరు ‘విద్యావంతు’ (ూషష్ట్రశీశ్రీaతీం) నిమగ్నమై వున్నారు. కొత్తగా ప్రారంభించబోయే పోర్టల్‌ ద్వారా వారి కృషి విస్తృతంగా ప్రజకు చేరుతుంది అన్నారు.
ఇటువంటి పోర్టల్‌ అవసరాన్ని కేంద్ర ప్రభుత్వమే మొదట గుర్తించింది. వేద పఠనమనేది మానవజాతి సాంస్కృతిక వారసత్వమని ప్రకటించారు. దీనిపై 2003లో యునెస్కో ఒక డాక్యుమెంటరీని తయారు చేసింది. 1987లో ఈ సంస్థ ఏర్పడినప్పటినుండే నిర్వహిస్తున్న పు అంశాపై కృషి చేస్తోంది.
‘‘ఈ పోర్టల్‌ మూడు రకావారికి ఉపయోగపడుతుందట. ఇప్పటికే ఈ అంశాపై కృషిచేస్తున్న నిపుణు మొదటిరకంవారు. ఈ అంశాపై ఆసక్తి క సాధారణ ప్రజు రెండవరకం కాగా ఇప్పటికే వీటిని ఆచరణలో పెట్టినవారు మూడవరకం. ‘‘ఇప్పటికే వేదాు పు ప్రదేశాల్లో నేర్పుతున్నారు. ఉదాహరణకు కర్నాటకలో 20 మంది బ్రాహ్మణు రాగయుక్తంగా వేదాన్ని, ప్రత్యేకంగా సామవేదాన్ని పఠించే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. గతంలో సామవేదాన్ని వేయి పద్ధతుల్లో ధారణ చేసేవారనీ, ఇప్పుడు మూడు పద్ధతులే మిగిలాయి’’ అన్నారు.
ప్రభుత్వం చేతుల్లో ఎన్ని సంస్థుంటే అన్నింటినీ కాషాయీకరణ చేసే క్ష్యంతో జరుగుతున్న కార్యక్రమాల్లో ఇదొకటి. వేలాది సంవత్సరా క్రితం అప్పటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, నైతిక పరిస్థితుపై ఆధారపడి రూపొందించిన వేదాలో ఈనాటి శాస్త్ర జ్ఞానమంతా నిబిడీకృతమై వుందన్న వాదనను సమర్ధించే పాక వర్గం ఇలాగే చేస్తుంది. దీనిలోని అశాస్త్రీయతను ఎండగట్టే శాస్త్రీయ ఉద్యమాన్ని నిర్మించడం నేటి అవుసరం.

admin

leave a comment

Create Account



Log In Your Account