ఈ పుస్తకాలు అందాయి

కష్టాల కొలిమి – త్యాగాల శిఖరం సర్వదేవభట్ల రామనాథం జీవితం :           పరిశోధకుడు : ఆర్‌. శివలింగం, రచన : డా॥ కె. ముత్యం.           1/8 డెమ్మీలో 312 పుటలు. వెల : రూ.200/- ప్రథమ ముద్రణ : 9-3-2021. ప్రచురణ : రాయల సుభాష్‌చంద్రబోస్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌. ప్రతులకు : గుర్రం అచ్చయ్య, ట్రస్ట్‌ చైర్మన్‌ ఆర్‌.ఎం.టి. భవన్‌, ఎం.వి.పాలెం (పోస్టు, గ్రామం) ఖమ్మం రూరల్‌ (మండలం), ఖమ్మం జిల్లా మరియు నవోదయ
Complete Reading

            స్వాతంత్య్ర సమరయోధులు, ప్రముఖ గాంధేయ హేతువాది, యలమంచిలి వెంకటప్పయ్య కృష్ణాజిల్లా కనుమూరులో జన్మించారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని రాజమండ్రి జైలులో (1920) బాబా పృధ్వీసింగ్‌ వద్ద హిందీ నేర్చుకున్నారు. ఆ తర్వాత నెల్లూరు, కాశీ, అలహాబాద్‌, బీహార్‌లో జాతీయోద్యమంలో భాగంగా హిందీ అధ్యయనం చేశారు. 1920, 1930, 1932, 1942లలో జైలు శిక్షలనుభవించారు. హిందీ బోధన ఒక కార్యక్రమంగా తీసుకొని కృష్ణాజిల్లా పెనుమచ్చ, చినకళ్ళేపల్లి, గుంటూరుజిల్లా మైనేనివారిపాలెం, తూర్పుపాలెం, బెల్లంవారి పాలెం మొదలగు గ్రామాలలో హిందీ నేర్పారు.
Complete Reading

117వ సంచిక, మే 1991             మేడే పై మోహన్‌ వేసిన చిత్రం ముఖచిత్రంగా వెలువడిన ఈ సంచికలో మేడేపై రాసిన సంపాదకీయాన్ని ‘‘ప్రజారచయితలూ, కళాకారులూ కష్టజీవులకు అండదండలుగా నిలబడి వారి లక్ష్య సాధనకు ఆలంబనగా రూపొందాలి. మరొకసారి మేడే నిర్దేశిస్తున్న కర్తవ్యం ఇదే!’’ అంటూ ముగించారు. దాదా హయత్‌ రాసిన ‘మసీదు పావురం’ కథ; రామతీర్థ వ్యంగ్య రచన, ‘బ్యాలటోపాఖ్యానం’; జాన్‌ వెస్లీ రచన ‘సామ్రాజ్యవాదం – ప్రసార సాధనాలు’; ‘మతతత్త్వం – మహిళల జీవితం’పై
Complete Reading

          ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) కళాశాలలు మన దేశంలో ఉన్న ప్రసిద్ధ విద్యాసంస్థలు. అటువంటి విద్యాసంస్థలలోనే కులవివక్ష బహిరంగంగా, నిర్భీతితో ప్రదర్శించబడిందంటే – సమాజంలోనూ, సామాన్య విద్యాలయాలలో ఈ వివక్ష ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఖరగ్‌పూర్‌ ఐఐటి సంఘటన తెలియచేస్తూంది. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ సీమాసింగ్‌ ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థుల బ్రిడ్జి కోర్సులో భాగంగా ఆన్‌లైన్‌లో పాఠం చెప్పటం పూర్తయిన తర్వాత విద్యార్థులు జనగణమణ పాటపాడి, భారత్‌ మాతాకీ జై! అంటూ ముగించారు. ఆ
Complete Reading

– బాలాజీ (కోల్ కతా)           సుప్రసిద్ధ హంగేరియన్ దర్శకుడు ఈస్త్వాన్ జాబో 1981లో నిర్మించిన సినిమా ‘మెఫిస్టో’. జాబో పేరు చెప్పగానే గుర్తొచ్చే సినిమా ఇది. సినిమాకు మూలం జర్మన్ రచయిత క్లాస్ మాన్ ఇదే పేరుతో రాసిన నవల. ఈ నవలకు నాటక రూపాలు కూడా చాలా వచ్చాయి. ఫాసిస్టు జర్మనీలో హెండ్రిక్ హాఫ్గెన్ అనే రంగస్థల నటుడి అంచెలంచెల ఎదుగుదలను చెబుతుంది ఈ కథ. నిజజీవిత నటుడు గుస్తఫ్ గ్రుంజెన్స్ జీవితం ఆధారంగా
Complete Reading

దీనికి మొదటినుంచీ చివరివరకూ శ్రుతి పలికే తంబురా రచయిత నరేంద్ర డా. చంద్రారెడ్డి           ‘‘నా జీవితంలో ఒక తీరని కోరికో లేక ఒక లోటో వున్నంత వరకూ నేను జీవించి ఉండటానికి ఒక కారణమంటూ ఉంటుంది. ఏ కోరికా లేక పూర్తిగా సంతృప్తి చెందటమంటె అది మరణంతో సమానం’’ అంటాడు బెర్నార్డ్‌ షా. జీవితంలో అతిప్రధానమైనది జీవితమే. అదే సరిపోతుందా అంటే సరిపోదంటుంది చిత్తూరు కుముదవల్లి నాగలక్ష్మి. ఆమెకు కావాల్సింది తను కోరుకున్న, తనుకావాలనుకున్న జీవితం.
Complete Reading

            29-03-2021న తెనాలిలో జి. మోహనరావు (స్పార్టకస్‌) సంతాపసభలో ‘ప్రజాసాహితి’ ప్రధాన సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు మాట్లాడుతూ మోహనరావు పోలీసు శాఖలో పనిచేస్తూ సాహిత్య ప్రపంచంలోకి ప్రవేశించడం, ఆయనపై రంగనాయకమ్మ రచనల ప్రభావం, ‘ఖాకీ బతుకులు’ నవల రాసిన తర్వాత పోలీసు శాఖ ఆయనపై చేబట్టిన వేధింపు చర్యలు మొదలైనవి వివరించారు. చెరబండరాజు రాసిన ‘పోలీసు పాట’ ద్వారా పోలీసులూ ప్రజల్లో భాగమని చెప్పారన్నారు. మోహనరావు మిత్రులు అడ్వకేట్‌ జి.యస్‌. నాగేశ్వరరావు, జనసాహితి సభ్యుడు రచయిత చందు
Complete Reading

            ‘చంద్ర’, ‘బాల’ పేర్లతో చిత్రకారునిగా, ఇల్లస్ట్రేటర్‌గా, కార్టూనిస్ట్ గా, డిజైనర్‌గా ప్రసిద్ధి చెందిన మైదం చంద్రశేఖర్‌ దీర్ఘ అనారోగ్యంతో 28-04-2021న హైదరాబాదులో తన 75వ యేట మరణించారు. ఆయన 28 ఆగస్టు 1946న వరంగల్‌ జిల్లా గన్నాసరి గ్రామంలో జన్మించారు.           తన చిన్ననాటి నుంచే చిత్రాలు గీయటం ప్రారంభించిన చంద్ర, హైస్కూలు విద్యార్థిగా ఎం.ఎఫ్‌. హుస్సేన్‌, కొండపల్లి శేషగిరిరావుల చిత్రాల ప్రతికృతులను చిత్రించారు. బాపుకు ఏకలవ్య శిష్యునిగా చెప్పుకున్న చంద్ర త్వరలోనే తనదైన సొంత
Complete Reading

ఆంగ్లమూలం : పంకజ్ ప్రసూన్                      తెలుగు : కొత్తపల్లి రవిబాబు (స్వేచ్ఛ, సమానత్వం, దోపిడీరహిత ప్రపంచం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులందరికీ మన విప్లవ అరుణారుణ వందనాలు)                     నిరంకుశులకు, సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా                     కవిత్వం ఒక ఆయుధంగా వుంటుంది.                     టునీసియాలో, ఈజిప్టులో, సిరియాలో                     యెమెన్‌లో, బహ్త్రైన్‌లో, మలేసియాలో                     స్వాతంత్య్ర పతాకాన్ని ఎత్తిపట్టిన వారికి,                     అన్యాయానికీ, దోపిడీకి వ్యతిరేకంగా                    
Complete Reading

– సిహెచ్. మధు జీవన చరమాంకం ప్రారంభమయ్యింది సూర్యుడు పశ్చిమాన పరుగును అరచేతితో ఆపేసాను ఆపన్నుల హస్తం, అభిమాన సూర్యుల వెలుగు నాకు అమృతం పోస్తున్నాయి అస్తమయం సహజాతి సహజం కానీ తాత్కాలికంగా ఓడిపోతుంది పర్వతాల అడ్డు తొలగిపోతుంది డెబ్బది సంవత్సరాల చెట్టు శిశిరంలోకి ప్రవేశించింది ఆకులు రాలిపోతున్నాయి కొమ్మలు బలంగానే వున్నాయి మళ్లీ ఆకులు చిగురిస్తాయి గాలి, నీరు నేనేగా నేల బలం నాలో నిక్షిప్తమయివుంది నా మనసులో ముళ్లు – రాళ్లు వున్నాయి నా
Complete Reading

Create Account



Log In Your Account