ఆస్తి దురాక్రమణను తేటతెల్లం చేసిన రావిశాస్త్రి ‘ఇల్లు’ నవల

– ఐ.టి.ఆర్‌.వి. శివాజీరావు                 రావిశాస్త్రిగారు చివరగా రాసిన నవల ‘ఇల్లు’. ఈ నవలను 1992లో మొదలుపెట్టి 93లో పూర్తి చేశారాయన. ‘స్వాతి’ వారపత్రికలో సీరియల్‌గా వచ్చింది. నవల పుస్తకరూపం తీసుకోక ముందే ఆయన మరణించారు.                 నవల రచనాకాలం 1992-93, అయితే నవలలోని జరిగిన కథాకాలం 1969 (‘ఇల్లు’ నవలా ప్రవేశంలో రావిశాస్త్రిగారే ఈ విషయం ప్రస్తావించారు). ఈ రెండు కాలాలు రచయిత మీద రచయిత రాసిన కథ మీద జమిలిగా ప్రభావం చూపించకపోవు. ఈ
Complete Reading

– ఓ.వీ.వీ.యస్‌. రామకృష్ణ                 రాచకొండ విశ్వనాధశాస్త్రిగారు రాసిన మంచి కథల్లో ‘‘వేతనశర్మ’’ కథ కూడా ఒకటి. ఈ కథని ఆయన 1971లో రాశారు. ఈ కథను మొదట ‘ఆంధ్రజ్యోతి’ వారపత్రికలోనూ, తర్వాత ‘బాకీ కథలు’ సంకలనంలోనూ, ‘ఉపాధ్యాయ 2004’, సంకలనంలోనూ ప్రచురించారు.                 పాలకయంత్రపు రథాన్ని సజావుగా నడిపించే కర్తవ్యం, ఏ దేశంలోనైనా ఉద్యోగవర్గానిదే. ఐయ్యేయెస్సులు మొదలుకొని, పంచాయితీ ఆఫీసు ప్యూన్ల వరకు…. ఇంకా చెప్పాలంటే నేటి ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామపంచాయితీ వలంటీర్ల వరకు ఈ కర్తవ్యాన్ని
Complete Reading

– బి. విజయభారతి (మహాభారతం – ఆదిపర్వం పరిశీలించి విజయభారతిగారు రాసిన ‘నరమేధాలూ – నియోగాలూ’ పుస్తకానికి ముందుమాట ఇది.      – సం॥)           ‘మహాభారతాన్ని’ భారతదేశ సంస్కృతికి ప్రతీకగా పరిగణిస్తుంటారు. ఇందులోని అంశాలు, ఒకప్పటి సామాజిక రాజకీయ సంఘటనల ఆధారంగా గ్రంథస్తమైన కథనాలే. అవి ఇప్పటికీ సమాజాన్ని శాసిస్తున్నాయి.           ‘మహాభారతం’ దాయాదుల పోరాటగాథగా కనిపిస్తున్నప్పటికీ ఇందులో రెండు వ్యవస్థలకు చెందిన హక్కుల పోరాటాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా కనిపించేది దుర్యోధనాదులకూ పాండు పుత్రులకూ మధ్య జరిగిన
Complete Reading

– కొత్తపల్లి రవిబాబు           పశ్చిమ ఆసియాలోని దేశం సిరియన్‌ అరబ్‌ రిపబ్లిక్‌ – దీనికి నాలుగు దిక్కులా లెబనాన్‌, టర్కీ, జోర్డాన్‌, ఇజ్రాయేల్‌ దేశాలున్నాయి. విభిన్న తెగలు, వివిధ మతశాఖలవారు సిరియాలో వుంటారు. వారిలో అరబ్బులు, కుర్దులు, టర్క్ మన్స్‌, అసీలియన్స్‌, ఆర్మీనియన్లు, గ్రీకులు మొదలగువారు ముఖ్యులు. సున్నీలు, క్రిస్టియన్లు, ఇస్మాయిల్స్‌, మాండనీస్‌, షియాలు, యూదులు మొదలగు మతశాఖలు వున్నాయి. అత్యధికులు సిరియన్‌ అరబ్బులు.           ఫ్రెంచివారి వలస పాలన నుండి సిరియా 1965 అక్టోబరు
Complete Reading

ఎంగెల్స్ 2వ శతజయంతి సందర్భంగా – డా. ఆర్కే 1884లో ఫ్రెడరిక్‌ ఎంగెల్స్‌ రాసిన ఈ మహత్తర గ్రంథం అనేకసార్లు ప్రచురించబడి, అత్యంత ప్రజాదరణ పొందింది. పలు భాషలలోకి అనువదింపబడింది. స్త్రీ, పురుష సంబంధాలు, కుటుంబం పుట్టుక, పరిణామం గురించి ఈ పుస్తకం చెబుతుంది. నేను, నాది అంటే ఏమిటో ఎరుగని మానవ సమాజంలోకి సొంత ఆస్తి ఎలా ప్రవేశించిందో తెలియజేస్తుంది. పాలకులు, పాలితులు లేని సమాజం స్థానే శ్రమదోపిడి, వర్గసమాజం ఎలా వచ్చాయో, వాటి రక్షణ
Complete Reading

– డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్ ఈనాడు మనిషి ఎటువంటి క్రూర జంతువునైనా ఒక తుపాకీ గుండుతో లొంగదీసుకోగలడు. కానీ కంటికి కనబడని రకరకాల క్రిములు ఎప్పుడైనా, ఎక్కడైనా మన ప్రాణాలు తీయగలవు. ఎన్ని రకాల కొత్త మందులు కనిపెట్టినా అవి తమ స్వభావాలని మార్చేసుకుని మనమీద దొంగదెబ్బ తీస్తూనే ఉంటాయి. సైంటిస్టులు ఈ ఎడతెగని పోరాటంలో అహోరాత్రాలు శ్రమిస్తూ ఉంటారు. అందుకే కష్టాల్లో ఉన్నవాళ్ళు దేవుణ్ణి తులుచుకున్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా అంటురోగాలు (లేదా, వాటి గురించిన భయం) ప్రబలినప్పుడల్లా
Complete Reading

– జి.వి. భద్రం           మే 25న సిగరెట్లు కొనటానికి 20 డాలర్ల నకిలీ కరెన్సీ నోటు ఇచ్చాడనే ఆరోపణతో అమెరికాలోని మినియాపోలీస్‌లో సౌవిక్‌ అనే తెల్లజాతి పోలీసు అధికారి జార్జి ఫ్లాయిడ్‌ అనే నల్లజాతి ఆఫ్రో – అమెరికన్‌ను కారులో నుంచి బయటకు లాగి, సంకెళ్ళు వేసి రోడ్డుపై బోర్లా పడుకోబెట్టి, తొమ్మిది నిముషాలపాటు మెడపై మోకాలితో త్రొక్కిపట్టి, అతడికి ఊపిరాడకుండా చేసి చంపివేశాడు. తాను ఊపిరి పీల్చుకోలేకపోతున్నానని అతడు పదే, పదే ప్రాధేయపడినా కనికరం
Complete Reading

‘‘తాడిచెట్టు ఎందుకు ఎక్కావు అంటే, దూడ మేత కోసం’’ అని వెనుకటికొకరు జవాబు చెప్పారట! తెలుగు మాధ్యమం రద్దు దేనికి అంటే ‘‘ప్రభుత్వ బడులలో చదివే బడుగుందర్నీ డాక్టర్లుగా, ఐ.ఎ.ఎస్‌. అధికార్లుగా చేయటానికి’’ – ఇదీ జగన్మోహనరెడ్డి ప్రభుత్వ జవాబు. ఈ సందర్భంలోని ఒక మోసపూరిత మెలిక ఏమిటంటే, తెలుగు మాధ్యమం రద్దు అనేది వినపడనీయకుండా చదువులన్నీ ఆంగ్ల మాధ్యమంలోనే అనటం! నిజానికి యిప్పటికే ప్రభుత్వ బడులన్నీ ఆంగ్లం – తెలుగు రెండు మాధ్యమాలలో సాగుతున్నాయి. ఇక
Complete Reading

మూడు నెలలుగా కరోనా మహమ్మారి మానవ ప్రపంచాన్ని గిజగిజలాడిస్తోంది. మానవ సమాజంలో వర్గ వైరుధ్యాలు తలెత్తిన నాటి నుండీ సామాజిక వైరుధ్యాలే ప్రధానంగా సాగుతూండిన చరిత్ర ఆకస్మికంగా మానవ సమాజమంతా ప్రకృతి విలయమైన కరోనాపైకి ఎక్కుపెట్టాల్సిన స్థితి ఏర్పడిందా అన్నట్లు పరిస్థితులు కదలాడసాగాయి. అయితే ప్రపంచాధిపత్యశక్తులు ఈ పాప పంకిలాన్ని ఏ దేశం నెత్తిన రుద్దాలా అనే పోటీలో వున్నాయి. ప్రకృతి విధ్వంసమూ, పర్యావరణ సమస్యలు కలగలిసి ఈ మహావిపత్తుకి కారణమయినట్లు ఒక సాధారణ భావన వ్యక్తమయింది.
Complete Reading

డా. జశ్వంతరావు           పెట్టుబడిదారీవిధానం, సామ్రాజ్యవాదం కరోనా వంటి అంటువ్యాధులు పుట్టడానికీ, విస్తరించడానికీ మూలకారణం. లాభాపేక్షే ఏకైక లక్ష్యంగా అది సాగిస్తున్న విధ్వంసం – జల, వాయు కాలుష్యం, ప్రకృతిలోని సమతుల్యతను దెబ్బతీయటం, జీవజాలం నశించిపోవటం, కొన్ని విపత్కర పరిస్థితుల్లో జీవం రూపాంతం చెందటం – ఈ ప్రక్రియలో భాగమే కరోనా వైరస్‌ పుట్టుక.           కరోనా వంటి అంటువ్యాధులు ప్రబలకుండా నిరోధించడానికి కూడా పెట్టుబడిదారీ వ్యవస్థ ఆటంకంగా వుంది. కరోనా వైరస్‌ను చైనా వైరస్‌గా పేర్కొంటూ
Complete Reading

Create AccountLog In Your Account