పిల్లల కవిత

– సంఘమిత్ర, బాలసంఘ సభ్యులు పిల్లలూ పాలపిట్టలు పిల్లలూ తాటిముంజలు పిల్లలూ చింపిరి గుడ్డలు పిల్లలూ ఆణిముత్యాలు పిల్లలూ వెన్నముద్దలు పిల్లలూ పంచదార చిలుకలు పిల్లలూ శిల్పి చెక్కిన బొమ్మలు పిల్లలూ మీరు పిడుగులు పిల్లలూ వాన చినుకులు పిల్లలూ శ్రమజీవుల చెమట చుక్కలు పిల్లలూ సముద్రపు ఆలుచిప్పలు పిల్లలూ మట్టిలోని మాణిక్యాలు పిల్లలూ చీపురుకట్ట పుల్లలు పిల్లలూ టపాకాయలు పిల్లలూ సంఘమిత్ర మొగ్గలు

– సంఘమిత్ర, బాలసంఘ సభ్యులు కరోనా వచ్చింది ముక్కుకు మాస్క్‌ వేసింది మనుషులను దూరం పెట్టింది షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకోవద్దంది దండాలు పెట్టుకోమనింది లాక్‌డౌన్‌ పెట్టారు ఇంట్లో ఉండమన్నారు బయటికి రావద్దన్నారు వలస కూలీలకు కష్టాలు లాభదారులకు నష్టాలు మంచి తిండి తినమన్నారు తిండి దొరకక చస్తున్నారు

–  ఎస్. అశ్వని ఆడది అమ్మ వంటిది. కాని ఇప్పుడు ఆమె మీద ఎన్నో అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి. ఎలా అంటే పూర్వం రామాయణంలో రాముడు సీతమ్మను అడవులపాలు చేశాడు కదండి. రామాయణంలో రాముడు దేవునిగా పేరు పొందినా కాని సీతమ్మను మాత్రం అగ్నిప్రవేశం చేయించాడు. అయినా చెప్పుడు మాటలు విని రాముడు అలా చేశాడు. కానీ మన తాత, నాయనమ్మలు మాత్రం అతన్ని ఇప్పటికీ దేవునిగానే కొలుస్తున్నారు. ఇది నిజమేనంటారా? రాముడు నిజంగా దేవుడా? అసలు
Complete Reading

–  అక్షర, ౩వ తరగతి అది నల్లమల అడవి. అక్కడ జంతువులు ఎప్పుడు సంతోషంగా ఉండేవి. అన్ని జంతువులతో పోలిస్తే కుందేలు అందరికన్నా తెలివిగా, ఉపాయంగా ఉండేది. అంతేకాదు భాషలు తెలిసినది. అంటే మనుషుల భాష ఇంకా 24 భాషలు కూడా వచ్చు. ఒకరోజు అది తిరుగుతూ ఉంటే అది కొంతమంది మనుషులు మాట్లాడుతుండగా వినసాగింది.  ఒక మనిషి ఏమని చెప్పాడంటే, ఇక్కడ యురేనియం బాగా ఎక్కువగా ఉంది, ఇక్కడ మనం తవ్వడం మొదలుపెడదాం అని. సరేనని
Complete Reading

– ‘బాలబంధు’ అలపర్తి వెంకట సుబ్బారావు ప్రకృతే చెబుతోంది పాఠాలు మనకు ! సారాంశమును తెలిసి సాగించు బ్రతుకు ॥ సూర్యుడే శ్రమశక్తి సూచించు మనకు ! చంద్రుడే సౌమ్యతకు కేంద్రమ్ము మనకు ॥ సముద్రం ధైర్యాన్ని సమకూర్చు మనకు ! చేరు పై స్థాయికని చెప్పేను నింగి ॥ ఓర్పుగా ఉండమని నేర్వేను నేల ! పరులకై తను తానె బలియగును అగ్ని ॥ పరుల మేలునుకోరి కురిసేను వాన ! విశ్వహిత మాశించి వీచేను
Complete Reading

– ‘బాలబంధు’ అలపర్తి వెంకట సుబ్బారావు           చిట్టి చిట్టి పాపలార           చెప్పండీ నేనెవరిని?                    ॥           మురికి అయితె తెల్లగాను           మురికి పోతె నల్లగాను           రూపు దాల్చుచుండు నేను           చూపరులకు చోద్యముగను       ॥           మూడు అక్షరాలు వున్న           ముచ్చటైన మాట నేను!           తిప్పి చదువ, ఇల్లు గట్ట           ఒప్పిదమగు కొయ్యనగుదు       ॥           ఆ కాలంలో దిద్దిరి           అక్షరాలు ఇసుకలోన!           అక్షరాలు
Complete Reading

– ఓ.హెచ్. మిత్ర, 8వ తరగతి           బయట ఎండ మండిపోతుంటే ఇంట్లోకి వచ్చాను. నా 15 ఏళ్ల కూతురు మంచినీళ్ళు ఇస్తూ ‘‘నాన్నా దొరికాయా?’’ అని అడిగింది. ‘‘లేదమ్మా 7 షాపులు వెతికాను. ఎక్కడా లేవు కాని మాస్కులు మాత్రం దొరికాయి.’’ అంటూ నా కూతురికి మాస్కులు ఇచ్చి కుర్చీలో కూలబడ్డాను.           కొంతసేపటికి మా ఆవిడ వచ్చి ‘‘హేండ్‌వాష్లు దొరకలేదా?…. మాస్కులింకో నాలుగైదు తేలేకపోయారా?. అయినా ఇంతసేపేంటి?’’ జవాబు ఇవ్వటానికి గ్యాపు లేకుండా ప్రశ్నలడిగేస్తూంది.
Complete Reading

– జ్యోత్స్న           రైతు దేశానికి వెన్నుముక           కాని ఇప్పుడు కర్రెముక           అలాంటి వెన్నుముకను కర్రెముక చేస్తున్నారు           కర్రెముకలను తొక్కి, నలిపేసి,           పిండి, పక్కకు పడేస్తున్నారు           రైతు ఎవరికోసం కష్టపడుచున్నాడు           మనకోసం, దేశంకోసం, ప్రపంచం కోసం           ఎండనక, వాననక కష్టపడి           నానా తిప్పలు పడేవాడు రైతు           పంట చేతికి వస్తే ఆనందం లేక           అది అమ్ముడౌతుందో లేదో అనే భయంతో           పంట
Complete Reading

— ఎస్ అశ్విని— 8 వ తరగతి నలుపు నుపని విసిగే ఓ మనసా నలుపంటే మీకు అంత అుసా! కళ్ళకి పెట్టుకునే కాటుక నుపు తకి ఉండే తనీలాు నుపు అందానికి పెట్టుకునే దిష్టిచుక్క నుపు రాత్రి చందమామను అందంగా చూపే ఆకాశం నుపు బిడ్డ తన తల్లి కడుపులో చూసేదంతా నుపు మనకి ఇన్ని అందాల్ని చూపించే కంటిపాప నుపు నుపంటే నిరసన, అుపులేని తిరుగుబాటు ఉదయాన్ని ప్రసవించే రాత్రి త్యాగం నుపు

(బాలసంఘాకు) విద్వాన్‌ ప్రయాగ, కాకుమాను సుబ్బారావు ఎగురవెయ్‌, ఎగురవెయ్‌ జెండా ఎగురవెయ్‌ చదువు కోసం సాము కోసం ఆట పాట కోసమూ ॥ ఎగురవెయ్‌ ॥ దేశస్వాతంత్య్రానికి శాంతికి అభ్యుదయానికి ॥ ఎగురవెయ్‌ ॥ జపాను వాళ్ళకు సింహస్వప్నం జర్మని గుండెల్లో బల్లెమూ ॥ ఎగురవెయ్‌ ॥ ఆడిపాడె బాురజెండా రెపరెపలాడుతూ ఎగరాలీ మిమి మింటను మెరవాలీ ॥ ఎగురవెయ్‌ ॥ వీరశివాజీ రaాన్సిక్ష్మీ పుట్టిన వీరగడ్డపై ఎగురవెయ్‌, ఎగురవెయ్‌ జెండా ఎగురవెయ్‌ (1461944, ‘ప్రజాశక్తి’ నుండి)

Create Account



Log In Your Account