Here I Stand
పాల్ రోబ్సన్ స్వీయకథ. అనువాదం : కొత్తపల్లి రవిబాబు
పాల్ రోబ్సన్ అద్భుతమైన అమెరికన్ సంగీతకారుడు, గాయకుడు, గొప్ప ఫుట్‌బాల్, బేస్‌బాల్, బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు. తన నల్లజాతివారి హక్కులకోసం జీవితాంతం కృషిచేసిన పోరాట యోధుడు. వివక్షకు గురి అవుతున్న జాతులవారు వివిధ దేశాలలో పోరాటాలు చేస్తూ వున్నారు. సామ్రాజ్యవాద దురాక్రమణల ఆధిపత్యశక్తులు వర్ణవివక్షల అసమాన ఆర్థిక, సాంఘిక వ్యవస్థలను పెంచి పోషిస్తున్నాయన్న దృక్పథంతో పాల్ రోబ్సన్ జీవితకాలం సామ్రాజ్యవాదాన్ని ధిక్కరిస్తూ సాగారు. పాల్ రోబ్సన్ స్వీయ అనుభవాల ఈ రచన వివక్షాయుత సమాజం ఎక్కడ వున్నా దానిని అంతం చేసే పోరాట చైతన్యాన్ని ప్రోత్సహిస్తుంది.
1/8 డెమ్మీలో 216 పుటలు. వెల : రూ. 150/- ప్రచురణ : జనసాహితి.
ప్రతులకు : మైత్రీబుక్‌హౌస్, అరండల్‌పేట, కార్ల్‌మార్క్స్ రోడ్డు, విజయవాడ – 520002. ఫోన్ : 86393 14662