లైఫ్ ఆఫ్ జై

– డా. కే.వి. రమణరావు           కారును సైడురోడ్లోకి తిప్పి పార్కింగ్‌ కోసం వెతుకుతున్నాడు జైరాజ్‌. జేబులో ఫోను రెండుసార్లు మోగి ఆగిపోయింది. ఇళ్ల యజమానులు వీధినే పార్కింగ్‌ లాట్‌గా మార్చుకొని రోడ్డుకు రెండువైపులా వాళ్ల కార్లు పెట్టుకున్నారు. చివరకు ఒక ఇంటిముందు గేటుకడ్డంరాని ఖాళీ కనపడింది. ‘ఇంటివోనరు చూసాడంటే తిట్లు తప్పవు, డ్రైవర్లంటే అందరికీ అలుసే. మాలాంటివాళ్లను గౌరవంగాజూసే రోజెప్పుడన్నా వస్తుందా’ అనుకుంటూ అక్కడ కారుపెట్టి గబగబా నడిచి అతని ఇల్లున్న సన్నటి సందులోకి తిరిగాడు.
Complete Reading

          వేలాదిమంది విద్యార్థులకు తెలుగు భాష, సాహిత్యాలను శాస్త్రీయంగా బోధించిన, వందలాది పరిశోధకులకు మార్గదర్శకులుగా పనిచేసిన మార్క్సిస్టు సాహితీ విమర్శకులు ఆచార్య కోవెల్‌ కందాళై రంగనాథాచార్యులు (80) కోవిడ్‌తో 15-5-2021న హైదరాబాద్‌లోని తార్నాకలో మరణించారు. ఆయన 14-6-1941న తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జన్మించారు.           ఆయన విశ్లేషణాత్మక రచనలు, గంభీరమైన ప్రసంగాలు, చతురోక్తులతో సాగించే సంభాషణ… ఏదైనా… ఆలోచింపచేసేవిగా, విజ్ఞానదాయకంగా, వివేచన కలిగించేవిగా ఉండేవి. విప్లవ రచయితల సంఘం, జనసాహితి వ్యవస్థాపకులలో ఒక ముఖ్యుడైన జ్వాలాముఖి, కె.కె.ఆర్‌
Complete Reading

ఇంతవరకు బతకడాన్ని నేరం చేసిన మూడు పాతికల స్వాహాతంత్య్రంలో మోడీ పాలనకొచ్చేసరికి ఊపిరిపీల్చడమూ, నోరువిప్పి మాట్లాడడమూ కూడా ‘రాజ ద్రోహం’ అయిపోయింది. ‘చావడాన్ని’ కారు చవక చేశారు. మరణాన్ని నిత్యకృత్యం చేస్తున్నారు. దీంతో నానాటికీ దేశ పాలక విధానాలు తీసికట్టై జన జీవనం అల్లకల్లోలమైపోతున్న సంక్షోభం దాపురించింది. సెక్షన్‌ 124ఎ నిబంధనలకు సంబంధించి చాలా సందర్భాల్లో కోర్టులు ఎన్నిసార్లు అభిశంసించినా ముఖ్యంగా మోడీ ప్రభుత్వం మంకుపట్టుతో ‘రాజద్రోహం’ పేరుతో భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తోంది. ఈ నేపథ్యంలో దేశకాలమాన
Complete Reading

Create AccountLog In Your Account