నిర్మ మనస్వి నిర్మలానందా
నిత్య అన్వేషి … నిర్మలానందా
నీ చేతికి నా దండాయ్యా
నీ రాతకు నే బందీనయ్యా
జన సాహితి పురోగతి కై
ప్రజాసాహితి ప్రగతి కై
పరితపించిన ప్రజాకవి
పరిశ్రమించిన ప్రజావాది
నీ సాహిత్య చైతన్య కోణం
నీ సాంస్కృతిక దృక్కోణం
అనువాదోద్యమ శకానికి
శిఖరమై నిచే నిజంగా
ఒకటేమిటి, ఒకటేమిటి
రేండేమిటి, మూడేమిటి
సక భాష సాక్షీ భావమూ
సాక్షాత్కరించే కవన రావమూ!
నెత్తుటి మరకకు సత్తువొస్తే
నా నెత్తురు వృధా కాదని
ఎుగెత్తి నినదించిన
విప్లవ కవీ… చైతన్య శీలీ
నే తల్లి తట్టుకో గదా
నేను నే కొరిగితే యని
శివమెత్తి నిరసించిన
విప్లవమూర్తీ ప్రగతి శీలీ!
రాయడమొచ్చినోడు రాయకపోతే
రాయకూడనివాడు రాస్సేస్తాడూ
జరా జాగ్రత్త ఓ కవీ.. యనీ
జాగృతి గంట మ్రోగించిన సుకవీ
చైనా ూషన్ జనం గీతిక
భగత్ సింగ్‌జీ విప్లవ గీతిక
మహాశ్వేతా అరణ్య గీతిక
తొగు నే తాకించిన తపస్వీ
పీడిత ప్రజ మనోవేదనను
ప్రణవ నాదమై పాడిరచితివి
విశా దృక్పథ కడలి తీరాన
విశ్వ వేణువు వినిపించితివి
సాహిత్యోద్యమ ప్రజాపథాన
నివురుగప్పి నిుచున్నావా
వాస్తవమ్మున నీవు భగభగ మండే
అక్షరాలా నిప్పు కణికవే కదా