శ్రీ ఆంజనేయం… ప్రసన్నాంజనేయం…

– శంకరం           ‘‘మాది తెనాలే…. మీది తెనాలే…. అహ మాది తెనాలే….’’           ‘‘యేట్రా బామ్మర్దీ వడదెబ్బ తగిలిందేటి అలా ఊగిపోతన్నావ్‌?’’           ‘‘ఊగిపోడం కాదురా…. ఆనందం…. ఆవేశం…. ఉచ్చాహం….’’           ‘‘దేనికిరో అంతుత్సాహం!’’           ‘‘దేనికేట్రా పిచ్చిమొకమా? ఆంజినేయుడు తిరప్తిలోనే పుట్నాడట….. పై పెచ్చు మన్తెలుగోడట…. ఆనందంగాకింకేట్రా!’’           ‘‘వారినీ! దేవుళ్ళకి కూడా భాష, ప్రాంతం లాంటివన్నీ అంటగడతన్నార్రా…. ఇంతకీ ఆంజినేయుడు తెలుగు మాట్టాడినట్టు మనోల్లకెలా తెలిసిందో?’’           ‘‘వారి మాలోకం, తిరప్తిలో పుట్టినోడు
Complete Reading

– బొలుసాని జయప్రభ                 ‘‘ఆనంద బాబు! నీదేకులం అని ఎన్నిమార్లు అడిగినా ఎప్పుడూ సమాధానం చెప్పరు ఎందుకు బాబూ?’’ అని అడిగాడు రంగయ్య.           ‘‘చెప్పాను కదా రంగయ్యా ! నీ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు’’ సమాధానంగా ఆనంద బాబు.           ‘‘అదేం సమాధానం బాబూ? మనిషి భూమి మీద పడ్డాక ఏదో కులానికి చెందకుండా ఎలా ఉంటాడు? పోనీ పేరును బట్టి పోల్చుకుందామా అంటే అదీ వీలు కాకుండా ఉంది. రెడ్డి,
Complete Reading

          వ్యక్తిగత ఆస్తులు పుట్టిన కాలం నుండీ ఈనాటివరకు మానవులు నడిచివచ్చిన కాలాన్ని వర్గపోరాటాల చరిత్రగా కమ్యూనిస్టు ప్రణాళికలో మార్క్స్‌ – ఏంగెల్స్‌ పేర్కొన్నందువల్ల సమాజంలో వర్గ సంఘర్షణ జరగటంలేదు. వర్గపోరాటం వ్యక్తుల యిష్టాయిష్టాలతో నిమిత్తం లేని వర్గ సమాజపు సత్యం. అది సామాజిక చలనానికి చోదకశక్తి.           సమాజాన్ని వాస్తవికంగా శాస్త్రీయంగా అర్ధం చేసుకున్నందువల్ల వర్గసంఘర్షణ – సామాజిక పరిణామాలు – విప్లవాలు – మానవ చైతన్య రూపాలయిన సాహిత్యం – కళలు సామాజిక విప్లవంలో
Complete Reading

                ఊపిరి అందని నిస్సహాయ పరిస్థితుల్లో భారత ప్రజానీకం మరణం అంచున వేలాడుతోంది. ప్రజల చితిమంటల కాగడాని ఎత్తిపట్టి దానినే అభివృద్ధి వెలుగుగా భారత పాలకవర్గం చాటుకుంటోంది. దయనీయ కరమైన పరిస్థితులను, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడే దుస్థితిని ప్రజలకి కల్పించిన నేరం మాత్రం పాలకులదే. గత సంవత్సర కాలంగా కరోనా వల్ల జరిగిన కల్లోలం తర్వాత సెకెండ్‌ వేవ్‌ వల్ల కలిగే విలయం గురించి శాస్త్రవేత్తల, డాక్టర్ల, ప్రజాతంత్రవాదుల హెచ్చరికలను పట్టించు కోకుండా పాలకులు పెట్టుబడిదారీ
Complete Reading

Here I Stand పాల్‌ రోబ్సన్‌ స్వీయకథ.    అనువాదం : కొత్తపల్లి రవిబాబు             పాల్‌ రోబ్సన్‌ అద్భుతమైన అమెరికన్‌ సంగీతకారుడు, గాయకుడు, గొప్ప ఫుట్‌బాల్‌, బేస్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌ క్రీడాకారుడు. తన నల్లజాతివారి హక్కులకోసం జీవితాంతం కృషిచేసిన పోరాట యోధుడు. వివక్షకు గురి అవుతున్న జాతులవారు వివిధ దేశాలలో పోరాటాలు చేస్తూ వున్నారు. సామ్రాజ్యవాద దురాక్రమణల ఆధిపత్యశక్తులు వర్ణవివక్షల అసమాన ఆర్థిక, సాంఘిక వ్యవస్థలను పెంచి పోషిస్తున్నాయన్న దృక్పథంతో పాల్‌ రోబ్సన్‌ జీవితకాలం సామ్రాజ్యవాదాన్ని ధిక్కరిస్తూ సాగారు.
Complete Reading

Create Account



Log In Your Account