స్వాతంత్య్ర సమరయోధులు, ప్రముఖ గాంధేయ హేతువాది, యలమంచిలి వెంకటప్పయ్య కృష్ణాజిల్లా కనుమూరులో జన్మించారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని రాజమండ్రి జైలులో (1920) బాబా పృధ్వీసింగ్ వద్ద హిందీ నేర్చుకున్నారు. ఆ తర్వాత నెల్లూరు, కాశీ, అలహాబాద్, బీహార్‌లో జాతీయోద్యమంలో భాగంగా హిందీ అధ్యయనం చేశారు. 1920, 1930, 1932, 1942లలో జైలు శిక్షలనుభవించారు. హిందీ బోధన ఒక కార్యక్రమంగా తీసుకొని కృష్ణాజిల్లా పెనుమచ్చ, చినకళ్ళేపల్లి, గుంటూరుజిల్లా మైనేనివారిపాలెం, తూర్పుపాలెం, బెల్లంవారి పాలెం మొదలగు గ్రామాలలో హిందీ నేర్పారు.
Complete Reading
తుమ్మ తిరుమరావుగారు 25, జనవరి 2010 నాడు తన 86వ ఏట మరణించారు. వారి జ్ఞాపకార్థం వారి ప్రథమ వర్ధంతి సందర్భంగా 2011 జనవరిలో వారి కుమారుడు సురేష్‌బాబు, కుమార్తొ సుధ, ప్రతిమ, క్ష్మీప్రసూను ‘ప్రజాసాహితి’ శాశ్వతనిధికి 40 వే రూపాయు అందించారు. తిరుమరావుగారి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. — ప్రజాసాహితి–