ఈ పుస్తకాలు అందాయి

ఈ పుస్తకాలు అందాయి

సాహితి వారి ప్రతిష్టాత్మక ప్రచురణలు

టాల్‌ స్టాయ్‌ సాహిత్యం

1. యుద్ధము – శాంతి నవల : అనువాదం : రెంటాల గోపాలకృష్ణ, బెల్లంకొండ రామదాసు. 1/8 డెమ్మీలో 960 పుటలు. వెల : రు. 600/- ముద్రణ : సెప్టెంబరు 2019.

2. అన్నా కెరనీన నవల అనువాదం : ఆర్వియార్‌. 1/8 డెమ్మీలో 896 పుటలు. వెల : రు. 500/- ముద్రణ సెప్టెంబరు 2018.

3. నవజీవనం నవల అనువాదం : పురాణం కుమార రాఘవశాస్త్రి. 1/8 డెమ్మీ. 368 పుటలు. వెల : రు. 200/- ముద్రణ : సెప్టెంబర్‌ 2018

4. విషాద సంగీతం మరి కొన్ని కథలు. అనువాదం : ఆర్వియార్‌ 1/8 డెమ్మీలో 272 పుటలు. వెల : రు. 150/- ముద్రణ : సెప్టెంబర్‌ 2018

5. ఇవాన్‌ ఇవిచ్‌మృతి మరి కొన్ని కథలు : అనువాదం: బెల్లంకొండ రామదాసు. 1/8 డెమ్మీలో 176 పుటలు. వెల : రు. 100/- ముద్రణ : సెప్టెంబర్‌ 2018

6. సంసార సుఖం మరియు మేడిపళ్ళు : అనువాదం : రెంటాల గోపాలకృష్ణ 1/8 డెమ్మీలో 144 పుటలు. వెల : రు. 75/- ముద్రణ : సెప్టెంబర్‌ 2018

7. కోడి గుడ్డంత ధ్యానపు గింజ మరికొన్ని కథలు. అనువాదం : భమిడిపాటి కామేశ్వరరావు. 1/8 డెమ్మీలో 136 పుటలు. వెల : రు. 70/- ముద్రణ. సెప్టెంబర్‌ 2018

8. ఆత్మజ్యోతి  వెల : రు. 30/-  ముద్రణ : సెప్టెంబర్‌ 2018

9. ఇద్దరు మిత్రులు : నీతి కథలు. 1/8 క్రౌన్‌ 160 పుటలు. ఆర్ట్‌ పేపర్‌. వెల : రు. 150/- పంచ రంగుల బొమ్మలతో ముద్రణ : సెప్టెంబర్‌ 2019

          ప్రతులకు : సాహితి ప్రచురణలు, 33-22-2, చంద్రం బిల్డింగ్స్‌, సి.ఆర్‌. రోడ్డు, చుట్టుగుంట, విజయవాడ-520004. ఫోన్‌ : 81210 98500. 0866 – 24366402/403

నా కవితల ఖదరే వేరు : కవితా సంకలనం

          కన్నడమూలం : కె.ఎస్‌.నిసార్‌ అహ్మద్‌, అనువాదం : స.రఘునాథ.

          కన్నడంలో నిత్సోత్సవం (1968లో రాసిన) కవిత ద్వారా బహుళ ప్రాచుర్యం పొందిన కవి కె.ఎస్‌.నిసార్‌ అహమద్‌గారి అనువదించబడిన 112 కవితలు, మెరుపులుతో కూడిన సంకలనం ఇది.

          1/8 డెమ్మీలో 244 పుటలు. వెల : రూ. 275/- ముద్రణ : 2019. ప్రతులకు : నదోజ ప్రొ. కె.ఎస్‌.నిసార్‌ అహ్మద్‌, 341, హమీద్‌ హైదర్‌, 7వ క్రాస్‌, పద్మనాభనగర్‌, బెంగుళూరు – 560070.

భీమా కోరెగాం 12 – వివి, వ్యాసాలు, నివేదికల సంపుటి – రచయిత : ఎన్‌. వేణుగోపాల్‌

          భీమా కోరెగాం హింసాకాండ కేసు పూర్వాపరాల గురించి 2018 ఫిబ్రవరి నుండి 2019 ఫిబ్రవరి వరకు వేణుగోపాల్‌ చేసిన రచనల్లో నుండి ఏర్చి కూర్చిన 12 రచనల సంపుటి ఇది.

          1/8 డెమ్మీలో 71 పుటలు. వెల : రూ.50/- ముద్రణ : ఫిబ్రవరి 2019.

          ప్రతులకు : వీక్షణం, మైత్రీ రెసిడెన్సీ 3-6-394, స్ట్రీట్‌ నెం : 3, హిమాయత్‌నగర్‌, హైదరాబాద్‌-500029. ఫోన్‌ : 040-66843495 మరియు ప్రముఖ పుస్తక కేంద్రాలలో.

సహచరులు : వరవరరావు జైలు లేఖలు

          వరవరరావు మొదటిసారి 1973లో అరెస్టయినాడు. ఆ తర్వాత చాలాసార్లు పాలకులు తప్పుడు ఆరోపణలతో నిర్బంధించబడుతూనే వున్నారు. ప్రస్తుతం గత రెండు సంవత్సరాలుగా భీమా కోరెగాం కేసులో నిర్బంధించబడి వున్నారు. గతంలో అరెస్టయినపుడు ఆయన రాసిన కవితామయ లేఖల సంపుటి ఈ ‘సహచరుల’ను పునః ప్రచురించారు.

          1/8 డెమ్మీలో 120 పుటలు. వెల : రూ.100/- ప్రచురణ : 1989, ఫిబ్రవరి 2019. ప్రతులకు : పి. హేమలత, ఫ్లాట్‌నెం : 419, హిమసాయి హైట్స్‌,  స్ట్రీట్‌ నెం : 6,  జవహర్‌నగర్‌,  గాంధీనగర్‌, హైదరాబాద్‌ – 500020.

అన్వేషణ : డా॥ పాపినేని శివశంకర్‌ సాహిత్యశీలన : సంపాదకులు : బండ్ల మాధవరావు

          శివశంకర్‌గారి సాహిత్యాన్ని గురించి, వ్యక్తిత్వాన్ని గురించి ప్రముఖులైన 68 మంది సాహిత్యకారులు అందించిన వ్యాసాలు, ఆయన జీవిత విశేషాలు, భగవాన్‌ కళాశాలవారు రాసిన అక్షరాంజలితో కూడిన సంకలనం.

          382 పుటలు. వెల : రూ. 150/- ప్రచురణ : 21 ఫిబ్రవరి 2019. ప్రతులకు : డా॥ పాపినేని శివశంకర్‌, 3/6, విద్యానగర్‌, గుంటూరు – 522007. ఫోన్‌ : 8500884400.

మోహనస్మృతి, మిత్రుల జ్ఞాపకాల సంకలనం : సంపాదకుడు సిద్ధార్ధ, మోహనరెడ్డి మితృలు.

          తెలంగాణా సాయుధ పోరాటం ప్రభావపు గ్రామంలో కమ్యూనిస్టు కుటుంబంలో జన్మించిన విశ్వవరం మోహనరెడ్డి, నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటాల ఉత్తేజంతో విప్లవ విద్యార్థి సంఘంలో కోదాడలోనూ అక్కడ నుండి ఢిల్లీ జె.ఎన్‌.యూ. విద్యార్థిగా ఆ యూనివర్శిటీలోనూ పనిచేశారు. ఆ తర్వాత నూతన అవగాహనతో జాతి విముక్తి పోరాటాన్ని, విప్లవ పార్టీ నిర్మాణాన్ని చేపట్టారు. మోహన్‌ మితృలు ఆయనను స్మరించుకుంటూ రాసిన 23 వ్యాసాల సంకలనం ఇది.

          1/8 డెమ్మీలో 100 పుటలు. వెల : రూ.80/- ముద్రణ : ఆగస్టు 2019.

          ప్రతులకు : సిద్ధార్ధ, నెం.301, మిత్రా టవర్స్‌, డొంకరోడ్డు, పోరంకి, విజయవాడ – 521137. ఫోన్‌ : 92475 75436.

నా కోసం ఎదురు చూడు…. అరుణోదయ రామారావు స్మృతిలో : అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య

          అరుణోదయ రామారావు పరిచయం అవసరంలేని విప్లవ గాయకుడు. విప్లవ సాంస్కృతికోద్యమ కార్యకర్త, నాయకుడు. ఆయనను స్మరించుకుంటూ ఆయన సహచరులు, మితృలు సాంస్కృతికరంగం, సాహిత్యరంగం, పాత్రికేయరంగం, అధ్యాపక, ఉద్యోగరంగాలు, హక్కులరంగం, ప్రజారంగాలు, రాజకీయరంగం మొదలగు రంగాల నుండి అందించిన వ్యాసాల సంపుటి. ఆయన సంస్మరణ సభలో (17-5-2019)న ఆవిష్కరించబడినది.

          1/8 డెమ్మీలో పుటలు : 264, వెల : రూ.150/- ప్రచురణ : మే 2019. ప్రతులకు : మార్క్స్‌ భవన్‌, 658, విద్యానగర్‌, 7వ లైన్‌, హైదరాబాద్‌ – 44.

గతితార్కిక భౌతికవాద కోణం నుంచి పదార్ధము – ప్రకృతి – పరమాత్మ (పదార్థమే యదార్థము) – రచయిత : పెండ్యాల లోకనాథం.

          లోకనాథం ఈ పుస్తకాన్ని 1981లోనే ‘పదార్థమే యదార్థము’ పేరుతో రచించారు. ముద్రణ కాకుండానే ఆయన మరణించారు. హేతుబద్ధంగా విషయాలను తర్కించాలి. ప్రశ్నించాలి. అధ్యయనం చేయాలన్న ఉద్దేశ్యంతో వారి అబ్బాయి సత్యనారాయణ ప్రచురించారు.

          1/8 డెమ్మీలో 170 పుటలు, వెల : రూ.140/- ప్రచురణ : నవంబర్‌ 2019.  ప్రతులకు : నవోదయ  బుక్‌ డిస్ట్రిబ్యూటర్స్‌, 3-3-859/1/బి, మొదటి అంతస్తు, ఆర్యసమాజం ఎదురుగా, కాచిగూడ క్రాస్‌రోడ్స్‌, హైదరాబాద్‌ – 500027, ఫోన్‌ : 040-24652387.

శాస్త్రీయ దృక్పథం – మానవ మనుగడ (శాస్త్రీయ, వ్యాస సంకలనం) : రచన, సంకలనం – పసల భీమన్న

          ఈ పుస్తకంలో వివిధ పత్రికల్లో ప్రచురింపబడిన 22 వ్యాసాలున్నాయి. శాస్త్రీయ దృక్పథం,  హేతువాదం, మార్క్సిజం, మానవవాదం, మతవాదం, శ్రమదోపిడి, విద్యావిధానం మొదలైన వ్యాసాలున్నాయి. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, శాస్త్రీయ భావజాలం ప్రచారవ్యాప్తిలో ఉపకరించగల పుస్తకం.

          1/8 డెమ్మీలో 152 పుటలు. వెల : రూ.90/- ప్రచురణ : 2019. ప్రతులకు : పసల భీమన్న, ఇం.నెం. 79-8-9/1, పోస్టల్‌ కాలనీ, శ్యామలా నగర్‌, రాజమండ్రి – 533103, ఫోన్‌ : 94901 23276.

కొత్త క్యాలెండర్‌ (కవిత్వం) – డా॥ రావి రంగారావు

          రావి రంగారావు తెలుగు సాహిత్య, భాషా, విద్యారంగాల్లో విశేషమైన కృషిచేశారు. మచిలీపట్నం ‘సాహితీమిత్రులు’ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులుగా వున్నారు. ‘యువ కవిత’ త్రైమాసిక పత్రికను ఎనిమిదేళ్ళపాటు నడిపారు. ప్రస్తుతం ‘రావి రంగారావు సాహిత్యపీఠం’ను నిర్వహిస్తున్నారు. అనేక కవితా సంపుటాలను ప్రచురించారు. పురస్కారాలు పొందారు. వివిధ పత్రికలలో ఆయన రాసిన 80 కవితలతో కూర్చిన సంకలనం ఇది.

          1/8 డెమ్మీలో 112 పుటలు. వెల : రూ. 100/- ప్రచురణ : జూలై 2019. ప్రతులకు : నర్రా ప్రభావతి, కన్వీనర్‌, రావి రంగారావు సాహిత్య పీఠము, 101 శంఖచక్ర నివాసం, అన్నపూర్ణానగర్‌, 5వ లైను, తూర్పు గోరంట్ల, గుంటూరు – 522034, ఫోన్‌ : 92475 81825.

నాన్నా నీకు నూరేళ్ళు…. : కవితా సంకలనం : రచయిత – డా॥ సమ్మన్న ఈటెల

          సమ్మన్నగారు అమ్మ, నాన్నల మీద రాసిన కవితలతోపాటు సామాజిక సంఘటనల మీద, సందర్భాల మీద రాసిన మరో ఇరవై ఎనిమిది కవితలతో కూడిన సంకలనం.

          1/8 డెమ్మీలో 72 పుటలు, వెల : రూ. 80/- ప్రచురణ : ఆగస్టు 2019. ప్రతులకు : డా॥ సమ్మన్న ఈటెల, 207, సిరి రెసిడెన్సీ, వీధి నెం. 2, తార్నాక, హైదరాబాద్‌ – 17, ఫోన్‌ : 98852 38654.

పడమటిగాలి పాట (ఆంగ్ల కవితల అనువాదం) : అనువాదం – డా॥ ముద్దు వెంకటరమణారావు

          14వ శతాబ్ధం నుండి 1940 వరకు వెలువడిన ఆంగ్ల కవిత్వాలలో ఎంచుకుని, అనువదించిన 96 కవితలతో ఈ పుస్తకాన్ని సంకలనం చేశారు.

          1/8 డెమ్మీలో 264 పుటలు, వెల : రూ. 150/- ప్రచురణ : ఆగస్టు 2019. ప్రతులకు : పాలపిట్ట బుక్స్‌, 16-11-20/6/1/1, 403, విజయసాయి రెసిడెన్సీ, సలీంనగర్‌, మలక్‌పేట, హైదరాబాద్‌ – 500036. ఫోన్‌ : 98487 87284.

నీళ్ళగోస, కవితా సంకలనం : సంపాదకులు – బైస దేవదాసు

          ‘నేటి నిజం’ పత్రికలో సాహిత్య పేజీలో నీటి అవసరాన్ని గుర్తిస్తూ వచ్చిన 101 కవితల సంకలనం ఇది.

          1/8 డెమ్మీలో 104 పేజీలు, వెల : రూ. 150/-, ప్రచురణ : 2019. ప్రతులకు : ‘నేటినిజం’ తెలుగు దినపత్రిక, ఎస్‌.ఆర్‌.టి – 74, జవహర్‌నగర్‌, హైదరాబాద్‌ – 20. ఫోన్‌ : 040-27662477

తొవ్వ ముచ్చట్లు (భాగం రెండు) : రచయిత – జయధీర్‌ తిరుమలరావు. సంపాదకులు : ఎ.కె. ప్రభాకర్‌

          ‘ఆంధ్రభూమి’ దినపత్రికలో జయధీర్‌ తిరుమలరావు రాస్తున్న ముచ్చట్లు తొలిభాగం 22 మే 2011లో ప్రచురించారు. దాని కొనసాగింపుగా ఇది రెండవ భాగం. త్వరలోనే మూడవ సంపుటిని కూడా తీసుకొస్తామని సంపాదకులు హామీ ఇచ్చారు. కళాసాహిత్య, సాంస్కృతికరంగాల్లో పనిచేస్తున్న వ్యక్తులు, సంస్థలు, పత్రికలు, సంఘాల 59 తొవ్వలను జయధీర్‌ తిరుమలరావు ఈ సంకలనంలో పరిచయం చేశారు.

          1/8 డెమ్మీలో పుటలు : 252, వెల : రూ. 150/- ప్రచురణ : ఫిబ్రవరి 2017.  ప్రతులకు : సాహితీకేంద్రం, 402, ఘరోండా అపార్టుమెంట్స్‌. ఉస్మానియా యూనివర్శిటీ మెయిన్‌గేట్‌-1 దగ్గర, డి.డి.కాలనీ, హైదరాబాద్‌ – 500007.

admin

leave a comment

Create AccountLog In Your Account