పిల్లల కవిత

– సంఘమిత్ర, బాలసంఘ సభ్యులు పిల్లలూ పాలపిట్టలు పిల్లలూ తాటిముంజలు పిల్లలూ చింపిరి గుడ్డలు పిల్లలూ ఆణిముత్యాలు పిల్లలూ వెన్నముద్దలు పిల్లలూ పంచదార చిలుకలు పిల్లలూ శిల్పి చెక్కిన బొమ్మలు పిల్లలూ మీరు పిడుగులు పిల్లలూ వాన చినుకులు పిల్లలూ శ్రమజీవుల చెమట చుక్కలు పిల్లలూ సముద్రపు ఆలుచిప్పలు పిల్లలూ మట్టిలోని మాణిక్యాలు పిల్లలూ చీపురుకట్ట పుల్లలు పిల్లలూ టపాకాయలు పిల్లలూ సంఘమిత్ర మొగ్గలు

– సంఘమిత్ర, బాలసంఘ సభ్యులు కరోనా వచ్చింది ముక్కుకు మాస్క్‌ వేసింది మనుషులను దూరం పెట్టింది షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకోవద్దంది దండాలు పెట్టుకోమనింది లాక్‌డౌన్‌ పెట్టారు ఇంట్లో ఉండమన్నారు బయటికి రావద్దన్నారు వలస కూలీలకు కష్టాలు లాభదారులకు నష్టాలు మంచి తిండి తినమన్నారు తిండి దొరకక చస్తున్నారు

–  ఎస్. అశ్వని ఆడది అమ్మ వంటిది. కాని ఇప్పుడు ఆమె మీద ఎన్నో అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి. ఎలా అంటే పూర్వం రామాయణంలో రాముడు సీతమ్మను అడవులపాలు చేశాడు కదండి. రామాయణంలో రాముడు దేవునిగా పేరు పొందినా కాని సీతమ్మను మాత్రం అగ్నిప్రవేశం చేయించాడు. అయినా చెప్పుడు మాటలు విని రాముడు అలా చేశాడు. కానీ మన తాత, నాయనమ్మలు మాత్రం అతన్ని ఇప్పటికీ దేవునిగానే కొలుస్తున్నారు. ఇది నిజమేనంటారా? రాముడు నిజంగా దేవుడా? అసలు
Complete Reading

–  అక్షర, ౩వ తరగతి అది నల్లమల అడవి. అక్కడ జంతువులు ఎప్పుడు సంతోషంగా ఉండేవి. అన్ని జంతువులతో పోలిస్తే కుందేలు అందరికన్నా తెలివిగా, ఉపాయంగా ఉండేది. అంతేకాదు భాషలు తెలిసినది. అంటే మనుషుల భాష ఇంకా 24 భాషలు కూడా వచ్చు. ఒకరోజు అది తిరుగుతూ ఉంటే అది కొంతమంది మనుషులు మాట్లాడుతుండగా వినసాగింది.  ఒక మనిషి ఏమని చెప్పాడంటే, ఇక్కడ యురేనియం బాగా ఎక్కువగా ఉంది, ఇక్కడ మనం తవ్వడం మొదలుపెడదాం అని. సరేనని
Complete Reading

– ‘బాలబంధు’ అలపర్తి వెంకట సుబ్బారావు ప్రకృతే చెబుతోంది పాఠాలు మనకు ! సారాంశమును తెలిసి సాగించు బ్రతుకు ॥ సూర్యుడే శ్రమశక్తి సూచించు మనకు ! చంద్రుడే సౌమ్యతకు కేంద్రమ్ము మనకు ॥ సముద్రం ధైర్యాన్ని సమకూర్చు మనకు ! చేరు పై స్థాయికని చెప్పేను నింగి ॥ ఓర్పుగా ఉండమని నేర్వేను నేల ! పరులకై తను తానె బలియగును అగ్ని ॥ పరుల మేలునుకోరి కురిసేను వాన ! విశ్వహిత మాశించి వీచేను
Complete Reading

మూలం : అరవింద సిన్హా                                      అనువాదం : వి. రాధిక           బీదా బిక్కీ           సాదాసీదా జనం మేం.           ఈ దేశంలో!           బహుదూరపు బాటసారులమై           కాలినడకన బేగు సరాయ్‌ చేరగలిగినప్పుడు           కాలే కడుపులతో బెనారస్‌ చేరగలిగినప్పుడు           నడిచి నడిచి మేం బిడ్డా పాపలతో           మాన్సర్‌, రాంచీ, బస్తర్‌…. దేశంలో ఏ           మూలకైనా           దూరదూర తీరాలకు మేం చేరగలిగినప్పుడు           గుర్తుంచుకోండి మీరంతా!           మా
Complete Reading

– వంగర లక్ష్మీకాంత్ తెల్ల తుమ్మ తంగేడు కరక్కాయ ఊటలో ఊరివచ్చిన తోలు చెప్పులా వైరస్సు ధూళి మహా సముద్రంలో మునిగి – నాని – ఈదివచ్చిన వాడా వీరుడా – శూరుడా – మానవుడా! కాష్టంబూడిద వళ్ళంతా పులుముకున్న శివుడిలా సూక్ష్మక్రిమి సున్నం లోపలా – బయటా తాపడం వేసుకుని ఊరేగుతున్న నవ్య రుద్రుడివిరా నువ్వు వీరుడా – శూరుడా – మానవుడా! ‘కరోనా’ ఓ చిన్న దుమ్ము కణం దాన్ని చూసి కటకట –
Complete Reading

– కొత్తపల్లి రవిబాబు           పశ్చిమ ఆసియాలోని దేశం సిరియన్‌ అరబ్‌ రిపబ్లిక్‌ – దీనికి నాలుగు దిక్కులా లెబనాన్‌, టర్కీ, జోర్డాన్‌, ఇజ్రాయేల్‌ దేశాలున్నాయి. విభిన్న తెగలు, వివిధ మతశాఖలవారు సిరియాలో వుంటారు. వారిలో అరబ్బులు, కుర్దులు, టర్క్ మన్స్‌, అసీలియన్స్‌, ఆర్మీనియన్లు, గ్రీకులు మొదలగువారు ముఖ్యులు. సున్నీలు, క్రిస్టియన్లు, ఇస్మాయిల్స్‌, మాండనీస్‌, షియాలు, యూదులు మొదలగు మతశాఖలు వున్నాయి. అత్యధికులు సిరియన్‌ అరబ్బులు.           ఫ్రెంచివారి వలస పాలన నుండి సిరియా 1965 అక్టోబరు
Complete Reading

– గౌరీశంకర్           ‘నారాయణా ఏవైందిరా అందరూ అలా గాభరా పడతన్రు?’ ఆదుర్దాగా అడిగాడు గోపాలం.           మన కిష్ణగాడు పురుగుల మందు తాగీసేడ్రా!           అమ్మమ్మ! అంత కస్టం ఏటొచ్చిందిరా ఆడికి!           ‘‘నీకెప్పుడూ సెప్పనేదేటి? ఈడు గాజువాకలో ఒక ఆసామీ దగ్గిర సీటీ కట్టేవోడు. ఆడీ కరోనా అడావిడ్లో జెండా ఎత్తీసి, కరోనా కంటే పెద్ద జబ్బులొచ్చీలా సేసి ఎల్లిపోండట….’’           ‘అయితే…. సచ్చిపోడవేనేట్రా అన్నిటికీ మందు…..?’           ‘కూతురు పెల్లి సెయ్యనీకి అయిదు
Complete Reading

– సహచరి             వాళ్ళు విమానాల్లో విహరించే వాళ్లకు             రన్‌వేలు నిర్మించే వలస జీవులు….             వాళ్ళు రైలు బోగీలకు పట్టాలేసి             రహదారుల్ని నిర్మించిన బడుగుజీవులు             వాళ్ళు కాళ్ళు తడవకుండా బడాబాబుల్ని             సముద్రాలు దాటించగల శ్రమజీవులు….             ఫ్యాక్టరీల పొగగొట్టాలే ఊపిరితిత్తుల్లా             ఉఛ్వాస నిశ్వాసాల్లో విషవల(స)యంలో రాలిపోయి..             తెగిపడిన విగత జీవులు వాళ్ళు             కళ్ళు తడుపుకుంటూ కడుపు కాల్చుకుంటూ             సకల సంపదల సృష్టికర్తలు వాళ్ళు..            
Complete Reading

Create Account



Log In Your Account