జీవశాస్త్ర విజ్ఞానం – సమాజం

జీవశాస్త్ర విజ్ఞానం – సమాజం

– డా॥ కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

          గతితార్కిక భౌతికవాద దృక్పథంతో కొడవటిగంటి రోహిణీప్రసాద్‌గారు ప్రజాసాహితి, తదితర పత్రికలలో అనేక సైన్సు వ్యాసాలు రాశారు. జీవశాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన వ్యాసాలను ఎన్నుకుని ‘జనసాహితి’ 53 వ్యాసాల ఈ సంకలనాన్ని ప్రచురించింది.

          ‘అత్యాధునిక జీవనశైలినీ, తెచ్చిపెట్టుకున్న పాశ్చాత్య సంస్కృతినీ అవలంబించే ఈ తరం మానసికంగా ఆటవికదశలో ఉందనేది మనం గుర్తించాలి. సామాజిక రుగ్మతలన్నిటికీ కారణం వర్గసమాజపు దుష్టశక్తులు కాగా వాటికి తోడవుతున్నవి మోడర్న్‌ వేషంలో ఉన్న మూఢనమ్మకాలూ, అవగాహనా రాహిత్యం, భౌతికవాద దృక్పథం లేకపోవటంవల్లనే’ అంటారు రచయిత. ‘మనిషి కారణజన్ముడా?’ అన్న వ్యాసంతో మొదలైన ఈ సంపుటి విశ్వంలో మనిషి స్థానం, మెదడులోని దేవుళ్ళు, మతాలు – జన్యువులు, సూక్ష్మజీవులు, బాక్టీరియాలు, ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ల దాడి వంటి 53 వ్యాసాలగుండా ప్రయాణించి, ‘భౌతిక దృక్పథం ఆవశ్యకత’ అన్న వ్యాసంతో ముగుస్తుంది. మన రోజువారీ దినచర్యలో ఎదుర్కొనే అనేక సందేహాలకు శాస్త్రీయ సమాధానాలతో సులభమైన భాషలో సాగుతూ భౌతికవాద దృక్పథాన్ని కల్పిస్తుందీ పుస్తకం.

          1/8 డెమ్మీ, పుటలు : 207, వెల : రూ.60/- ప్రచురణ : జనసాహితి.

          ప్రతులకు : మైత్రీ బుక్ హౌస్, అరండల్ పేట, కార్ల్ మార్క్స్ రోడ్డు, విజయవాడ – 520002. ఫోన్ : 91779 79622

admin

leave a comment

Create Account



Log In Your Account