మతతత్త్వాన్ని ఓడిద్దాం!

మీ మదిలో విద్వేషమే మతం                                 అది గద్దెనెక్కి అరాచకీయం అయ్యింది!                                 దొంగలింపబడ్డ మా గదిలో దేవుడు                                 మీ కషాయి పాలక ఎన్నికల జెండా – ఎజెండా ఇప్పుడు!                                 మా బతుకు ఎప్పుడో                                 ప్రపంచం పెద్ద బజారు సరుకయ్యింది!                                 మా కష్టం కట్టుబానిస కన్నీరయ్యింది!                                 మీ ఆధిపత్య మౌనం                                 అది మానవతుల మానాలను కోరుతోంది!                                 ఇప్పుడు కాకపోతే ఎప్పుడు?!                                 మా ధిక్కారం గుండె నిబ్బరమే
Complete Reading

                ఆధునిక తెలుగు సాహిత్యానికి కొండంత గుర్తు రావిశాస్త్రిగా ప్రసిద్ధుడైన రాచకొండ విశ్వనాథశాస్త్రి. 2022 ఆయన శతజయంతి సంవత్సరం.  ఆ  మహారచయిత  స్మరణలో  ఆయన  సాహిత్యపు ప్రాసంగికతను గుర్తుచేస్తూ తీసుకువస్తున్న ‘ప్రజాసాహితి’ ప్రత్యేక సంచిక ఇది. ఆధునిక సాహిత్యంతో పరిచయం వున్నవాళ్ళందరూ ఆయన రచనలు చదివి వుంటారు. 1952 నుండి నాలుగు దశాబ్దాల పాటు ఆయన కథ, నవల, నాటకం ప్రక్రియల్లో గొప్ప సాహిత్యం సృజించాడు. ‘మూడు కథల బంగారం’, ‘ఋక్కులు’, ‘ఆరు చిత్రాలు’, ‘ఆరు సారా
Complete Reading

ఇంతవరకు బతకడాన్ని నేరం చేసిన మూడు పాతికల స్వాహాతంత్య్రంలో మోడీ పాలనకొచ్చేసరికి ఊపిరిపీల్చడమూ, నోరువిప్పి మాట్లాడడమూ కూడా ‘రాజ ద్రోహం’ అయిపోయింది. ‘చావడాన్ని’ కారు చవక చేశారు. మరణాన్ని నిత్యకృత్యం చేస్తున్నారు. దీంతో నానాటికీ దేశ పాలక విధానాలు తీసికట్టై జన జీవనం అల్లకల్లోలమైపోతున్న సంక్షోభం దాపురించింది. సెక్షన్‌ 124ఎ నిబంధనలకు సంబంధించి చాలా సందర్భాల్లో కోర్టులు ఎన్నిసార్లు అభిశంసించినా ముఖ్యంగా మోడీ ప్రభుత్వం మంకుపట్టుతో ‘రాజద్రోహం’ పేరుతో భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తోంది. ఈ నేపథ్యంలో దేశకాలమాన
Complete Reading

                ఊపిరి అందని నిస్సహాయ పరిస్థితుల్లో భారత ప్రజానీకం మరణం అంచున వేలాడుతోంది. ప్రజల చితిమంటల కాగడాని ఎత్తిపట్టి దానినే అభివృద్ధి వెలుగుగా భారత పాలకవర్గం చాటుకుంటోంది. దయనీయ కరమైన పరిస్థితులను, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడే దుస్థితిని ప్రజలకి కల్పించిన నేరం మాత్రం పాలకులదే. గత సంవత్సర కాలంగా కరోనా వల్ల జరిగిన కల్లోలం తర్వాత సెకెండ్‌ వేవ్‌ వల్ల కలిగే విలయం గురించి శాస్త్రవేత్తల, డాక్టర్ల, ప్రజాతంత్రవాదుల హెచ్చరికలను పట్టించు కోకుండా పాలకులు పెట్టుబడిదారీ
Complete Reading

            ఉదయం చూస్తే మంచు! మధ్యాహ్నం వరకు వడగాడ్పులు! అంతలోనే సాయంత్రం దట్టంగా కమ్ముకున్న మబ్బులు – ఉరుములు – మెరుపులు – బోరున వర్షం!! రాత్రి గడగడలాడించే చలి!!!             ఒక ఏడాది కాలంలో రావాల్సిన మూడు కాలాలూ ఒక్క రోజులోనే – కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే! రుతువుల్ని ధ్వంసం చేస్తుంది ఎవరు? ప్రకృతి నియమాలను చిందరవందర చేసిందెవరు? ఎక్కడెక్కడో వైరస్‌లను తట్టి లేపుతుంది ఎవరు? పర్యావరణ విధ్వంసం ఎవరి ఖాతాలో జమ చేయాలి?
Complete Reading

         ‘‘భవిష్యత్‌ భారతదేశం తరగతి గదిలో నిర్మాణం అవుతుంది’’           ఈ వాక్యంతో కొఠారీ కమీషన్‌ నివేదిక మొదలవుతుంది.           తరగతి గది ఒక సాంస్కృతిక కేంద్రం           ఉపాధ్యాయుడు సాంస్కృతిక సైనికుడు.           విద్యాబలంతో ఏ లక్ష్యాలు సాధించాలో జాషువా చెబుతారు.           ప్రజల్ని పీల్చి పిప్పిచేసే దురాచారాల్ని విద్యాబలం అణచివేయాలనీ, విద్య మూఢత్వం అనే పులికి ఇంపైన భోజనం కాకూడదనీ మోసపూరిత కోతలకు రక్షాబంధం కాకూడదనీ, మనిషిని మనిషిగా నిలబెట్టలేని చదువులెందుకనీ నిరసించాడు కవి జాషువా.
Complete Reading

సామాజిక చలనక్రమంలో సంస్కృతి నిర్మాతలు ముగ్గురే. శాస్త్రవేత్త – కళాకారుడు – శ్రామికుడు. నూతన సృజనకు ఆలోచన చేసేవాడు శాస్త్రవేత్త. ఆ ఆలోచనను అందంగా, ఆకర్షణీయంగా, సృజనాత్మకంగా ప్రచారంలో పెట్టేవాడు కళాకారుడు. దాన్ని భౌతిక ఆచరణశక్తితో వాస్తవిక ప్రపంచంలోకి నేల మీదకి దించి రూపకల్పన చేసి చూపించేవాడు శ్రామికుడు. ప్రకృతితో ఐక్యత – సంఘర్షణల ఫలితంగా అందివచ్చిన విజ్ఞాన సంపదను శ్రామికుల నుండి శ్రామికులకు అనే గతితార్కిక క్రమమే సామాజిక వికాసం. ఈ మౌలిక సామాజిక అవగాహనలోంచి
Complete Reading

ఉపఖండం యువతకు నెత్తురు మండే, శక్తు నిండిన నిువెత్తు ప్రతినిధిగా కనిపించే భగత్‌సింగ్‌ చెప్పినట్లుయవ్వనంలో మనిషికి రెండే రెండు మార్గాు. అయితే అతను ఔన్నత్యపు ఉన్నత శిఖరాన్ని అధిరోహించనూ వచ్చుÑ లేదా అధః పాతాళపు చీకటి కందకంలో పడిపోనూవచ్చు. ఒకనాటి చరిత్ర పుటల్ని తిరగేస్తుంటే దేశంకోసం, ప్రజకోసం జీవిత సర్వస్వాన్నీ గడ్డిపరకలా తీసిపారేసి, రక్త ప్రభంజనంతో ఒక యువ మార్క్స్‌, ఒక నవ గోర్కీ, ఒక గరిమెళ్ళ, ఒక అూ్లరి, ఒక ఓస్ట్రవ్‌స్కీ, ఒక మైకోవ్‌స్కీ, ఒక
Complete Reading

ప్రకృతి సమత్యుతను దెబ్బతీస్తూ, సహజవనరులను క్లొలగొడుతూ తమ దళారీ పెట్టుబడిదారీ స్వార్ధ ప్రయోజనాకు అనుగుణంగా పాకు అనుసరిస్తున్న విధానా ఫలితంగా దేశంలో అతివృష్టి, అనావృష్టి పరిస్థితును ప్రజు ఎదుర్కొంటున్నారు. కుంభవృష్టి, వరదు, తుపాను బీభత్సం ఒకవైపు, నీటి చుక్కలేక నెర్లిచ్చిన భూమితో కరువుతో కునార్లిుతూ మరోవైపు ప్రజు జీవనం సాగిస్తున్నారు. ఈ ఏడాది తమిళనాడు, కేరళు కుంభవృష్టి వరదతో ముంచెత్తగా, ఒడిశా, చెన్నై, ఆంధ్రలో వచ్చిన తుపాను పెను విపత్తుగా మారాయి. గుజరాత్‌, బీహార్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌,
Complete Reading

Create Account



Log In Your Account